పర్సనల్ లోన్ పార్ట్-ప్రీపేమెంట్ మరియు ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

2 నిమిషాలలో చదవవచ్చు

పార్ట్-ప్రీపేమెంట్ అంటే మీరు ఒక ఇఎంఐ కంటే ఎక్కువ మొత్తంతో మీ పర్సనల్ లోన్‌ను తిరిగి చెల్లించడం. ఇది మీ భవిష్యత్తు ఇఎంఐలను తగ్గించడానికి సహాయపడుతుంది.

పాక్షిక-ప్రీపేమెంట్ ఛార్జీలు అంటే ఏమిటి?

  • మీరు ఫ్లెక్సీ పర్సనల్ లోన్ కోసం ఎంచుకున్నట్లయితే ఎటువంటి పాక్షిక-ప్రీపేమెంట్ ఛార్జీలు విధించబడవు.
  • మీకు సాధారణ టర్మ్ లోన్ ఉన్నట్లయితే, మీరు ప్రీపెయిడ్ మొత్తంపై 4.72% (పన్నులతో సహా) చెల్లించాలి, అది ఒక ఇఎంఐ కన్నా ఎక్కువగా ఉన్నపుడు మాత్రమే. మీరు మీ లోన్‌లో కనీసం ఒక నెలవారీ వాయిదాను చెల్లించిన తర్వాత మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి.

ఫోర్‍క్లోజర్ ఛార్జీలు అంటే ఏమిటి?

పర్సనల్ లోన్ ఫోర్‍క్లోజర్ అంటే మీరు అనేక ఇఎంఐ చెల్లింపులు చేయడానికి బదులుగా మీ రుణం యొక్క మొత్తం బ్యాలెన్స్‌ను ఒకే చెల్లింపులో చెల్లించడం. మీ ప్రస్తుత పర్సనల్ లోన్ చెల్లించడానికి మీ వద్ద అదనపు నిధులు ఉంటే మీరు పర్సనల్ లోన్ ఫోర్‍క్లోజర్ ఎంపికను ఎంచుకోవచ్చు.

మీ లోన్ అకౌంట్‌కు పాక్షిక-ప్రీపేమెంట్లు చేయడం లేదా దానిని సమయానికి ముందు ఫోర్‍క్లోజ్ చేయడం, మీ డెట్ భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు మీ బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్‌ను పార్ట్-ప్రీపే చేయాలనుకుంటే లేదా ఫోర్‌క్లోజ్ చేయాలనుకుంటే, మీరు ఈ క్రింద పేర్కొన్న ఛార్జీలను చెల్లించాలి:

  • మీరు మీ లోన్ అకౌంట్‌ను ఫోర్‌క్లోజ్ చేయాలనుకుంటే, ప్రీపేమెంట్ తేదీనాటికి మిగిలిన ఉన్న మీ ప్రిన్సిపల్ మొత్తం పై 4.72% ఫీజులు మరియు వర్తించే పన్నులు చెల్లించాలి.
  • మీరు ఒక ఫ్లెక్సీ పర్సనల్ లోన్ కోసం ఎంచుకుంటే, మీకు విత్‍డ్రా చేసిన మొత్తం పై 4.72% మరియు వర్తించే పన్నులు మరియు సెస్ ఛార్జ్ చేయబడుతుంది*.

పాక్షిక ప్రీపేమెంట్ చేయడానికి లేదా మీ పర్సనల్ లోన్‌ను ఫోర్‍క్లోజ్ చేయడానికి కస్టమర్ పోర్టల్ - బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్ సర్వీస్ పోర్టల్ ద్వారా మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయండి.

పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు మరియు వర్తించే ఛార్జీల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

మరింత చదవండి తక్కువ చదవండి