45000 జీతంపై హోమ్ రుణం
హోమ్ లోన్లు సహజంగా అధిక-విలువ గల ఆర్థిక ప్రోడక్టులు కానీ, వాటి పరిమాణం ఒక రుణగ్రహీత నుండి మరొకరికి మారుతూ ఉంటుంది. దాని వెనుక కారణాలు నెలవారీ ఆదాయం, వయస్సు, ప్రాపర్టీ లొకేషన్ మరియు ఇతరత్రా కావచ్చు.
లోన్ అర్హతను చెక్ చేయడానికి ముందు ఒకరు హోమ్ లోన్ పన్ను ప్రయోజనం కూడా పరిగణించాలి, తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.
45000 జీతంపై నేను ఎంత హోమ్ లోన్ పొందగలను?
45000 జీతంపై అందుబాటులో ఉన్న హోమ్ లోన్ అమౌంట్ ఎంత అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మెరుగైన ఆలోచన కోసం ఈ కింది పట్టికను చూడండి:
నికర నెలసరి ఆదాయం |
హోమ్ లోన్ మొత్తం** |
రూ. 45,000 |
రూ. 37,53,591 |
రూ. 44,000 |
రూ. 36,70,178 |
రూ. 43,000 |
రూ. 35,86,765 |
రూ. 42,000 |
రూ. 35,03,352 |
రూ. 41,000 |
రూ. 34,19,939 |
**పైన పేర్కొన్న హోమ్ లోన్ మొత్తాన్ని బజాజ్ ఫిన్‌సర్వ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ ఉపయోగించి లెక్కించండి. అసలు రుణ మొత్తం నగరం, వయస్సు మరియు ఇతర అంశాల పై ఆధారపడి ఉంటుంది.
హోమ్ లోన్ అర్హతను ఎలా తనిఖీ చేయాలి?
మీరు ఇప్పుడు ఆన్‌లైన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ హోమ్ లోన్ అర్హతను చెక్ చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
దశ 1:హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ వెబ్‌పేజీని సందర్శించండి.
స్టెప్ 2: ఈ క్రింది వివరాలను ఎంటర్ చేయండి:
- పుట్టిన తేదీ
- నివసించే నగరం
- నికర నెలసరి జీతం
- లోన్ కాలపరిమితి
- అదనపు నెలసరి ఆదాయం
- ప్రస్తుత ఇఎంఐలు లేదా ఇతర బాధ్యతలు
దశ 3: ఈ వివరాలను నమోదు చేసి 'మీ అర్హతను చెక్ చేయండి' పై క్లిక్ చేయండి
దశ 4: కాలిక్యులేటర్ మీకు అర్హత గల లోన్ మొత్తాన్ని చూపిస్తుంది. మీరు వివిధ ట్యాబ్‌లలో విలువలను మార్చవచ్చు మరియు తగిన లోన్ ఆఫర్‌ను కనుగొనవచ్చు.
లోన్ అర్హతను చెక్ చేయడంతో పాటు ఈ ప్రయోజనం కోసం అవసరమైన డాక్యుమెంట్ల జాబితాను కూడా పరిశీలించాలి.
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి హౌసింగ్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏవి?
హోమ్ లోన్‌ను పొందడానికి ఒకరు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్నాయి:
- కెవైసి డాక్యుమెంట్లు
- ఆదాయం ప్రూఫ్ (జీతం స్లిప్స్, ఫారం 16, ఒక వ్యాపారం యొక్క ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు)
- కనీసం 5 సంవత్సరాల కొనసాగింపును పేర్కొంటూ వ్యాపార రుజువు
- గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే ప్రస్తుత హోమ్ లోన్ వడ్డీ రేటు ఎంత?
ప్రస్తుతం వర్తించే బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి హోమ్ లోన్ వడ్డీ రేటు సంవత్సరానికి కేవలం 8.50%* నుండి ప్రారంభమవుతుంది, ఫలితంగా, నెలవారీ వాయిదాలు కూడా అతి తక్కువగా రూ. 769/లక్ష నుండి ప్రారంభమవుతాయి*.
బజాజ్ ఫిన్‌సర్వ్ హౌసింగ్ లోన్ వల్ల ప్రయోజనాలు ఏమిటి?
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి హౌసింగ్ లోన్ ఈ కింది ప్రయోజనాలతో వస్తుంది:
-
పిఎంఎవై ప్రయోజనాలను పొందండి
భారత ప్రభుత్వ ప్రధాన గృహనిర్మాణ పథకం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పౌరులకు ఆస్తి కొనుగోళ్లపై వడ్డీ రాయితీలను పొందడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకం కింద హౌసింగ్ లోన్లను అందించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ నమోదు చేయబడింది.
-
అధిక లోన్ క్వాంటమ్
మీ అర్హతను బట్టి, మీరు ఇప్పుడు అర్హత ఆధారంగా రూ. 5 కోట్లు* లేదా అంతకంటే ఎక్కువ హోమ్ లోన్ మొత్తాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మీ ఆర్ధిక అవసరాల కోసం నిధులను సమకూర్చుకోవడానికి మీరు రూ.1 కోటి* లేదా అంతకన్నా ఎక్కువతో టాప్-అప్ లోన్ సౌకర్యాన్ని పొందవచ్చు.
-
దీర్ఘకాలిక రీపేమెంట్ వ్యవధి
బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి హోమ్ లోన్లు 30 సంవత్సరాల వరకు ఉండే రీపేమెంట్ అవధితో వస్తాయి. ఇది ఇఎంఐలను తగ్గించడం ద్వారా రీపేమెంట్‌ల ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ స్థోమతకు తగిన లోన్ అవధిని కనుగొనడానికి ఇప్పుడు ఆన్‌లైన్ హోమ్ లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ను ఉపయోగించవచ్చు.
-
బ్యాలెన్స్ బదిలీ లభ్యత
బజాజ్ ఫిన్‌సర్వ్‌తో హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ చాలా సులభం, రుణగ్రహీతలు తక్కువ వడ్డీ రేటు మరియు అనుకూలమైన నిబంధనలను ఆస్వాదించడానికి వారి రుణాలను బదిలీ చేసుకోవచ్చు.
-
ఆన్‌లైన్ లోన్ అకౌంట్ నిర్వహణ
మీరు ఇప్పుడు మీ లోన్ అకౌంటును 24X7 గంటలూ ఎక్కడినుండైనా యాక్సెస్ చేయవచ్చు. అదనంగా, ఈ కస్టమర్ పోర్టల్ హోమ్ లోన్ ఇఎంఐలను చెల్లించడానికి, లోన్ సంబంధిత డాక్యుమెంట్లను యాక్సెస్ చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది.
-
ప్రీపేమెంట్ లేదా ఫోర్‍క్లోజర్ పై అదనపు ఛార్జీలు ఉండవు
బజాజ్ ఫిన్‌సర్వ్‌తో హౌసింగ్ లోన్‌ను ప్రీపే చేయడం లేదా ఫోర్‌క్లోజ్ చేయడం వల్ల ఎలాంటి అదనపు ఛార్జీలు వర్తించవు. అందువల్ల, మీ మొత్తం రుణ ఖర్చు తక్కువగా ఉంటుంది.
-
ఆస్తి వివరాల డాక్యుమెంట్లు
ప్రాపర్టీ డాక్యుమెంట్ ఒక ఇంటిని కలిగి ఉండటానికి సంబంధించి అన్ని చట్టపరమైన, ఆర్థిక అంశాలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది.
ఒక హోమ్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
దిగువ పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా మీరు బజాజ్ ఫిన్‌సర్వ్‌తో హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు:
- 1 బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- 2 అవసరమైన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వివరాలతో లోన్ దరఖాస్తును పూరించండి
- 3 ప్రాథమిక ఆమోదం పొందిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అందించండి మరియు లోన్ సంబంధిత ఛార్జీలను చెల్లించండి
- 4 ఆ తర్వాత భవిష్యత్తు కార్యకలాపాల కోసం కంపెనీ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు
- 5 ఆస్తి మరియు లోన్ డాక్యుమెంట్ల విజయవంతమైన ధృవీకరణ తర్వాత మీరు లోన్ శాంక్షన్ లెటర్‌ను అందుకుంటారు
- 6 మీరు మీ లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత లోన్ మొత్తాన్ని అందుకుంటారు
ఒక హోమ్ లోన్ కోసం అర్హతను ఏవిధంగా మెరుగుపరచుకోవాలి?
45000 జీతంపై హోమ్ లోన్ కోసం మీ అర్హతను మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- సహ-దరఖాస్తుదారుని జోడించడం చాలా సహాయకరంగా ఉంటుంది, ఎందుకంటే రుణదాతలు దరఖాస్తుదారులిద్దరి అర్హతను పరిగణిస్తారు మరియు తదనుగుణంగా లోన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు.
- దీర్ఘకాల వ్యవధి అనేది ఇఎంఐలను తగ్గిస్తుంది, ఇది దరఖాస్తుదారుల రీపేమెంట్ సామర్థ్యానికి అనుగుణంగా ఉంటుంది మరియు వారి అర్హతను మెరుగుపరుస్తుంది.
- ప్రతి ఆదాయ వనరులను ఉదహరిస్తూ ఒకరి నెలవారీ ఆదాయాన్ని పెంచుతుంది, వారి రీపేమెంట్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- ఒక మచ్చలేని రీపేమెంట్ చరిత్రతో కూడిన గౌరవప్రదమైన క్రెడిట్ స్కోర్ మీ లోన్ అర్హతను గణనీయంగా పెంచుతుంది.
45000 జీతంపై హోమ్ లోన్ గురించి మరింత తెలుసుకోవడానికి, బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి ఒక ప్రతినిధిని సంప్రదించండి.