క్రెడిట్ కార్డులు ఎలా పని చేస్తాయి?

ఏదైనా ట్రాన్సాక్షన్ కోసం మీరు క్రెడిట్ కార్డ్ ను ఉపయోగిస్తే, మీ తరఫున మర్చెంట్ ఫీజ్ ను మీకు కార్డ్ జారీ చేసిన ఫైనాన్షియల్ సంస్థ చెల్లిస్తుంది. మీ అప్రూవ్డ్ క్రెడిట్ పరిమితిలో మీకు కావలసినన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.

ప్రతి నెల మీ కార్డ్ యొక్క ట్రాన్సాక్షన్ వివరాల సారాంశంతో మీకు ఒక అకౌంట్ స్టేట్‍మెంట్‍ పంపించబడుతుంది.
ఆ స్టేట్మెంట్ ఈ క్రింది వాటిని కూడా హైలైట్ చేస్తుంది:

  • అందుబాటులో ఉన్న క్రెడిట్ మరియు క్యాష్ పరిమితి
  • బాకీ ఉన్న మినిమం పేమెంట్
  • పూర్తి చెల్లింపు గడువు తేది
  • వసూలు చేయబడే వడ్డీ మరియు ఫీజు
  • చెల్లింపు పద్ధతులు

 

అయినప్పటికీ, మీరు కార్డ్ పై వినియోగించిన మొత్తం నిర్దేశిత సమయంలో, సాధారణంగా 20 రోజులలో, మీకు కార్డ్ జారీ చేసిన వారికి తిరిగి చెల్లించవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి. అలా మీరు తిరిగి చెల్లించకపోతే, మీకు కార్డ్ జారీ చేసిన వారు వినియోగించిన మొత్తం పై వడ్డీ విధిస్తారు, ఆ వడ్డీ చెల్లింపు బాకీ ఉన్నంత కాలం పెరుగుతూ ఉంటుంది.

అదనంగా చదవండి:: ఒక క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది?

ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్