ఫీచర్లు మరియు ప్రయోజనాలు

మిమ్మల్ని ఊహించని, అధిక వైద్య ఖర్చుల నుండి రక్షించడం ద్వారా, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమైన ఆరోగ్యం, అనారోగ్యం మరియు ప్రమాద ఖర్చులను కవర్ చేస్తుంది. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు, ఆసుపత్రిలో చేరిన సమయంలో మీకు అందిన వైద్య చికిత్స ఖర్చులు, వార్షిక ప్రీమియం చెల్లింపు సమయంలో, మీచే ఎంచుకోబడిన హామీ ఇవ్వబడిన మొత్తానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ సంస్థచే చెల్లించబడతాయి. చికిత్స కోసం మీకు మీరుగా చెల్లించవచ్చు మరియు ఆ తరువాత పాలసీచే రీఎంబర్స్ చేయించుకోవచ్చు, లేదా మీ చికిత్స కోసం నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్ళవచ్చు, అక్కడ మొదటి నుండి మీ ఖర్చులు పాలసీచే కవర్ చేయబడతాయి. దీనికి అదనంగా, పాలసీ కోసం చెల్లించబడిన ప్రీమియం ఆదాయ పన్ను చట్టం, 1961 యొక్క సెక్షన్ 80D క్రింద పన్ను మినహాయింపు క్రిందికి వస్తుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఒక వ్యక్తి కోసం లేదా కుటుంబం కోసం కొనుగోలు చేయవచ్చు. వీటిని మీరు ఏదేని చాలా తీవ్రమైన అనారోగ్యం బారినుండి లేదా గర్భందాల్చిన సమయంలో మీరు ఎదుర్కొనే ఏదేని సమస్యలకు రక్షణగా కూడా కొనవచ్చు. ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కొనే నిర్ణయమ తీసుకునే ముందు విభిన్న రకాల హెల్త్ ఇన్సూరెన్స్ కవర్లను పరిశీలించండి.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రకాలు

 • వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

  వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద, ఆసుపత్రిలో నగదురహిత చేరిక మరియు ఇతర ప్రయోజనాల కోసం ప్లాన్ క్రింద కవర్ చేయబడిన వ్యక్తికి వ్యక్తిగత ప్రాతిపదికన ఎంచుకోబడిన హామీ మొత్తం వర్తిస్తుంది. ఇది ఇన్సూరెన్స్ చేయబడిన ప్రతి వ్యక్తి పూర్తి మొత్తానికి అర్హుడయ్యే పాలసీ.

 • ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

  ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో, ఎంచుకోబడిన హామీ ఇవ్వబడిన మొత్తం ఒకే కవర్ క్రింద కవర్ చేయబడిన కుటుంబ సభ్యులు అందరికీ వర్తిస్తుంది అనగా సభ్యులు అందరికీ ఒక కవర్. ఇది పూర్తిగా ఒక సభ్యునిచే లేదా అనేక క్లెయిముల ద్వారా అనేకమందిచే ఉపయోగించుకోబడవచ్చు.

 • టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

  టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అదనపు కవరేజ్ అనేది ప్రస్తుత వ్యక్తిగత ప్లాన్ లేదా యజమాని నుండి కవరేజ్ క్రింద పరిమిత హెల్త్ కవర్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి అదనపు కవరేజ్. ప్రస్తుతం ఉన్న కవర్ యొక్క పరిమితి చాలనప్పుడు ఒక్క అనారోగ్యం నుండి ఉత్పన్నమయ్యే ఖర్చుకు రీఎంబర్స్మెంట్ కోసం ఇది ఉద్దేశించబడింది.

 • క్రిటికల్ ఇల్నెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

  క్యాన్సర్, మూత్రపిండాలు విఫలం కావడం, గుండెపోటు మొదలైన తీవ్రమైన అస్వస్థతల చికిత్స కోసం స్టాండలోన్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా రైడర్ తీసుకోబడతాయి. పాలసీదారుడు నిర్దేశించిన తీవ్ర అనారోగ్య సమస్యలలో ఒక దానితో బాధపడుతున్నట్లుగా రోగనిర్ధారణ చేయబడినట్లయితే, అనేక క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏకమొత్తం చెల్లింపు బెనిఫిట్ అందిస్తాయి.

 • గ్రూప్/ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

  గ్రూప్/ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు సాధారణంగా కంపెనీలచే కొనుగోలు చేయబడతాయి, మరియు సదరు కంపెనీ యొక్క ఉద్యోగులకు వైద్య సంరక్షణకు అయ్యే వైద్య ఖర్చులను కవర్ చేస్తాయి. సాధారణంగా గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ప్రీమియంలు సగటు ప్రీమియంల కంటే తక్కువగా ఉంటాయి, మరియు వ్యాధులు మరియు వైద్య ప్రక్రియల పై కవరేజ్ చాలా విస్తృతంగా ఉంటుంది.

 • పర్సనల్ యాక్సిడెంట్ కవర్లు

  పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ యాక్సిడెంట్ కారణంగా, మరణం, వైకల్యం, గాయం, మరియు ఇతర అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అయ్యే ఖర్చుల నుంచి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ కవర్లు విడిగా కొనుగోలు చేయవచ్చు లేదా అప్పటికే ఉన్న పాలసీకి ఒక రైడర్‍‍గా జోడించవచ్చు.

 • Senior Citizen Health Insurance Policy

  సీనియర్ సిటిజెన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

  సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కనీసం 60 ఏళ్లు లేదా అంతకంటే పైబడిన వయసున్న వ్యక్తులు కొనుగోలు చేయవచ్చు. ఇవి ప్రత్యేకంగా వృద్ధులైనవారికి వైద్యపరమైన అవసరాల ఖర్చుల కోసం రూపొందించబడినాయి. అటువంటి పాలసీల్లో మీరు ప్లాన్‌ను తీసుకోవటానికి ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. అయితే, వాటి మీద ప్రీమియం ఖర్చులు సాధారణంగా కంటే తక్కువగా ఉంటాయి.

 • మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్

  మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ గర్భిణీ స్త్రీల కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన కవర్. దీనిని విడిగా కొనుగోలు చేయవచ్చు, లేదా అప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి రైడర్‍‍గా జోడించవచ్చు. మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ ప్రసవానికి ముందు, ప్రసవం అనంతరం, మరియు ఆసుపత్రిలో ఉన్న సమయంలో, మరియు అదనంగా గర్భంతో ఉన్న సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యల నుండి కూడా కవర్ చేస్తుంది.

భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • రూ.2 లక్షల నుండి రూ.50 లక్షల వరకు సమగ్రమైన హెల్త్ కవర్ ఇన్సూరెన్స్ ఆప్షన్లు

 • నగదు రహిత సెటిల్మెంట్ - ఆసుపత్రుల విస్తృత నెట్వర్క్ వ్యాప్తంగా చికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు మీరు ఏ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు

 • అంబులెన్స్ ఫీజ్ కవర్ చేయబడుతుంది

 • గది అద్దెకు గరిష్ట పరిమితి లేదు

 • ప్రసూతి ప్రయోజనాలు, అప్పుడే పుట్టిన శిశువు యొక్క కవరేజ్, టీకాలు వేసే ఛార్జీలకు 10 సంవత్సరాల వరకు కవరేజీ ఉంటుంది

 • ఆసుపత్రిలో చేరడానికి 30 రోజుల ముందరి మరియు 60 రోజుల తరువాతి ప్రయోజనాలు

 • 130 డే కేర్ ప్రొసీజర్లు కవర్ చేయబడ్డాయి

 • అవయవ మార్పిడి సమయంలో అయిన ఖర్చులు

 • అత్యవసర అంబులెన్స్ ఛార్జీలు కవర్ చేయబడ్డాయి

 • ఆయుష్ (ఆయుర్వేద, యునానీ, సిద్ధ మరియు హోమియోపతి) చికిత్స కూడా కవర్ చేయబడుతుంది

 • ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు క్లెయిమ్ లేని బోనస్ గా డిస్కౌంట్ వోచర్లు (NCB అనేది మునుపటి సంవత్సరంలో ఒక వ్యక్తి ఏ చికిత్స కోసం ఒక క్లెయిమ్ ధాఖలు చేయకపోతే ఉండే ఒక ప్రయోజనం.)

 • ప్రవేశ వయస్సు 60 సంవత్సరాల వరకు

 • సెక్షన్ 80D క్రింద ఆదాయ పన్ను ప్రయోజనం

 • ప్రతి ఒక్క క్లెయిమ్-లేని సంవత్సరం తరువాత పాలసీ రెన్యూ చేసుకోవడం పైన నో క్లెయిమ్ బోనస్

 • ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి అటువంటి పాలసీ కోసం కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను రిఫర్ చేసిన తరువాత ప్రీమియంపై లాయల్టీ డిస్కౌంట్లు

 • ఏ సమయంలోనైనా ఖచ్ఛితంగా మీరు మీ పాలసీని యాక్సెస్ చేసుకోవచ్చని హామీ ఇచ్చే విధంగా 24/7 టోల్-ఫ్రీ కాల్ సెంటర్ సహాయం

 • పాలసీని ఇబ్బంది లేకుండా చేయడానికి ఆన్‍లైన్ అప్లికేషన్ మరియు రెన్యువల్

 • వృద్ధాప్యంతో సహా, జీవితకాలం పొడవునా పాలసీ రెన్యూ చేసుకునే సామర్థ్యం

 • మీకు నచ్చిన ఇన్సూరర్ ఎవరికైనా ఇన్సూరెన్స్ పాలసీ బదిలీ చేసుకునే సామర్థ్యం

హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అర్హత మరియు అవసరమైన డాక్యుమెంట్లు

 • 18 నుండి 21 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చు

 • వయస్సులు 90 రోజులనుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న ఆధారపడి ఉన్న పిల్లలు ఈ పాలసీ కింద కవర్ చేయబడవచ్చు

 • 60 ఏళ్ల వయస్సు పైబడిన వారికి అనుకూలంగా రూపొందించిన పాలసీలలో వయో వృద్ధులు కవర్ చేయబడతారు

 • సాధారణంగా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు స్పష్టంగా నింపబడి సంతకం చేయబడిన అప్లికేషన్ ఫారం తప్ప, ఏ డాక్యుమెంట్లు అవసరం లేదు. అయితే, మీరు ఒక నిర్దిష్ట వయస్సుకు పైబడి ఉంటే మీరు ఒక వైద్య పరీక్షను చేయించుకోవలసి రావచ్చు.

మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కొనడానికి ముందు పరిగణించవలసిన అంశాలు


 • మీరు ఎటువంటి రకం ఇన్సూరెన్స్ పాలసీ కొనాలని అనుకుంటున్నారు, ఒక వ్యక్తి కొరకా లేదా కుటుంబం కొరకా?

 • మీకుమీ కుటుంబం కోసం ఏది అనువైన ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది?

 • మీరు ఏ యాడ్-ఆన్ ఫీచర్లు ఎంచుకోవాలని అనుకుంటున్నారు?

 • వర్తించే ఉప పరిమితులు (గది అద్దె, వైద్యులు ఫీజు, మెడికల్ టెస్ట్ మొదలైన వాటి గరిష్ట పరిమితి) తెలుసుకోండి

 • పాలసీలో చేర్చినవి మరియు మినహాయించినవి.

 • క్లెయిమ్ కోసం అవసరమయ్యే విధానాలు ఏమిటి? (నగదు రహిత, రీఎంబర్స్మెంట్)

 • పాలసీ ఆమోదానికి ముందు వైద్య పరీక్షలు అవసరమవుతాయా?

అప్లై చేయడం ఎలా

హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేయటం సులువు. కేవలం మా ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం నింపండి, మరియు ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళడం కోసం మా ప్రతినిధి తిరిగి మిమ్మల్ని సంప్రదిస్తారు, మరియు మీ అవసరాలకు తగిన అత్యుత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడంలో మీకు సహాయపడతారు.