ఫిక్స్‌‌డ్ డిపాజిట్ల గురించి అన్ని వివరాలు

బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సిలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు) ద్వారా అందించబడే, ఒక ఫిక్స్‌డ్‌ డిపాజిట్ అనేది ఒక స్థిరమైన వడ్డీ రేటుతో మరియు అత్యంత భద్రతతో ఒక నిర్ణీత అవధిలో ఒక ఏకమొత్తాన్ని మీరు పెంచుకోవచ్చు.

వడ్డీ రేటు మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా ప్రభావితం కాదు మరియు లాక్-ఇన్ వ్యవధి తర్వాత మెచ్యూరిటీ పై మీకు హామీ ఇవ్వబడిన రాబడులు లభిస్తాయి. మీరు ఒక పీరియాడిక్ ప్రాతిపదికన లేదా మెచ్యూరిటీ సమయంలో మీ వడ్డీ ఆదాయాన్ని పొందడానికి ఎంచుకోవచ్చు. సాధారణంగా, ఒక ఎఫ్‌డి కోసం నిర్వచించే ప్రమాణాలు ఏంటంటే డబ్బు మెచ్యూరిటీకి ముందు విత్‍డ్రా చేయబడదు, కానీ మీరు జరిమానా చెల్లించడానికి సిద్ధపడితే దాన్ని విత్‍డ్రా చేయవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు

  • రాబడులు హామీ ఇవ్వబడతాయి మరియు మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా ప్రభావితం కావు
  • ప్రిన్సిపల్ నష్టపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది లేదా అసలు నష్టపోరు
  • ఎన్‌బిఎఫ్‌సిలు అందించే ఎఫ్‌డి వడ్డీ రేట్లు బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటాయి
  • ఎఫ్‌డిలను సులభంగా రెన్యూ చేసుకోవచ్చు, మరియు మీరు మీ డిపాజిట్లను రెన్యూ చేయడం పై అదనపు రేట్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు
  • ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం వడ్డీ ఆదాయంపై మూలం వద్ద పన్ను మినహాయించబడుతుంది. మీ మొత్తం ఆదాయం పై పన్ను చెల్లించనవసరం లేకపోతె, మీరు ఫారం 15G (ఫారం 15H ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయితే) సబ్మిట్ చేయడం ద్వారా టిడిఎస్ ని నివారించవచ్చు
  • మీ నెలవారీ ఖర్చులను నిర్వహించడానికి మీరు పీరియాడిక్ వడ్డీ చెల్లింపులను ఎంచుకోవచ్చు
  • సీనియర్ సిటిజన్స్ తరచుగా అధిక ఎఫ్‌డి వడ్డీ రేట్లు పొందుతారు

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క ఫీచర్‌లు

వడ్డీ రేటు

సంవత్సరానికి 7.60% వరకు.

కనీస అవధి

1 సంవత్సరం

గరిష్ట అవధి

5 సంవత్సరాలు

డిపాజిట్ మొత్తం

కనీసం- రూ. 15,000

అప్లికేషన్ ప్రాసెస్

సులభమైన ఆన్‌లైన్ కాగితరహిత ప్రక్రియ

ఆన్‌లైన్ చెల్లింపు ఎంపికలు

నెట్ బ్యాంకింగ్ మరియు యుపిఐ


బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

బజాజ్ ఫైనాన్స్ భారతదేశంలో సంవత్సరానికి 7.60% వరకు కొన్ని అత్యధిక ఎఫ్‌డి రేట్లను అందిస్తుంది, క్రిసిల్ నుండి ఎఫ్ఎఎఎ రేటింగ్ మరియు ఐసిఆర్ఎ నుండి ఎంఎఎఎ రేటింగ్ కారణంగా మీరు ఇక్కడ అధిక పెట్టుబడి భద్రతను ఆనందిస్తారు. మీరు ఒక ఫ్లెక్సిబుల్ అవధి కోసం పెట్టుబడి పెట్టవచ్చు, కేవలం రూ. 15,000 మొత్తంతో ప్రారంభించవచ్చు. బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టడం ద్వారా, సీనియర్ సిటిజన్స్ వారి డిపాజిట్లపై సంవత్సరానికి 0.25% వరకు వడ్డీ రేటు ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

తరచుగా అడగబడే ప్రశ్నలు

నేను ఆన్‌లైన్‌లో ఎఫ్‌డి తెరవవచ్చా?

అవును, మీరు బజాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డి లో డబ్బును పెట్టుబడి చేయడానికి ఎంచుకోవడం ద్వారా ఆన్‌లైన్‌లో ఎఫ్‌డి లో పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్‌లైన్‌లో ఎఫ్‌డి అకౌంట్ తెరవడానికి మీరు కొన్ని ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి. మీ మొబైల్ నంబర్ అందించడం ద్వారా లాగిన్ అవడానికి, మీరు ఓటిపి ని ఎంటర్ చేయాలి.

మీరు ఇప్పటికే ఉన్న కస్టమర్ అయితే, మీ వివరాలను ధృవీకరించండి మరియు కొనసాగడానికి నామినీ వివరాలను నమోదు చేయండి. మీరు ఒక కొత్త కస్టమర్ అయితే, పాన్ లేదా ఆధార్ అందించడం లేదా డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడం ద్వారా మీ కెవైసి ని పూర్తి చేయండి.

బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు డిపాజిట్ మొత్తం, అవధి మరియు వడ్డీ చెల్లింపు రకాన్ని నమోదు చేయండి.

నెట్ బ్యాంకింగ్ లేదా యుపిఐ ద్వారా చెల్లించడానికి ఎంచుకోండి. రూ. 1,00,000 కంటే ఎక్కువ పెట్టుబడి కోసం, నెట్ బ్యాంకింగ్ ఎంపిక మాత్రమే అందుబాటులో ఉంది. విజయవంతమైన చెల్లింపు తర్వాత, మీ డిపాజిట్ బుక్ చేయబడుతుంది మరియు మీరు 15 నిమిషాల్లో ఇమెయిల్ మరియు ఎస్‌ఎంఎస్ ద్వారా ఒక రసీదును అందుకుంటారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై డబ్బును నేను ఎలా ఆదా చేయగలను?

ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ మీ ఫండ్స్‌ను ఒక ఫిక్స్‌డ్ టర్మ్ కోసం పెట్టుబడి పెట్టడానికి మరియు ఒక ఫిక్స్‌డ్ వడ్డీ రేటుకు రాబడులను సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ఎఫ్‌డి పై వడ్డీ రేటు సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువగా ఉంటుంది, తద్వారా మీరు మీ సేవింగ్స్‌ను మరింత పెంచుకోవచ్చు.

సులభంగా డబ్బును ఆదా చేయడానికి మీరు ఎఫ్‌డి లో ఎలా పెట్టుబడి పెట్టవచ్చో ఇక్కడ ఇవ్వబడింది.

  • మీకు పెట్టుబడి పెట్టడానికి అదనపు మొత్తం ఉంటే, మీరు దానిని వివిధ అవధులతో అనేక FDలలోకి విభజించవచ్చు మరియు ప్రతి డిపాజిట్ కోసం వడ్డీని సంపాదించవచ్చు
  • ఎఫ్‌డి వడ్డీ చెల్లింపు మెచ్యూరిటీ సమయంలో అందుకోబడుతుంది, లేదా రికరింగ్ ఖర్చులకు నిధులు సమకూర్చడానికి మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని అందుకోవచ్చు
  • నెలకు కేవలం రూ. 5000 నుండి ప్రారంభమయ్యే డిపాజిట్లతో, సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్‌తో నెలవారీగా ఆదా చేసుకోండి

మీరు అత్యవసర పరిస్థితుల కోసం ఫండ్స్ సేకరించాలని చూస్తున్నట్లయితే, మీ సేవింగ్స్‌ను లిక్విడేట్ చేయవద్దు. అత్యవసర ఫైనాన్సింగ్ అవసరాలను తీర్చుకోవడానికి మీరు ఎఫ్‌డి పై రుణం పొందవచ్చు.

నేను నా ఎఫ్‌డి ని ఆన్‌లైన్‌లో లిక్విడేట్ చేయవచ్చా?

బజాజ్ ఫైనాన్స్ యూజర్లు తమ సౌలభ్యం ప్రకారం తమ ఎఫ్‌డి ని ఆన్‌లైన్‌లో లిక్విడేట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. 3 నెలల ఫిక్స్‌డ్ లాక్-ఇన్ వ్యవధి ఉంది, ఆ సమయంలో డిపాజిట్ లిక్విడేట్ చేయబడదు. 3 నెలల తర్వాత కానీ 6 నెలల ముందు కానీ డబ్బు విత్‍డ్రా చేస్తే, డిపాజిటర్ ప్రిన్సిపల్ అమౌంట్‌ని మాత్రమే అందుకోవచ్చు. ఈ వ్యవధిలో డబ్బు విత్‍డ్రా చేస్తే వడ్డీ ఏదీ రాదు.

6 నెలల తర్వాత విత్‍డ్రా చేసిన మీదట, వర్తించే వడ్డీ రేటు కంటే డిపాజిట్ బుక్ చేసిన సమయంలో అందుకునే వడ్డీ 2% తక్కువగా ఉంటుంది.

ప్రీమెచ్యూర్ విత్‍డ్రాల్ ఎల్లప్పుడూ ఒక ఎంపిక అయితే, అత్యవసర ఖర్చులను తీర్చుకోవడానికి ఎఫ్‌డి పై రుణం పొందడం మంచిది.

ఫిక్స్‌‌డ్ డిపాజిట్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవుతుందా?

ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా ప్రభావితం కాని సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో ఒకటి. అయితే, మీరు మీ జారీదారుని తెలివిగా ఎన్నుకోకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ కోల్పోవటం లేదా చెల్లింపులలో ఆలస్యాలు వంటి ప్రమాదాలు ఉండవచ్చు.

క్రిసిల్ మరియు ఐసిఆర్ఎ వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల ద్వారా రేటింగ్ ఇవ్వబడిన అధిక విశ్వసనీయత కలిగిన ఒక ఫైనాన్షియర్‌ను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే, మీ డబ్బు సురక్షితంగా ఉండేలాగా నిర్ధారించడానికి పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక స్థితి, మార్కెట్‌లో కీర్తి, క్రిసిల్ స్థితి మరియు సంస్థ యొక్క ప్రొఫైల్‌ను తనిఖీ చేయండి.

ఇప్పుడు డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ పెట్టుబడి ప్రణాళిక ఏది?

అత్యధిక భద్రతతో సేవింగ్స్ యొక్క స్థిరమైన వృద్ధిని పొందాలని చూస్తున్న వ్యక్తులు తప్పనిసరిగా బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డి లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించాలి, ఇది మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా సంవత్సరానికి 7.60% వరకు లాభదాయకమైన వడ్డీ రేట్లను అందిస్తుంది.

ఉత్తమ పెట్టుబడి ఎంపికల్లో ఒకటిగా, క్రిసిల్ ద్వారా ఎఫ్ఎఎఎ మరియు ఐసిఆర్ఎ ద్వారా ఎంఎఎఎ యొక్క అత్యధిక భద్రతా రేటింగ్స్ గుర్తింపుతో బజాజ్ ఫైనాన్స్ వద్ద ఒకరి డిపాజిట్ కోసం అత్యధిక భద్రతను పొందవచ్చు. సకాలంలో చెల్లింపుల హామీతో ఈ రేటింగ్లు డిపాజిట్ యొక్క అత్యధిక భద్రతను సూచిస్తాయి.

అధిక అస్థిరతలు మరియు హెచ్చుతగ్గులకు గురి అవుతున్న స్టాక్ సూచీలను కలిగి ఉన్న మార్కెట్లో, బజాజ్ ఫైనాన్స్ ఆన్‌లైన్ ఎఫ్‌డి కి మీ సేవింగ్స్‌లో కొంత భాగాన్ని కేటాయించండి, ఇది ద్రవ్యోల్బణంకి మించిన రాబడులు మరియు మీ డిపాజిట్ పై భద్రతను అందిస్తాయి.

మరింత చదవండి తక్కువ చదవండి