మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ అప్లికేషన్ స్థితిని ఎలా ట్రాక్ చేయాలి?

2 నిమిషాలలో చదవవచ్చు

బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ అనేది 1 కార్డులో 4 కార్డుల ప్రయోజనాలతో లభించే ఒక ప్రత్యేకమైన క్రెడిట్ కార్డ్. ఇది ఆకర్షణీయమైన రివార్డులు, ఇఎంఐ మార్పిడి సౌకర్యం మరియు వార్షిక పొదుపులలో రూ. 55,000 వరకు అందిస్తుంది. మీరు కార్డ్ కోసం అప్లై చేసినప్పుడు, మీరు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు.

మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్థితిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయండి

బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేయడం చాలా సులభం ఈ దశలను అనుసరించండి:

దశ 1: మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయడానికి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ట్రాకింగ్ పేజీని సందర్శించండి

దశ 2: అవసరమైన వివరాలను పూరించండి. మీరు మీ కస్టమర్ ఐడి, మొబైల్ నంబర్, పాన్ కార్డు నంబర్, ఇమెయిల్ ఐడి మరియు రిఫరెన్స్ నంబర్ నమోదు చేయాలి

దశ 3: బటన్ పై క్లిక్ చేయడం ద్వారా వివరాలను సబ్మిట్ చేయండి

దశ 4: మీ క్రెడిట్ కార్డు స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది

క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్థితిని ఆఫ్‌లైన్‌లో తనిఖీ చేయండి

మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ అప్లికేషన్ స్టేటస్‌ను ఆఫ్‌లైన్‌లో తనిఖీ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

 • +91 92892 22032 పై ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి మరియు మా ప్రతినిధి మిమ్మల్ని తిరిగి కాల్ చేస్తారు
 • సమీప బజాజ్ ఫిన్‌సర్వ్ శాఖను సందర్శించండి మరియు మా ప్రతినిధులను సంప్రదించండి
మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

నా క్రెడిట్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను నేను ఏవిధంగా చెక్ చేయగలను?

మీరు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతులను ఉపయోగించి మీ క్రెడిట్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు.

మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి, ఈ దశలను అనుసరించండి:

 • మీ క్రెడిట్ కార్డు స్టేటస్‌ను ట్రాక్ చేయడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి
 • అవసరమైన వివరాలను పూరించండి. మీ కస్టమర్ ఐడి, మొబైల్ నంబర్, పాన్ కార్డు నంబర్, ఇమెయిల్ ఐడి మరియు రిఫరెన్స్ నంబర్‌ను ఎంటర్ చేయండి
 • వివరాలను సబ్మిట్ చేయండి. మీ అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది

మీరు మీ బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్‌బిఎల్ బ్యాంకు క్రెడిట్ కార్డు స్టేటస్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా దీని ద్వారా చెక్ చేయవచ్చు:

 • +91 9289222032 పై ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం. మీ స్టేటస్‌ను గురించి మీకు తెలియజేయడానికి ఒక ప్రతినిధి మీకు తిరిగి కాల్ చేస్తారు
 • సమీపంలోని బజాజ్ ఫిన్‌సర్వ్ బ్రాంచ్‌ను సందర్శించడం మరియు మా ప్రతినిధులలో ఎవరినైనా సంప్రదించడం
నా క్రెడిట్ కార్డు అప్లికేషన్ అప్రూవ్ చేయబడిందో లేదో నేను ఏవిధంగా తెలుసుకోగలను?

మీ క్రెడిట్ కార్డు అప్లికేషన్ ఆమోదించబడిందో లేదో చెక్ చేయడానికి, మీరు మీ క్రెడిట్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ట్రాక్ చేయాలి.

నా క్రెడిట్ కార్డు యాక్టివ్‌గా ఉందో లేదో నేను ఎలా చెక్ చేయగలను?

మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL Bank సూపర్‌కార్డ్ యాక్టివ్‌గా ఉందా లేదా అని తనిఖీ చేయడానికి మా కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్ 022-71190900 కు కాల్ చేయండి. మీరు 9289222032 పై ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్‌బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అప్లికేషన్ స్థితిని కూడా చెక్ చేయవచ్చు.

నా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ పూర్తయిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది?

బ్యాంకు మీ డాక్యుమెంట్లను ధృవీకరించిన తర్వాత అది ఎస్‌ఎంఎస్, ఇమెయిల్ లేదా పోస్టల్ లెటర్ ద్వారా మీ క్రెడిట్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను గురించి మీకు తెలియజేస్తుంది. మీరు మీ బజాజ్ ఫిన్‌సర్వ్ ఆర్‌బిఎల్ బ్యాంకు క్రెడిట్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ట్రాక్ చేయడం ద్వారా కూడా మీ అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు.

నా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఎందుకు తిరస్కరించబడుతుంది?

ఈ క్రింది కారణాల వలన మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తిరస్కరించబడి ఉండవచ్చు:

 • మీ సిబిల్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉంది
 • మీరు 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు లేదా 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉన్నారు
 • మీ నివాస చిరునామా సర్వీస్ చేయదగిన ప్రదేశంలో లేదు
 • మీకు డిఫాల్ట్ యొక్క గత రికార్డులు ఉన్నాయి
 • మీరు దరఖాస్తు పై తప్పు వివరాలను పూరించారు
క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ కనీస సమయం ఎంత?

మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL Bank క్రెడిట్ కార్డ్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, మీ దరఖాస్తు 5 నుండి 7 వ్యాపార రోజులలోపు ప్రాసెస్ చేయబడుతుంది.

మరింత చదవండి తక్కువ చదవండి