క్రెడిట్ కార్డును ఎలా బ్లాక్ చేయాలి మరియు ఎలా అన్‌బ్లాక్ చేయాలి?

2 నిమిషాలలో చదవవచ్చు

మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL Bank సూపర్‌కార్డ్ బ్లాక్ చేయడం సులభం. కార్డుదారులు దానిని RBL MyCard యాప్ నుండి చేయవచ్చు లేదా టోల్-ఫ్రీ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్ 022-7119 0900 కు కాల్ చేయవచ్చు మరియు కస్టమర్ ప్రతినిధిని వారి క్రెడిట్ కార్డును బ్లాక్ చేయమని అడగవచ్చు. ఈ ప్రక్రియలో మీకు కస్టమర్ ప్రతినిధి సులభంగా సహాయపడటానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి కాల్ చేయండి మరియు మీ క్రెడిట్ కార్డు నంబర్ సహా ముఖ్యమైన వ్యక్తిగత వివరాలను సిద్ధంగా ఉంచుకోండి.

బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఎలా అన్‌బ్లాక్ చేయాలి?

సూపర్‌కార్డ్ అన్‌బ్లాక్ చేయడానికి, కార్డ్ హోల్డర్లు దానిని RBL యాప్ నుండి చేయవచ్చు లేదా టోల్-ఫ్రీ నంబర్ 022-71190900కు కాల్ చేయవచ్చు మరియు కస్టమర్ ప్రతినిధిని వారి క్రెడిట్ కార్డ్ అన్‌బ్లాక్ చేయమని అడగవచ్చు.

మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పోయినా లేదా దొంగిలించబడినా అనుసరించవలసిన దశలు ఏమిటి?

దశ 1: మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించుకోండి

దశ 2: ఎల్లప్పుడూ ఒక ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేయండి

దశ 3: మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ధృవీకరించండి

దశ 4: క్రెడిట్ బ్యూరోను వెంటనే సంప్రదించండి

దశ 5: కొత్త క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయండి

మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నష్టాన్ని నివారించండి

అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్ మిస్సయ్యినా లేదా దొంగిలించబడితే, మీరు కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇది మీ కార్డు దుర్వినియోగాన్ని నివారిస్తుంది మరియు ఏదైనా బాధ్యత నుండి మిమ్మల్ని సేవ్ చేస్తుంది.

  • మీ క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్న మూడు రోజుల్లోపు 022 – 71190900 పై బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్ కేర్ నంబర్‌ను సంప్రదించండి
  • మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయమని ప్రతినిధిని అడగండి
  • మీరు మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా క్రెడిట్ కార్డును బ్లాక్ చేయవచ్చు
మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు మీ క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్ చేసినప్పుడు ఏమి జరుగుతుంది?

మీరు మీ క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్ చేసినప్పుడు, మీ కార్డ్‌ను జారీ చేసే బ్యాంక్/ ఆర్థిక సంస్థ కార్డ్‌ను అన్‌బ్లాక్ చేసే వరకు మీరు ఏ ట్రాన్సాక్షన్లు చేయలేరు.

మేము క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేయవచ్చా?

అవును, మీరు మీ క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేయవచ్చు. టోల్-ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్ 022-71190900 కు కాల్ చేయడం ద్వారా మీరు మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ సూపర్‌కార్డ్‌ను బ్లాక్ చేయవచ్చు.

నేను నా క్రెడిట్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో ఎలా బ్లాక్ చేయగలను?

కార్డ్ ఇష్యూయర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం మరియు మీ వివరాలతో లాగిన్ అవడం ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో బ్లాక్ చేయవచ్చు.

నేను నా క్రెడిట్ కార్డ్‌ను ఎలా అన్‌బ్లాక్ చేయగలను?

ఈ క్రింది పద్ధతులను ఉపయోగించి మీరు మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను అన్‌బ్లాక్ చేయవచ్చు:

  • కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్ 022-71190900 కు డయల్ చేసి, మీ కార్డును అన్‌బ్లాక్ చేయమని కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ని అడగండి.
  • మీ స్మార్ట్‌ఫోన్‌లో RBL MyCard యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అన్‌బ్లాక్ చేయడానికి మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.
క్రెడిట్ కార్డును అన్‌బ్లాక్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

క్రెడిట్ కార్డ్‌ను అన్‌బ్లాక్ చేయడానికి ఏడు నుండి పదిహేను రోజుల సమయం పట్టవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి