లైఫ్ ఇన్సూరెన్స్ పై తరచుగా అడగబడే ప్రశ్నలు | బజాజ్ ఫిన్సర్వ్|లైఫ్ ఇన్సూరెన్స్ పై తరచుగా అడగబడే ప్రశ్నలు | బజాజ్ ఫిన్సర్వ్

తరచుగా అడగబడే ప్రశ్నలు

ఒక ఇన్సూరెన్స్ పాలసీకి మైనర్ నామినీగా ఉండవచ్చా?

అవును, ఒక పాలసీకి మైనర్ నామినీగా ఉండవచ్చు. అయితే, అతనికి లేదా ఆమెకు ఒక అపాయింటీ రూపములో చట్టపరమైన సంరక్షకుడు ఉండాలి.

ఇన్సూరెన్స్ పాలసీలో నేను నా నామినీని మార్చవచ్చా?

అవును, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ గా మీరు పాలసీ మెచ్యూరిటి తేదీకి ముందు ఏ సమయములో అయినా మీ నామినేషన్ ను మార్చవచ్చు

మార్కెట్ లో ఉన్న వివిధ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ రకాలు ఏమిటి?

ఇన్సూరెన్స్ పాలసీలు స్థూలంగా లైఫ్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్టులుగా వర్గీకరించబడ్డాయి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రాణ నష్టానికి ఆర్ధిక రక్షణను అందిస్తాయి. జనరల్ ఇన్సూరెన్స్ వైద్య అత్యవసరాలు, యాక్సిడెంట్లు, ఇల్లు, ప్రయాణము, ఆటోమొబైల్స్ మొదలైన ప్రాణ నష్టము లేని సంఘటనలకు ఆర్ధిక రక్షణను అందిస్తాయి.

ఇన్సూరెన్స్ కోసం నా అవసరాన్ని నేను ఎలా నిర్ధారించుకోగలను లేదా పరిమాణాన్ని ఎలా నిర్ణయించుకోగలను?

మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ కవర్ విలువ రక్షణ కోసం మీ అవసరము పై ఆధారపడి ఉండాలి. మీరు ఆస్తి ఇన్సూరెన్స్ కోసం అప్లై చేస్తుంటే, విలువ ఆ ఆస్తిని తిరిగి భర్తీ చేసే ఖర్చును కవర్ చేసేదిగా ఉండాలి. అలాగే, మీరు మరణించిన సందర్భములో మీ కుటుంబము ఎదుర్కొనే నష్టానికి పరిహారంగా ఒక టర్మ్ ప్లాన్ యొక్క ఫైనల్ పేఅవుట్ ఉండాలి. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (ULIP), ఎండోమెంట్ లేదా హోల్ లైఫ్ పాలసీలు మె మొత్తం ఫైనాన్సియల్ ప్లాన్ కు సరిపోయేవిగా ఉండాలి మరియు మీరు ఉపయోగించాలి అని అనుకున్నప్పుడు మీరు ఫండ్స్ అందుకునేలాగా ఉండాలి.

నాకు ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

ఇన్సూరెన్స్ ఒక వ్యక్తికి, ఒకరి కుటుంబానికి మరియు ఆస్తులకు మరణం, ప్రమాదం, అనారోగ్యం మొదలైన దురదృష్టకరమైన సంఘటనలలో ఆర్ధిక రక్షణను అందించడమే లక్ష్యంగా కలిగి ఉంటుంది. ఒక టర్మ్ ప్లాన్ వంటి ఒక క్లాసిక్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు మరణించడం వంటి దురదృష్టకరమైన సందర్భములో మీ కుటుంబానికి ఆర్ధిక సహకారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఈనాటి ఆధునిక ఇన్సూరెన్స్ పాలసీలు మీ సంపద నిధిని పెంచుకొనుటకు, పదవీవిరమణ కోసం ప్రణాళిక, మీ ఇంటిని మరియు అందులోని పర్సనల్ వస్తువులను రక్షించడం, వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్, ఆసుపత్రి బిల్లులు మొదలైన వాటన్నిటికి సహాయము చేయుటకు ఏర్పాటు చేయబడ్డాయి.

లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ చేయదగిన వ్యక్తి యొక్క మరణం వంటి దురదృష్టకర పరిస్థితుల విషయంలో ఆర్ధిక రక్షణను అందించే ఒక ఉద్దేశం.