వైద్య పరికరాల ఫైనాన్స్ ఫీజులు మరియు ఛార్జీలు

 • Affordable financing

  సరసమైన ఫైనాన్సింగ్

  ఆకర్షణీయమైన వడ్డీ రేటు వద్ద ఖరీదైన వైద్య సాధనాలు మరియు పరికరాల కోసం నిధులు సమకూర్చుకోండి.

 • Lengthy repayment

  సుదీర్ఘ రీపేమెంట్ అవధి

  మీ ఖర్చులను 96 నెలల వరకు సుదీర్ఘమైన వ్యవధి అంతటా విస్తరించే చిన్న ఇఎంఐల్లోకి విభజించండి మరియు మీ చెల్లింపులను సులభంగా నిర్వహించుకోండి.

 • Minimal documentation

  కనీస డాక్యుమెంటేషన్

  అప్రూవల్ పొందడానికి మీ కెవైసి మరియు మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి మీ ప్రాథమిక డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.

 • Personalised offers

  వ్యక్తిగతీకరించిన ఆఫర్లు

  తక్షణ హెల్త్‌కేర్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్సింగ్ పొందడానికి ప్రత్యేకమైన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను పొందండి.

 • Online loan management

  ఆన్‌లైన్ లోన్ మేనేజ్‍మెంట్

  మా సౌకర్యవంతమైన, 24x7 డిజిటల్ కస్టమర్ పోర్టల్ –మై అకౌంట్ ద్వారా మీ హెల్త్‌కేర్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లోన్‌ను మేనేజ్ చేసుకోండి.

వైద్య పరికరాల లోన్

నాణ్యమైన చికిత్సను అందించడానికి వైద్యులు ప్రత్యేకమైన మరియు అత్యున్నత-స్థాయి వైద్య పరికరాలలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీటిలో అల్ట్రాసౌండ్ యూనిట్లు, సిటి స్కానర్లు, ఇసిజిలు, ఎక్స్-రే మెషీన్లు, ఎంఆర్ఐలు, యాంజియోగ్రఫీ మెషీన్లు, స్కానర్లు, మానిటర్లు మరియు మరెన్నో మెషీన్లు ఉంటాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి అవాంతరాలు లేని మెడికల్ ఎక్విప్‌మెంట్ కోసం రూ. 6 కోట్ల లోన్‌తో, మీరు మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ పరికరాలను కొనుగోలు చేసి, మీ ప్రాక్టీసును సులభంగా ఏర్పాటుచేసుకోవచ్చు. అనేక రకాల ప్రయోజనాలతో నిండిన ఈ హెల్త్‌కేర్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ లోన్లు, ఖరీదైన వైద్య పరికరాల కొనుగోలు కోసం మీకు సరైన ఆర్థిక-పరిష్కారంగా నిలుస్తాయి.

మీరు సరసమైన వడ్డీ రేటును పొందవచ్చు మరియు మీ నగదు ప్రవాహాలను ఉత్తమంగా నిర్వహించుకోవడానికి సుదీర్ఘమైన అవధులలో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. మేము సులభమైన అర్హత ప్రమాణాలతో హెల్త్ కేర్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్సింగ్‌ను అందిస్తున్నందున, ఆమోదం పొందడం సులభం మరియు ధృవీకరణ కోసం కేవలం ప్రాథమిక డాక్యుమెంటేషన్ మాత్రమే అవసరం.

మరింత చదవండి తక్కువ చదవండి

వైద్య పరికరాల ఫైనాన్స్ ఫీజులు మరియు ఛార్జీలు

బజాజ్ ఫిన్‌సర్వ్ మెడికల్ ఎక్విప్‌మెంట్స్ కోసం అతి తక్కువ వడ్డీ రేట్ల వద్ద రుణాన్ని అందిస్తుంది. మా ఫీజులు మరియు ఛార్జీల గురించి మరింత చదవండి.

ఫీజుల రకాలు

వర్తించే ఛార్జీలు

వడ్డీ రేటు

సంవత్సరానికి 8.5% నుండి 14%

ప్రాసెసింగ్ ఫీజు

రుణ మొత్తంలో 2.95% వరకు (వర్తించే పన్నులతో సహా)*
*రుణ మొత్తంలో ఇన్సూరెన్స్ ప్రీమియం, విఎఎస్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు మరియు ఫ్లెక్సీ ఫీజులు ఉంటాయి.

చెల్లించవలసిన స్టాంప్ డ్యూటీ/ లీగల్, తిరిగి స్వాధీనం చేసుకునే మరియు యాధృచ్చిక ఛార్జీలు

చెల్లించవలసిన వాస్తవ స్టాంప్ డ్యూటీ, చట్టపరమైన మరియు ఆకస్మిక ఛార్జీలు సంబంధిత చట్టం(లు) క్రిందకి వస్తాయి

బౌన్స్ ఛార్జీలు

రూ. 1,500

జరిమానా వడ్డీ

నెలవారీ వాయిదా/ ఇఎంఐ చెల్లింపులో జరిగే ఏదైనా ఆలస్యం, డిఫాల్ట్ తేదీ నుండి నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్/ ఇఎంఐ అందే వరకు నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్/ ఇఎంఐ బకాయిపై నెలకు 3.50% చొప్పున జరిమానా వడ్డీని ఆకర్షిస్తుంది.

మ్యాండేట్ తిరస్కరణ ఛార్జీలు కొత్త మ్యాండేట్ రిజిస్టర్ చేయబడే వరకు కస్టమర్ యొక్క బ్యాంక్ ద్వారా మ్యాండేట్ తిరస్కరించబడిన గడువు తేదీ నుండి నెలకు రూ. 450/.


ప్రీపేమెంట్ ఛార్జీలు మరియు వార్షిక నిర్వహణ ఛార్జీలు

పార్ట్ ప్రీపేమెంట్ చార్జీలు

ఏమీ లేదు

పూర్తి ప్రీపేమెంట్ (ఫోర్‍క్లోజర్) ఛార్జీలు

ఏమీ లేదు


గమనిక: కేరళలోని అన్ని ఛార్జీలపై అదనపు సెస్ వర్తిస్తుంది.

హెల్త్‌కేర్/ మెడికల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ కోసం అర్హత ప్రమాణాలు

వైద్య పరికరాల కొనుగోళ్ల కోసం రుణానికి అవసరమైన అర్హతా ప్రమాణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

 • డయాగ్నోస్టిక్ సెంటర్
 • పాథాలజీ ల్యాబ్ సెంటర్
 • వ్యక్తిగత ప్రాక్టీస్
 • స్పెషాలిటీ లేదా సూపర్-స్పెషాలిటీ హాస్పిటల్
 • నర్సింగ్ హోమ్
 • స్పెషాలిటీ క్లినిక్స్ (స్కిన్ మరియు డెంటల్ క్లినిక్స్ వంటివి)
 • డయాలిసిస్ సెంటర్
 • ఎండోస్కోపీ సెంటర్
 • ఐవిఎఫ్ సెంటర్

రూ. 6 కోట్ల వరకు రూ. 50 లక్షలకు మించిన క్రెడిట్ సౌకర్యం కోసం అర్హత

 • బిజినెస్ వింటేజ్ కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి
 • రుణం కోసం అవసరమైన డాక్యుమెంట్లలో ఐటిఆర్, పి&ఎల్, 2 సంవత్సరాల కోసం ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్ మరియు 6 నెలల కరెంట్ అకౌంట్ స్టేట్‌మెంట్ ఉంటాయి