క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ ఎలా పొందాలి?

2 నిమిషాలలో చదవవచ్చు

క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ అనేది మీరు మీ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఒక నెల లేదా బిల్లింగ్ సైకిల్‌లో చేసిన అన్ని ట్రాన్సాక్షన్ల రికార్డ్. స్టేట్‌మెంట్‌ను ప్రతి నెలా క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు పంపుతారు మరియు మీరు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు.

మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఎలా తనిఖీ చేయాలి?

 • నెట్ బ్యాంకింగ్ ద్వారా
  మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి, స్టేట్‌మెంట్‌ను చూడండి మరియు డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సర్వీసులు అందుకోవడానికి రిజిస్టర్ చేసుకోకపోతే, సైన్ అప్ చేయడానికి మీ 16 -అంకెల క్రెడిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
 • ఇమెయిల్ ద్వారా
  మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి కూడా పంపబడుతుంది. మీ ఇమెయిల్‌ను తనిఖీ చేయండి మరియు కొన్ని క్లిక్‌లలో డౌన్‌లోడ్ చేసుకోండి.

మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఆఫ్‌లైన్‌లో ఎలా పొందాలి?

 • కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి మరియు పోస్ట్ ద్వారా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను అందుకోండి
  కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయండి మరియు పోస్ట్ ద్వారా మీ నివాస చిరునామాలో స్టేట్‌మెంట్‌ను అందుకోవడానికి మా ప్రతినిధి మీకు సహాయపడతారు.
 • ఒక ఎస్‌ఎంఎస్ తో క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ అందుకోవడానికి సైన్ అప్ చేయండి:
  ‘GREEN’ అని టైప్ చేసి, మీ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుండి 5607011 కు ఎస్ఎంఎస్ పంపండి. ఈ ఆఫ్‌లైన్ ప్రాసెస్ మీ క్రెడిట్ కార్డ్ కోసం ఇ-స్టేట్‌మెంట్ సర్వీస్‌ను యాక్టివేట్ చేస్తుంది. మీరు మెసేజ్ పంపిన తర్వాత, ప్రాసెస్ ప్రారంభించబడుతుంది, మరియు మీరు 48 గంటల్లోపు అప్రూవల్ అందుకుంటారు. ఈ యాక్టివేషన్‌తో, మీరు తదుపరి బిల్లింగ్ సైకిల్ నుండి మీ ఇ-స్టేట్‌మెంట్లను తనిఖీ చేయవచ్చు.

క్రింది వివరాలను తెలుసుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను చదవండి:

 • మీ క్రెడిట్ కార్డుపై చెల్లించవలసిన పూర్తి మొత్తం మరియు కనీస మొత్తం
 • చెల్లింపు గడువు తేదీ
 • మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి
 • చేయబడ్డ ట్రాన్సాక్షన్లు మరియు మినహాయించబడిన పన్నులు
 • ప్రస్తుత బిల్లింగ్ సైకిల్ కోసం క్రెడిట్ కార్డ్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ బ్యాలెన్స్
 • సంపాదించిన రివార్డ్ పాయింట్లు, రిడీమ్ చేయబడని రివార్డ్ పాయింట్లు వంటి ఇతర వివరాలు.

ప్రతి నెలా మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయడం ముఖ్యం. ఇది సకాలంలో చెల్లింపులు చేయడానికి మాత్రమే కాకుండా అనధికారిక లేదా అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి నివేదించడానికి కూడా మీకు సహాయపడుతుంది.

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను నా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఎలా తనిఖీ చేయగలను?

మీరు మీ బజాజ్ ఫిన్‌సర్వ్ RBL Bank క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్‌లో ఈ క్రింది మార్గాల్లో అందుకోవచ్చు:

ఆఫ్లైన్

 • మీ నివాస చిరునామాలో మీ స్టేట్‌మెంట్‌ను అందుకోవడానికి మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించవచ్చు
 • ఎస్‌ఎంఎస్ సర్వీస్ ఉపయోగించి మీరు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను కూడా తనిఖీ చేయవచ్చు ‘GREEN” అని టైప్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 5607011 కు మెసేజ్ పంపండి సర్వీస్ యాక్టివేట్ అయిన తర్వాత, మీరు తదుపరి బిల్లింగ్ సైకిల్ నుండి మీ ఇ-స్టేట్‌మెంట్‌ను అందుకోవచ్చు

ఆన్ లైన్

 • మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్లను తనిఖీ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్లను వీక్షించి డౌన్‌లోడ్ చేయడానికి లాగిన్ అవ్వండి
 • మీ నెలవారీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్లు కూడా మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి పంపబడతాయి
నేను నా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చూడగలను?

మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో చూడడానికి, ఈ దశలను అనుసరించండి:

 • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి
 • సంబంధిత నెల కోసం బజాజ్ ఫిన్‌సర్వ్ RBL Bank క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను చూడండి మరియు డౌన్‌లోడ్ చేసుకోండి

మీరు ఆన్‌లైన్ సేవల కోసం రిజిస్టర్ చేయబడకపోతే, సైన్ అప్ చేయడానికి మీ మొబైల్ నంబర్ మరియు 16-అంకెల క్రెడిట్ కార్డ్ నంబర్‌ను ఉపయోగించండి.

నేను నా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను ఎక్కడ తనిఖీ చేయగలను?

RBL బ్యాంక్ వెబ్‌సైట్ లేదా నా RBL బ్యాంక్ యాప్ ద్వారా మీ క్రెడిట్ కార్డ్ డ్యాష్‌బోర్డ్‌కు లాగిన్ అవడం ద్వారా మీరు ఎప్పుడైనా మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు.