నాకు హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం? మీరు మీ కలల సౌధాన్ని నిర్మించుకోవడంలో ఎల్లప్పుడూ ఆనందం పొందారు. మీకు మరియు మీ కుటుంబానికి ఒక మంచి నివాసాన్ని బహుమతిగా ఇచ్చేందుకు మీరు ప్రతి రూపాయి కూడబెట్టారు, కష్టపడ్డారు మరియు పాటుపడ్డారు. మీ కలలను సురక్షితం చేసుకొనుటకు మీరు మీ ఇంటికి మరియు అందులోకి వస్తువులను అగ్నిప్రమాదం, బాహ్య పరిస్థితులు, దొంగతనం, మొదలైన వాటి నుండి రక్షించేందుకు ఇన్సూరెన్స్ తో రక్షణ కలిగించాలి. మీ ఇంటిని ప్రమాదాల నుండి, ఎదురుచూడని విపత్తుల నుండి కాపాడేందుకు మీకు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేకపోతే మీరు ప్రయాణించే సమయంలో ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మీ ఇంట్లోని వస్తువుల కవర్ కోసం మీరు హోమ్ ప్రొటెక్షన్ కవర్ తీసుకోవాలి.
దోపిడీ అంటే దొంగతనం చేయడం కోసం ప్రాంగణంలోకి బలవంతంగా చొరబడటం. ప్రాంగణంలోకి బలవంతంగా చొరబడకుండా దొంగతనం చేయడాన్ని దొంగతనం అంటారు. చిల్లరదొంగతనం అంటే ఆ ప్రాంగణంలో తెలిసిన వ్యక్తి ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వస్తువులను దొంగతనం చేయడం లేదా దోచుకోవడం.
యాజమాన్యము బదిలీ క్రియాశీలకం అయిన సమయం నుండి, పాలసీ రద్దు అయినట్లు పరిగణించబడుతుంది మరియు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి అప్పటి నుండి పాలసీ ప్రకారం ఇన్సూర్ చేయబడిన వ్యక్తిగా ఉండరు. ఇన్సూర్ చేయబడిన కాలములో మిగిలిన కాలానికి చెందిన ప్రీమియం రిఫండ్ చేయబడుతుంది.
దొంగిలించబడిన వస్తువుల విలువను పేర్కొంటూ ఒక ఇన్వాయిస్ సబ్మిట్ చేయాలి. దీనితోపాటు మీరు మార్పిడి ఖర్చు/మరమ్మత్తు ఖర్చు, FIR, ఫైనల్ పోలీస్ రిపోర్ట్ మరియు క్లెయిమ్ ఫారం కూడా ఇవ్వాలి.
ఈ పాలసీలో అగ్ని ప్రమాదము, తుఫాను, సుడిగాలి, తీవ్రమైన గాలివాన, మెరుపులు, నేల కుంగిపోవడం మరియు ల్యాండ్ స్లైడ్స్, వరదలు మరియు ఉప్పెనలు, భూకంపాలు, అల్లర్లు, సమ్మెలు, హానికరమైన మరియు తీవ్రవాద నష్టాలు (ఐచ్ఛిక కవర్), విస్ఫోటనం/పేలుళ్ళు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవకల్పిత సంఘటనల కారణంగా భవనానికి సంభవించే నష్టాలు కవర్ అవుతాయి. పాలసీ మీ ఇంటి భవనములోని వస్తువులు, ఉపకరణాలు, విలువైన వాటిని అగ్నిప్రమాదము మరియు సంబంధిత ప్రమాదాలు, తీవ్రవాద నష్టముతో సహా (ఐచ్ఛిక కవర్), దోపిడీలతో సహా భూకంపాలు, హౌస్ బ్రేకింగ్, హోల్డ్-అప్ మరియు యాంత్రిక/విద్యుత్ ఉపకరణాల బ్రేక్డౌన్ మొదలైన వాటి నుండి రక్షణ కల్పిస్తుంది.