హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

  1. హోం
  2. >
  3. హోమ్ లోన్
  4. >
  5. హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

క్విక్ అప్లై

అప్లై చేయడానికి కేవలం60 సెకన్లు

మీ మొదటి పేరు మరియు చివరి పేరును నమోదు చేయండి
మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి

నేను ఈ అప్లికేషన్ మరియు ఇతర ప్రోడక్టులు/సర్వీసుల నిమిత్తం కాల్/SMS చేసేందుకు బజాజ్ ఫిన్సర్వ్ రిప్రెజెంటేటివ్‍‍కు అధికారం ఇస్తున్నాను. ఈ అనుమతి DNC/NDNC కోసం నా రిజిస్ట్రేషన్‌ను ఓవర్ రైడ్ చేస్తుంది. నిబంధనలు మరియు షరతులు

మీ మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడినది

వన్-టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి*

0 సెకన్లు
నికర నెలవారీ వేతనం ని నమోదు చేయండి
పుట్టిన తేదీని ఎంచుకోండి
PAN కార్డు వివరాలు నమోదు చేయండి
జాబితాలో నుండి యజమాని పేరును ఎంచుకోండి
వ్యక్తిగత ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి
అధికారిక ఇమెయిల్ చిరునామాని నమోదు చేయండి
ప్రస్తుత నెలవారీ బాధ్యతలను నమోదు చేయండి
మీ నెలవారీ జీతం ఎంటర్ చేయండి
వార్షిక టర్న్‌ఓవర్ (18-19) నమోదు చేయండి

ధన్యవాదాలు

నికర నెలసరి జీతం

రూ

కాలవ్యవధి

సంవత్సరం

నెలవారీ ఇతర ఆదాయం

రూ

ప్రస్తుత EMI లు/చెల్లించాల్సిన మొత్తం

రూ

నిర్ధేశిత కాలంలో బజాజ్ ఫిన్సర్వ్ నుంచి రూ. 0 హోమ్ లోన్ పొందడానికి మీరు ప్రయత్నించవచ్చు. షరతులు, నియమాలు వర్తిస్తాయి.

 

హోమ్ లోన్ అర్హత గురించి

ఇండియాలో ఆస్తి కొనుగోలు చేసే సందర్భంలో సులభంగా లభ్యమయ్యే ఫైనాన్సింగ్ ఆప్షన్లలో హోమ్ లోన్లు ముందు వరుసలో ఉంటాయి. ఆస్తి యొక్క ప్రస్తుత మార్కెట్ విలువలో రుణగ్రహీతలకు 80% వరకు ఫండ్లు అందుబాటులో ఉంటాయి.

బజాజ్ ఫిన్సర్వ్‌తో, హోం లోన్ రూపంలో రూ. 3.5 కోట్ల వరకు తగినంత ఆర్ధిక సహకారాన్ని పొందండి మరియు మీ రెసిడెన్షియల్ ఆస్తిని నిర్మించడానికి లేదా కొనుగోలు చేయడానికి వెచ్చించండి. మీ కలల గృహాన్ని సులభంగా పొందడానికి దోహదపడేందుకు ఇందులో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

హోమ్ లోన్ అర్హత అంటే ఏమిటి?

ప్రతి రుణగ్రహీత హోమ్ లోన్ పొందేందుకు అర్హత సాధించడానికి కొన్ని యోగ్యతా ప్రమాణాలను అందుకోవలసి ఉంటుంది. దీని వలన అతను/ఆమె లోన్‌ని ఎగవేయకుండా అధిక ప్రయాస పడకుండా తిరిగి చెల్లించే హామీ లభిస్తుంది.

యోగ్యతా ప్రమాణాలను అందుకోలేని పక్షంలో లోన్ అప్లికేషన్ తిరస్కరించబడి, ఆ వ్యక్తి యొక్క క్రెడిట్ ప్రొఫైల్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకనే, అవసరమైన యోగ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఈ ప్రక్రియ వేగంగా మరియు సాఫీగా పూర్తి అయ్యే విధంగా జాగ్రత్తపడండి.

హోమ్ లోన్‌ని మరింత చేరువ చేయడానికి, బజాజ్ ఫిన్సర్వ్ సులభంగా అందుకోగలిగే యోగ్యతా ప్రమాణాలను అందుబాటులోకి తెచ్చింది. క్రింద ఇవ్వబడిన చార్ట్‌లో వివరాలు ఉన్నాయి.

హోమ్ లోన్ కు కావలసిన అర్హత
జీతంగల వ్యక్తుల వయస్సు పరిమితి 23 నుండి 62 వరకు
స్వయం-ఉపాధి వ్యక్తుల వయస్సు పరిమితి 25 నుండి 70 వరకు
హోమ్ లోన్ కోసం అవసరమైన CIBIL స్కోర్ కనీసం 750
జీతం పొందే దరఖాస్తుదారుల పని అనుభవం కనీసం 3 సంవత్సరాలు
వ్యాపార కొనసాగింపు కనీసం 5 సంవత్సరాలు
కనీస జీతం రూ. 25,000
జాతీయత దేశంలో నివసిస్తున్న భారతీయుడు

జీతం పొందే దరఖాస్తుదారులు రూ. 3.5 కోట్ల వరకు హోమ్ లోన్ పొందవచ్చు మరియు స్వయం ఉపాధి పొందే వ్యక్తులు రూ. 5 కోట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు హోసింగ్ లోన్ యోగ్యతా ప్రమాణాలు మరియు హోసింగ్ లోన్ కోసం అవసరమయ్యే డాక్యుమెంట్లు గురించి పూర్తిగా తెలుసుకోండి.

జీతం ఆధారంగా హోమ్ లోన్ యోగ్యత

మీకు ఎంత మొత్తంలో హోమ్ లోన్ లభిస్తుందో నిర్ణయించే యోగ్యతా ప్రమాణాల్లో ఒకటి మీ నికర జీతం (చేతికి అందే జీతం). మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మీ జీతం చాలా కీలకం.

మీరు ఎంత మొత్తంలో లోన్ పొందడానికి అర్హులో మీ ఆదాయం నిర్ణయిస్తుంది. రుణ దాతలు సాధారణ మినహాయింపులైన గ్రాట్యుయిటీ, PF, ESI మొదలైనవాటిని మీ జీతం నుండి తీసివేసి పరిశీలిస్తారు. మీ చేతికి అందే జీతం మీరు భరించగలిగిన EMI మొత్తాన్ని నిర్ణయిస్తుంది మరియు అదే విధంగా మీరు అప్పుగా తీసుకోదలచిన లోన్ మొత్తాన్ని కూడా.

ఉదాహరణకు, మీకు చేతికి అందే జీతం రూ. 25,000 అయితే, మీరు రూ. 40 లక్షల విలువ గల ఇంటిని కొనుగోలు చేయడానికి రూ. 18.64 లక్షల వరకు లోన్ గా పొందవచ్చు (మీకు ఇప్పటికే ఎటువంటి ఆర్థిక బాధ్యతలు లేనట్లయితే.) కానీ మీ చేతికి అందే జీతం రూ. 50,000 అయితే, మీరు అదే ఆస్తి కోసం రూ. 37.28 లక్షల లోన్ మొత్తాన్ని పొందవచ్చు. ఆ తరువాత, మీ చేతికి అందే జీతం రూ. 75,000 అయితే మీ అర్హతను మీరు రూ. 55.93 లక్షల వరకు పెంచుకోవచ్చు.

వయస్సు
నికర నెలసరి ఆదాయం (రూ. లలో)
  25,000 50,000 75,000
25 సంవత్సరాలు 18.64లక్ష 37.28లక్ష 55.93లక్ష
30 సంవత్సరాలు 18.64లక్ష 37.28లక్ష 55.93లక్ష
35 సంవత్సరాలు 18.64లక్ష 37.28లక్ష 55.93లక్ష
40 సంవత్సరాలు 18.64లక్ష 37.28లక్ష 55.93లక్ష
45 సంవత్సరాలు 18.64లక్ష 37.28లక్ష 55.93లక్ష
50 సంవత్సరాలు 18.64లక్ష 37.28లక్ష 55.93లక్ష

వయస్సు ఆధారంగా హోమ్ లోన్ యోగ్యత

లోన్ వ్యవధిని నిర్ణయించడానికి వయస్సు కీలక పాత్ర పోషిస్తుంది. మీరు పొందగలిగే గరిష్ఠ వ్యవధి 20 సంవత్సరాలు.

మీ వయస్సు తక్కువగా ఉంటే ఎక్కువ రీపేమెంట్ వ్యవధి పొందుతారు. మీకు అధిక ఆదాయం ఉన్నట్లయితే మీరు అధిక విలువ కలిగిన హోమ్ లోన్‌ను పొందగలరు.

హోమ్ లోన్ అప్లై చేయడానికి జీతం పొందే దరఖాస్తుదారుల యొక్క వయస్సు 23 నుండి 62 మధ్యన ఉండాలి. అలానే, లోన్ పొందాలని అనుకుంటున్న స్వయం ఉపాధి పొందే వ్యక్తుల వయస్సు 25 నుండి 70 మధ్యన ఉండాలి.

క్రింద ఉన్న టేబుల్‌లో వయస్సు ఆధారంగా వ్యక్తులు గరిష్ఠముగా ఎంత లోన్ వ్యవధికి అర్హులో ఇవ్వబడింది:

వయస్సు
జీతం పొందే దరఖాస్తుదారులకు గరిష్ట అవధి
స్వయం-ఉపాధి పొందే దరఖాస్తుదారులకు గరిష్ట అవధి
25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు
30 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు
35 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు
40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు
45 సంవత్సరాలు 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు
45 సంవత్సరాలు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు

హోమ్ లోన్ కొరకు అర్హత క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

హోమ్ లోన్ అర్హతను తెలుసుకోవడానికి ఉన్న సులభమైన మార్గం ఒక ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం. బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ మీరు ఎంత లోన్ పొందేందుకు అర్హులో క్షణాల్లో లెక్కించి తెలియజేస్తుంది. ఇది మెరుగైన ఆర్థిక ప్రణాళికకు దోహదపడటమే కాకుండా మీ అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశాలను తగ్గిస్తుంది. ఈ టూల్ మాన్యువల్ లెక్కింపులో వచ్చే ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తుంది.

బజాజ్ ఫిన్సర్వ్ లో, మీరు ఎప్పుడైనా ఎక్కడి నుండైనా ఈ ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్‌ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.

హోమ్ లోన్ అర్హత ఎలా లెక్కించబడుతుంది?

అర్హత క్యాలిక్యులేటర్, ఎంత లోన్ పొందడానికి అర్హత ఉన్నదో, ఒక గణిత సూత్రం ఆధారంగా లెక్కించి తెలియజేస్తుంది. ఇది లోన్ వ్యవధి, నికర నెల జీతం, ఇప్పటికే ఉన్న బాధ్యతలు లేదా EMIలు, ఇతర నెలవారీ ఆదాయాలను, మొదలైన వాటిని పరిగణలోకి తీసుకుంటుంది.

బజాజ్ ఫిన్సర్వ్ యొక్క అర్హత క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

బజాజ్ ఫిన్సర్వ్ అందిస్తున్న అర్హత క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం చాలా సులభం మరియు సరళం. మీ పుట్టిన తేదీ మరియు నివసిస్తున్న నగరంతో పాటు అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి.

స్టెప్ 1: పుట్టిన తేదీని DD/MM/YYYY ఫార్మట్‌లో నమోదు చేయండి.
స్టెప్ 2: మీరు నివసిస్తున్న ప్రదేశాన్ని తెలియజేయండి.
స్టెప్ 3: మీ నెలవారీ జీతాన్ని నేరుగా లేదా ఇవ్వబడిన బార్‌ని సరిచేయడం ద్వారా నమోదు చేయండి.
స్టెప్ 4: మీ ఆర్ధిక ప్రణాళిక మరియు రీపేమెంట్ సామర్థ్యం ఆధారంగా 240 నెలల కాలం వరకు మీకు నచ్చిన వ్యవధిని ఎంచుకోండి.
స్టెప్ 5: ఒక వేళ ఇంకేదైనా నెలవారీ ఆదాయం ఉంటే వాటి వివరాలను నమోదు చేయండి. మీకు ఇతర ఆదాయ మార్గాలు లేనట్లయితే ఈ స్టెప్‌ని దాటవేయండి.
స్టెప్ 6: ఇప్పటికే ఉన్న మీ రుణాల పై మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న EMIల మొత్తాన్ని తెలియజేయండి. ఏదీ లేకపోతే వదిలేయండి.

సరైన ఫలితాలను లెక్కించడానికి ఖచ్చితమైన సమాచారాన్ని అందించండి. అన్ని ఎంట్రీలను తనిఖీ చేసి 'అర్హతను చెక్ చేయండి' పై క్లిక్ చేయండి . మీరు బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఎంత మొత్తంలో లోన్ పొందగలరో క్యాలిక్యులేటర్ వెంటనే డిస్‌‌ప్లే చేస్తుంది.

సాధ్యమైన ఇతర వ్యవధులను తెలుసుకోవడానికి బార్‌‌ని అటుఇటు జరపండి మరియు మీకు ఎంత మొత్తం లభిస్తుందో చెక్ చేసుకోండి. మీకు గరిష్ఠ అర్హత మొత్తం తెలిసిన తరువాత, మీరు మీ అవసరానికి తగినట్లుగా హోమ్ లోన్ కోసం అప్లై చేయవచ్చు.

హోమ్ లోన్ అర్హతను నిర్ణయించే అంశాలు ఏమిటి?

అనేక అంశాలు హోమ్ లోన్ తీసుకునే రుణగ్రహీత యొక్క అర్హతను నిర్ణయిస్తాయి. కొన్ని ముఖ్యమైనవి ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

1. వయస్సు: 25 నుండి 70 మధ్య వయస్సు ఉన్న స్వయం-ఉపాధి పొందే దరఖాస్తుదారులు లోన్ కొరకు అప్లై చేయడానికి అర్హులు. అర్హత సాధించడానికి జీతం పొందే వ్యక్తులు వయస్సు 23 మరియు 62 సంవత్సరాల మధ్యన ఉండాలి.
2. CIBIL స్కోర్: 3-అంకెలు గల CIBIL స్కోర్ ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ విశ్వసనీయత ను సూచిస్తుంది. 300 నుండి 900 వరకు ఉండే స్కేల్‌‌లో, 750 ని లోన్ కొరకు అర్హత సాధించడానికి కావలసిన కనీస రేటింగ్‌‌గా పరిగణిస్తారు. హోమ్ లోన్ కొరకు మంచి CIBIL స్కోర్ ఉండడం వలన ఆకర్షణీయమైన ఫీచర్లు మరియు మెరుగైన వడ్డీ రేట్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
3. వృత్తి : దరఖాస్తుదారులు స్వయం ఉపాధి పొందే వారు (వ్యాపారవేత్త, డాక్టర్, చార్టర్డ్ అకౌంటెంట్ మరియు ఇతరులు) అయి ఉండాలి లేదా ఏదైనా ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా MNC లో జీతం పొందే ఉద్యోగం అయినా చేస్తూ ఉండాలి.
4. కనీస ఆదాయం: నివసిస్తున్న ప్రదేశాన్ని బట్టి బజాజ్ ఫిన్సర్వ్ కనీస నెలవారీ నికర ఆదాయ స్లాబ్‌‌ను తెచ్చింది. వర్తించే కనీస అర్హతలను దరఖాస్తుదారులు కలిగి ఉండాలి.
5. LTV and Property Value: The chance of getting a higher loan amount is more if the property’s market value is higher. If you can make a 20% down payment, you can get a home loan faster.

అర్హత కలిగిన అప్లికెంట్ మెరుగైన హోమ్ లోన్ వడ్డీ రేటు తో పాటు పార్ట్-ప్రీపేమెంట్, ఫోర్‌క్లోజర్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయం వంటి మొదలగు ఫీచర్లను పొందవచ్చు.

హోమ్ లోన్ అర్హతను మీరు ఎలా మెరుగుపరచగలరు?

  • వ్యవధిని పెంచడం ద్వారా EMIలు తగ్గి మీరు అధిక లోన్ మొత్తాన్ని తీసుకునే అర్హతను పొందుతారు. కానీ, మీరు చెల్లించవలసిన వడ్డీ పెరుగుతుంది.
  • మీకు ప్రస్తుతం ఉన్న రుణాలు అయినటువంటి లోన్ EMIలు, క్రెడిట్ కార్డు బాకీలు, మొదలైనవి పూర్తిగా చెల్లించండి. ఇది మీ FOIR ను తగ్గించి, మీరు హోమ్ లోన్ పొందే అవకాశాన్ని మెరుగుపరుస్తుంది.
  • ఒక సహ-దరఖాస్తుదారుని తో కలిసి జాయింట్ హోమ్ లోన్ కొరకు అప్లై చేయండి మరియు అధిక లోన్ మొత్తాన్ని పొందే అవకాశాన్ని మెరుగుపరుచుకోండి.
బజాజ్ ఫిన్సర్వ్ యొక్క యోగ్యతా ప్రమాణం ద్వారా మీ అర్హతను పరిశీలించుకోండి మరియు మీ ఆస్తిని ఫైనాన్స్ చేయడానికి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్న హోమ్ లోన్‌‌ను పొందండి.

ప్రజలు వీటిని కూడా పరిగణించారు

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఏ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఒక టాప్-అప్ లోన్ పొందండి

అప్లై

హోమ్ లోన్ వడ్డీ రేటు

ప్రస్తుత హోమ్ లోన్‌ను తనిఖీ చేయండి
వడ్డీ రేట్లు

అన్వేషించండి

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

మీ హోమ్ లోన్ అర్హత నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అప్లికేషన్ మొత్తం ప్లాన్ చేసుకోండి

ఇప్పుడు లెక్కించండి

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

మీ నెలవారీ EMI, ఇన్స్టాల్మెంట్లు మరియు లోన్ మొత్తం పై వర్తించే వడ్డీ రేటు లెక్కించుకోండి

ఇప్పుడు లెక్కించండి