అహ్మదాబాద్‌లో స్టాంప్ డ్యూటీ

అహ్మదాబాద్ గుజరాత్‌లోని అతిపెద్ద నగరం మరియు భారతదేశంలోని ఆరవ అతిపెద్ద నగరం. అత్యంత బిజినెస్-ఫ్రెండ్లీ నగరంగా పరిగణించబడే అహ్మదాబాద్ గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షించింది, ఇది నగర రంగంలో విపరీతమైన వృద్ధికి దారితీసింది. అహ్మదాబాద్‌లో ప్రాపర్టీని కొనుగోలు చేయాలనుకుంటున్న వారు తప్పనిసరిగా స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించవలసి ఉంటుంది. జాబితా ఇక్కడ ఇవ్వబడింది.

అహ్మదాబాద్‌లో స్టాంప్ డ్యూటీ ఛార్జీలు ఎంత?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, మొత్తం ఆస్తి విలువలో 4.9% స్టాంప్ డ్యూటీని వసూలు చేస్తుంది. ఇందులో ప్రాథమిక స్టాంప్ డ్యూటీ రేటు 3.5%గా ఉంటుంది మరియు ప్రాథమిక రేటుపై 40% సర్‌ఛార్జ్, అనేది 1.4% అవుతుంది. అదేవిధంగా, అహ్మదాబాద్‌లో మొత్తం స్టాంప్ డ్యూటీ ఛార్జీలు 4.9%గా ఉన్నాయి.

అహ్మదాబాద్‌లో స్టాంప్ డ్యూటీ ఛార్జీలను నిర్ణయించే కొన్ని అంశాలు ఏవి?

అహ్మదాబాద్‌లో స్టాంప్ డ్యూటీ ఛార్జీలు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి:

ఆస్తి వయస్సు

స్టాంప్ డ్యూటీ ఛార్జీలు ప్రాపర్టీ విలువపై ఆధారపడి ఉంటాయి. పాత ఆస్తుల విలువ తక్కువగా ఉన్నందున అవి తక్కువ స్టాంప్ డ్యూటీని ఆకర్షిస్తాయి మరియు ఆస్తి విలువను బట్టి మారతాయి.

యజమాని వయస్సు

అహ్మదాబాద్‌లోని సీనియర్ సిటిజన్లు వయస్సులో చిన్నవారి కంటే తక్కువ స్టాంపు డ్యూటీని చెల్లించాలి.

యజమాని లింగం

అహ్మదాబాద్‌లో పురుషులు మరియు మహిళలు ఇద్దరూ సమాన స్టాంప్ డ్యూటీని చెల్లించవలసి ఉన్నప్పటికీ, మహిళా గృహ కొనుగోలుదారులకు నగరంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వబడింది.

ఆస్తి రకం 

రెసిడెన్షియల్ ప్రాపర్టీల కన్నా కమర్షియల్ ప్రాపర్టీలకు స్టాంప్ డ్యూటీ ఎక్కువ.

ఆస్తి ఉన్న ప్రదేశము

నగర కేంద్రంలో ఉన్న ఆస్తులు అధిక ధరలను కలిగి ఉంటాయి, అందువల్ల అధిక స్టాంప్ డ్యూటీని ఆకర్షిస్తాయి. శివార్లలో ఉన్న ఆస్తులు తక్కువ స్టాంప్ డ్యూటీని ఆకర్షిస్తాయి.

సదుపాయాలు

తక్కువ సౌకర్యాలు గల భవనాల కంటే ఎక్కువ సదుపాయాలు గల భవనాలు ఎక్కువ స్టాంప్ డ్యూటీని వసూలు చేస్తాయి.

అహ్మదాబాద్‌లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏవిధంగా లెక్కించబడతాయి?

గుజరాత్ ప్రభుత్వం ఆస్తి మొత్తం విలువలో 1% ను రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా వసూలు చేస్తుంది. అయితే, నగరంలో ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపు నుండి మహిళలకు మినహాయింపు ఉంది.

వాస్తవాన్ని వివరంగా చూడటానికి ఈ ఉదాహరణను పరిశీలిద్దాం:

ఒక వ్యక్తి అహ్మదాబాద్‌లో రూ. 1 కోటి విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తే, వారు తప్పనిసరిగా రూ. 1 లక్ష రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించాలి. అయితే, ఆస్తి మొదటి యజమానిగా స్త్రీ ఉన్నట్లయితే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు వర్తించదు. అదేవిధంగా పురుషులు, స్త్రీలు సంయుక్తంగా కలిగి ఉన్న ఆస్తులపై కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు విధించబడవు.

అహ్మదాబాద్‌లో స్టాంప్ డ్యూటీ ఏవిధంగా లెక్కించబడుతుంది?

గుజరాత్ ప్రభుత్వం, మొత్తం ఆస్తి విలువలో 4.9% స్టాంప్ డ్యూటీని వసూలు చేస్తుంది. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఒకే మొత్తాన్ని స్టాంప్ ఛార్జీలుగా చెల్లించాలని కోరింది. ఈ విధంగా మీరు రూ. 1 కోటి విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తే మగ లేదా ఆడ అనే తేడా లేకుండా రూ. 4.9 లక్షల రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించాలి. అయితే, ఆస్తి ధరలు చాలా అరుదుగా రౌండ్ ఫిగర్‌లలో ఉంటాయి కనుక ఈ ఛార్జీలను లెక్కించడానికి స్టాంప్ డ్యూటీ కాలిక్యులేటర్ను ఉపయోగించడం ఉత్తమం.

డిస్‌క్లెయిమర్: ఈ రేట్లు సూచనాత్మకమైనవి మరియు ప్రస్తుత సమయంలో వర్తించే చట్టాలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా మార్పుకు లోబడి ఉంటాయి. వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా చర్య తీసుకునే ముందు కస్టమర్లకు స్వతంత్రంగా న్యాయపరమైన సలహాను పొందాల్సిందిగా సూచించడమైనది మరియు ఇది ఎల్లప్పుడూ వినియోగదారు ప్రధాన బాధ్యత మరియు నిర్ణయంగా ఉండాలి. ఏ సందర్భంలోనైనా ఈ వెబ్‌సైట్‌ను ప్లాన్ చేయడంలో, రూపొందించడంలో లేదా డెలివరీ చేయడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా, శిక్షణాత్మకంగా, ఆనుషంగికంగా, ప్రత్యేక, పరిణామ నష్టాలకు (రెవెన్యూ లేదా లాభాలలో నష్టం, వ్యాపారంలో నష్టం లేదా డేటా నష్టం తో సహా ) లేదా పైన పేర్కొన్న సమాచారంపై కస్టమర్ విశ్వాసానికి సంబంధించిన ఏవైనా నష్టాలకు బిఎఫ్ఎల్ లేదా బజాజ్ గ్రూప్ లేదా దాని ఏజెంట్లు లేదా మరేదైనా ఇతర పార్టీ ఎలాంటి బాధ్యత వహించవు.