ఓవర్‍వ్యూ

జీవితములో అనుకోని ప్రమాదాలు మరియు అకస్మాత్ సంఘటనలు జరుగుతాయి, అవి మీ కుటుంబ ఆర్ధిక సురక్షతను అపాయంలో పడేయవచ్చు. ఇలాంటి సమయాలలో మీ కుటుంబాన్ని కవర్ చేయటానికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మీరు ఆలోచించారా? మీ కుటుంబానికి అనుకూలమైన సరైన లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోండి మరియు మా ప్రోడక్టులతో ప్రత్యేకమైన ప్రయోజనాలను అందుకోండి. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ మరణం, లేదా వైకల్యం లేదా తీవ్రమైన అనారోగ్యం కారణంగా మీ కుటుంబం ఎదుర్కొనే పరిస్థితుల నుండి కొన్ని యాడ్-ఆన్స్ ద్వారా ఆర్ధికంగా రక్షించేందుకు ఉన్న సురక్షిత విధానము. లైఫ్ ఇన్సూరెన్స్ లో మీ అవసరాలను అనుసరించి మీరు పరిగణించగలిగే కొన్ని ఆప్షన్లను చూద్దాము.

 • టర్మ్ ఇన్సూరెన్స్

  ఇది ఒక నిర్దిష్ట వ్యవధి కోసం ఆర్థిక రక్షణను అందించడానికి రూపొందించిన చవక మరియు సులభమైన ఇన్సూరెన్స్. ఇది మీ కుటుంబం హామీ ఇవ్వబడిన మొత్తాన్ని ఏకమొత్తంలో పొందడంలో హామీ ఇస్తుంది, అంటే మీ మరణం తర్వాత ఆర్థికంగా స్థిరంగా జీవనం సాగించడానికి అవసరమయ్యే మొత్తం. అయితే, మీరు టర్మ్ వ్యవధి అంతా జీవించి ఉంటే, ఇన్సూరర్ ఏమీ చెల్లించరు.

 • ULIP

  ULIP లేదా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో, ప్రీమియం యొక్క ఒక భాగం జీవిత కవరును అందిస్తుంది, మిగిలిన భాగాన్ని ఈక్విటీలు లేదా లోన్లలో పెట్టుబడి పెడుతుంది. ULIP పెట్టుబడి విభాగం మార్కెట్‌ ఒడిదుడుకుల పైన ఆధారపడి ఉంటుంది.

 • పిల్లల ప్లాన్లు

  పెరుగుతున్న విద్యాభ్యాస ఖర్చు తల్లిదండ్రులలో చాలా అసౌకర్యాన్ని కలిగిస్తోంది. అందుచేత, మీరు లేనప్పుడు కూడా మీ బిడ్డకు ఒక సురక్షిత జీవితాన్ని అందించుటకు పిల్లల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. పిల్లల లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ పాలసీ హోల్డర్ మరణం సంభవించిన సందర్భంలో బెనిఫీషియరీకు(అంటే బిడ్డకు) ఏక-మొత్తం అందిస్తుంది.

 • పెన్షన్ ప్లాన్

  జీవిత బీమా సంస్థలు అందిస్తున్న ఫించనుదారుల ఇన్సూరెన్స్ ప్లాన్లు వినియోగదారులు పదవి విరమణ నిధిని సమకూర్చుకోవడంలో సహాయపడతాయి. ఈ మొత్తం ఒక వ్యక్తి పదవీ విరమణ పొందిన తరువాత ఆర్థికంగా భద్రమైన జీవితం గడిపేందుకు సహాయపడుతుంది. పాలసీదారుడి దురదృష్టకరమైన మరణం సంభవించిన సందర్భంలో, అభ్యర్థి గరిష్ట మొత్తాన్ని పొందవచ్చు లేదా మిగిలిన పాలసీ కాలానికి ఒక సాధారణ పెన్షన్ పొందవచ్చు.

 • మరింత తెలుసుకోవాలంటే మీరు 0928 922 2406 పై మాకు కాల్ చేయవచ్చు

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

• అతితక్కువ ఖర్చు ప్రీమియంతో లైఫ్ కవర్ ప్రయోజనం పొందండి
• చెల్లింపు ఆప్షన్లు – దురదృష్టవశాత్తూ మరణించినా లేదా మెచ్యూరిటీ అయినా ఏకమొత్తం లేదా నెలవారీ చెల్లింపు ఆప్షన్లను ఎంచుకోండి.
• పాలసీ వ్యవధి - మీ ఇన్సూరెన్స్ పాలసీ కాలవ్యవధి 5 నుండి 30 సంవత్సరాలు ఉండేలా ఎంచుకోండి.
• ఒకే పాలసీలో జాయింట్ లైఫ్ కవరేజ్. మీ ప్రస్తుత పాలసీలో మీ జీవిత భాగస్వామిని చేర్చండి. ప్రమాదవశాత్తు వైకల్యం లేదా అనారోగ్యం కారణంగా ఆదాయం నష్టం జరిగిన సందర్భంలో సప్లిమెంటరీ ఆదాయం
• క్లిష్టమైన అనారోగ్యం - క్లిష్టమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారిగా-మొత్తం పొందండి
• అదనపు ప్రయోజనాలు - ప్రమాదం వలన మరణం సంభవించిన సందర్భంలో అదనపు హామీ ఇవ్వబడిన మొత్తం
• పొగత్రాగని వారికి ప్రాధాన్య రేట్లు.
• పన్ను మినహాయింపులు - ఆదాయ పన్ను చట్టం యొక్క 80C మరియు 10(10D) సెక్షన్ల ప్రకారం పన్ను మినహాయింపు. క్లిష్టమైన అనారోగ్య ప్రయోజనం కోసం చెల్లించిన ప్రీమియంలు కూడా సెక్షన్ 80D ప్రకారం మినహాయింపుకు అర్హత కలిగి ఉంటాయి

అప్లై చేయడం ఎలా

మీరు మా సర్వీసులు ఇదివరకు ఎప్పుడు ఉపయోగించుకొనక పోయినప్పటికీ, బజాజ్ ఫిన్సర్వ్ తో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పొందడం ఎంత సులభమో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ఈ పేజ్ పై ఉన్న మీ వివరాలను పూర్తి చేయండి లేదా 09289 222 406 పై మాకు మిస్డ్ కాల్ ఇవ్వండి. మేము మిమ్మల్ని సంప్రదిస్తాము మరియు ప్రాసెస్ పూర్తి చేయడంలో మీకు సహాయం చేస్తాము.

మీరు కొనడానికి ముందు పరిగణించవలసిన అంశాలు

• మీకు ఏ రకమైన లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కావాలి, టర్మ్ ఇన్సూరెన్స్, ULIP, చైల్డ్ లేదా పెన్షన్ ప్లాన్?
• హామీ ఇవ్వబడిన మొత్తం మరియు మెచ్యూరిటి వయసు ఎంత కావాలి?
• క్లెయిమ్ యొక్క విధానాలు ఏమి ఉండవచ్చు?
• క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి ఏమిటి?