వ్యక్తిగత రుణం కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి మా గైడ్‌ను చదవండి
డిజిటలైజేషన్ పేపర్‌లెస్ పర్సనల్ లోన్తో సహా జీవితంలోని అన్ని అంశాలను సులభతరం చేస్తుంది. మీరు రుణదాతను ఎంచుకున్న తర్వాత, ఏ సమయంలోనైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, మీకు అవసరమైన ఫైనాన్సింగ్ కోసం యాక్సెస్ పొందవచ్చు.
ఒక కాగితరహిత వ్యక్తిగత రుణం కోసం అప్లికేషన్ విధానం ఏమిటి?
- రుణదాత వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు ఆన్‌లైన్ లోన్ అప్లికేషన్ ఫారమ్ను గుర్తించండి.
- ఉపాధి, ఆర్థిక మరియు వ్యక్తిగత వివరాలతో సహా అవసరమైన అన్ని వివరాలను పూరించండి.
- సరైన లోన్ మొత్తాన్ని మరియు రీపేమెంట్ కోసం సౌకర్యవంతమైన అవధిని ఎంచుకోండి.
- మీ లోన్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలను అందించండి.
- త్వరిత ఆమోదం మరియు పంపిణీ కోసం వేచి ఉండండి.
అప్రూవల్, పంపిణీ ఖచ్చితంగా త్వరగా మరియు తక్షణమే అని నిర్ధారించడానికి, మీరు అర్హతా ప్రమాణాలను నెరవేర్చాలి, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి.
కాగితరహిత వ్యక్తిగత రుణం: అర్హత ప్రమాణాలు
సాధారణంగా, మీకు 685 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉండాలి, సరైన వయస్సు పరిధిలోకి వచ్చి, భారతీయ పౌరులు అయి ఉండాలి, ఒక ప్రైవేట్/పబ్లిక్ కంపెనీ లేదా ఎంఎన్‌సి లో పనిచేస్తూ రుణదాత నిర్వచించిన విధంగా కనీస జీతం సంపాదించాలి.
కాగితరహిత వ్యక్తిగత రుణం: అవసరమైన డాక్యుమెంట్లు
మీరు అర్హత ప్రమాణాలను నెరవేర్చిన తర్వాత, అవసరమైన డాక్యుమెంట్లను సేకరించండి. సాధారణంగా, రుణదాతలకు ఈ క్రిందివి అవసరం అవుతాయి:
- ఐడెంటిటీ మరియు అడ్రస్ ప్రూఫ్: డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటరు ఐడి లేదా పాస్‌పోర్ట్
- ఉపాధి రుజువు: ఉద్యోగి ఐడి కార్డ్
- ఆర్థిక స్థిరత్వం యొక్క రుజువు: బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు మరియు జీతం స్లిప్లు
తక్షణమే లోన్ పొందాలనే తొందరలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలను చెక్ చేయడం మర్చిపోవద్దు. ఇది మీకు అవాంతరాలు లేని, సరసమైన రీపేమెంట్‌ను ఖచ్చితంగా అందించడంలో సహాయపడుతుంది.
అలాగే, బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఒక కాగితరహిత పర్సనల్ లోన్‌ను తీసుకోవడానికి పరిగణించండి. నామమాత్రపు వడ్డీ రేటు, ఫ్లెక్సీ సౌకర్యం పొందండి మరియు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అంతే కాకుండా, మీరు 5 నిమిషాల్లో* అప్రూవల్ పొందవచ్చు మరియు మీ అకౌంట్‌లో 24 గంటల్లో ఫండ్స్ పొందవచ్చు*.
*షరతులు వర్తిస్తాయి