తరచుగా అడగబడే ప్రశ్నలు

బజాజ్ ఫిన్ సర్వ్ నుంచి నేను బంగారం లోన్ ఎందుకు తీసుకోవాలి?

బజాజ్ ఫిన్‌సర్వ్‌ 100% పారదర్శకత మరియు సరసమైన వడ్డీ రేట్లుతో రూ. 2 కోట్ల వరకు బంగారం పై రుణం అందిస్తుంది. దీనికి అదనంగా, బజాజ్ ఫిన్‌సర్వ్‌ పాక్షిక-చెల్లింపు మరియు ఫోర్‍క్లోజర్ కోసం ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతమైన రీపేమెంట్ ఎంపికలను కూడా అందిస్తుంది. ఇంకా, మీకు అవసరమైనప్పుడు మీ బంగారం ఆభరణాలలో కొన్నింటిని విత్‍డ్రా చేసుకోవడానికి మీకు వీలు కల్పించే పాక్షిక విడుదల సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.

బంగారం ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది?

బజాజ్ ఫిన్‌సర్వ్ వద్ద, మీ బంగారం ఆభరణాలు ప్రపంచ స్థాయి భద్రతా ప్రోటోకాల్స్‌తో ఉన్న ఒక సురక్షితమైన గదిలో భద్రపరచబడతాయి. మీ ఆభరణాల యొక్క అత్యధిక భద్రతను నిర్ధారించడానికి మేము అన్ని శాఖలలో సిసిటివి, గోల్డ్ వాల్ట్‌లలో మోషన్ డిటెక్టర్లను ఏర్పాటు చేశాము.

మీ శాఖ నుండి నా బంగారం దొంగిలించబడితే ఏం చేయాలి?

బజాజ్ ఫిన్‌సర్వ్‌ తో, మీ బంగారం ఇన్సూర్చేయబడి ఉంటుంది. మీ బంగారం ఆభరణాలు దొంగిలించబడితే, రికార్డ్ చేయబడిన బరువు మరియు క్యారెట్ ప్రకారం ప్రస్తుత బంగారం ధర ఆధారంగా మీ బంగారం యొక్క పూర్తి విలువ కోసం మీకు పరిహారం ఇవ్వబడుతుంది.

బంగారం పై రుణాల కోసం పంపిణీ విధానం ఏమిటి?

ఒక బంగారం పై రుణం పంపిణీని నగదు మరియు ఐఎంపిఎస్/నెఫ్ట్/ఆర్‌టిజిఎస్ ద్వారా చేయవచ్చు.

నాతో పాటు ఏ డాక్యుమెంట్లను తీసుకొని రావాలి?

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్‌ ద్వారా నిర్దేశించబడిన కనీస అర్హతా ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత, మీరు బంగారం పై రుణం పొందడానికి గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు వంటి కెవైసి పత్రాలను మాత్రమే సమర్పించాలి.

ఒక ఏడాది తర్వాత నా లోన్ కొనసాగించడానికి నేను ఏం చెయ్యాలి?

అవును, మీరు 1 సంవత్సరం తర్వాత మీ రుణం కొనసాగించవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్‌ తో, మీరు మీ బంగారం పై రుణం రెన్యూ చేసుకునే ఎంపికను కలిగి ఉంటారు.

నేను 2 పాక్షిక ముందస్తు చెల్లింపులు చేసి నా రుణాన్ని పూర్తిగా చెల్లించవచ్చా?

బజాజ్ ఫిన్‌సర్వ్‌ ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఎంపికలు మరియు ఉచిత పాక్షిక-చెల్లింపు సౌకర్యంతో బంగారం పై రుణాలను అందిస్తుంది. మీరు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా 2 పాక్షిక చెల్లింపులతో మీ బంగారం పై ఉన్న రుణాన్ని చెల్లించవచ్చు.

నేను వడ్డీ రీపేమెంట్ స్కీంను ఎంచుకుంటే, నాకు పాక్షిక చెల్లింపు ఎంపిక ఉంటుందా?

బజాజ్ ఫిన్‌సర్వ్ అనేక రీపేమెంట్ పథకాలు మరియు ఉచిత పాక్షిక చెల్లింపు మరియు ఫోర్‍క్లోజర్ సౌకర్యాలతో గోల్డ్ లోన్లు అందిస్తుంది. మీరు ఎంచుకున్న రీపేమెంట్ స్కీమ్ కాకుండా, మీ వద్ద మిగులు ఫండ్స్ ఉన్నప్పుడు మీ బంగారం పై రుణం కోసం పాక్షిక చెల్లింపు చేయవచ్చు.

నేను మరణిస్తే నా బంగారానికి ఏమి జరుగుతుంది?

ఈ ఊహించని సంఘటనలో, బకాయి మొత్తాన్ని చెల్లించడం మరియు అవసరమైన డాక్యుమెంట్లను చూపించడం ద్వారా మీరు తనఖా పెట్టిన బంగారాన్ని మీ నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు.

నేను వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలపై గోల్డ్ లోన్ తీసుకోవచ్చా?

లేదు. RBI మార్గదర్శకాల ప్రకారం, బంగారం ఆభరణాలపై మాత్రమే గోల్డ్ లోన్లు ఇవ్వవచ్చు.

వడ్డీ రీపేమెంట్ కోసం నేను ఏ ఫ్రీక్వెన్సీని ఎంచుకోవచ్చు?

ఈ క్రింది ఫ్రీక్వెన్సీలలో వడ్డీ మొత్తాన్ని చెల్లించే ఫ్లెక్సిబిలిటి మీకు ఉంటుంది

  • నెలవారీ - నెలకు ఒకసారి
  • ద్వైమాసికం - ప్రతి 2 నెలలకు ఒకసారి
  • త్రైమాసికం - ప్రతి 3 నెలలకు ఒకసారి
  • అర్ధ-వార్షికం - ప్రతి 6 నెలలకు ఒకసారి
  • వార్షికంగా - లోన్ మెచ్యూరిటీ పై అసలుతో పాటు వన్-టైమ్ వడ్డీ చెల్లింపు
నేను నా ప్రస్తుత గోల్డ్ లోన్‌ను బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు ఎలా బదిలీ చేయగలను?

గోల్డ్ డిపాజిట్ రసీదు (జిడిఆర్)తో సహా మీ ప్రస్తుత గోల్డ్ లోన్ యొక్క అన్ని వివరాలను అందించడం ద్వారా మీరు మీ మునుపటి రుణదాతతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు మీ ప్రస్తుత గోల్డ్ లోన్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

గోల్డ్ లోన్ కోసం అప్లై చేయడానికి పాన్ కార్డ్ అవసరమా?

గోల్డ్ లోన్ కోసం అప్లై చేయడానికి పాన్ కార్డ్ అవసరం. మీకు పాన్ కార్డ్ లేకపోతే, మీరు ఫారం 60 పై సంతకం చేయాలి. ఫారం 60 అనేది మీకు పాన్ కార్డ్ లేదని మరియు మీ ఆదాయం పన్ను పరిమితుల కంటే తక్కువగా ఉందని పేర్కొంటూ ఒక సంతకం చేయబడిన ప్రకటన. రూ. 5 లక్షల కంటే ఎక్కువ రుణాల కోసం పాన్ కార్డ్ తప్పనిసరి.

నేను ఏ రకమైన బంగారం ఆభరణాలపై గోల్డ్ లోన్ తీసుకోవచ్చు?

మీరు 22 క్యారెట్ల బంగారు నగలపై గోల్డ్ లోన్‌ పొందవచ్చు. అయితే, బంగారు నాణేలు, కడ్డీలు, బులియన్లు, బంగారు బిస్కెట్లు, స్పూన్లు, పాత్రలు, ఆధ్యాత్మిక విగ్రహాలు మరియు కిరీటాలపై గోల్డ్ లోన్‌ ఇవ్వబడదు.

నేను నగదు రూపంలో గోల్డ్ లోన్ మొత్తాన్ని పొందవచ్చా?

అవును, మీరు నగదు రూపంలో గోల్డ్ లోన్ మొత్తాన్ని పొందవచ్చు. మీరు రుణ మొత్తాన్ని పాక్షికంగా నగదు రూపంలో మరియు పాక్షికంగా బ్యాంక్ అకౌంటులోకి పొందడానికి ఎంచుకోవచ్చు. మీరు నగదు రూపంలో పొందగల గరిష్ట రుణ మొత్తం రూ. 1,99,999.

జిడిఆర్ అంటే ఏమిటి మరియు అది ఎందుకు ముఖ్యం?

గోల్డ్ డిపాజిట్ రసీదు లేదా జిడిఆర్ అనేది గోల్డ్ లోన్ కోసం రుణదాత వద్ద తాకట్టు పెట్టబడిన మీ బంగారం యొక్క రుజువు. ఒక వ్యక్తి తాను గోల్డ్ లోన్ తీసుకున్న ప్రస్తుత రుణదాత నుండి మరొక రుణదాతకి మార్చాలని అనుకుంటే ఈ డాక్యుమెంట్ చాలా ముఖ్యం.

మరింత చదవండి తక్కువ చదవండి