తరచుగా అడిగే ప్రశ్నలు

ఏదైనా ఇతర క్రెడిట్ కార్డ్ నుండి సూపర్‌కార్డ్ ఎలా భిన్నంగా ఉంటుంది?

పేరుకు తగినట్టుగా, సూపర్‌కార్డులో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది సాధారణ క్రెడిట్ కార్డ్ ఫీచర్లను అందిస్తుంది కానీ 50 రోజుల వరకు వడ్డీ-రహిత నగదు విత్‍డ్రాల్ మరియు క్రెడిట్ కార్డ్‌పై రుణం పొందడం వంటి అదనపు ఫీచర్లతో కూడా వస్తుంది. వీటితో పాటు ఇందులో బహుమతులు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ నెట్‌వర్క్ పై ప్రత్యేక హక్కులు ఉంటాయి*.

సూపర్‌కార్డ్ ఎటిఎం క్యాష్ విత్‌డ్రాలను అందిస్తుందా?

అవును, ఇది చేస్తుంది. 50 రోజుల వరకు ఎటువంటి వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు 2.5% ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మీరు విత్‌డ్రా చేయగల మొత్తం రుణదాత యొక్క విధానాలు మరియు మీ సూపర్‌కార్డ్‌కు కేటాయించబడిన పరిమితిపై ఆధారపడి ఉంటుంది.

సూపర్‌కార్డ్ ఎంత సురక్షితం?

ఖచ్చితంగా సురక్షితం. సూపర్‌కార్డ్ 'ఇన్‌హ్యాండ్' సెక్యూరిటీ ఫీచర్‌తో వస్తుంది, ఇందులో మీరు మీ క్రెడిట్ మరియు నగదు పరిమితిని నియంత్రించవచ్చు మరియు RBL MyCard యాప్ ద్వారా అంతర్జాతీయ ట్రాన్సాక్షన్ల పై పరిమితిని నియంత్రించవచ్చు

సూపర్‌కార్డ్‌తో నేను ఏ రకమైన ఆఫర్‌లను పొందుతాను?

ఒక సూపర్‌కార్డ్ కస్టమర్‌గా, మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్య దుకాణాల నుండి ప్రత్యేక ప్రయోజనాలు మరియు రూ. 2,500 కంటే ఎక్కువ ఖర్చుల కోసం అవాంతరాలు-లేని ఇఎంఐ మార్పిడికి అర్హులు. సూపర్‌కార్డ్ పై తాజా ఆఫర్ల కోసం, బజాజ్ ఫిన్‌సర్వ్ MobiKwik వాలెట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

కస్టమర్ వెల్కమ్ రివార్డు పాయింట్లను ఎలా ఆర్జించవచ్చు?

జాయినింగ్ ఫీజు కలిగి ఉన్న ఏదైనా సూపర్‌కార్డ్ వేరియంట్ వెల్‌కమ్ రివార్డ్ పాయింట్లతో లభిస్తుంది. రివార్డ్ పాయింట్లను పొందడానికి, కార్డ్ జారీ చేసిన 30 రోజుల్లోపు కస్టమర్ కనీస మొత్తం రూ. 2,000 లేదా అంతకంటే ఎక్కువ విలువ గల ట్రాన్సాక్షన్ చేయడానికి సూపర్‌కార్డ్ ఉపయోగించాలి.

సూపర్‌కార్డ్ కోసం వార్షిక ఫీజు ఎంత?

కార్డ్ యొక్క వార్షిక ఫీజు కార్డ్ యొక్క ప్రతి వేరియంట్ ప్రకారం మారుతూ ఉంటుంది.

సూపర్‌కార్డ్‌తో నేను రివార్డ్ పాయింట్లను ఎలా సంపాదించగలను?

ఒక కస్టమర్ సూపర్‌కార్డ్ ఉపయోగించి చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పై రివార్డ్ పాయింట్లు సంపాదిస్తారు. రివార్డ్ పాయింట్లు నెల చివరిలో కస్టమర్ యొక్క అకౌంట్‌లోకి క్రెడిట్ చేయబడతాయి మరియు RBL రివార్డ్స్ వెబ్‌సైట్ వద్ద రిడీమ్ చేసుకోవచ్చు.

క్యాష్ పరిమితిని వడ్డీ లేని లోన్ గా నేను ఎలా మార్చుకోవచ్చు?

మీరు మీ అందుబాటులో ఉన్న క్యాష్ పరిమితిని RBL MyCard యాప్ ఉపయోగించి 90 రోజుల వరకు వడ్డీ లేని రుణంగా మార్చుకోవచ్చు.

వడ్డీ లేని క్యాష్ విత్‍డ్రాల్ పరిమితి ఎంత?

మీరు మీ సూపర్‌కార్డ్ ఉపయోగించి ఒక ఎటిఎం నుండి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విత్‍డ్రాల్ 50 రోజుల వరకు వడ్డీ లేనిది; అయితే, దీని పై 2.5% ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబడుతుంది మరియు రిస్క్ పాలసీలపై ఆధారపడి ఉంటుంది.

క్యాష్‌బ్యాక్‌ను ఎవరు క్లెయిమ్ చేయవచ్చు మరియు అతను/ఆమె దానిని ఎప్పుడు అందుకుంటారు?

30 కంటే ఎక్కువ రోజులపాటు ఎటువంటి అవుట్‌స్టాండింగ్ చెల్లింపు లేని చెల్లుబాటు గల కార్డ్ కలిగి ఉన్న ఎంపిక చేసిన సభ్యులకు మాత్రమే క్యాష్‌బ్యాక్ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. మీరు లావాదేవీ చేసిన 45 రోజుల తర్వాత క్యాష్‌బ్యాక్ రివార్డ్ పొందుతారు.

క్యాష్‌బ్యాక్ మొత్తం ఎంత?

కార్డుదారులు ఒకే ట్రాన్సాక్షన్ పై గరిష్టంగా రూ. 1,000 వరకు 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

క్యాష్‌బ్యాక్ ఏ లావాదేవీలకు లభిస్తుంది?

సూపర్‌కార్డ్‌తో RBL Bank భాగస్వామి దుకాణంలో చేసిన డౌన్‌పేమెంట్ పై మాత్రమే క్యాష్‌బ్యాక్ చెల్లుతుంది చెల్లింపు లేదా ఇతర లావాదేవీలో మొత్తం చెల్లింపుకు ఈ ఆఫర్ చెల్లుబాటు కాదు.

మరింత చదవండి తక్కువ చదవండి