సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?

2 నిమిషాలలో చదవవచ్చు

మీ సిబిల్ స్కోర్ అనేది 300 మరియు 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య, ఇది మీ క్రెడిట్ విలువను సూచిస్తుంది. లోన్లు మరియు క్రెడిట్ కార్డులపై త్వరిత అప్రూవల్ మరియు మెరుగైన డీల్స్ పొందడానికి అధిక స్కోర్ మీకు సహాయపడుతుంది. చాలా బ్యాంకులు మరియు నాన్-బ్యాంకుల కోసం, రుణం అప్రూవల్ కోసం అవసరమైన కనీస క్రెడిట్ స్కోర్ 685 లేదా అంతకంటే ఎక్కువ.

అయితే, మీరు మీ సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోవడానికి ముందు సిబిల్ అర్థం మరియు క్రెడిట్ హెల్త్ పరంగా అది ఎందుకు ముఖ్యమోనని తెలుసుకోవడం కూడా చాలా అవసరం.

CIBIL యొక్క ఓవర్‍వ్యూ

సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఇది వ్యక్తులు మరియు సంస్థల క్రెడిట్ సంబంధిత కార్యకలాపాల రికార్డులను నిర్వహించడంలో నిమగ్నమై ఉన్న క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ.

బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మరియు ఇతర ఫైనాన్షియల్ సంస్థలు, కస్టమర్ల క్రెడిట్ సమాచారాన్ని బ్యూరోకు అందిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా, సిబిల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను(CIR) జారీ చేస్తుంది మరియు కస్టమర్‌కు క్రెడిట్ స్కోరును కేటాయిస్తుంది.

మరింత చదవండి: 550-600 సిబిల్ స్కోర్ కోసం పర్సనల్ రుణం

సాధారణంగా ఈ డాక్యుమెంట్‌ని మరియు సంబంధిత క్రెడిట్ స్కోర్‌ను సిబిల్ స్కోర్‌గా పిలుస్తారు, ఇది మీ క్రెడిట్ విలువను నిర్ణయిస్తుంది, మీరు మీ లోన్‌ను సకాలంలో చెల్లించే అవకాశం ఎంత మెరుగ్గా ఉందోనని రుణదాతకు తెలియజేస్తుంది. అధిక క్రెడిట్ స్కోర్, లోన్ డిఫాల్ట్ యొక్క తక్కువ సంభావ్యతను సూచిస్తుంది మరియు తక్కువ స్కోరు క్రెడిట్ యొక్క రిస్కీ ప్రవర్తనను సూచిస్తుంది.

సిబిల్ అనేది క్రెడిట్ సమాచారానికి నిక్షేపం అయితే, అది ఎలాంటి లోన్ కార్యకలాపాలలో పాల్గొనదని గమనించాలి. అయితే, ఇది బ్యాంకులు, రుణదాతలు దరఖాస్తుదారుని క్రెడిట్ ప్రొఫైల్‌ను గుర్తించడానికి అవసరమైన క్లిష్టమైన సమాచారాన్ని మరియు లోన్ తీసుకున్న మరింత విశ్వసనీయ చరిత్రను కలిగి ఉన్న కస్టమర్లను గుర్తించడానికి సహాయపడుతుంది.

CIBIL నుండి ఇతర సేవలు

కేవలం మీ క్రెడిట్ స్కోర్‌ కాకుండా సిబిల్ అనేది, ఇండివిడ్యువల్స్ మరియు కంపెనీల కోసం క్రెడిట్ రిపోర్టును కూడా అందజేస్తుంది.

మీ క్రెడిట్ రిపోర్ట్ లో మీ క్రెడిట్ స్కోర్ మరియు మీ రుణ చరిత్ర, రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ, రీపేమెంట్ డిఫాల్ట్స్ మరియు జాప్యాలు వంటి రికార్డ్ ఏదైనా ఉంటే వాటి గురించిన ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఈ రిపోర్ట్ మీ ఉద్యోగం మరియు సంప్రదింపు వివరాలకు సంబంధించిన డేటాను కూడా నిర్వహిస్తుంది.

ఒక వ్యక్తి యొక్క నివేదిక వలె కంపెనీల కోసం ఉన్న CIBIL నివేదిక కంపెనీ యొక్క క్రెడిట్ చరిత్ర గురించి వివరాలను కలిగి ఉంటుంది. ఇది ఇప్పటికే ఉన్న క్రెడిట్, ఏదైనా పెండింగ్‌లో ఉన్న లా సూట్లు అలాగే ఏవైనా బాకీ ఉన్న మొత్తాల గురించి డేటాను కలిగి ఉంటుంది. ఈ బ్యూరో ఆర్థిక సంస్థల నుండి ఈ డేటాను పొందుతుంది మరియు సమయానికి తగినట్లుగా దాన్ని నిర్వహిస్తుంది.

మీ రీపేమెంట్ చరిత్ర, క్రెడిట్ వినియోగ నిష్పత్తి మరియు ప్రస్తుత లోన్ల సంఖ్య వంటి అంశాలు మీ CIBIL స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి.

సంవత్సరానికి ఒకసారి మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయడం మంచి విధానంగా పరిగణించబడుతుంది.‌ బజాజ్ ఫిన్‌సర్వ్ వద్ద ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి. కేవలం కొన్ని ప్రాథమిక వివరాలను నమోదు చేయండి మరియు మీ స్కోర్ అలాగే మీ వ్యక్తిగతీకరించిన క్రెడిట్ హెల్త్ రిపోర్ట్‌కు యాక్సెస్ పొందండి.

మరింత చదవండి తక్కువ చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

సిబిల్ స్కోర్ 685 లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

మీ సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ హెల్త్ యొక్క కొలత. ఈ స్కోర్ 300 మరియు 900 మధ్య ఎక్కడైనా ఉంటుంది, 900 గరిష్ట క్రెడిట్ యోగ్యతను సూచిస్తుంది. మీ క్రెడిట్ రిపోర్ట్‌కు 685 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే ఇది ఉత్తమమైనది. 685 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ అద్భుతమైన స్కోర్ పరిధిలోకి వస్తుంది మరియు మీరు ఆధారపడిన రుణగ్రహీత అని రుణదాతలను చూపుతుంది. అందువల్ల, 685 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్‌ను కలిగి ఉండటం అనేది పర్సనల్ లోన్లు మరియు క్రెడిట్ కార్డులకు మీకు అర్హత సాధించడానికి సహాయపడుతుంది. మీరు మీ స్కోర్ పై ఎటువంటి ప్రభావం లేకుండా మీ తాజా సిబిల్ స్కోర్‌ను ఉచితంగా తనిఖీ చేయవచ్చు.

CIBIL స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్ స్కోర్ అనేది 300 నుండి 900 వరకు ఉండే మూడు అంకెల సంఖ్య, ఇది మీ క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి ఉపయోగించబడుతుంది. మీ క్రెడిట్ స్కోర్‌ను లెక్కించేటప్పుడు మీ క్రెడిట్ ప్రవర్తన మరియు మీ క్రెడిట్ చరిత్ర యొక్క రికార్డుగా పనిచేసే మీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ రిపోర్ట్‌లోని సమాచారం పరిగణనలోకి తీసుకోబడుతుంది.