చిత్రం

కీ రీప్లేస్‍‍మెంట్ ఇన్సూరెన్స్

ఓవర్‍వ్యూ

మీ ఇంటి లేదా కార్ తాళం చెవిని పోగొట్టుకున్నారా? ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఒక కీ రీప్లేస్‍‍మెంట్ పాలసీని ఎంచుకోండి. ఇల్లు మరియు వాహనం తాళాల నష్టం లేదా చోరీ, తాళాలు బాగుచేసే వ్యక్తి ఖర్చులు మరియు తాళం చెవి రీప్లేస్‍‍మెంట్ ఖర్చుల కోసం కవరేజ్ అందుకోండి.

కీ రీప్లేస్‍‍మెంట్ ఇన్సూరెన్స్ యొక్క ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • మీ ఇల్లు లేదా వాహనం కోసం డూప్లికేట్ తాళం చెవులు తయారు చేయుటకు కవరేజ్ అందుకోండి

 • తాళాల రీప్లేస్‍‍మెంట్ కోసం అయిన కూలి ఖర్చు కోసం రీఎంబర్స్మెంట్ అందుకోండి

 • ఒకవేళ మీ వాహనం యొక్క తాళం చెవి రీప్లేస్‍‍మెంట్ కోసం 24 గంటల కంటే ఎక్కువ సమయం పడితే, బాడుగ కార్ యొక్క ఖర్చును రీఎంబర్స్మెంట్ అందుకోండి.

 • సులభమైన మరియు అవాంతరాలు-లేని క్లెయిమ్ ప్రాసెస్

 • కీ రీప్లేస్‍‍మెంట్ ఇన్సూరెన్స్ - పాలసీ కవరేజ్

 • తాళం చెవుల రీప్లేస్‍‍మెంట్

  మీ ఇల్లు మరియు వాహనం తాళం చెవుల రీప్లేస్‍‍మెంట్ ఖర్చు యొక్క రీఎంబర్స్మెంట్. మీరు ఒక కొత్త తాళం చెవిని తయారు చేయటానికి తాళాలు బాగు చేసే వ్యక్తికి చెల్లించిన మొత్తానికి మాత్రమే కవర్ అందుబాటులో ఉంటుంది.

 • బ్రేక్-ఇన్ ప్రొటెక్షన్

  ఒకవేళ ఎవరైనా మీ వాహనం డోర్లు పగులుగొట్టి చొరబడితే, దాని తాళాలు మరియు తాళం చెవులు మార్చుకునే ఖర్చులను కీ రీప్లేస్‍‍మెంట్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అయితే మేము తాళం ఖర్చును కవర్ చేయము అని గుర్తుంచుకోండి. మేము ఆ తాళాన్ని మార్చేందుకు అయ్యే కూలీ ఖర్చులను మాత్రమే కవర్ చేస్తాము.

 • లాకవుట్ అయిన సందర్భంలో రీఎంబర్స్మెంట్

  ఒకవేళ మీరు మీ ఇల్లు లేదా కార్ బయట లాక్ అయిపోయి ఉంటే, ఒక తాళాలు బాగు చేసే వ్యక్తిని తీసుకొచ్చే ఖర్చును కూడా మేము రీఎంబర్స్ చేస్తాము.

 • రెంటల్ కార్ రీఎంబర్స్మెంట్

  కొన్నిసార్లు తాళం చెవి మార్చే పని 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ఇలాంటి పరిస్థితులలో మేము బాడుగ కార్ ఖర్చును కవర్ చేస్తాము.

 • కీ రీప్లేస్‍‍మెంట్ - మేము కవర్ చేయనవి

 • పైన పేర్కొనబడిన ఖర్చులు కాకుండా మరే ఇతర ఖర్చు

 • మీ ప్రధాన ఇల్లు కాకుండా వేరొక ఇంటి తాళం చెవులు పోగొట్టుకున్నప్పుడు ఉండే ఖర్చులు. రెండవ ఇంటిని కవర్ చేయుటకు మీరు వేరొక పాలసీ తీసుకోవాలి.

 • మీరు వ్యక్తిగత వినియోగానికి ఉపయోగించని వాహనం యొక్క తాళం చెవులు రీప్లేస్‍‍మెంట్ కోసం అయిన ఖర్చు

 • కీ రీప్లేస్‍‍మెంట్ ఇన్సూరెన్స్ ప్రస్తుత వినియోగదారులకు మాత్రమే

కీ రిప్లేస్‌మెంట్ ఇన్సూరెన్స్ కొరకు అవసరమైన డాక్యుమెంట్లు

•    తాళాలు పగులుగొట్టిన క్లెయిమ్స్ లో రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేయుటకు కవర్ చేయబడిన సమయంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుపుతూ అధికారిక పోలీస్ FIR

ఒక ప్రమాదం జరిగిన తరువాత లేదా తాళం చెవి పోయిన తరువాత ఏమి చేయాలి

• 1800-11-9966 వద్ద మాకు కాల్ చేయండి
• ప్రత్యామ్నాయంగా, నష్టాన్ని కనుగొన్న 24 గంటలలోపు ఒక వ్రాతపూర్వక సూచన లేఖను సమర్పించండి
• ఇది మీరు ఒక క్లెయిమ్ చేయుటకు మరియు అవసరమైన ఫారంలు మరియు సూచనలను పొందుటకు సహాయపడుతుంది
• తాళం చెవి పోగొట్టుకోవటం లేదా పగులగొట్టే ప్రయత్నము జరిగిందని కనుగొన్న 24 గంటలలోపు పోలీస్ స్టేషన్ లో FIR ఫైల్ చేయాలి.
• క్లెయిమ్ ఫారంలు పూర్తి చేయండి మరియు జతచేయబడిన డాక్యుమెంట్లతో సహా మాకు తిరిగి ఇవ్వండి.
• ఇందులో పోలీస్ రిపోర్టులు, తాళాలు మరియు తాళం చెవులు మార్చుటకు అయిన ఖర్చు రసీదులు, మరియు కంపెనీ అడిగే ఇతర డాక్యుమెంట్లు ఉంటాయి.
• క్లెయిమ్ ఫారంలను కంపెనీకి 3 రోజులలో సమర్పించండి
 

క్లెయిమ్ ప్రాసెస్

•    మీరు తాళం చెవి పోగొట్టుకుంటే, మీరు పాలసీ డాక్యుమెంట్లో అందించబడిన ఫోన్ నంబర్ పై ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేయవచ్చు.
• సంఘటనలను వివరిస్తూ వ్రాతపూర్వక అప్లికేషన్ ను సమర్పించాలి.
• ఒకవేళ ఎవరైనా మీ ఇంటిని లేదా వాహనాన్ని డోర్లు పగులగొట్టి చొరబడితే , సంఘటన జరిగిందని కనుగొన్న 24 గంటలలోపు మీరు పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు ఫైల్ చేయాలి మరియు FIR కాపీ పొందాలి.
• డాక్యుమెంట్ల కాపీలను (పోలీస్ FIR) కంపెనీకి సమర్పించాలి
• ఈలోపు, తాళం చెవి రీప్లేస్‍‍మెంట్ ఖర్చులు, తాళాలు బాగు చేసే వ్యక్తికి చెల్లించిన ఛార్జీలు మొదలైన వాటి రసీదులను సేకరించండి.
• రీప్లేస్‍‍మెంట్ ఖర్చుల రీఎంబర్స్మెంట్ పొందుటకు రసీదులను కంపెనీకి సమర్పించాలి