ప్రీ-పేమెంట్ అంటే గడువు తేదీకి ముందు ఇఎంఐ ని తిరిగి చెల్లించడం. మీ వద్ద అధికంగా లేదా ఖర్చు పెట్టని డబ్బు ఉంటే మీరు మీ లోన్‌ను ముందస్తుగా చెల్లించవచ్చు. ఇది మిగిలిన అవధి కోసం మీ ఇఎంఐ మొత్తాన్ని తగ్గించవచ్చు లేదా ఇఎంఐ మొత్తాన్ని స్థిరంగా ఉంచుతూ వర్తించే అవధిని తగ్గించవచ్చు.
ప్రీపేమెంట్ మొత్తం మీ సాధారణ ఇఎంఐ మొత్తానికి కనీసం మూడు రెట్లు ఉండాలి.
పాక్షిక-ముందస్తు చెల్లింపు కాలిక్యులేటర్ అంటే ఏమిటి?
పాక్షిక-ముందస్తు చెల్లింపు కాలిక్యులేటర్ అనేది మీ లోన్ ని ముందస్తుగా తిరిగి చెల్లించడంలో ఉండే పాజిటివ్ ఆర్థిక ప్రభావాన్ని చూపే కాలిక్యులేటర్.
బజాజ్ ఫిన్సర్వ్ పార్ట్ ప్రీపేమెంట్ కాలిక్యులేటర్ ఎలా ఉపయోగించాలి?
మీ లోన్ ముందస్తు రిపేమెంట్ ప్రభావం తెలుసుకోవడానికి బజాజ్ ఫిన్సర్వ్ పార్ట్ ప్రీపేమెంట్ కాలిక్యులేటర్ ను మీరు ఉపయోగించవచ్చును.
ఈ క్రింది వివరాలను తెలుసుకోవడానికి స్లైడర్ ను కదపండి:
• లోన్ మొత్తం
• అవధి (నెలల్లో)
• వడ్డీ రేటు
• మీరు చెల్లించాలనుకుంటున్న పాక్షిక ముందస్తు చెల్లింపు మొత్తం
ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత మీరు సవరించిన EMI , EMI పై ఆదా, EMI ఆదా శాతం, మారిన కాలపరిమితిని చూడవచ్చు.
పాక్షిక-ముందస్తు చెల్లింపు కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది?
ఈ క్రింది అంశాలతో పార్ట్ ప్రీపేమెంట్ కాలిక్యులేటర్ పనిచేస్తుంది:
• లోన్ మొత్తం
• నెలల్లో అవధి
• వడ్డీ రేటు
• ప్రీ-పేమెంట్ మొత్తం
ఒకసారి మీరు ఈ వివరాలు నమోదు చేస్తే, పాక్షిక ప్రీపేమెంట్ తర్వాత మీరు EMI ల పై ఎంత మొత్తం డబ్బును ఆదా చేస్తారో ఈ క్యాలిక్యులేటర్ తెలియచేస్తుంది.