ఆస్తిపై లోన్ క్యాలిక్యులేటర్

ఆస్తి పై లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ అనేది ఒక ఆన్‌లైన్ సాధనం. ఇది మీ నెలవారీ వాయిదాలను, చెల్లించవలసిన వడ్డీని మరియు రుణ ఖర్చులను లెక్కిస్తుంది. అలాగే, మీ రీపేమెంట్ సామర్థ్యానికి తగిన విధంగా సరిపోయే ఇఎంఐ విలువను పొందడానికి, రుణ మొత్తాన్ని మరియు అవధిని సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా మీరు రీపేమెంట్‌ కోసం ఒక ముందస్తు ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు డిఫాల్ట్ అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.

ఒక తనఖా లోన్ కాలిక్యులేటర్ చెల్లించవలసిన మొత్తం వడ్డీని కూడా అందిస్తుంది మరియు అనేక ఇతర అంశాల పై వివరణాత్మక పరిశీలనను అందిస్తుంది. మీరు పొందగలిగే కొన్ని వివరాలు:

  • అవధి అంతటా ప్రతి నెలా చెల్లించాల్సిన ఇఎంఐ
  • ప్రతి ఇఎంఐలో వడ్డీ మరియు అసలు భాగం
  • ప్రతి ఇఎంఐ చెల్లించిన తర్వాత బాకీ ఉన్న బ్యాలెన్స్

గమనిక: రీపేమెంట్ అవధి సమయంలో ప్రతి నెలా ఇఎంఐ యొక్క అసలు మరియు వడ్డీ భాగం మారుతుంది సాధారణంగా, రీపేమెంట్ ప్రారంభ దశలో, మీ ఇఎంఐ లో ఒక ప్రధాన భాగం వడ్డీలను కలిగి ఉంటుంది మరియు అవధి ముందుకు సాగే కొద్దీ అసలు భాగం పెరుగుతుంది.

సంక్షిప్తంగా, ఒక ఆస్తి లోన్ కాలిక్యులేటర్ అనేది లోన్ రీపేమెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందిస్తుంది, మీరు రుణం పొందడానికి ముందు మెరుగైన నిర్ణయం తీసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.

తనఖా లోన్ కాలిక్యులేటర్ కోసం పరిగణించవలసిన వాస్తవాలు

తనఖా లోన్ కాలిక్యులేటర్ అనేది ఆస్తి పై లోన్స్ కోసం నెలవారీ వాయిదాల సులభమైన లెక్కింపును అనుమతించే ఒక ప్రత్యేక ఆన్‌లైన్ సాధనం. ఆస్తి పై లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీ బాధ్యతలను చెక్ చేయడం ఎల్లప్పుడూ ఉత్తమం, ఇలాంటి సందర్భంలో ఈ సాధనం ఉత్తమంగా పనిచేస్తుంది. మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా నెలవారీ వాయిదాలను లెక్కించడంలో ఇది మీకు సహాయపడుతుంది, అవి:

  • లోన్ అసలు మొత్తం: ఇది మీరు అప్లై చేసిన రుణ మొత్తాన్ని సూచిస్తుంది. ఆస్తి పై రుణం కోసం అందించే గరిష్ట మొత్తం ఆస్తి యొక్క మార్కెట్ ధరలో 90% వరకు ఉండవచ్చు. ఉదాహరణకు, స్థిరాస్తి విలువ రూ. 50 లక్షలు అయితే, మీకు వచ్చిన ఫలితంలో అసలు మొత్తం రూ. 45 లక్షలకు మించకూడదు. ఆస్తి రుణాల కోసం, గరిష్ట పరిమితి సాధారణంగా ఆస్తి విలువలో 80%గా ఉంటుంది.
  • రీపేమెంట్ అవధి: ఇది క్రెడిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించే అవధి. ఆస్తి పై లోన్ లాంటి అధిక-విలువగల రుణ మొత్తాలు, సుదీర్ఘవంతమైన రీపేమెంట్ అవధితో వస్తాయి. 15 సంవత్సరాల వరకు పొడిగించబడిన అవధిలో రుణాన్ని తిరిగి చెల్లించేలా ఎంచుకోవచ్చు*. తనఖా లోన్ కాలిక్యులేటర్ పనిచేయడానికి ఈ అంశం చాలా ముఖ్యం.
  • వడ్డీ రేటు: తనఖా లోన్ కాలిక్యులేటర్ పనిచేయడానికి అవసరమైన చివరి అంశం ఏమిటంటే పేర్కొన్న రుణం పై వర్తించే వడ్డీ రేటు. ఇతర కారకాలతో పాటు రుణగ్రహీత యొక్క అర్హత మరియు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈ రేటు అమలు చేయబడుతుంది.
    ఈ మూడు ఫీల్డ్‌లలో సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, ఒక తనఖా రుణం ఇఎంఐ క్యాలిక్యులేటర్ నెలవారీ వాయిదా మొత్తం, మొత్తం వడ్డీ చెల్లింపు మరియు తనఖా రుణంకి చెందిన మొత్తం ఖర్చును ప్రదర్శిస్తుంది. కొన్ని అధునాతన క్యాలిక్యులేటర్లు మొత్తం అమార్టైజేషన్ షెడ్యూల్‌ను కూడా వెల్లడిస్తాయి.

తనఖా లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ యొక్క ప్రయోజనాలు

తనఖా లోన్ వడ్డీ రేటు కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఎందుకు ముఖ్యం అని మీరు ఆశ్చర్యపోవచ్చు? ఎందుకంటే దాని పరిశోధనలు ఖచ్చితమైనవి మరియు వాటిని చేరుకోవడం చాలా సులభం. ఇలాంటి సుదీర్ఘమైన లెక్కింపులను మాన్యువల్‌గా చేయడం కన్నా దీనిని ఉపయోగించడం ఉత్తమం. తనఖా లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ యొక్క కొన్ని ఇతర ఫీచర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • వేగవంతమైనది- ఈ సాధనాలు వేగవంతమైన లెక్కింపులను నిర్ధారిస్తాయి, సమయం తీసుకునే మాన్యువల్ గణనలను నివారించడానికి రుణగ్రహీతలను అనుమతిస్తాయి.
  • ఖచ్చితమైనది - ఇలాంటి కాలిక్యులేటర్లు అల్గారిథమ్‌లపై పని చేస్తాయి, అది మాన్యువల్ ఎర్రర్ యొక్క అవకాశాన్ని తొలగిస్తుంది.
  • ఉచితం మరియు అపరిమితం - ఈ సాధనాలు ఏ అదనపు ఛార్జీ లేకుండా లెక్కింపులను అనుమతిస్తాయి; మీకు కావలసినన్నిసార్లు లేదా అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించండి.
  • సరిపోల్చడం సులభం- మీ ఇఎంఐని ముందస్తుగా లెక్కించడం అనేది రుణదాతలు అందించే ఆఫర్లను సరిపోల్చడానికి వీలు కల్పిస్తుంది, అలాగే, మీకు తగినవిధంగా సరిపోయే ఆప్షన్‌ను ఎంచుకోవడంలో సహాయపడుతుంది.

ఆస్తి పై లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ తరచుగా అడిగే ప్రశ్నలు

ఎల్ఎపి (ఆస్తి పై లోన్) ఇఎంఐ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

ఆస్తి పై లోన్ కాలిక్యులేటర్ అనేది మీ ఆస్తి పై లోన్ రీపేమెంట్ కోసం మీరు చెల్లించవలసిన నెలవారీ వాయిదాలను లెక్కించడానికి, మీకు సహాయపడే ఒక రకమైన కాలిక్యులేటర్.

ఇఎంఐ అంటే ఏమిటి?

ఇఎంఐ లేదా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది మీరు లోన్‌ను పూర్తిగా తిరిగి చెల్లించే వరకు ప్రతి నెలా చెల్లించవలసిన నిర్ధిష్ట మొత్తాన్ని సూచిస్తుంది. ప్రతి ఇఎంఐ లో అసలు మొత్తం మరియు వడ్డీ భాగం ఉంటుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ తనఖా లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించి మీరు మీ ఇఎంఐని ముందుగానే లెక్కించవచ్చు.

ఆస్తి పై రుణం ఇఎంఐ క్యాలిక్యులేటర్/తనఖా రుణం క్యాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?

ఎల్‌ఎపి ఇఎంఐ కాలిక్యులేటర్‌ పనిచేయడానికి మూడు ప్రధాన అంశాలు అవసరం, అవి లోన్ అమౌంట్, అవధి మరియు ఆస్తి పై లోన్ వడ్డీ రేట్లు.

ఇది మీ ఇఎంఐ లెక్కించడానికి కింది ఫార్ములాను అనుసరిస్తుంది.

  • E అంటే ఇఎంఐ
  • P అంటే లోన్ అసలు మొత్తం
  • r అనేది నెలవారీగా లెక్కించబడే వడ్డీ రేటు
  • n అనేది రుణం యొక్క అవధి/ వ్యవధి
ఆస్తి లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్ లేదా తనఖా లోన్ కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

ఒక ఆస్తి పై లోన్ కాలిక్యులేటర్ లేదా తనఖా లోన్ ఇఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం సులభం. మీరు చేయవలసిందల్లా ఈ కింది వివరాలను అందించడం:

  • లోన్ మొత్తం
  • అవధి
  • వడ్డీ రేటు

విలువలను సర్దుబాటు చేయడానికి లేదా వాటిని నేరుగా టైప్ చేయడానికి మీరు స్లైడర్లను మీ ఎడమకు లేదా కుడివైపు జరపవచ్చు.

ఇప్పుడు మీకు అవసరమైన పూర్తి సమాచారం మీ వద్ద అందుబాటులో ఉంది, కావున, ఆస్తి పై లోన్ అర్హత కాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ అర్హతను లెక్కించుకోండి లేదా ఆస్తి పై లోన్ ఫోర్‍క్లోజర్ కాలిక్యులేటర్‌‌ను ఉపయోగించి మీ లోన్ పూర్తి రీపేమెంట్‌ను షెడ్యూల్ చేయండి.

మరింత చదవండి తక్కువ చదవండి