కార్ ఇన్సూరెన్స్ - ఓవర్‍వ్యూ

ఒక కార్ ఇన్సూరెన్స్ ప్రమాదము, దొంగతనము, లేదా ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగిన ఫైనాన్షియల్ నష్టాన్ని కాంపెన్సేట్ చేయగలదు. మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ ఆధారంగా, మీరు థర్డ్-పార్టీ ఆస్తి నష్టం, పర్సనల్ గాయాలు లేదా మరణం కోసం కూడా కవర్ చేయబడవచ్చు.

కారు ఇన్స్యూరెన్స్ రకాలు


భారతదేశంలో రెండు రకాలైన కార్ ఇన్సూరెన్స్ లు లభిస్తున్నాయి:

 1. సమగ్ర ఇన్సూరెన్స్

 2. మీ కారు కొలైషన్ లేదా ఒక వడగండ్ల వాన లేదా విధ్వంసం కారణంగా పాడైతే ఎలా? కాంప్రిహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ వీటిని మాత్రమే కాకుండా మరెన్నిటినో కవర్ చేస్తుంది. అలాగే ఒక దొంగతనం, అగ్నిప్రమాదం, హానికరమైన చర్య లేదా ప్రకృతి వైపరీత్యం వలన జరిగే నష్టానికి కూడా మీరు కాంపెన్సేట్ చేయబడతారు.

 3. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్

 4. ప్రమాదంలో మీ బాధ్యత ఉన్నట్లయితే, థర్డ్ పార్టీకి జరిగిన నష్టానికి పరిహారం మీరే చెల్లించవలసి ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇటువంటి పరిస్థితిలో మిమ్మల్ని కవర్ చేస్తుంది. ఇది ఇతరుల వాహనాలు మరియు ఆస్తికి మీ కారు వలన కలిగే నష్టం కోసం చెల్లిస్తుంది. అయితే, మీరు తప్పుగా ఉంటే మీ కారుకు నష్టపరిహారం ఇది కవర్ చేయదు.

కార్ ఇన్సూరెన్స్ తరచుగా అడిగే ప్రశ్నలు FAQలు

నేను కారు ఇన్సూరెన్స్ ను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చా?

అవును, మీరు కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. నిజానికి, కార్ బీమా ఆన్‌లైన్లో కొనుగోలు చేయడం వేగవంతమైనది మరియు సులభమైనది. మీ కార్ ఇన్సూరెన్స్ కొటేషన్ వివరాలను వేగంగా పొందడానికి మీ వ్యక్తిగత వివరాలు మరియు కార్‌కి సంబంధించిన వివరాలను అందిస్తే సరిపోతుంది. కార్ ఇన్సూరెన్స్ కొరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

నా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవచ్చా?

అవును, మీరు మీ మోటార్ పాలసీని ఆన్‌లైన్‌లో సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. ఇంకా, పాలసీని రెన్యూ చేస్తే మీకు నో క్లెయిమ్ బోనస్ లేదా NCB (వర్తిస్తే ) మరియు ప్రత్యేకమైన ఆన్‌లైన్ తగ్గింపులు లభిస్తాయి.

కార్ ఇన్సూరెన్స్ పై డిస్కౌంట్ అందుబాటులో ఉందా?

అవును, బజాజ్ అలియన్స్ వంటి ఇన్స్యూరర్స్ అప్పుడప్పుడు కార్ ఇన్సూరెన్స్ పై డిస్కౌంట్స్ మరియు డీల్స్ అందిస్తారు. ప్రస్తుతం వారు అందించే ఉత్తమ డీల్స్ కోసం వారి వెబ్సైట్ ను చెక్ చేయవచ్చు.

నాకు కార్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం ?

మీరు రోడ్లపై డ్రైవ్ చేస్తుంటే, మీకు కార్ ఇన్సూరెన్స్ కావాలి. ఎందుకంటే:

 1. తప్పనిసరి చట్టం: మోటారు వాహనాల చట్టం 1988 కింద ఇది కారు బీమా లేకుండా భారతీయ రహదారులపై డ్రైవ్ చేయడానికి చట్టవిరుద్ధం.

 2. ఊహించని ఖర్చులు: కార్ ప్రమాదము అనేది ఎదురుచూడని ఒక సంఘటన, దీనికి భారీ మొత్తం లో ఖర్చులు కావచ్చు. కార్ ఇన్స్యూరెన్స్ లేకపోతే మీ సేవింగ్స్ పై ప్రభావం పడి మీకు నగదు కొరత ఏర్పడవచ్చు.

 3. థర్డ్ ప్రమాదాలు: వేరేవారి ఆస్తి లేదా వాహనాన్ని డీకొట్టడంవల్ల పాడుచేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు. మీరు కారు బీమాను కలిగి ఉంటే మీకు ఏవైనా అవాంతరాలు లేకుండా మూడవ పార్టీ నష్ట పరిహారం పొందవచ్చు.

కార్ ఇన్సూరెన్స్ పాలసీ దేనిని కవర్ చేస్తుంది ?

అది మీరు ఎంచుకున్న కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. సమగ్ర కారు భీమా మిమ్మల్ని కిందివాటి కోసం కవర్ చేయవచ్చు:

 • ప్రమాదం వలన నష్టం
 • వరదలు, హరికేన్, మెరుపు, భూకంపం, కొండచరియలు, వడగళ్ళు తుఫాను మొదలైనవి వంటి ప్రకృతి వైపరీత్యాలు (యాక్ట్ ఆఫ్ గాడ్) కారణంగా వాటిల్లిన నష్టం.
 • అగ్ని లేదా సెల్ఫ్-ఇగ్నీషన్ వలన నష్టం
 • దొంగతనం, అల్లర్లు, లేదా ఏదైనా హానికరమైన లేదా తీవ్రవాద కార్యకలాపాలు కారణంగా నష్టం
 • రోడ్, రైల్, ఇన్లాండ్ వాటర్‍వే, లిఫ్ట్, ఎలివేటర్ లేదా గాలి రవాణా వలన జరిగిన నష్టం
 • భీమా చేయబడిన కార్‌ యొక్క యజమాని/డ్రైవర్ ‌కి అయ్యే గాయాలకు యాక్సిడెంట్ కవర్
 • మరణం లేదా శాశ్వత వైకల్యం కోసం పరిహారం

థర్డ్ పార్టీ లయబిలిటీలను కూడా కార్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఇందులో:

 • మీ ఇన్స్యూర్డ్ కార్ వలన ఒక పబ్లిక్ ప్లేస్ లో జరిగిన వాహనం లేదా అస్తి నష్టం
 • ఒక ప్రమాదం వలన థర్డ్ పార్టీ డ్రైవర్ కు జరిగిన గాయాలు

ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీ వేటిని కవర్ చేయదు ?

ఈ కింది కారు ఇన్సూరెన్స్ కింద వర్తించవు:

 • మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ వైఫల్యాలు
 • కార్ యొక్క తరుగుదల లేదా సాధారణ అరుగుదల
 • మద్యం/డ్రగ్స్ ప్రభావంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు జరిగిన నష్టం
 • చెల్లుబాటు అయ్యే ఒక లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నప్పుడు జరిగిన నష్టం
 • కార్ ను హైర్ లేదా రివార్డ్ కోసం, ఆర్గనైస్డ్ రేసింగ్ లేదా స్పీడ్ టెస్టింగ్ మొదలైన వాటి కోసం ఉపయోగించినప్పుడు జరిగిన నష్టం.
 • ఒక ప్రమాదం వలన కాకుండా మరొక విధంగా పాడైన టైర్
 • దొంగతనం కారణంగా కార్ ఉపకరణాలు కోల్పోవడం

కార్ ఇన్సూరెన్స్ ను ఆన్‍లైన్ లో కొనడం వలన ప్రయోజనాలు ఏమిటి ?

కార్ ఇన్సూరెన్స్ కొనడం కోసం వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి భౌతికంగా బ్రోచర్లు సేకరించడం, వాటి పోల్చి చూడటాన్ని ఊహించుకోండి. చాలా అలసటతో కూడుకున్నది కదా? మీరు ఆన్‍లైన్ లో కార్ ఇన్సూరెన్స్ కొనడం వలన మరెన్నో పొందగలరు, అవి:

 • సులభమైన పోలిక: ఆన్‍లైన్ కార్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు వాటి ధరలను సులభంగా పోల్చి చూసి పరిశోధించే అవకాశాన్ని ఇస్తుంది. మీరు కస్టమర్ సమీక్షలను చదవవచ్చు, సమాచారాన్ని షేర్ చేయవచ్చు లేదా ఇన్సూరెన్స్ కంపెనీని నేరుగా ప్రశ్నలు అడగవచ్చు.
 • సౌలభ్యం: ఈ రోజులలో సౌలభ్యం అనేది చాలా పెద్ద ఆవశ్యకత. కార్ ఇన్సూరెన్స్ ను ఆన్‍లైన్ లో కొనే సదుపాయం ఉంటే, మీరు ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్తూ మీరు సమయాన్ని శ్రమను ఎందుకు వృధా చేసుకుంటారు ?
 • సులభ అప్లికేషన్: ఇన్సూరెన్స్ సంస్థలు ఈ రోజుల్లో ఆన్లైన్లో కారు ఇన్సూరెన్స్ కొనుగోలు కోసం అతుకులు లేని ఒక ఆన్‍లైన్ దరఖాస్తు ప్రక్రియను అందిస్తాయి. ఆన్ లైన్ అప్లికేషన్ ఫారంలు వేగంగా, సులభంగా మరియు స్వీయ మార్గనిర్దేశనం చేసేలా ఉంటాయి. తప్పులు రావడానికి చాలా తక్కువ అవకాశాలుంటాయి, మీ దరఖాస్తును ఎప్పుడైనా సమీక్షించుకోవచ్చు.
 • చెల్లింపుల సౌలభ్యం: మీరు ఆన్లైన్లో కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు మీరు చెల్లింపు కోసం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, స్మార్ట్ కార్డు మొదలైనవాటి వంటి మల్టిపుల్ ఆప్షన్లు పొందుతారు.
 • డిస్కౌంట్స్ మరియు డీల్స్: చాలా సార్లు ఆన్‍లైన్ కార్ ఇన్సూరెన్స్ అప్లికెంట్స్ కోసం ప్రత్యేకమైన డిస్కౌంట్స్ మరియు డీల్స్ అందుబాటులో ఉంటాయి.

మీరు కార్ అమ్మినప్పుడు కార్ ఇన్సూరెన్స్ బదిలీ చేసే ప్రాసెస్ ఏమిటి ?

ప్రమేయంగల దశలు ఇక్కడ ఉన్నాయి:

స్టెప్ 1: మీకు నో క్లెయిమ్ బోనస్ (NCB) అర్హత ఉంటే, కార్ ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ చేసే ముందే క్లెయిమ్ చేసుకోండి. కొత్త యజమాని NCBని క్లెయిమ్ చేయలేరు.
స్టెప్ 2: కార్ రిజిస్ట్రేషన్ మరియు పత్రాలు ట్రాన్స్ఫర్ అయిన తరువాత కొత్త యజమానికి NOC ఇవ్వండి.
స్టెప్ 3: కార్ ట్రాన్స్ఫర్ పత్రాలు, NOC సర్టిఫికేట్, మరియు నూతన అప్లికేషన్ ఫారంతో ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించమని కొత్త యజమానికి సూచించండి.
స్టెప్ 4: ఇన్సూరెన్స్ కంపెనీ కారును పరిశీలించి నూతన యజమానికి కార్ ఇన్సూరెన్స్ పాలసీని ట్రాన్స్ఫర్ చేస్తుంది.

కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి మరిన్ని FAQలు చదవండి