క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?

2 నిమిషాలలో చదవవచ్చు

ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఒక ప్రీ-సెట్ క్రెడిట్ పరిమితితో బ్యాంకుల ద్వారా జారీ చేయబడిన ఒక ఆర్థిక సాధనం, ఇది మీకు నగదురహిత లావాదేవీలు చేయడానికి సహాయపడుతుంది. కార్డ్ జారీచేసేవారు మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ చరిత్ర మరియు మీ ఆదాయం ఆధారంగా క్రెడిట్ పరిమితిని నిర్ణయిస్తారు.

క్రెడిట్ కార్డుల గురించి అన్ని వివరాలు

క్రెడిట్ కార్డ్ అనేది క్రెడిట్ పై ప్రోడక్టులను కొనుగోలు చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఒక ఫైనాన్షియల్ టూల్, మరియు మీరు గడువు తేదీకి ముందు ఉపయోగించిన క్రెడిట్‌ను తిరిగి చెల్లించవచ్చు. వడ్డీని నివారించడానికి, మీరు గడువు తేదీలోపు క్రెడిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.

క్రెడిట్ కార్డులు ప్రతి వేరియంట్ కోసం పేర్కొన్న కార్డ్ పరిమితితో వస్తాయి. మీ సిబిల్ స్కోర్, ఆదాయ ప్రొఫైల్ వంటి అనేక పారామితులు ప్రీ-అప్రూవ్డ్ పరిమితితో వేరియంట్ కోసం మీ అర్హతను నిర్వచిస్తాయి. క్రెడిట్ కార్డులు అనేక ప్రత్యేక ప్రతిపాదనలు మరియు ప్రయోజనాలతో రూపొందించబడ్డాయి, ఇవి కార్డు నుండి కార్డుకు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, మీరు వెల్‌కమ్ బోనస్ పాయింట్లు, యాక్సిలరేటెడ్ పాయింట్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ మరియు మరెన్నో ప్రయోజనాలను ఒక రకమైన కార్డుతో పొందవచ్చు, అయితే మరొక కార్డుకు వేరే ప్రయోజనాలు ఉండవచ్చు. కార్డ్ కోసం అప్లై చేసేటప్పుడు మీరు ఫీచర్లు మరియు ప్రయోజనాలను తనిఖీ చేయవచ్చు.

క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ మధ్య ముఖ్యమైన తేడా ఏమిటంటే మీరు ఒక డెబిట్ కార్డ్‌ను స్వైప్ చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు మినహాయించబడుతుంది. క్రెడిట్ కార్డ్ విషయంలో, మీ క్రెడిట్ పరిమితి నుండి డబ్బు తీసుకోబడుతుంది.

దాదాపుగా అన్ని ఉత్పత్తులు మరియు సేవల కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లింపు చేయడానికి మీరు క్రెడిట్ కార్డును స్వైప్ చేయవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసిన తర్వాత దానిని ఉపయోగించడం ప్రారంభించండి, జరిమానా ఛార్జీలను నివారించడానికి మీరు అప్పుగా తీసుకున్న లేదా ఉపయోగించిన మొత్తాన్ని నిర్ణీత సమయంలోపు తిరిగి చెల్లించే విధంగా నిర్ధారించుకోండి. మీ క్రెడిట్ కార్డ్ వివరాలు జారీచేసిన వారి వద్ద సురక్షితంగా నిల్వ చేయబడతాయి. మోసం నివారించడానికి, మీ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.

ఉత్తేజకరమైన ఆఫర్లను పొందడానికి మరియు కార్డుతో షాపింగ్ చేయడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ RBL BANK సూపర్‌కార్డ్ ఎంచుకోండి.

క్రెడిట్ కార్డుల రకాలు

1 లో 4 శక్తితో వచ్చే వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ మరియు DBS బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది.

  • దీనిని ఒక క్రెడిట్ కార్డ్‌గా ఉపయోగించండి
  • దీన్ని ఒక డెబిట్ కార్డ్‌గా ఉపయోగించండి
  • దీన్ని ఒక ఇఎంఐ కార్డ్‌గా ఉపయోగించండి
  • దీనిని ఒక లోన్ కార్డ్‌గా ఉపయోగించండి

బజాజ్ ఫిన్‌సర్వ్ DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 8 వేరియంట్లలో వస్తుంది అయితే బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ అని పిలవబడే బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 19 ప్రత్యేక వేరియంట్లను అందిస్తుంది.

క్రెడిట్ కార్డ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?

క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు అనేవి మీ కార్డ్ ప్రొవైడర్ మరియు అప్లై చేయబడిన వేరియంట్ ఆధారంగా మారవచ్చు, సాధారణంగా, ప్రయోజనాల పరిధి విస్తృతంగా ఉంటుంది.

బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ ప్రయోజనాలు

ఇది ప్రత్యేకమైన ప్రయోజనాలతో 19 వేరియంట్లను కలిగి ఉంది. మీరు ఈ క్రింది ప్రయోజనాలతో ఈ కార్డులను తీసుకోవచ్చు:

  • స్వాగత బోనస్
  • సులభ EMI మార్పిడి
  • వడ్డీ-రహిత నగదు విత్‍డ్రాల్స్
  • ఎమర్జెన్సీ అడ్వాన్స్
  • ఖర్చులపై రివార్డులు
  • ఇంధన సర్ ఛార్జీ రద్దు
  • క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
  • మైల్‌స్టోన్ ప్రయోజనాలు
  • సినిమా టిక్కెట్లు మరియు మరిన్ని

బజాజ్ ఫిన్‌సర్వ్ DSB బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు

కార్డ్ మీకు 9 వేరియంట్లను అందిస్తుంది. మీరు ఇటువంటి కొన్ని ప్రయోజనాల కోసం కార్డును పొందవచ్చు:

  • వెల్‌కమ్ క్యాష్ పాయింట్లు
  • బజాజ్ హెల్త్ మెంబర్‌షిప్
  • సులభ EMI మార్పిడి
  • వడ్డీ-రహిత నగదు విత్‍డ్రాల్స్
  • ఎమర్జెన్సీ అడ్వాన్స్, వేగవంతమైన రివార్డులు
  • ఇంధన సర్ ఛార్జీ రద్దు
  • క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
  • నెలవారీ మైల్‌స్టోన్ ప్రయోజనాలు మరియు సబ్‌స్క్రిప్షన్లపై డిస్కౌంట్లు
మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడగబడే ప్రశ్నలు

క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ మధ్య తేడా ఏమిటి?

క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏంటంటే మీ కరెంట్ లేదా సేవింగ్స్ అకౌంట్ నుండి నగదును విత్‍డ్రా చేయడానికి మీరు ఒక డెబిట్ కార్డును ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో ఎటువంటి క్రెడిట్ తీసుకోబడలేదు, అందువల్ల మీరు విత్‍డ్రా చేసిన నగదును తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. అయితే, క్రెడిట్ కార్డ్‌లో క్రెడిట్ కార్డు జారీచేసేవారు కార్డ్ హోల్డర్‌కు ఇచ్చే క్రెడిట్ ఉంటుంది. మీరు గడువు తేదీలోపు అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది.

బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే వివిధ రకాల క్రెడిట్ కార్డులు ఏమిటి?

పరిశ్రమలో మొదటిసారి వస్తున్న ఫీచర్లతో క్రెడిట్ కార్డులను అందించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ మరియు DBS బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. క్రెడిట్ కార్డులు అందించబడే ప్రయోజనాల రకాలపై నిర్వచించబడతాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే కొన్ని అత్యంత ప్రముఖ క్రెడిట్ కార్డులు:

  • రివార్డ్స్ క్రెడిట్ కార్డ్
  • క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్
  • ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్
  • ట్రావెల్ క్రెడిట్ కార్డ్
  • షాపింగ్ క్రెడిట్ కార్డ్
క్రెడిట్ పరిమితి అంటే ఏమిటి మరియు నేను అధిక క్రెడిట్ పరిమితిని ఎలా పొందగలను?

క్రెడిట్ కార్డ్ పరిమితి అనేది మీరు మీ కార్డుపై ఖర్చు చేయగల గరిష్ట మొత్తం. క్రెడిట్ పరిమితి మీ కార్డ్ ప్రొవైడర్ ద్వారా నిర్వచించబడుతుంది. మంచి రీపేమెంట్ చరిత్రను నిర్వహించడం ద్వారా మీకు అధిక పరిమితిని అందించడానికి మీరు మీ కార్డ్ ప్రొవైడర్‌ను ప్రభావితం చేయవచ్చు. ఇది మీ ఆదాయ ప్రొఫైల్ మరియు సిబిల్ స్కోర్ వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

నేను క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు లేదా రివార్డుల క్రెడిట్ కార్డులను ఎంచుకోవాలా?

మీ అవసరాలు మరియు కార్డు అందించే ప్రయోజనాల ఆధారంగా మీరు ఎంచుకోవచ్చు.

క్రెడిట్ కార్డులపై రివార్డులను ఎలా సంపాదించాలి? వాటిని ఎలా రిడీమ్ చేసుకోవాలి?

క్రెడిట్ కార్డ్ పై సంపాదించిన రివార్డుల సంఖ్య ప్రతి వేరియంట్ కోసం మారుతుంది. చాలా కార్డులు మీ అన్ని ఖర్చులపై రివార్డులను అందిస్తాయి. అదనంగా, కొన్ని క్రెడిట్ కార్డులు వెల్‌కమ్ రివార్డులు, మైల్‌స్టోన్ రివార్డులు మరియు వేగవంతమైన రివార్డులను కూడా అందిస్తాయి.

బకాయిలను చెల్లించకపోతే వడ్డీ లేదా ఆలస్యపు చెల్లింపు ఛార్జీ వసూలు చేయబడుతుందా?

అవును, కార్డ్ ప్రొవైడర్ నాన్-పేమెంట్ కోసం జరిమానాను విధిస్తారు.

మరింత చూపండి తక్కువ చూపించండి