బజాజ్ ఫిన్ సర్వ్ పర్సనల్ లోన్‌తో, మీరు ఒక భరించగలిగే వడ్డీ రేటుకు రూ. 25 లక్షల వరకు అప్పు తీసుకోవచ్చు, తద్వారా మీరు డబ్బు ఆదా చేసుకుని EMI లను సౌకర్యవంతంగా చెల్లించవచ్చు.
There are no hidden charges, and you are assured of 100% transparency. Latest personal loan interest rate & charges are listed in the table below.
పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు | |
---|---|
ఫీజుల రకాలు | వర్తించే ఛార్జీలు |
వడ్డీ రేటు | 13% నుండి |
ప్రాసెసింగ్ ఫీజు | లోన్ మొత్తంలో 4.13% వరకు (వర్తించే పన్నులు అదనం) |
బౌన్స్ ఛార్జీలు | ఒక బౌన్స్‌కు రూ.600 - రూ.1,200 (వర్తించే పన్నులతో సహా) |
జరిమానా వడ్డీ | నెలవారీ ఇన్స్టాల్మెంట్/EMI చెల్లింపులో ఆలస్యం జరిగితే నెలవారీ ఇన్స్టాల్మెంట్/బాకీ పడిన EMI పై ప్రతి నెల 2% నుండి 4% జరిమానా వడ్డీ విధించబడుతుంది. బకాయి పడిన తేదీ నుండి నెలవారీ వడ్డీ/EMI అందుకునే వరకు ఈ జరిమానా వడ్డీ వసూలు చేయబడుతుంది. ఇటీవల అప్డేట్ చేయబడింది |
డాక్యుమెంట్/స్టేట్మెంట్ ఛార్జీలు అకౌంట్ స్టేట్మెంట్/రీపేమెంట్ షెడ్యూల్/ఫోర్క్లోజర్ లెటర్/నో డ్యూస్ సర్టిఫికెట్/వడ్డీ సర్టిఫికెట్/ఇతర డాక్యుమెంట్ల జాబితా |
కస్టమర్ పోర్టల్ – ఎక్స్పీరియాకు లాగిన్ అవడం ద్వారా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా మీ ఇ-స్టేట్మెంట్లు/లెటర్లు/సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకోండి మీరు మీ స్టేట్మెంట్లు/ఉత్తరాలు/సర్టిఫికెట్లు/ఇతర డాక్యుమెంట్ల జాబితా యొక్క ఒక భౌతిక కాపీని మా శాఖలలో దేని వద్ద నుండి అయినా ప్రతి స్టేట్మెంట్/ఉత్తరం/సర్టిఫికేట్ కు ₹. 50 (వర్తించే పన్నులతో సహా) ఛార్జికి పొందవచ్చు. |
లోన్ వేరియంట్ | ఛార్జీలు |
---|---|
టర్మ్ లోన్ | పూర్తి ప్రీ-పేమెంట్ తేదీనాడు బకాయి ఉన్న అసలు మొత్తం పైన 4% మరియు వర్తించే పన్నులు |
ఫ్లెక్సీ టర్మ్ లోన్ | మొత్తం విత్‌డ్రా చేయదగిన మొత్తం పైన 4% మరియు వర్తించే పన్నులు మరియు సెస్* (* రిపేమెంట్ షెడ్యూల్ ప్రకారం మీరు ఫ్లెక్సీ లోన్ క్రింద సమయానుసారం విత్‌డ్రా చేయగల మొత్తం లోన్) అటువంటి ఛార్జీలు విధించబడిన తేదీన |
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ | మొత్తం విత్‌డ్రా చేయదగిన మొత్తం పైన 4% మరియు వర్తించే పన్నులు మరియు సెస్* (* రిపేమెంట్ షెడ్యూల్ ప్రకారం మీరు ఫ్లెక్సీ లోన్ క్రింద సమయానుసారం విత్‌డ్రా చేయగల మొత్తం లోన్) అటువంటి ఛార్జీలు విధించబడిన తేదీన |
రుణ గ్రహీత రకం | సమయ వ్యవధి | పాక్షిక-ముందస్తు చెల్లింపు ఛార్జీలు |
---|---|---|
రుణ గ్రహీతలు అందరు | లోన్ మంజూరు చేసిన తేదీ నుండి 1 నెల కంటే ఎక్కువ | 2% + చెల్లించబడిన పాక్షిక-చెల్లింపు మొత్తం పై వర్తించే పన్నులు* |
లోన్ వేరియంట్ | ఛార్జీలు |
---|---|
ఫ్లెక్సీ టర్మ్ లోన్ | అటువంటి ఛార్జీలు విధించబడిన తేదీనాటికి వినియోగంతో సంబంధం లేకుండా మొత్తం విత్‌డ్రా చేయదగిన మొత్తం పై 0.25% ప్లస్ వర్తించే పన్నులు |
ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ | అటువంటి ఛార్జీలు విధించబడిన తేదీనాటికి వినియోగంతో సంబంధం లేకుండా మొత్తం విత్‌డ్రా చేయదగిన మొత్తం పై 0.25% ప్లస్ వర్తించే పన్నులు |
మాండేట్ రిజెక్షన్ సర్వీస్ ఛార్జ్: రూ.450 (వర్తించే పన్నులతో సహా)
ఏ కారణము చేత అయినా కస్టమర్ యొక్క బ్యాంక్ ద్వారా ఇదివరకటి మాండేట్ ఫారం తిరస్కరణ చేయబడిన తేదీ నుండి 30 రోజుల లోపల కొత్త మాండేట్ ఫారం రిజిస్టర్ కాకపోతే ఛార్జీలు విధించబడతాయి.Note: Additional cess will be applicable on all charges in state of Kerala.
పర్సనల్ లోన్లు రెండు రకాల వడ్డీ రేటుతో వస్తాయి: ఫిక్సెడ్ వడ్డీ రేటు మరియు ఫ్లోటింగ్ వడ్డీ రేటు.
పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు రెండు మార్గాల్లో లెక్కించబడతాయి - ఫ్లాట్ రేటు మరియు బ్యాలెన్స్ తగ్గుతూ ఉండే వడ్డీ రేటు:-
ఫ్లాట్ రేటు మరియు బ్యాలెన్స్ తగ్గుతూ ఉండే పద్ధతి ద్వారా పర్సనల్ లోన్ వడ్డీ రేటు లెక్కింపు ఈ క్రింది సూత్రంతో జరుగుతుంది –
మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు, మీరు రుణదాతకు వడ్డీ మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. కానీ మీ చెల్లించవలసిన పర్సనల్ లోన్ రేటు ఎంత ఉంటుంది అనేది మాన్యువల్ గా కనుగొనడం సులభం కాకపోవచ్చు.
అలా చేయడానికి, మీరు బజాజ్ ఫిన్సర్వ్ వెబ్‌సైట్‌లోని పర్సనల్ లోన్ EMI క్యాలిక్యులేటర్ ను చెక్ చేయవచ్చు.
మీరు కోరుకున్న లోన్ మొత్తం, వ్యవధి మరియు వర్తించే వడ్డీ రేటును ఎంచుకున్న తర్వాత, ఆ క్యాలిక్యులేటర్ ఒక EMI మొత్తాన్ని సూచిస్తుంది. ఇది పూర్తి లోన్ మొత్తానికి ఖచ్చితమైన పర్సనల్ వడ్డీ రేటు మొత్తాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
వడ్డీ రేటు దరఖాస్తుదారుని రకం మరియు అతని/ఆమె క్రెడిట్ స్కోర్ (కనీసం 750 లేదా అంతకంటే ఎక్కువ), ఆదాయం, వయస్సు, ఫైనాన్షియల్ సంస్థతో సంబంధం, ఇప్పటికే ఉన్న అప్పులు మరియు అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. మంచి బ్యాక్‌గ్రౌండ్ మరియు మంచి క్రెడిట్ చరిత్ర కలిగిన కస్టమర్లు తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ వద్ద పర్సనల్ లోన్ తిరిగి చెల్లించడానికి కనిష్ఠ మరియు గరిష్ఠ వ్యవధి 12 నెలలు (1 సంవత్సరం) మరియు 60 నెలలు (5 సంవత్సరాలు).
తరుగుతూ ఉండే వడ్డీ రేటు లేదా తగ్గుతూ ఉండే వడ్డీ రేటు ప్రతి EMI చెల్లించిన తర్వాత బకాయి ఉన్న లోన్ బ్యాలెన్స్‌కు వర్తిస్తుంది. వడ్డీని లెక్కించే ఈ ప్రక్రియను బ్యాలెన్స్ తగ్గుతూ ఉండే విధానంగా పిలుస్తారు.
ఫిక్సెడ్ రేటు పద్ధతి అనేది ప్రత్యామ్నాయ ప్రక్రియ, ఇందులో మొత్తం లోన్ మొత్తం లేదా అసలు మొత్తంపై వడ్డీ రేటు వసూలు చేయబడుతుంది.
పర్సనల్ లోన్పొందటం కోసం, మీరు కొంత ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. బజాజ్ ఫిన్సర్వ్ వద్ద ప్రాసెసింగ్ ఛార్జీ మొత్తం లోన్ మొత్తంలో 4.13% వరకు ఉంటుంది.
బజాజ్ ఫిన్సర్వ్ ₹. 25 లక్షల వరకు అప్పుగా తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, దీనిని ఫ్లెక్సిబుల్ వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. ఇది మీ CIBIL స్కోర్ మరియు రీపేమెంట్ చరిత్ర ఆధారంగా చర్చించి కుదుర్చుకోగల అతి తక్కువ పర్సనల్ లోన్ వడ్డీ రేట్లతో వస్తుంది.
చెల్లించవలసిన అసలు మొత్తంపై వర్తించే పన్నులతో సహా ప్రీక్లోజర్ ఛార్జీలు 4% ఉంటాయి. లోన్ పంపిణీ చేసిన తేదీ నుండి కాల వ్యవధి 1 నెల కంటే ఎక్కువ ఉంటుంది.
పర్సనల్ లోన్ ఫోర్క్లోజర్లు అంటే అసలు వ్యవధి కంటే ముందరే లోన్ అకౌంట్‌ను మూసివేయడం. లోన్ యొక్క మొత్తం బాధ్యతను నివారించడానికి చాలా మంది రుణగ్రహీతలు అలా చేయటానికి ఇష్టపడతారు. కానీ మీరు అలా చేస్తే మీరు రుణదాతకు కొన్ని పర్సనల్ లోన్ ప్రీక్లోజర్ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది.
బజాజ్ ఫిన్సర్వ్ లో పర్సనల్ లోన్ ఛార్జీల్లో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, దీని విలువ పొందిన లోన్ మొత్తంలో 4.13% వరకు ఉంటుంది.
కస్టమర్ పోర్టల్ - ఎక్స్‌పీరియా ద్వారా ఇ-స్టేట్మెంట్లను డౌన్లోడ్ చేయడానికి మీరు ఎటువంటి ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు. కానీ భౌతిక కాపీలు పొందాలని కోరుకుంటే మీరు రూ. 250 + పన్నులు చెల్లించవలసి ఉంటుంది.
రెపో రేటు అనేది భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) వాణిజ్య బ్యాంకులకు రుణాలను అందజేసే రేటు. రెపో రేటులో కోత ద్వారా వ్యక్తులు మరియు బ్యాంకులకు వడ్డీ రేట్లు మరియు EMI లు వంటి ఋణ ఖర్చులను తగ్గిస్తుంది.
ఫ్లోటింగ్ వడ్డీ రేటు ప్రాతిపదికన పర్సనల్ లోన్లను అందించినప్పుడు మాత్రమే రెపో రేటు వాటి వడ్డీ రేటును ప్రభావితం చేస్తుంది. రుణగ్రహీతకు ఇది తన తిరిగి చెల్లింపులను నిర్వహించడానికి మరింత సరసమైనదిగా అవుతుంది. ఫిక్సెడ్ వడ్డీ రేట్ల వద్ద ఇవ్వబడే పర్సనల్ లోన్లు అనేవి రెపో రేటులో చేసే తగ్గింపుతో ప్రభావితం కావు.
మీరు కింద తెలిపిన సులభమైన సూచనలను పాటించినట్లయితే, బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్‌కు అప్లై చేయడం చాలా సులభం:
స్టెప్ 1 - బజాజ్ ఫిన్సర్వ్ వెబ్‌సైట్‌లోని ఆన్లైన్ అప్లికేషన్ ఫారంలో మీ వ్యక్తిగత, ఉద్యోగ మరియు ఆర్థిక వివరాల సమాచారాన్ని పూరించండి.
స్టెప్ 2 - లోన్ కాలపరిమితిని మరియు కావలసిన మొత్తాన్ని ఎంచుకోండి, సత్వర అప్రూవల్స్‌ను ఆనందించండి
స్టెప్ 3 - సంబంధిత డాక్యుమెంట్లన్నింటినీ, త్వరలో మిమ్మల్ని సంప్రదించే బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధికి అందజేయండి
స్టెప్ 4 - కావలసిన లోన్ మొత్తం అప్రూవల్ పొందిన 24 గంటలలో మీ బ్యాంక్ అకౌంట్లోకి పంపిణీ చేయబడుతుంది
అంతే, మీరు పర్సనల్ లోన్ల కోసం ఎలా అప్లై చేసుకోవచ్చు మరియు మీ అవసరాలను త్వరగా ఎలా నెరవేర్చుకోవచ్చో ఇక్కడ ఇవ్వబడింది.
డిస్‌క్లెయిమర్ :
EMI క్యాలిక్యులేటర్ అనేది ఒక సూచనాత్మక సాధనం, ఇంకా వాస్తవ వడ్డీ రేట్ల ఆధారంగా మరియు పంపిణీ తేదీ మరియు మొదటి EMI తేదీ మధ్య వ్యవధి ఆధారంగా ఫలితాలు మారవచ్చు. లెక్కింపు ఫలితాలు సుమారుగా ఉంటాయి మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని గమనించగలరు.పర్సనల్ లోన్ పై మారటోరియం వ్యవధిని తనిఖీ చేయండి
ఫ్లెక్సీ పర్సనల్ లోన్ కోసం ఆన్లైన్లో అప్లై చేయండి
పర్సనల్ లోన్ గురించి మరింత తెలుసుకోండి
మీ పర్సనల్ లోన్ అర్హత చెక్ చేసుకోండి
పర్సనల్ లోన్ ఫోర్క్లోజర్ కాలిక్యులేటర్
పర్సనల్ లోన్ కోసం ఆన్లైన్లో అప్లై చేయండి
మీ CIBIL స్కోర్‌ను ఉచితంగా చెక్ చేసుకోండి
త్వరిత చర్య