ఒకవేళ మీరు కొత్తగా ఆస్తిని కొనుగోలు చేస్తుంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. మీరు చెల్లించే ఫీజు మీ పేరున ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి, మీ ఆస్తికి చట్టబద్దమైన యాజమాన్య హక్కులు కల్పించడానికి ఉపయోగిస్తారు. ఆస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పై స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా ఆ ఆస్తికి మీరు చట్టబద్దమైన యజమాని కాలేరు.
స్థిరాస్తి మార్కెట్ విలువలో స్టాంప్ డ్యూటీ సాధారణంగా 5-7% వుంటుంది. మార్కెట్ విలువలో రిజిస్ట్రేషన్ విలువ 1% గా ఉంటుంది. అందువల్ల ఈ ఛార్జీలు లక్షల రూపాయల్లో ఉంటాయి. ఇళ్లు కొనుగోలు చేసి, మీ పేరున రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫండ్స్ తక్కువ కాకుండా ఉండేందుకు, హోమ్ లోన్ దరఖాస్తు చేసుకునే సమయంలో స్టాంప్ సుంకం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి లోన్ మొత్తం కావాలని కోరాలి.
మీరు ఎంత స్టాంప్ డ్యూటీ చెల్లించాలి అనే నిర్ధారణలో అనేక అంశాలున్నాయి. అవి:
• ఆస్తి యొక్క మార్కెట్ విలువ
• అంతస్తులతో సహా ఆస్తి రకం
• ఆస్తి యొక్క ఉద్దేశించిన ఉపయోగం, నివాసం లేదా వాణిజ్యం
• ఆస్తి ఉన్న ప్రదేశం
• ఆస్తి యజమాని యొక్క వయస్సు మరియు లింగం
రుణదాతలు మంజూరు చేసిన హోమ్ లోన్ మొత్తంలో స్టాంప్ సుంకం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిసి ఉండవనేది ఒక నియమం. వీటిని కొనుగోలుదారుడు తన జేబులోంచి ఖర్చు పెట్టాలి.
నగరం | స్టాంప్ డ్యూటీ చార్జీలు | రిజిస్ట్రేషన్ రుసుములు |
---|---|---|
బెంగుళూరు | ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 5% | ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 1% |
ఢిల్లీ | • ఒకవేళ యజమాని మహిళ అయితే 4% | పేస్టింగ్ ఛార్జీ రూ. 100 కి అదనంగా మొత్తం మార్కెట్ విలువలో 1% |
• ఒకవేళ యజమాని పురుషుడు అయితే 6% | ||
ముంబై | • గ్రామీణ ప్రాంతాలకు ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 4% లేదా ఒప్పందం లో సూచించిన విలువ | ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 1% లేదా ఒప్పందం లో సూచించిన విలువ లేదా రూ. 30,000 ఏది తక్కువైతే అది. |
• పట్టణ ప్రాంతాలకు ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 5% లేదా ఒప్పందం లో సూచించిన విలువ | ||
చెన్నై | ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 7% | ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 1% |
కోల్కతా | • ఒకవేళ ఆస్తి గ్రామ పంచాయితీ పరిధిలో గనక ఉంటే ఆస్తి మొత్తం మార్కెట్ విలువ లో 5% | ఆస్తి మొత్తం మార్కెట్ విలువలో 1% |
• ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఆస్తి మార్కెట్ విలువలో 6% | ||
• ఒకవేళ స్థిరాస్తి మార్కెట్ విలువ రూ. 40 లక్షలు కంటే ఎక్కువగా ఉంటే, అదనంగా 1% స్టాంప్ డ్యూటీ చెల్లించాలి |
అవును, ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C క్రింద పన్ను మినహాయింపు కోసం గరిష్ట పరిమితి రూ. 1,50,000 వరకు స్టాంప్ డ్యూటీ క్లెయిమ్ చేయవచ్చు.
లేదు. స్టాంప్ డ్యూటీ రిఫండబుల్ కాదు.
ఇప్పటివరకు స్థిరాస్తి విక్రయంపై స్టాంప్ డ్యూటీ మరియు GST వేరు వేరుగా వసూలు చేస్తున్నారు. ఒకదానిపై మరొకటి ప్రభావం చూపదు.
ముంబైలో స్టాంప్ డ్యూటీ మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ చార్జీలు
ఢిల్లీలో స్టాంప్ డ్యూటీ మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ చార్జీలు
చెన్నైలో స్టాంప్ డ్యూటీ మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ చార్జీలు
బెంగళూరులో స్టాంప్ డ్యూటీ మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ చార్జీలు
కోల్కత్తాలో స్టాంప్ డ్యూటీ మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ చార్జీలు
హైదరాబాద్లో స్టాంప్ డ్యూటీ మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ చార్జీలు
పూణేలో స్టాంప్ డ్యూటీ మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ చార్జీలు