తిరుపతిలో తక్షణ గోల్డ్ లోన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూర్ జిల్లాలోని ఒక భాగమైన తిరుపతి, ప్రసిద్ధ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నిలయం మరియు ఒక ధార్మిక పుణ్యక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ యొక్క 'ఆధ్యాత్మిక రాజధాని'గా పేరొందిన ఈ నగరం, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా 'ఉత్తమ వారసత్వ నగరంగా' కూడా గుర్తింపు పొందింది.
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి గోల్డ్ లోన్ యొక్క సులభమైన లభ్యతతో తిరుపతి నివాసులకు ఇప్పుడు ఆర్థిక అవకాశాలు మెండుగా పెరిగాయి.
బజాజ్ ఫిన్‌సర్వ్ గోల్డ్ లోన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు
బజాజ్ ఫిన్‌సర్వ్ గోల్డ్ లోన్‌ల యొక్క విభిన్న ఫీచర్లు మరియు ప్రయోజనాలను చెక్ చేయండి:
-
ఖచ్చితమైన మూల్యాంకన
మీ బంగారం వస్తువుల మార్కెట్ విలువను లెక్కించడానికి మా ఎగ్జిక్యూటివ్‌లు ఒక స్టాండర్డ్ క్యారెట్ మీటర్‌ను ఉపయోగిస్తారు.
-
విభిన్న రీపేమెంట్ ఆప్షన్లు
బజాజ్ ఫిన్‌సర్వ్ సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆఫర్లను అందిస్తుంది. మీరు మీ సౌలభ్యం ప్రకారం పీరియాడిక్ వడ్డీలు లేదా రెగ్యులర్ ఇఎంఐలను చేయవచ్చు.
-
రూ. 2 కోట్ల వరకు రుణం పొందండి
ఇప్పుడు గోల్డ్ ఐటెంలను తాకట్టు పెట్టడం ద్వారా రూ. 2 కోట్ల వరకు అధిక రుణ మొత్తాన్ని పొందండి. నగదు కోసం అప్లై చేయడానికి గోల్డ్ లోన్ అర్హత ప్రమాణాలను నెరవేర్చండి.
-
పార్ట్-ప్రీపేమెంట్ మరియు ఫోర్‌క్లోజర్ సదుపాయం
ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండా, పార్ట్-ప్రీపేమెంట్ మరియు ఫోర్‍క్లోజర్ సదుపాయంతో మీ పూర్తి రుణ భారాన్ని తగ్గించుకోండి.
-
పాక్షిక-విడుదల కోసం ఆప్షన్
తిరుపతిలో బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి తక్షణ గోల్డ్ లోన్‌తో, మీరు కావలసిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం ద్వారా మీ ఐటెంలను పాక్షికంగా విడుదల చేసుకోవచ్చు.
-
ఉచిత గోల్డ్ ఇన్సూరెన్స్
మా గోల్డ్ లోన్లతో పాటు కాంప్లిమెంటరీ బీమా కవరేజీని కూడా పొందండి. ఇది మీరు తాకట్టు పెట్టిన ఆభరణాలు దొంగిలించబడినప్పుడు మరియు కోల్పోయినప్పుడు మీ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతుంది.
-
అత్యున్నత-స్థాయి భద్రతా ప్రమాణాలు
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి తిరుపతిలో గోల్డ్ లోన్ అనేది మీరు తాకట్టు పెట్టిన వస్తువుల భద్రతను నిర్ధారించడానికి, అత్యాధునిక భద్రతా ప్రోటోకాల్స్ అనుసరిస్తుంది.
తిరుపతి నగరం హిందువుల యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ నగర ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటక రంగంపై ఆధారపడి ఉంటుంది. అలాగే, ఐటి మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కూడా తిరుపతి ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర మొబైల్ మరియు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది మొబైల్ హ్యాండ్‌సెట్‌లు మరియు ఇతర కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువులను తయారుచేసే ఒక ప్రత్యేక పారిశ్రామిక కేంద్రం.
తిరుపతి నివాసులు ఇప్పుడు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి గోల్డ్ లోన్‌తో వారి తక్షణ నగదు అవసరాలను నెరవేర్చుకోవచ్చు. నామమాత్రపు వడ్డీ రేట్లకు తిరుపతిలో మేము గోల్డ్ లోన్లను అందిస్తాము.
తిరుపతిలో గోల్డ్ లోన్ అర్హత ప్రమాణాలు
క్రెడిట్ కోసం అప్లై చేయడానికి కింద పేర్కొన్న గోల్డ్ లోన్ అర్హత ప్రమాణాలను నెరవేర్చండి:
-
వయస్సు
21 నుంచి 70 సంవత్సరాలు
-
వృత్తి విధానం
ఉద్యోగస్తులు లేదా స్వయం-ఉపాధి గలవారు
-
పౌరసత్వం
నివాసిత భారతీయ పౌరులు మాత్రమే
అప్లై చేయడానికి ముందు మీ బంగారం వస్తువుల స్వచ్ఛతను చెక్ చేయడాన్ని నిర్ధారించుకోండి. మీరు అప్పుగా తీసుకోగల రుణ మొత్తాన్ని తెలుసుకోవడానికి ఒక గోల్డ్ లోన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.
గోల్డ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి గోల్డ్ లోన్ పొందడానికి మీరు సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్లు దిగువ ఇవ్వబడ్డాయి
- ఆధార్ కార్డు
- ఓటర్ ఐడి కార్డు
- పాస్‍పోర్ట్
- డ్రైవింగ్ లైసెన్సు
- యుటిలిటీ బిల్లు
- ఆదాయం రుజువు (శాలరీ స్లిప్, ఐటిఆర్, ఫారం 16, బిజినెస్ టర్నోవర్ వివరాలు), ఒకవేళ అడిగినట్లయితే
గోల్డ్ లోన్ యొక్క వడ్డీ రేటు మరియు ఛార్జీలు
బజాజ్ ఫిన్‌సర్వ్ నామమాత్రపు వడ్డీ రేట్లకు బంగారం పై రుణాలను అందిస్తుంది. అప్లై చేయడానికి ముందు, గోల్డ్ లోన్ వడ్డీ రేటు మరియు అదనపు ఫీజులు మరియు ఛార్జీలను చెక్ చేయండి.