image

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ / ప్రొటెక్షన్ ప్లాన్లు

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

ఆర్థిక భద్రత, వేగంగా మరియు సులభంగా. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు, మీ ప్రియమైన వారి భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితం చేసుకోవడానికి ప్రొటెక్షన్ ప్లాన్ ఆఫరింగ్స్ ఒక సులభమైన మార్గం. మీ మరణం, అశక్తత లేదా ప్రాణాంతక అనారోగ్యం విషయంలో మీ కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడానికి అధికారం పొందండి. ప్రొటెక్షన్ ప్లాన్ ఆఫరింగ్స్‌తో, మీరు భవిష్యత్తు గురించి ఎన్నడూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

 • సరసమైన ఇన్సూరెన్స్ ప్లాన్

  కనీస వ్యయంతో మార్కెట్లో ఉన్న అత్యంత సమగ్రమైన ఇన్సూరెన్స్ పథకం.

 • సమగ్ర కవరేజ్

  మీ మరణం, ప్రమాదం కారణంగా మరణం, ప్రమాదవశాత్తు శాశ్వత వైకల్యం లేదా సంక్లిష్టమైన అనారోగ్యం సందర్భంలో మీ ప్రియమైనవారికి ఆర్ధిక రక్షణ.

 • అందుబాటులో ఉన్న కస్టమైజేషన్స్

  మరణం సంభవించినప్పుడు ఏక మొత్తం చెల్లింపు లేదా కొన్ని సంవత్సరాల వరకు కుటుంబానికి నెలవారి ఆదాయం వంటి అనేక కస్టమైజేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

 • ప్రీమియం మాఫీ

  యాక్సిడెంట్ వలన శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు లేదా ఒక తీవ్రమైన అనారోగ్యం ఉందని రోగనిర్ధారణ జరిగినప్పుడు మీ భవిష్యత్తు ప్రీమియంలు అన్ని రద్దు చేయబడతాయి. అప్పుడు కూడా పాలసీ అదే ప్రయోజనాలతో కొనసాగుతుంది.

 • పాలసీ ప్రవేశ వయస్సు

  గరిష్ట కవరేజ్ కోసం 18 నుండి 65 సంవత్సరాల వరకు ప్రవేశ వయస్సు.

 • ఫ్లెక్సిబుల్ పాలసీ టర్మ్

  40 సంవత్సరాల వరకు ఉండే ప్లాన్స్ తో మీ పాలసీ మరియు ప్రీమియం చెల్లింపు నిబంధనలను ఎంచుకునే ఫ్లెక్సిబిలిటి.

 • ప్రీమియం చెల్లింపు ఆప్షన్

  మీ ఆర్ధిక సౌకర్యం కోసం నెలవారి, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా ప్రీమియం మొత్తం చెల్లించే ఎంపిక.

 • పన్ను ప్రయోజనాలు

  చెల్లించిన ప్రీమియం మరియు పాలసీ రిటర్న్స్ పై పన్ను ప్రయోజనాలను పొందండి.

 • ధూమపానం చేయని వారికి ప్రయోజనం

  కేవలం పొగ తాగని వారి కోసం మాత్రమే, తక్కువ ప్రీమియం మొత్తాలు.

డిస్‌క్లెయిమర్

"బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ('BFL') అనేది బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, HDFC Life Insurance Company Limited, Future Generali Life Insurance Company Limited, బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, Tata AIG General Insurance Company Limited, Oriental Insurance Company Limited, Max Bupa Health Insurance Company Limited , Aditya Birla Health Insurance Company Limited మరియు Manipal Cigna Health Insurance Company Limited కి చెందిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రాడక్టుల కోసం, IRDAI కాంపోజిట్ రిజిస్ట్రేషన్ నంబర్ CA కలిగి ఉన్న, ఒక రిజిస్టర్డ్ కార్పొరేట్ ఏజెంట్.

దయచేసి గమనించండి, BFL రిస్క్‌కు పూచీకత్తు ఇవ్వదు లేదా ఒక ఇన్సూరర్‌గా వ్యవహరించదు. మీరు ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కొనుగోలు చేయడము అనేది ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ యొక్క అనుకూలత, ఆచరణ సాధ్యత యొక్క పూర్తి సమగ్ర పరిశీలన తరువాత తీసుకొనబడే స్వచ్ఛంద నిర్ణయం. ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కొనుగోలు అనేది మీరు పూర్తి బాధ్యతతో స్వంతంగా తీసుకునే నిర్ణయం మరియు ఏదైనా వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా నష్టం లేదా ప్రమాదం జరిగితే BFLకి ఎటువంటి బాధ్యత ఉండదు. ఈ ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. పాలసీకి సంబంధించిన నిబంధనలు మరియు షరతులు, నిర్వచనం కోసం దయచేసి ఇన్సూరర్‌కి చెందిన వెబ్‌సైట్‌ని చూడండి. రిస్క్ అంశాలు, షరతులు మరియు నిబంధనలు, మినహాయింపుల పై మరిన్ని వివరాల కోసం, కొనుగోలును పూర్తి చేసే ముందు ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సేల్స్ బ్రోచర్‌ను జాగ్రత్తగా చదవండి. పన్ను ప్రయోజనాలు ఏవైనా ఉంటే, అవి అమలులో ఉన్న పన్ను చట్టాల ప్రకారం ఉంటాయి. పన్ను చట్టాలు మార్పునకు లోబడి ఉంటాయి. BFL పన్ను/పెట్టుబడి సేవలను అందించదు. ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కొనుగోలు చేయడానికి ముందు దయచేసి మీ అడ్వైజర్లను సంప్రదించండి."

డిస్‌క్లెయిమర్ - *షరతులు వర్తిస్తాయి. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ మాస్టర్ పాలసీ హోల్డర్ అయిన గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం కింద ఈ ప్రోడక్ట్ అందించబడుతుంది. మా పార్టనర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్ అందించబడుతుంది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిస్క్‌కు బాధ్యత వహించదు. IRDAI కార్పొరేట్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ CA0101 పైన పేర్కొన్న ప్రయోజనాలు మరియు ప్రీమియం మొత్తం ఇన్సూర్ చేయబడిన వారి వయస్సు, జీవనశైలి అలవాట్లు, ఆరోగ్యం మొదలైన వివిధ అంశాలకు లోబడి ఉంటాయి (వర్తిస్తే). అమ్మకం తర్వాత జారీ, నాణ్యత, సేవలు, నిర్వహణ మరియు ఏవైనా క్లెయిములకు BFL ఎటువంటి బాధ్యతను కలిగి ఉండదు. ఈ ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. ఈ ఉత్పత్తి కొనుగోలు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఏదైనా మూడవ పార్టీ ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయడానికి బిఎఫ్ఎల్ తన కస్టమర్లలో ఎవరినీ బలవంతం చేయదు.”

మీకు తెలుసా, రుణాలు మరియు క్రెడిట్ కార్డులపై మెరుగైన డీల్ పొందడానికి మంచి సిబిల్ స్కోర్ మీకు సహాయపడుతుందని?