బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే బంగారం పై రుణం కోసం అప్లై చేయడానికి నేను నెరవేర్చవలసిన అర్హతా ప్రమాణాలు ఏమిటి?
మీ బంగారు ఆభరణాలపై రుణం తీసుకోవడం అనేది మీ ఆస్తి యాజమాన్యం పై రాజీ పడకుండా, తక్షణ రుణం పొందడానికి దానిని వినియోగించే గొప్ప మార్గం. అది ఒక వైద్య అత్యవసర పరిస్థితి, మీ వ్యాపార విస్తరణ, ఉన్నత విద్య లేదా ఏదైనా ఇతర ఖర్చు కోసం అయినా సరే, మీ అన్ని ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి గోల్డ్ లోన్ ఒక సులభమైన మార్గం.
పరిమిత క్రెడిట్ చరిత్ర లేదా తక్కువ క్రెడిట్ స్కోర్‌లు ఉన్న వ్యక్తులకు గోల్డ్ లోన్ ప్రధాన ఎంపికగా ఉంటుంది, ఎందుకంటే లోన్ అమౌంట్ బంగారం విలువపై ఆధారపడి ఉంటుంది. మీ బంగారు ఆభరణాలను తాకట్టుగా పెట్టి గోల్డ్ లోన్ పొందవచ్చు కావున, అన్‌సెక్యూర్డ్ లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి.
బజాజ్ ఫైనాన్స్ వద్ద మీరు రూ. 5,000 నుండి రూ. 2 కోట్ల వరకు రుణం పొందవచ్చు. మేము తక్కువ పేపర్‌వర్క్‌తో వేగవంతమైన మరియు అవాంతరాలు-లేని అప్రూవల్‌ని కూడా అందిస్తాము. ప్రాథమిక అర్హత పరామితులను నెరవేర్చే వరకు ఎవరైనా బజాజ్ ఫిన్‌సర్వ్ గోల్డ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
మీరు 21 మరియు 70 మధ్య వయస్సు గల భారతీయ పౌరులైతే, మా గోల్డ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీకు కావలసిందల్లా మీ వద్ద ఉన్న 22-క్యారెట్ల విలువైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు. అంతే కాకుండా, మీకు మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు మరియు మీ గుర్తింపు రుజువు, చిరునామా రుజువుగా కింది డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి అవసరం:
- ఆధార్ కార్డు
- ఓటర్ ఐడి కార్డు
- పాస్‍పోర్ట్
- డ్రైవింగ్ లైసెన్సు
అయితే, మీరు 5 లక్షల కంటే ఎక్కువ రుణం కోసం అప్లై చేస్తే, మీరు మీ పాన్ కార్డును కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
మేము మా అవాంతరాలు-లేని అప్లికేషన్ మరియు వేగవంతమైన అప్రూవల్ ప్రాసెస్, మీరు కొన్ని సులభమైన దశలలో ఆన్‌లైన్‌లో గోల్డ్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. మేము ఒక అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేస్తాము మరియు మీరు మీ సమీప గోల్డ్ లోన్ శాఖను సందర్శించే సమయంలో ప్రతిదానినీ సిద్ధంగా ఉంచుతాము.
ఒకసారి మీ అర్హత గురించి మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత, మీరు మా వెబ్‌సైట్‌లో గోల్డ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. గోల్డ్ లోన్ కోసం అప్లై చేయడానికి ఈ సాధారణ దశలను అనుసరించండి:
దశ 1: వెబ్‌సైట్‌లో గోల్డ్ లోన్ విభాగాన్ని సందర్శించండి.
దశ 2: ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం తెరవడానికి 'అప్లై చేయండి' బటన్ పై క్లిక్ చేయండి.
దశ 3: మీ పేరు మరియు మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
దశ 4: మీ నగరం పేరును టైప్ చేయండి మరియు మీకు సమీపంలోని బ్రాంచ్‌ను ఎంచుకోండి.
దశ 5: మీ ఫోన్‌కు పంపబడిన ఓటిపిని సబ్మిట్ చేయండి మరియు ఆన్‌లైన్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.
అదనంగా, ప్రస్తుతం మేము బంగారు నాణేలు, కడ్డీలు, మిశ్రమ లోహాలు, పాత్రలు మొదలైనవాటిని గోల్డ్ లోన్ కొరకు తాకట్టుగా అంగీకరించడం లేదని దయచేసి గమనించగలరు.