క్రెడిట్ కార్డ్ PIN జనరేట్ చేయడం

మీ అన్ని లావాదేవీల కోసం క్రెడిట్ కార్డ్ PIN ని జనరేట్ చేయడం చాలా ముఖ్యం, అందువల్ల మీ క్రెడిట్ కార్డ్ PIN ని రహస్యంగా ఉంచడం కూడా కీలకమైన అంశం. మీ క్రెడిట్ కార్డ్ యొక్క భద్రతను నిర్ధారించడానికి, క్రెడిట్ కార్డ్ PIN ను తరచుగా మార్చండి.

మీరు మీ RBL క్రెడిట్ కార్డ్ పిన్ మార్చడానికి చూస్తున్నట్లయితే, బజాజ్ ఫిన్సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పిన్‌ జెనరేషన్ ప్రాసెస్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చేయాలో ఇక్కడ ఇవ్వబడింది:

మీ ఫోన్ లేదా డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌లో RBL బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోమ్ స్క్రీన్ పైన క్రెడిట్ కార్డ్ విభాగాన్ని ఎంచుకోండి మరియు 'మీ పిన్ సెట్ చేయండి' ఎంపికను ఎంచుకోండి. ఇక్కడ, మీరు మీ సూపర్‌కార్డ్ వివరాలను నమోదు చేసి 'ధృవీకరించండి' పైన క్లిక్ చేయవచ్చు’. మీ OTP జెనరేట్ చేయండి మరియు మీకు నచ్చిన PIN సెట్ చేసుకోండి. ఇది నిజంగా అంత సులభం!

త్వరిత చర్య