ఫీచర్లు మరియు ప్రయోజనాలు

  • Minimal documents

    అతి తక్కువ డాక్యుమెంట్లు

    ఉద్యోగస్తుల కొరకు పర్సనల్ లోన్‌ను పొందడానికి మీరు కేవలం మీ గుర్తింపు మరియు చిరునామాని మాత్రమే సమర్పించాలి.

  • High-value loan amount

    అధిక-విలువ లోన్ మొత్తం

    రూ. 40 లక్షల వరకు అధిక-విలువగల వ్యక్తిగత రుణాలను పొందండి మరియు మీ అన్ని ఆర్థిక అవసరాలను సులభంగా పరిష్కరించండి.

  • Doorstep document collection

    ఇంటి వద్దకు వచ్చి డాక్యుమెంట్ల సేకరణ

    మా ప్రతినిధులు మీ నివాసం నుండి అవసరమైన డాక్యుమెంట్లను సేకరిస్తారు మరియు మీ సౌలభ్యం కోసం ప్రాసెస్‌ను పూర్తి చేస్తారు.

  • Swift approval and disbursal

    త్వరిత ఆమోదం మరియు పంపిణీ

    బజాజ్ ఫిన్‌సర్వ్షార్ట్-టర్మ్ లోన్స్ కోసం త్వరిత అప్రూవల్ అందిస్తుంది. సాధారణ అప్లికేషన్ ఫారం నింపండి మరియు మీరు త్వరగా అవసరమైన ఫండ్స్ అందుకోండి.

  • Transparent process

    పారదర్శక ప్రక్రియ

    బజాజ్ ఫిన్‌సర్వ్ అనేది 100% పారదర్శక నిబంధనలు కలిగి ఉన్న ఒక విశ్వసనీయ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్. అప్లై చేయడానికి ముందు అన్ని సంబంధిత ఛార్జీలను తనిఖీ చేయండి.

జీతం పొందే ప్రొఫెషనల్స్ సాధారణంగా ఒక నిర్ణీత నెలవారీ ఆదాయం కలిగి ఉంటారు, అత్యవసర పరిస్థితుల కోసం ఈ మొత్తం ఎల్లప్పుడూ సరిపోకపోవచ్చు.

అందువల్ల, వైద్య అత్యవసర పరిస్థితి, ఇంటి పునరుద్ధరణ, రుణ ఏకీకరణ, వివాహ ఖర్చులు మొదలైనటువంటి వివిధ ప్లాన్ చేసుకున్న లేదా ప్లాన్ చేయని ఖర్చులను తీర్చుకోవడంలో మీకు సహాయపడటానికి మేము ఉద్యోగుల కొరకు పర్సనల్ లోన్‌ను అందిస్తాము. మీ నెలవారీ జీతంతో ఈ అధిక-మొత్తంతో కూడిన ఖర్చులను నిర్వహించడం ఒక సవాలుగా మారవచ్చు. అలాగే, మీరు మీ పొదుపులను కూడా వినియోగించుకోవాల్సి రావచ్చు.

అయితే, ఉద్యోగస్తుల కోసం బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ పొందడం ద్వారా మీరు అలాంటి పరిస్థితిని నివారించవచ్చు. ఒక ప్రైవేటు లేదా ప్రభుత్వ సంస్థ లేదా ఎంఎన్‌సిలో పనిచేసే వ్యక్తిగా ఈ రుణాన్ని పొందవచ్చు. మీరు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు మరియు సౌకర్యవంతమైన రీపేమెంట్ అవధులతో రూ. 35 లక్షల వరకు పొందవచ్చు. మా అర్హత ప్రమాణాల గురించి తెలుసుకోవడానికి చదవండి.

మరింత చదవండి తక్కువ చదవండి

అర్హతా ప్రమాణాలు

మీరు ఈ కింది అర్హత ప్రమాణాలను నెరవేర్చినట్లయితే, బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఉద్యోగస్తుల కొరకు ఒక ఉత్తమ పర్సనల్ లోన్‌ను పొందవచ్చు:

  • Nationality

    జాతీయత

    భారతీయ నివాసి

  • Age limit

    వయో పరిమితి

    21 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు*

  • Employment status

    ఉద్యోగం యొక్క స్థితి

    ఒక ఎంఎన్‌సి, పబ్లిక్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క జీతం పొందే ఉద్యోగి

  • CIBIL Score

    సిబిల్ స్కోర్

    750 పైన

నగరం పేరు

కనీస జీతం

బెంగళూరు, ఢిల్లీ, పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, ఘజియాబాద్, నోయిడా, థానే

రూ. 35,000

జైపూర్, చండీగఢ్, నాగ్పూర్, సూరత్, కొచ్చిన్

రూ. 28,000

గోవా, లక్నో, బరోడా, ఇండోర్, భువనేశ్వర్, వైజాగ్, నాసిక్, ఔరంగాబాద్, మధురై, మైసూర్, భోపాల్

రూ. 25,000

పేరొందిన ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు లేదా ఎంఎన్‌సిలలో పనిచేస్తూ జీతం పొందే ఉద్యోగస్తులు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి అధిక-విలువతో కూడిన ఇన్స్టెంట్ పర్సనల్ లోన్‌ను పొందవచ్చు. రీపేమెంట్ మొత్తాన్ని అంచనా వేయడానికి మీరు మా ఆన్‌లైన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ పర్సనల్ లోన్ పై ఇఎంఐ ను కూడా లెక్కించవచ్చు.

ఆకర్షణీయమైన రేట్ల వద్ద ఇన్స్టెంట్ పర్సనల్ లోన్‌ను పొందడానికి ఉద్యోగస్తులు తమ క్రెడిట్ రేటింగ్‌ను మరియు అర్హతను మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం వారు సకాలంలో బకాయిలను చెల్లించడం ఒక ఉత్తమ మార్గం. ఇది సిబిల్ స్కోర్‌ను పెంచడంలో సహాయపడుతుంది. మెరుగైన అవగాహన కోసం ఆన్‌లైన్‌ అర్హత క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

మరింత చదవండి తక్కువ చదవండి

వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్‌సర్వ్ సహేతుకమైన వడ్డీ రేట్లకు జీతం పొందే ఉద్యోగుల కోసం వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. రుణ ఖర్చు గురించి వివరాల కోసం అదనపు ఛార్జీల గురించి తెలుసుకోవడానికి ముందు వ్యక్తిగత రుణ వడ్డీ రేట్ల గురించి చదవండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఉద్యోగస్తుల కొరకు పర్సనల్ లోన్‌ను తీసుకునేటప్పుడు నేను ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది?

పరిస్థితి ఆధారంగా, మీరు మీ వ్యక్తిగత రుణం పై అదనపు ఛార్జీలు చెల్లించవలసి ఉండవచ్చు. వీటిలో బౌన్స్ ఛార్జీలు (బౌన్స్ చేయబడిన చెక్ లేదా మిస్డ్ ఇఎంఐ సందర్భంలో), రుణం కోసం ప్రాసెసింగ్ ఫీజు, పాక్షిక-ప్రీపేమెంట్ లేదా ఫోర్‍క్లోజర్ ఛార్జీలు మరియు ఇతరులు ఉంటాయి.

మీ పర్సనల్ లోన్‌ కోసం వర్తించే ఫీజులు మరియు ఛార్జీల పూర్తి జాబితాను చదవండి.

నేను నా వ్యక్తిగత రుణాన్ని ఫోర్‌క్లోజ్ చేయవచ్చా లేదా పార్ట్-ప్రీపే చేయవచ్చా?

అవును, మీకు మీ పర్సనల్ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేసే లేదా పార్ట్-ప్రీపే చేసే అవకాశం ఉంది. దీన్ని ప్రారంభించడానికి దయచేసి మా కస్టమర్ పోర్టల్ - మై అకౌంట్‌‌ను సందర్శించండి.

నేను తక్కువ సిబిల్ స్కోర్‌తో పర్సనల్ లోన్ పొందవచ్చా?

750 క్రెడిట్ స్కోర్ ఆదర్శవంతంగా పరిగణించబడినప్పటికీ, మీకు తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నప్పటికీ మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. ఒక అద్భుతమైన సిబిల్ స్కోర్ కలిగి ఉంటే, ఒక జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యునికి సంయుక్తంగా అప్లై చేయడానికి ఒక ఎంపిక. అయితే, మీ దరఖాస్తును ఆమోదించడానికి ముందు మీ ఋణదాత మీ తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేస్తారని దయచేసి గమనించండి.

నేను ఎంత రుణం మొత్తాన్ని అప్పుగా తీసుకోవాలి?

మీకు అవసరమైన దానిని మాత్రమే మీరు అప్పుగా తీసుకోవాలని ఎల్లప్పుడూ సలహా ఇవ్వబడుతుంది. ఈ విధంగా, మీరు సులభంగా రీపేమెంట్ నిర్వహించగలుగుతారు. మీరు అప్లై చేయడానికి ముందు మీ నెలవారీ వాయిదాలు మరియు రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మా పర్సనల్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ ను కూడా ఉపయోగించవచ్చు.

ఉద్యోగస్తుల కొరకు పర్సనల్ లోన్ అంటే ఏమిటి?

ఉద్యోగస్తుల కొరకు పర్సనల్ లోన్ అనేది ఒక ఇన్స్టెంట్ ఆన్‌లైన్ పర్సనల్ లోన్. ఇది జీతం పొందే కస్టమర్ల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక పర్సనల్ లోన్. ప్రముఖ ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు లేదా ఎంఎన్‌సిలలో పనిచేసి వ్యక్తులు బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి అధిక-విలువతో కూడిన పర్సనల్ లోన్‌ను తక్షణమే పొందవచ్చు. ఆకర్షణీయమైన రేట్ల వద్ద ఈ పర్సనల్ లోన్‌ను పొందడానికి మీ క్రెడిట్ రేటింగ్ మరియు అర్హతను చెక్ చేయండి.

నేను ఉద్యోగస్తుల కొరకు పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

బజాజ్ ఫిన్‌సర్వ్‌ వద్ద ఉద్యోగస్తుల కొరకు ఆన్‌లైన్ పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం చాలా సులభం. ప్రారంభించడానికి 'ఆన్‌లైన్లో అప్లై చేయండి' బటన్‌పై క్లిక్ చేసి, ఇచ్చిన సూచనలను అనుసరించండి మీరు అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లను (ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ మొదలైనవి) రెడీగా ఉంచుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము. ఉద్యోగస్తుల కొరకు పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి మీరు మీ సమీప బజాజ్ ఫిన్‌సర్వ్ బ్రాంచ్‌ను కూడా సందర్శించవచ్చు.

ఉద్యోగుల కొరకు పర్సనల్ లోన్ కోసం అప్లికేషన్ ప్రాసెస్‌కు ఎంత సమయం పడుతుంది?

ఉద్యోగుల కొరకు పర్సనల్ లోన్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ వేగవంతమైనది మరియు చాలా సులభం. మీరు చేయవలసిందల్లా కేవలం కొన్ని సులభమైన దశలను అనుసరించడం. మీరు అర్హత ప్రమాణాలను నెరవేర్చి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందించినట్లయితే, 5 నిమిషాల్లో అప్రూవల్‌ను పొందవచ్చు.

పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఏవి?

జీతం పొందే ఉద్యోగుల కొరకు పర్సనల్ లోన్ పొందడానికి మీరు ఈ కింది డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి:

  • పాస్‍‍పోర్ట్-సైజ్ ఫోటోలు
  • కెవైసి డాక్యుమెంట్లు (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్)
  • మునుపటి మూడు నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు
  • గత రెండు నెలల శాలరీ స్లిప్పులు
మరింత చదవండి తక్కువ చదవండి