ఓవర్‍వ్యూ: థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్

చాలా సందర్భాలలో, ప్రమాదాలలో థర్డ్-పార్టీ ప్రమేయం కూడా ఉంటుంది. మీ టూ-వీలర్ ఇతరుల వాహనాలకు మరియు ఆస్తులకు కలిగించిన నష్టాల కోసం చెల్లించడం చాలా ఒత్తిడితో మరియు ఖర్చుతో కూడుకున్నది. ఈ విధంగా థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ మోటార్ వాహనాల చట్టం, 1988 ప్రకారం తప్పనిసరి మరియు సిఫారసు చేయబడుతుంది.

టూ-వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ద్వారా మీరు కవర్ అయి ఉంటే మీరు సమయం, డబ్బు మరియు ఒత్తిడిని ఆదా చేసుకోగలుగుతారు. ఇది ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఉత్పన్నం అయ్యే చట్టపరమైన లయబిలిటీల కోసం చెల్లించే ఒక రకమైన రిస్క్ కవర్.

ఒక 2 -వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ తో, మీరు ఇతరుల వాహనాలు మరియు ఆస్తికి జరిగిన నష్టాల నుండి కవర్ చేయబడతారు. అంతేకాకుండా, ఇన్సూర్ చేయబడని డ్రైవర్స్ ద్వారా మీ టూ-వీలర్ కు కలిగిన నష్టాల కోసం కూడా కవర్ చేయబడతారు.

ఫీచర్లు మరియు ప్రయోజనాలు

 • • ఎలాంటి ఫైనాన్షియల్ బాధ్యత లేదు

  థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ మీ ఇన్సూర్ చేయబడిన టూ వీలర్ ఒక వ్యక్తికి, వాహనానికి, లేదా ఆస్తికి కలిగించిన నష్టాల కోసం మీ ఫైనాన్షియల్ లయబిలిటి ని కవర్ చేస్తుంది. ఈ ఖర్చులన్నిటిని మీ జేబు నుండి చెల్లించడం ఒక పెద్ద ఫైనాన్షియల్ భారం కావచ్చు.

 • • ఆన్‍లైన్ ప్రాసెసింగ్

  కేవలం కొన్ని డాక్యుమెంట్స్ తో మీరు ఆన్‍లైన్ లో థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. ఇది మీ ఇన్స్యూర్డ్ వాహనాన్ని కవర్ చేయదు కాబట్టి ఈ ప్రాసెసింగ్ వేగవంతమైనది మరియు చాలా కొద్ది సమయం తీసుకుంటుంది.

 • • సరసమైన ఎంపిక

  టూ-వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇతర ఇన్సూరెన్స్ కవర్స్ మరియు యాడ్-ఆన్స్ తో పోలిస్తే చాలా చవకైనది. ఈ విధంగా చిన్న ప్రీమియం మొత్తం చెల్లించి మీరు అధిక రిస్క్ కవర్ అందుకుంటారు.

 • • మనశ్శాంతి

  టూ-వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇతర ఇన్సూరెన్స్ కవర్స్ మరియు యాడ్-ఆన్స్ తో పోలిస్తే చాలా చవకైనది. ఈ విధంగా చిన్న ప్రీమియం మొత్తం చెల్లించి మీరు అధిక రిస్క్ కవర్ అందుకుంటారు.

థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ లో ఏమేమి కవర్ అవుతాయి ?

కాంప్రిహెన్సివ్ థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ లో ఈ క్రింది అంశాలు కవర్ అవుతాయి:

 •  

  థర్డ్ పార్టీ మరణం లేదా గాయాలు: ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు, ప్రమాదంలో మీ ఇన్సూర్ చేయబడిన టూ-వీలర్ వలన ఎవరైనా గాయపడినా లేదా మరణించినా, థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ ఉపయోగించవచ్చు. వైద్య ఖర్చులు లేదా వైకల్యం వలన ఆదాయం నష్టం లేదా మరణం ఈ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేయవచ్చు. శారీరిక వైకల్యాల వలన ఆదాయం నష్ఠం కోసం పరిహారం కూడా క్లెయిమ్ చేయవచ్చు.

 •  

  థర్డ్ పార్టీ ఆస్తి నష్టం: ఒకవేళ మీ టూ-వీలర్ థర్డ్-పార్టీ ఆస్తికి నష్టం కలిగిస్తే, థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ఉపయోగించి ఆ ఖర్చులను చెల్లించవచ్చు. IRDA ప్రకారం ఈ థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 1 లక్షల వరకు థర్డ్-పార్టీ ఆస్తి నష్టం కవర్ చేయబడాలి.

 •  

  ఇన్సూర్ చేయబడిన టూ-వీలర్ యజమాని లేదా రైడర్ మరణం: ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు, ప్రమాదంలో ఇన్సూర్ చేయబడిన టూ-వీలర్ యజమాని లేదా రైడర్ మరణిస్తే, తద్వారా సంభవించే అకస్మాత్ ఆదాయం నష్ఠం కోసం వారిపై ఆధారపడిన వారికి పరిహారం చెల్లించబడుతుంది.

 •  

  ఇన్సూర్ చేయబడిన టూ-వీలర్ యజమాని లేదా రైడర్ కు శాశ్వత సంపూర్ణ వైకల్యం: ఒక దురదృష్టకరమైన సంఘటనలో జరిగిన ప్రమాదంలో ఇన్సూర్ చేయబడిన టూ-వీలర్ యజమాని లేదా రైడర్ శాశ్వత సంపూర్ణ వైకల్యానికి గురి అయితే, అకస్మాత్ ఆదాయం నష్టానికి వారికి పరిహారం చెల్లించబడుతుంది.

థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ లో కవర్ కానిది ఏది ?

కాంప్రిహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ మీకు లేదా ఒక మూడవ పార్టీకి నష్టాలను కవర్ చేస్తుంది. అయితే, టూ-వీలర్ ఇన్సూరెన్స్ లో వర్తించని కొన్ని మినహాయింపులు ఉన్నాయి:

 •  

  అతివేగం వలన టూ-వీలర్ కు జరిగిన నష్టం.

 •  

  తాళాలు పోగొట్టుకోవడం లేదా మద్యం లేదా డ్రగ్స్ ప్రభావంలో డ్రైవ్ చేయడం వంటి బాధ్యత లేని ప్రవర్తన వలన జరిగిన నష్టాలు.

 •  

  పేర్కొనబడిన భౌగోళిక ప్రదేశం వెలుపల టూ-వీలర్ కు జరిగిన నష్ఠం లేదా థర్డ్ పార్టీ లయబిలిటి.

 •  

  ఒక అనధికార రైడర్ లేదా తక్కువ వయసు ఉన్న రైడర్ కారణంగా టూ-వీలర్ కు జరిగిన నష్టం.

 •  

  యాంత్రిక లేదా ఎలెక్ట్రికల్ వైఫల్యం.

 •  

  ద్విచక్ర-వాహనం పేర్కొనబడిన ఉద్దేశాల కోసం కాకుండా వేరొక వాటికి ఉపయోగించబడితే. ఇన్సూరర్ కు తెలియజేయకుండా ఆ ద్విచక్ర-వాహనాన్ని వాణిజ్య పనుల కొరకు ఉపయోగించడం వంటివి.

 •  

  యుద్ధం, ఆక్రమణ, తీవ్రవాద చర్య, అల్లర్లు లేదా అణ్వాయుధాల వలన కలిగే నష్టం, లయబిలిటి.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హెల్త్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ - అత్యవసర వైద్య పరిస్థితుల నిమిత్తం అయ్యే ఖర్చుల నుండి రక్షణ

అప్లై
లైఫ్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

లైఫ్ ఇన్సూరెన్స్ - అత్యవసర పరిస్థితులలో వైద్యపరమైన ఖర్చులకు బాసటగా నిలుస్తుంది

అప్లై
మోటార్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

మోటార్ ఇన్సూరెన్స్ - పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తో మీ కారు లేదా 2-వీలర్‌‌కి రక్షణ

అప్లై
కార్ ఇన్సూరెన్స్

తెలుసుకోండి

కార్ ఇన్సూరెన్స్ - మీ కార్‌కి థర్డ్ పార్టీ కవరేజ్‌తో పాటు సమగ్రమైన ‌ఇన్సూరెన్స్‌ను పొందండి

అప్లై