ఎన్‌బిఎఫ్‌సి నుండి వ్యక్తిగత రుణం పొందడం వలన ప్రయోజనాలు

2 నిమిషాలలో చదవవచ్చు

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) పర్సనలైజ్డ్ ఆఫర్లు, విస్తృత పరిధి, బలమైన రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లు, వివిధ కో-లెండింగ్ ఒప్పందాలు మరియు డైనమిక్ డిజిటల్ ఉనికిని కలిగి ఉన్నాయి, ఇది భారతదేశంలో వారి క్రెడిట్ సౌకర్యాల స్వీకరణను పెంచింది. బ్యాంక్ లోన్ కన్నా రుణగ్రహీతలు ఎన్‌బిఎఫ్‌సి లోన్‌ను ఎందుకు ఇష్టపడతారో తెలుసుకోవడానికి చదవండి.

ఎన్‌బిఎఫ్‌సి వ్యక్తిగత రుణం ఎందుకు మెరుగైన ఎంపిక?

1. సులభమైన అర్హత పరామితులు
మీరు పొడవైన లేదా సంక్లిష్టమైన వాటిని అనుసరించవలసిన అవసరం లేదు వ్యకిగత రుణాల కోసం అర్హతా ప్రమాణాలు ఈ రుణదాతలు పరిగణించే ప్రాథమిక పారామితి మీ క్రెడిట్ స్కోర్. కనీస సిబిల్ స్కోర్ 750, ఇంస్టెంట్ అప్రూవల్ పొందడంలో మీకు సహాయపడుతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్‌లు ఉన్నవారు గణనీయమైన ఆదాయాన్ని, మంచి కెరీర్ పోర్ట్‌ఫోలియోను సూచించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దీనికి విరుద్ధంగా, బ్యాంకులు నిర్దేశించిన అర్హత నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి, ప్రత్యేకించి స్వయం-ఉపాధి గల దరఖాస్తుదారుల విషయంలో ఇది గమనించవచ్చు.

2. కనీసం నుండి అసలు ఉండని పేపర్‌వర్క్
ప్రస్తుత లేదా ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లు ఎన్‌బిఎఫ్‌సిలతో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త కస్టమర్‌లకు కూడా, అవసరమైన డాక్యుమెంట్లు కెవైసి, బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లు, లేటెస్ట్ శాలరీ స్లిప్స్ కొరకు ఓవిడిలకు పరిమితం చేయబడ్డాయి.

బ్యాంకుల విషయంలో, ప్రస్తుత మరియు కొత్త కస్టమర్లు ఇద్దరూ సుదీర్ఘమైన డాక్యుమెంట్లను సమర్పించవలసి ఉంటుంది. ఈ రుణదాతలకు, సాధారణంగా స్వయం ఉపాధి పొందిన దరఖాస్తుదారుల నుండి అదనపు డాక్యుమెంట్లు అవసరం.

3. త్వరితమైన ఆమోదం
ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లు పర్సనల్ లోన్ కోసం ఉత్తమమైన ఎన్‌బిఎఫ్‌సితో అప్లై చేసిన కొద్ది నిమిషాల్లోనే లోన్ అప్రూవల్‌ను పొందవచ్చు. ఇతర సందర్భాల్లో కూడా, మీరు ప్రసిద్ధ ఎన్‌బిఎఫ్‌సిల నుండి కేవలం 5 నిమిషాల్లో* అన్‌సెక్యూర్డ్ లోన్ అప్రూవల్‌ను పొందవచ్చు.

అప్లికేషన్‌ను అప్రూవ్ చేయడానికి ముందు అనుసరించాల్సిన ఎన్నో అంతర్గత ప్రాసెస్‌లు ఉన్నందున, బ్యాంకులకు ఇది సాధారణ విషయమేమి కాదు.

4. స్విఫ్ట్ ప్రాసెసింగ్
ఎన్‌బిఎఫ్‌సిలు అప్రూవల్ తర్వాత ఒక పనిదినంలోపు అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయగలవు. ఈ విధంగా, రుణగ్రహీతలు తాము ఎంచుకున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుండి 24 గంటలలోపు వారి అకౌంట్‌లో డబ్బును అందుకుంటారు. మెడికల్ ఎమర్జెన్సీ వంటి అత్యవసరమైన అవసరాల కోసం ఎన్‌బిఎఫ్‌సి లోన్‌లు ఆదర్శవంతమైన ఫండింగ్ ఆప్షన్‌గా నిలుస్తాయి.

బ్యాంకుల నుండి పర్సనల్ లోన్ కోసం పంపిణీ సమయం అనేది, కొన్ని రోజులు మరియు కొన్ని వారాల మధ్య ఎక్కడైనా పొడిగించవచ్చు.

5. పూర్తిగా ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్
మేము 100% డిజిటల్ మరియు పేపర్‌లెస్ అప్లికేషన్ ప్రాసెస్‌ను అందిస్తున్నాము. ప్రాసెస్‌ను మొదలుపెట్టడానికి మీరు పేరు, ఫోన్ నంబర్, నగరం వంటి ప్రాథమిక వివరాలను మాత్రమే అందించాలి.

మరోవైపు, అనేక బ్యాంకుల నుండి ఆన్‌లైన్ లోన్ దరఖాస్తు ప్రాసెస్ ఇప్పటికీ అందుబాటులో లేదు. రుణగ్రహితలు తప్పనిసరిగా బ్రాంచ్‌ను సందర్శించి వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి కావున ఇది మరింత కష్టతరం అవుతుంది.

6. అసాధారణమైన కస్టమర్ సర్వీస్
చివరిది కానీ ముఖ్యమైనది, ఎన్‌బిఎఫ్‌సిలు అత్యుత్తమ కస్టమర్ సేవను అందిస్తున్నాయి, మీరు వాటిపై ఆధారపడవచ్చు. ఈ లెండింగ్ కంపెనీలు సాధారణంగా కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజర్‌ను కేటాయిస్తాయి, అతను పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు మరియు తరువాత లేదా లోన్ మంజూరు అయ్యే వరకు రుణగ్రహీతకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటాడు.

మరోవైపు, బ్యాంకులతో అటువంటి సేవలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవి, తక్కువ కస్టమర్-సెంట్రిక్‌గా ఉంటాయి.

ఈ అన్ని కారణాల వల్ల, ఎన్‌బి‌ఎఫ్‌సి లోన్‌ను ఎంచుకోవడం అనేది సాధారణంగా ఒక మంచి ఎంపికగా పరిగణించబడుతుంది. మీరు బ్యాంక్‌తో పోలిస్తే ఎన్‌బి‌ఎఫ్‌సిల (అర్హత ఆధారంగా) నుండి అధిక మొత్తంలో తక్షణ లోన్‌ను కూడా పొందవచ్చు. నామమాత్రపు వడ్డీ రేట్లతో ఆకర్షణీయమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలను ఆస్వాదించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్‌తో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి.

మరింత చదవండి తక్కువ చదవండి