బజాజ్ ఫిన్‌సర్వ్ వ్యక్తిగత రుణం పై వడ్డీ రేటు
బజాజ్ ఫిన్‌సర్వ్, పర్సనల్ లోన్‌లపై నామమాత్రపు వడ్డీ రేటును విధిస్తుంది, అది 11% నుండి ప్రారంభమవుతుంది. ఇది మీ పర్సనల్ లోన్‌పై వర్తించే ప్రాథమిక ఛార్జీ అయితే, మీరు ప్రాసెసింగ్ ఫీజులు, ఇఎంఐ బౌన్స్ ఛార్జీలు, జరిమానా వడ్డీ (మీరు ఇఎంఐ చెల్లింపులను ఆలస్యం చేస్తే) మరియు డాక్యుమెంట్/స్టేట్‌మెంట్ ఛార్జీలు వంటి ఇతర ఛార్జీలను భరించాల్సి ఉంటుంది.
మరింత చదవండి: పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు
మీ బజాజ్ ఫిన్‌సర్వ్ వ్యక్తిగత రుణం పై వడ్డీని ఎలా లెక్కించాలి?
పర్సనల్ లోన్ రెండు భాగాలను కలిగి ఉంటుంది: ప్రిన్సిపల్, అది అప్పుగా తీసుకున్న అసలు మొత్తం మరియు వడ్డీ, ఇది అప్పుగా తీసుకున్నందుకు ఖర్చు. వడ్డీ అనేది లోన్ తీసుకున్న మొత్తంలో ఒక శాతం. సెక్యూరిటీగా ఆస్తిని తాకట్టు పెట్టకుండానే మీరు పర్సనల్ లోన్ పొందవచ్చు కావున, పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఇతర సెక్యూర్డ్ లోన్‌ల కన్నా కొంత ఎక్కువగా ఉంటుంది.
మీరు చెల్లించే ప్రతి ఇఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్) లో అసలు మొత్తం మరియు వడ్డీ భాగం ఉంటుంది. వడ్డీ రేటు ఫిక్స్ చేయబడినందున, మీ ఇఎంఐ 12 నెలల నుండి 84 నెలల వరకు ఉండే రుణ రీపేమెంట్ అవధిపై ఆధారపడి ఉంటుంది.
సులభంగా పర్సనల్ లోన్ ఇఎంఐ మొత్తాన్ని లెక్కించడానికి మా పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించండి. అలాగే, మీరు చెల్లించవలసిన మొత్తం వడ్డీని చూడటానికి దీనిని ఉపయోగించండి.
వ్యక్తిగత రుణం వడ్డీ రేట్లను ప్రభావితం చేసే కారకాలు ఏమిటి?
మీరు పొందగల పర్సనల్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేసే కొన్ని ప్రధాన అంశాలు మీ ఆదాయం, మీ క్రెడిట్ రేటింగ్, అప్పుగా తీసుకున్న అసలు మొత్తం మరియు దరఖాస్తు సమయంలో ప్రబలంగా ఉన్న మార్కెట్ పరిస్థితులు. సాధారణంగా, అధిక క్రెడిట్ స్కోర్, మంచి రీపేమెంట్ హిస్టరీ మీకు మెరుగైన పర్సనల్ లోన్ వడ్డీ రేటును పొందడంలో సహాయపడుతుంది.