• హోమ్ లోన్ అనేది ఎవరైనా వ్యక్తి, బ్యాంక్ నుండి లేదా ఋణమిచ్చే సంస్థలనుండి ఒక నిర్ధారిత వడ్డీ రేటుపై, తిరిగి ప్రతినెలా EMI రూపంలో చెల్లించేలా పొందే మొత్తం. ఋణమిచ్చే సంస్థలు ఈ ఆస్తిని, వారిచ్చే హోమ్ లోన్ కు సెక్యూరిటీగా ఉంచుకొంటారు.
• ఆ ఆస్తి స్వభావరీత్యా కమర్షియల్ లేదా పర్సనల్ గానీ అయి ఉండవచ్చు.
• అప్పు తీసుకున్నవారు బాకీలను చెల్లించలేకపోతే, సదరు ఆస్తిని విక్రయించడం ద్వారా బాకీ ఉన్న లోన్ మొత్తాన్ని రికవర్ చేసుకునేందుకు అప్పు ఇచ్చినవారికి అన్ని చట్టపరమైన హక్కులు ఉంటాయి.
హోమ్ లోన్ల రకాలు:
• హోమ్ పర్చేజ్ లోన్: ఇది ఎవరైనా, ఒక ఇల్లు కొనుగోలు చేయడానికి తీసుకునే లోన్.
• హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్: ఈ లోన్ మీ ఇంటికి రిపెయిర్లు లేదా రెనొవేషన్ కు సంబంధించిన ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.
• గృహ నిర్మాణ లోన్: ఇది మీరు కొత్త ఇల్లు కట్టుకొనే సమయంలో అవసరానికి ఉపయోగపడుతుంది.
• భూమి కొనుగోలు లోన్: ఎవరైనా అతని/ఆమె స్వంత ఇల్లు నిర్మించుకోవడానికి ప్లాట్ కొనుక్కోదలిస్తే ఈ లోన్ని వినియోగించుకోవచ్చు.
• హోమ్ ఎక్స్టెన్షన్ లోన్: మీరు మీ ఇంటికి మరొక గది, గ్యారేజి, బాత్ రూమ్ లేదా వంట గదిని జోడించాలనుకుంటే. అప్పుడు మీరు అప్లై చేయవలసిన లోన్ ఇది మరియు ఒకవేళ మీరు మరొక అంతస్తు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తుంటే కూడా ఈ లోన్ ఉపయోగపడుతుంది.