హోమ్ లోన్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు
-
8.60% మొదలుకొని వడ్డీ రేటు*
బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ అతి తక్కువగా రూ. 776/లక్ష ఇఎంఐలతో ప్రారంభమవుతుంది*. దీర్ఘకాలంలో అఫోర్డబిలిటీని నిర్ధారించడానికి ఈరోజే మా వద్ద ఒక హోమ్ లోన్ కోసం ఆన్లైన్లో అప్లై చేయండి.
-
రూ. 5 కోట్ల ఫండింగ్*
ఒక మంచి క్రెడిట్ చరిత్ర మరియు స్థిరమైన ఆదాయం గల అర్హత కలిగిన అప్లికెంట్ల కోసం ఒకరు పొందగల రుణం మొత్తం ఇతర అంశాలతో పాటు అపరిమితంగా ఉంటుంది.
-
30 సంవత్సరాల రీపేమెంట్ అవధి
మీ ఇఎంఐ లు సరసమైనవిగా ఉండేలాగా నిర్ధారించడానికి మరియు మీ ఫైనాన్సులను చాలా పరిమితం చేయకుండా ఉండటానికి బజాజ్ ఫిన్సర్వ్ ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధిని అందిస్తుంది.
-
రూ. 1 కోటి టాప్-అప్*
మీరు ఇప్పటికే ఉన్న మీ హోమ్ లోన్ బ్యాలెన్స్ మొత్తాన్ని మాకు బదిలీ చేసినప్పుడు, ఏవైనా ఇతర ఆర్థిక అవసరాల కోసం మీరు గణనీయమైన టాప్-అప్ లోన్‌ను పొందవచ్చు.
-
48 గంటల్లో పంపిణీ*
అవాంతరాలు-లేని అనుభవాన్ని నిర్ధారించడానికి, మేము అతి తక్కువ టర్న్అరౌండ్ సమయాల కోసం కృషి చేస్తాము. ధృవీకరణ తర్వాత మా లోన్లు త్వరలోనే పంపిణీ చేయబడతాయి.
-
సున్నా ప్రీపేమెంట్ మరియు ఫోర్క్లోజర్ ఛార్జీలు
ఫ్లోటింగ్ వడ్డీ రేటు హోమ్ లోన్లు ఉన్నవారు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా అవధి ముగిసే ముందు వారి లోన్ మొత్తంలో అన్ని లేదా భాగాన్ని తిరిగి చెల్లించడానికి ఎంచుకోవచ్చు
-
బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానించిన రుణాలు
మేము రెపో రేటు వంటి బాహ్య ప్రమాణాలకు అనుసంధానించబడిన వడ్డీ రేట్లతో హోమ్ లోన్లను కూడా అందిస్తాము.
-
అవాంతరాలు-లేని ప్రాసెసింగ్
మేము ప్రాసెసింగ్ ద్వారా మరియు అంతకు మించి సరైన అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తాము. మా అర్హతా ప్రమాణాలు చాలా సులభం మరియు డాక్యుమెంటేషన్ అవసరాలు అతి తక్కువగా ఉంటాయి.
బజాజ్ ఫిన్సర్వ్ జీతం పొందే మరియు ప్రొఫెషనల్ అప్లికెంట్ల కోసం 8.60%* నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేటుతో మీ అర్హత ఆధారంగా రూ. 5 కోట్లు* లేదా అంతకంటే ఎక్కువ హోమ్ లోన్‌ను అందిస్తుంది. మేము అందించే ఒక హోమ్ లోన్ అనేక అదనపు ప్రయోజనాలతో లభిస్తుంది, అవి 30 సంవత్సరాల వరకు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అవధి, పిఎంఎవై ద్వారా వడ్డీ సబ్సిడీ మరియు మీరు మీ ప్రస్తుత హోమ్ లోన్‌ను మాకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక టాప్-అప్ లోన్ ఎంపిక.
సాధారణ అర్హతా నిబంధనలు మరియు అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరాలు హోమ్ ఫైనాన్సింగ్ ఎంపిక ప్రతి ఒక్కరికీ అప్లై చేయడం సులభం అని నిర్ధారిస్తాయి.
మీ హౌసింగ్ ఫైనాన్స్ అవసరాలను తీర్చుకోవడానికి, ఈ రోజే ఆన్లైన్లో హోమ్ లోన్ కోసం అప్లై చేయండి.
హౌసింగ్ లోన్ కోసం అర్హత ప్రమాణాలు
బజాజ్ ఫిన్సర్వ్ వద్ద ఆన్లైన్లో హోమ్ లోన్ కోసం అప్లై చేయడానికి అర్హతా ప్రమాణాలు చాలా సులభం; మంచి ఆర్థిక ప్రొఫైల్ ఉన్న ఏ భారతీయ జాతీయుడైనా ఫండింగ్ పొందవచ్చు. మీరు జీతం పొందేవారా లేదా స్వయం-ఉపాధి పొందేవారా అనేదాని ఆధారంగా కొన్ని ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి, అయితే మిగిలిన అంశాలు ఒకే విధంగా ఉంటాయి. అంతేకాకుండా, మీ వయస్సు వంటి కొన్ని ప్రమాణాలు అవును లేదా కాదు వంటివి ఉంటాయి, మరియు కొన్ని మీకు అందించబడే రుణ నిబంధనలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, ఒకే వయస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తులలో అధిక క్రెడిట్ స్కోర్ కలిగి ఉన్న వ్యక్తి అధిక లోన్ మొత్తాన్ని అప్పుగా పొందవచ్చు.
అర్హత ప్రమాణాలు |
జీతం పొందే వారి కోసం |
సెల్ఫ్- ఎంప్లాయిడ్ వారి కోసం |
జాతీయత |
భారతీయ నివాసి |
భారతీయ నివాసి |
వయస్సు*** |
23 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలు |
25 నుంచి 70 సంవత్సరాలు |
వృత్తి అనుభవం |
3 సంవత్సరాలు |
ప్రస్తుత సంస్థతో 5 సంవత్సరాల వింటేజ్ |
కనీస నెలవారీ ఆదాయం |
నివాస నగరం మరియు వయస్సు ఆధారంగా రూ. 30,000 నుండి రూ. 50,000 వరకు |
నివాస నగరం మరియు వయస్సు ఆధారంగా రూ. 30,000 నుండి రూ. 40,000 వరకు |
***రుణం మెచ్యూరిటీ సమయంలో గరిష్ఠ వయో పరిమితిని వయస్సుగా పరిగణించబడుతుంది
భారతదేశంలో హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు
ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపేటప్పుడు ఈ క్రింది డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోండి:
- 1 కెవైసి డాక్యుమెంట్లు - మీరు దాని కోసం మీ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ సబ్మిట్ చేయవచ్చు
- 2 మీ ఉద్యోగి ఐడి కార్డులు
- 3 గత 3 నెలల శాలరీ స్లిప్పులు
- 4 గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు
- 5 తర్వాత సమర్పించవలసిన ఆస్తి డాక్యుమెంట్లు
ఆదాయం రుజువు డాక్యుమెంట్లు అవసరం
కోసం హోమ్ లోన్ |
డాక్యుమెంట్లు |
స్వయం-ఉపాధి గల వ్యక్తులకు మరియు జీతం పొందే వ్యక్తులు |
|
*మీ అప్లికేషన్ ప్రాసెసింగ్ సమయంలో పైన సూచించిన డాక్యుమెంట్ల జాబితా మరియు అదనపు డాక్యుమెంట్లు అవసరం కావచ్చని గమనించండి.
హోమ్ లోన్ పై ఫీజులు మరియు ఛార్జీలు
బజాజ్ ఫిన్సర్వ్ తక్కువ వడ్డీ రేటు మరియు అతి తక్కువ ఫీజు మరియు ఛార్జీలతో హౌసింగ్ లోన్లను అందిస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా వర్తించే హోమ్ లోన్ ఫీజులు మరియు ఛార్జీలు క్రింద పేర్కొనబడ్డాయి:
ఫీజుల రకాలు |
వర్తించే ఛార్జీలు |
ప్రాసెసింగ్ ఫీజు |
లోన్ మొత్తంలో 7% వరకు |
లోన్ స్టేట్మెంట్ ఛార్జీలు |
ఏమీ లేదు |
వడ్డీ మరియు ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఛార్జీలు |
ఏమీ లేదు |
EMI బౌన్స్ ఛార్జీలు |
రూ. 3,000/ వరకు- |
జరిమానా వడ్డీ |
ప్రతి నెలకు 2% |
సెక్యూర్ ఫీజు |
రూ. 4,999 వరకు (ఒకసారి) |
ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన చిట్కాలు
హౌసింగ్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు, క్రింది చిట్కాలను గుర్తుంచుకోండి :
- మీ సిబిల్ స్కోరును చెక్ చేసి, దానిని ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నించండి, దీని వలన మీరు సాధ్యమైనంత ఉత్తమ నిబంధనలను పొందవచ్చు. మీరు మీ ఇఎంఐ లను సకాలంలో తిరిగి చెల్లించి, సాధ్యమైన చోట ఇతర రుణాలను మూసివేసి, అధిక రీపేమెంట్ సామర్థ్యాన్ని ప్రదర్శించవచ్చు.
- ఒక హోమ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌తో మీ హోమ్ లోన్ అర్హత మరియు అఫర్డబిలిటీని చెక్ చేసుకోండి మీ ఫైనాన్సెస్ కోసం ఏ కాంబినేషన్ ఉత్తమంగా పనిచేస్తుందో నిర్ణయించుకోవడానికి వివిధ రుణం మొత్తాలు మరియు అవధి కలయికల కోసం మీరు హోమ్ లోన్ ఇఎంఐ మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు.
- మీరు సులభంగా తిరిగి చెల్లించగల రుణం మొత్తం కోసం అప్లై చేయండి మీరు మీ అర్హతకు మించి ఒక మొత్తం కోసం అప్లై చేసినప్పుడు, మీరు మీ అప్రూవల్ అవకాశాలను తగ్గించుకుంటారు.
- మీ హోమ్ లోన్ అవధిని తెలివిగా ఎంచుకోండి దీర్ఘకాలిక అవధి మీకు చిన్న ఇఎంఐలను అందించినప్పటికీ, అవధి సమయంలో మీరు ఎక్కువ వడ్డీని చెల్లించవలసి ఉంటుంది మరోవైపు, మీరు తక్కువ అవధిని ఎంచుకుంటే, మీరు త్వరగా రుణ విముక్తులు అవుతారు, కానీ మీ ఫైనాన్సులు ప్రతి నెలా భారంగా మారవచ్చు సాధారణంగా, ఒకరి ఇఎంఐ లను సులభంగా చెల్లించగలిగేలా కానీ ఎక్కువ వడ్డీ చెల్లించకుండా ఉండేలా అవధిని ఎంచుకోవాలి.
- మీ ఇతర బాధ్యతలను తగ్గించుకోండి మీరు ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు, మీ ప్రొఫైల్ మరియు అర్హతను నిర్ధారించడానికి అంచనా వేయబడిన అంశాల్లో ఒకటి ఎఫ్ఒఐఆర్ లేదా ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో ఇది మీ నెలవారీ బాధ్యతలను చెల్లించిన తర్వాత మీరు ఎంత డిస్పోజబుల్ ఆదాయాన్ని మిగిలి ఉన్నారో దాని కొలతగా మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది అందువల్ల, అప్లై చేయడానికి ముందు మీరు ఇతర రుణాలను మూసివేయడం మంచిది, మీ హోమ్ లోన్ ఇఎంఐ కోసం ఎక్కువ ఆదాయాన్ని మళ్లించడం సరైన పని.
ఆన్లైన్లో హోమ్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
బజాజ్ ఫిన్సర్వ్ వద్ద హౌసింగ్ లోన్ కోసం ఆన్లైన్లో అప్లై చేయడానికి క్రింది దశలను అనుసరించండి:
- 1 దీని పైన క్లిక్ చేయండి ఆన్లైన్లో అప్లై చేయండి
- 2 మీ ప్రాథమిక వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి
- 3 ఒక ఓటిపి తో మిమ్మల్ని ధృవీకరించండి
- 4 రుణ మొత్తం మరియు అవధిని ఎంచుకోండి
- 5 మీ వ్యక్తిగత, ఉపాధి, ఆర్థిక మరియు ఆస్తి వివరాలను పూరించండి
మీ అప్లికేషన్‌ను పూర్తి చేయడానికి మా ప్రతినిధి తదుపరి దశలతో మిమ్మల్ని సంప్రదిస్తారు.
అలాగే, మీరు మీ ఆన్లైన్ హోమ్ లోన్ అప్లికేషన్‌ను ప్రారంభించి దానిని ఏదైనా కారణం వలన వదిలివేస్తే, మీరు ఎల్లప్పుడూ అదే లింక్‌ను తర్వాత సందర్శించడం ద్వారా తిరిగి ప్రారంభించవచ్చు.
హోమ్ లోన్ తరచుగా అడగబడే ప్రశ్నలు
ఒక హోమ్ లోన్ అనేది మీకు కావలసిన ఆస్తిని కొనుగోలు చేయడానికి మీరు పొందగల ఒక ఆర్థిక పరిష్కారం. ఒక ఇంటిని కొనుగోలు చేయడానికి, రెనోవేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి లేదా ఒక ఇంటిని నిర్మించడానికి మీరు బజాజ్ ఫిన్సర్వ్ వద్ద హౌసింగ్ లోన్ కోసం ఆన్లైన్లో అప్లై చేయవచ్చు.
భారతదేశంలో అత్యంత వైవిద్యమైన ఎన్బిఎఫ్సి లలో ఒకటైన బజాజ్ ఫిన్సర్వ్ సుదీర్ఘమైన రీపేమెంట్ అవధి మరియు వేగవంతమైన పంపిణీతో హోమ్ లోన్లను అందిస్తుంది.
హోమ్ లోన్ స్వభావంలో సురక్షితమైనది, అనగా, లోన్ మొత్తం పరిగణిస్తున్న ఆస్తి తాకట్టుపై మంజూరు చేయబడుతుంది.
అంగీకరించిన కాలానికి ముందుగా నిర్ణయించిన వడ్డీతో లోన్ మొత్తం మంజూరు చేయబడుతుంది, దీనిని 'అవధి' అని కూడా పిలుస్తారు. రుణగ్రహీత ప్రతి నెలా చెల్లించవలసిన హోమ్ లోన్ ఇఎంఐ ద్వారా వడ్డీతో రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. వడ్డీతో సహా హోమ్ లోన్ రీపేమెంట్ పూర్తయ్యే వరకు ఆస్తి యాజమాన్యం రుణదాత వద్దనే ఉంటుంది.
3 సంవత్సరాల పని అనుభవం ఉన్న జీతం పొందే వ్యక్తులు రూ. 5 కోట్ల వరకు లేదా అర్హత ఆధారంగా అంతకంటే ఎక్కువ విలువ గల హోసింగ్ లోన్ పొందవచ్చు మరియు కనీసం 5 సంవత్సరాల వ్యాపార కొనసాగింపు కలిగి ఉన్న స్వయం-ఉపాధిగల వ్యక్తులు రూ. 5 కోట్ల* వరకు ఫండింగ్ పొందవచ్చు. మీ ఆదాయం, అవధి మరియు ప్రస్తుత బాధ్యతల ఆధారంగా గరిష్ట లోన్ మొత్తాన్ని అంచనా వేయడానికి హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.
లేదు. ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం, 100% హోమ్ ఫైనాన్సింగ్ అందించడానికి రుణదాతకు అనుమతి లేదు. మీరు ఆస్తి కొనుగోలు ధరలో 10-20% మొత్తం డౌన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా, మీరు మీ ఆస్తి కోసం 80% వరకు హౌసింగ్ లోన్ ఫైనాన్సింగ్ పొందవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్తో, బలమైన క్రెడిట్ ప్రొఫైల్ కలిగి ఉన్న ఏ భారతీయ జాతీయులు ఒక హోమ్ లోన్ పొందవచ్చు. హౌస్ లోన్ అర్హత నిబంధనలలో ఇవి ఉంటాయి:
- వయస్సు: జీతం పొందే వ్యక్తులకు 28 నుండి 58 సంవత్సరాలు, స్వయం-ఉపాధి పొందే వారికి 25 నుండి 70 సంవత్సరాలు
- ఉపాధి స్థితి: జీతం పొందే వ్యక్తులకు కనీసం 3 సంవత్సరాల అనుభవం, స్వయం-ఉపాధిగల వ్యక్తులకు కనీసం 5 సంవత్సరాల వ్యాపార కొనసాగింపు
- సిబిల్ స్కోర్: 750 లేదా అంతకంటే ఎక్కువ
- కనీస జీతం: హౌసింగ్ లోన్ పొందడానికి మీకు కనీస నికర నెలవారీ ఆదాయం రూ. 25,000 నుండి రూ. 30,000 ఉండాలి. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై మరియు థానే వంటి ప్రదేశాల్లో, మీ జీతం కనీసం రూ. 30,000 ఉండాలి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు గోవా వంటి నగరాల్లో మీరు కనీసం రూ. 25,000 సంపాదించాలి
అవును, మీరు హోమ్ లోన్ రీపేమెంట్ పై పన్ను మినహాయింపులను పొందవచ్చు. హోమ్ లోన్ పన్ను ప్రయోజనాలు లో ప్రిన్సిపల్ రీపేమెంట్ పై సెక్షన్ 80సి క్రింద రూ. 1.5 లక్షల మినహాయింపు మరియు వడ్డీ రీపేమెంట్ పై సెక్షన్ 24బి క్రింద రూ. 2 లక్షల మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80సి క్రింద రిజిస్ట్రేషన్ ఫీజు మరియు స్టాంప్ డ్యూటీ ఛార్జీల కోసం మీరు హోమ్ లోన్ పన్ను మినహాయింపులను కూడా క్లెయిమ్ చేయవచ్చు.
బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఒక హోమ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లలో ఇవి ఉంటాయి:
- కెవైసి డాక్యుమెంట్లు
- అడ్రస్ ప్రూఫ్
- ఐడెంటిటీ ప్రూఫ్
- ఫోటో
- ఫారం 16/ ఇటీవలి జీతం స్లిప్స్
- గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు
- వ్యాపార కొనసాగింపు ప్రూఫ్ (వ్యాపారవేత్తలకు, స్వయం -ఉపాధి కలవారికి)
రెండు రకాల హోమ్ లోన్లకి వాటి లాభ నష్టాలు ఉన్నాయి. ఒక ఫిక్స్డ్-రేట్ హోమ్ లోన్‌తో, వడ్డీ రేటు అవధి మొత్తం స్థిరంగా ఉంటుంది, ఇది ఇఎంఐలను అంచనా వేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. హోమ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు మరియు మీకు ఫిక్స్డ్ ఇఎంఐలు కావాలనుకున్నప్పుడు దాన్ని ఎంచుకోండి.
ఫ్లోటింగ్-రేటు హోమ్ లోన్లతో, ఆర్థిక మార్పులు మరియు ఆర్బిఐ పాలసీ నిర్ణయాల ఆధారంగా వడ్డీ రేటు మారుతుంది. రానున్న కాలంలో రేట్లు తగ్గుతాయని మీరు ఆశించినప్పుడు ఈ వేరియంట్‌ను ఎంచుకోండి. అదనంగా, మీరు ఒక ఫ్లోటింగ్ రేటు హోమ్ లోన్ తీసుకుంటున్న వ్యక్తి అయితే మీరు ఏ ప్రీపేమెంట్ లేదా ఫోర్క్లోజర్ ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని ఆర్బిఐ ఆదేశించింది.
హోమ్ ఫైనాన్స్ మరియు వివిధ కస్టమర్ ప్రొఫైల్స్ కోసం వివిధ అవసరాల ఆధారంగా, భారతదేశంలో అందుబాటులో ఉన్న హోమ్ లోన్ల రకాలు ఇవి:
- ఇంటి నిర్మాణానికి లోన్
- హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్
- టాప్-అప్ లోన్
- జాయింట్ హోమ్ లోన్
- ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీం కింద లోన్లు
- కోసం హోమ్ లోన్:
- మహిళలు
- ప్రభుత్వ ఉద్యోగులు
- అడ్వకేట్లు
- బ్యాంక్ ఉద్యోగులు
- ప్రైవేట్ ఉద్యోగులు
ఒక హౌస్ లోన్ పొందడానికి రుణగ్రహీత యొక్క తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని నిర్ధారించే అర్హతా ప్రమాణాలను నెరవేర్చడానికి ఒక వ్యక్తి అవసరం. అర్హతను ప్రభావితం చేసే అంశాలు:
- ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ స్కోర్
- నెలవారీ ఆదాయం
- ప్రస్తుత ఆర్థిక బాధ్యతలు మరియు అప్పు
- ఉద్యోగం యొక్క స్థితి
- అప్లికెంట్ యొక్క వయస్సు
- కొనుగోలు చేయవలసిన ఆస్తి
అవును, మీ హౌసింగ్ లోన్ యొక్క రీపేమెంట్ అవధిలో మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుండి ఫిక్సెడ్ వడ్డీ రేటుకి మారవచ్చు. ఈ మార్పు కోసం మీ రుణదాతకు మీరు నామమాత్రపు మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది.
హౌసింగ్ లోన్ ఎంచుకోవడం అనేది ఈ క్రింది కారణాల వలన ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం అవుతుంది:
- ఇది మీ సేవింగ్స్‌ను ప్రభావితం చేయకుండా మీ హౌసింగ్ కలలకు ఫండ్స్ సమకూర్చడానికి అదనపు ఫైనాన్సింగ్ అందిస్తుంది
- మీ అవసరాల ప్రకారం మీరు అనేక హౌసింగ్ లోన్ ఎంపికల నుండి ఎంచుకోవచ్చు
- వడ్డీ రేట్లు సరసమైనవి మరియు లోన్ రీపేమెంట్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తాయి
- దీర్ఘ అవధి అనేది సులభ EMI లలో లోన్ రీపేమెంట్‌ను అనుమతిస్తుంది
లేదు, అదే ఆస్తి కోసం ఒక సమయంలో రెండు హౌసింగ్ లోన్లను పొందడం CERSAI ప్రకారం పరిమితం చేయబడింది. అయితే, వ్యక్తులు తక్కువ వడ్డీ రేటుకు వారి ప్రస్తుత హౌసింగ్ క్రెడిట్‌ను రీఫైనాన్స్ చేయడానికి హౌస్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎంచుకోవచ్చు. ఈ సౌకర్యం టాప్-అప్ రుణం సదుపాయంతో వస్తుంది - ఇప్పటికే ఉన్న రుణం మొత్తానికి మించి మరియు పైన ఒక అదనపు రుణం. విభిన్న ఆర్థిక అవసరాలను సులభంగా తీర్చుకోవడానికి ఫండ్స్ పొందండి.
ఒక హోమ్ లోన్‌ను సులభంగా పొందడానికి ఈ క్రింది స్టెప్స్‌తో కొనసాగండి.
- మీ క్రెడిట్ రిపోర్టులు చెక్ చేయండి మరియు ఏవైనా లోపాలు ఉంటే సరిచేయండి
- ఒక హోమ్ లోన్ క్యాలిక్యులేటర్‌తో ఇఎంఐ లను అంచనా వేయండి మరియు రీపేమెంట్ సామర్థ్యం ప్రకారం రుణ మొత్తాన్ని నిర్ణయించండి
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోండి
- ఉత్తమ హౌసింగ్ లోన్ ఎంపిక కోసం అందుబాటులో ఉన్న ఆఫర్లను సరిపోల్చండి
- అప్లై చేయడానికి ముందు అన్ని అర్హతను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి
రుణదాత పూర్తి హౌసింగ్ రుణం మొత్తాన్ని పంపిణీ చేసిన తర్వాత రుణాల కోసం రీపేమెంట్ వ్యవధి వెంటనే ప్రారంభమవుతుంది. అయితే, పాక్షిక పంపిణీ విషయంలో, అటువంటి పంపిణీ చేయబడిన మొత్తం పై పొందిన వడ్డీని ప్రీ-EMI గా చెల్లించవలసి ఉంటుంది. ప్రిన్సిపల్ మరియు వడ్డీ మొత్తంతో సహా పూర్తి EMI చెల్లింపు లోన్ యొక్క పూర్తి పంపిణీ తర్వాత ప్రారంభమవుతుంది.
లేదు, మీరు మీ లోన్ తో పాటుగా హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి కాదు. అయితే, మీ EMI లలో స్వల్ప పెరుగుదలతో ఏదైనా బాధ్యతను చూసుకోవడానికి ఒక ఇన్సూరెన్స్ పొందడాన్ని మీరు పరిగణించవచ్చు.
పంపిణీ చెక్ సృష్టించబడినప్పుడు మీరు మీ హోమ్ లోన్ EMI చెల్లించడం ప్రారంభిస్తారు. మీరు మీ లోన్ మొత్తాన్ని అందుకున్న తర్వాత, మీరు EMI చక్రం ప్రకారం EMI లను చెల్లించడం ప్రారంభిస్తారు. అంటే మీరు ఇఎంఐ రీపేమెంట్ కోసం ఎంచుకున్న తేదీ ఒక నెలలో 5 వ తేదీ అయి మరియు మీరు ఆ నెలలో 28 వ తేదీన లోన్ అందుకుంటే, అప్పుడు మీరు మీ హౌస్ లోన్ శాంక్షన్ చేయబడిన రోజు నుండి మీ మొదటి ఇఎంఐ తేదీ వరకు లెక్కించిన ఇఎంఐ ను మొదటి నెల కోసం చెల్లిస్తారు అని అర్ధం. తరువాతి నెల నుండి, మీరు నియమించబడిన రోజున రెగ్యులర్ ఇఎంఐ లను చెల్లిస్తారు. తరువాతి నెల నుండి, మీరు నియమించబడిన రోజున రెగ్యులర్ EMI లను చెల్లిస్తారు.
అవును, మీరు ఎక్కువ లోన్ పొందాలనుకుంటే, మీరు జాయింట్ పేర్లలో ఒక హోమ్ లోన్ తీసుకోవచ్చు. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తోబుట్టువులు మరియు అవివాహితులు వంటి కుటుంబ సభ్యులు జాయింట్ హౌస్ లోన్ కోసం సహ-దరఖాస్తుదారులుగా ఉండవచ్చు.
అంతేకాకుండా, డెట్ సర్వీసింగ్ బాధ్యతను పంచుకోవడం ద్వారా లోన్ రీపేమెంట్ భారం తగ్గుతుంది.
ప్రాసెసింగ్ ఫీజు అనేది మీరు ఒక హోమ్ లోన్‌పై చెల్లించవలసిన ఫీజుల్లో ఒకటి. ఒక హోమ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది మీ హౌసింగ్ లోన్ అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత రుణదాత వసూలు చేసే వన్-టైమ్ ఫీజు. కొంతమంది రుణదాతలు హోమ్ లోన్ల కోసం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నప్పటికీ, ఇతరులు చేయరు.
మీ హోమ్ లోన్ అప్లికేషన్ నంబర్/ ఐడి అలాగే మీ మొబైల్ నంబర్/ సంప్రదింపు సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా మీరు మీ హౌసింగ్ లోన్ అప్లికేషన్ యొక్క స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు.
మీరు మీ హోమ్ లోన్ రుణదాతను కూడా సంప్రదించవచ్చు మరియు మీ అప్లికేషన్ ఐడి/ రిఫరెన్స్ నంబర్ అందించడం ద్వారా మీ హోమ్ లోన్ అప్లికేషన్ స్థితి గురించి అడగవచ్చు.
పేర్కొన్న బంధువులు మాత్రమే హోమ్ ఫైనాన్స్ కోసం సహ-దరఖాస్తుదారులుగా ఉండటానికి అర్హులు:
పెళ్ళి కాని కుమారులు మరియు కుమార్తెలు వారి తల్లిదండ్రులతో జాయింట్ హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. భార్యాభర్తలు ఉమ్మడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక సోదరుడు మరియు సోదరి కలిసి హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ సోదరుడు-సోదరి లేదా సోదరి-సోదరి కలిపి అనుమతించబడదు.