గోల్డ్ లోన్ మొత్తం ఎలా లెక్కించబడుతుంది?

2 నిమిషాలలో చదవవచ్చు
18 ఏప్రిల్ 2023

ఈ విలువైన లోహం నిరంతరం పెరుగుతున్న మార్కెట్ విలువ కారణంగా బంగారం కలిగి ఉన్న వ్యక్తులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. నిష్క్రియాత్మకంగా ఉన్న ఒక ఆభరణంగా కూడా, దాని అంతర్లీన ఆస్తి విలువ ఎక్కువగా ఉంటుంది, అలాగే దానిని విక్రయించినప్పుడు లేదా ట్రేడ్ చేసినప్పుడు అధిక ధరను పొందవచ్చు. అదృష్టవశాత్తు, ఈ రోజు నిధులను సేకరించడానికి మీరు బంగారం యాజమాన్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. బదులుగా మీరు మీ బంగారు ఆభరణాలపై రుణాన్ని ఎంచుకోవచ్చు. అందుబాటులో ఉన్న రుణ మొత్తం, రుణదాత ద్వారా అనుసరించబడే ప్రతి గ్రాముకు గోల్డ్ లోన్ రేటుపై ఆధారపడి ఉంటుంది.

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ గోల్డ్ లోన్ క్యాలిక్యులేటర్‌‌‌ను ఉపయోగించవచ్చు, ఇది మీరు కలిగి ఉన్న బంగారు నగల బరువును బట్టి గరిష్ట రుణ లభ్యతను అంచనా వేయడానికి, మారుతున్న ప్రతి గ్రాముకు గోల్డ్ లోన్ రేటును అందిస్తుంది.

బంగారం స్వచ్ఛత ప్రకారం ప్రతి గ్రాముకు గోల్డ్ లోన్ రేటును ఎలా లెక్కించాలి?

ప్రతి గ్రాముకు గోల్డ్ లోన్ లెక్కింపు ప్రక్రియ వేగవంతమైనది మరియు సులభమైనది. అందుబాటులో ఉన్న ప్రతి గ్రాముకు గోల్డ్ లోన్ క్యాలిక్యులేటర్లు గణించిన ఫలితాలను పొందడానికి ఈ క్రింద పేర్కొన్న ప్రాతిపదికన పని చేస్తాయి.

 1. తాకట్టు పెట్టే బంగారు ఆభరణాల బరువును పరిగణనలోకి తీసుకుంటారు.
 2. 22 క్యారెట్ వద్ద ఉండే సరైన స్వచ్ఛతతో బంగారం యొక్క స్వచ్ఛత స్థాయి నిర్ణయించబడుతుంది.
 3. గత 30 రోజుల పాటు 22 క్యారెట్ బంగారు ఆభరణాల సగటు ధర లెక్కించబడుతుంది.
 4. రుణదాత ఎల్‌టివి ప్రకారం మంజూరు చేయబడిన మొత్తం లెక్కించబడుతుంది.

బంగారు ఆభరణం యొక్క స్వచ్ఛత అనేది లెక్కించబడిన ప్రతి గ్రాము గోల్డ్ లోన్ యొక్క తుది ధరను ప్రభావితం చేస్తుంది.

ఇప్పుడు మీరు ప్రతి గ్రాము రేటును లెక్కించే ప్రక్రియను తెలుసుకున్నారు, తదుపరి బజాజ్ ఫైనాన్స్ నుండి గోల్డ్ లోన్ పొందడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను తెలుసుకోండి.

గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

 • అంతర్లీన ఆస్తి విలువపై నిధులు: అవసరమైన నిధులను అత్యవసరంగా సేకరించడానికి మీరు బంగారు ఆభరణాల అంతర్లీన ఆస్తి విలువను సులభంగా వినియోగించుకోవచ్చు.
 • అధిక రుణ మొత్తం: తాకట్టు కోసం అందించే బంగారం స్వచ్ఛత మరియు బరువు అనేది సులభంగా రూ. 2 కోట్ల వరకు గోల్డ్ లోన్ పొందేందుకు వీలు కల్పిస్తుంది.
 • అతి తక్కువ పేపర్‌వర్క్: గోల్డ్ లోన్ కోసం డాక్యుమెంట్ల జాబితా చిన్నగా ఉంటుంది, దీనిలో కేవలం అడ్రస్ ప్రూఫ్, కెవైసి డాక్యుమెంట్లు మాత్రమే ఉంటాయి.
 • సరసమైన వడ్డీ రేట్లు: సెక్యూర్డ్ ఫైనాన్స్ అయినందున గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు మరింత సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటాయి.
 • అనేక రీపేమెంట్ ఆప్షన్లు: మీ నెలవారీ బడ్జెట్‌కు అనుగుణంగా ఉండే రీపేమెంట్ పద్ధతిని ఎంచుకోండి.
 • తనఖా పెట్టిన బంగారం కోసం ఇన్సూరెన్స్: బజాజ్ ఫైనాన్స్ నుండి గోల్డ్ లోన్ పొందుతున్నప్పుడు, మా కస్టడీలో ఉన్నంత వరకు మీరు మీ బంగారం కోసం ఉచిత ఇన్సూరెన్స్ కవరేజీని ఆనందించవచ్చు. ఇలాంటి కవరేజ్ నిల్వ చేసిన బంగారం దొంగతనానికి గురికావడం, ఎక్కడైనా పెట్టి దానిని మర్చిపోవడం లాంటి వాటిని కవర్ చేస్తుంది.
 • బంగారు ఆభరణాల పాక్షిక విడుదల: మీకు తాకట్టు పెట్టిన బంగారంలో కొంత అవసరమైతే, దానికి సమానమైన మొత్తాన్ని లోన్ రీపేమెంట్ రూపంలో చెల్లించిన తరువాత, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని పాక్షికంగా విడుదల చేసుకోవచ్చు.

ఈ ప్రయోజనాలతో పాటు, ప్రతి గ్రాముకు గోల్డ్ లోన్ రేట్ లెక్కింపును అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ లోన్ దరఖాస్తు కోసం ప్లాన్ చేసేటప్పుడు గోల్డ్ లోన్ క్యాలిక్యులేటర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది రీపేమెంట్ బాధ్యతను అంచనా వేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు సరసమైన రుణ నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది.

మరింత చదవండి తక్కువ చదవండి