1. మీరు ఇదివరకే ఉన్న ఋణదాత నుండి కొన్ని డాక్యుమెంట్లు సేకరించి మీ కొత్త ఋణదాతకు సమర్పించాలి
2. మీ డాక్యుమెంట్లు అన్నింటినీ కొత్త ఋణదాత భౌతికంగా వెరిఫై చేసి మీ క్రెడిట్ స్కోర్ తనిఖీ చేస్తాడు
మీ హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి, అవసరమైన డాక్యుమెంట్ల లిస్ట్ ఇక్కడ వివరంగా ఇవ్వబడింది. ఈ ప్రక్రియ ప్రారంభం నుండి చివర వరకు కావలసిన ప్రతి డాక్యుమెంట్ గురించి ఈ లిస్టులో ఇవ్వబడింది.
ఈ ప్రక్రియలో ఇద్దరు ఋణదాతలు ఉన్నారు కాబట్టి, ఇప్పటికే ఉన్న మీ ఋణదాత నుండి కొన్ని డాక్యుమెంట్లు సేకరించి వాటిని మీ కొత్త ఋణదాతకు సమర్పించాలి.
మీ ప్రస్తుత ఋణదాత నుండి మీరు సేకరించ వలసిన డాక్యుమెంట్లు:
మీ ప్రస్తుత ఋణదాతకు హోమ్ లోన్ బదిలీ గురించి తెలుపుతూ ఒక అప్లికేషన్ సమర్పించి, సమ్మతి లేఖ కోసం అడగాలి..
ఒక ’నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ లేదా ఒక NOC అనేది మీ హోమ్ లోన్ ను కొత్త ఋణదాతకు బదిలీ చేయడానికి, మీ ప్రస్తుత ఋణదాతకు ఎలాంటి సమస్య లేదని తెలుపుతుంది.
చివరగా, మీ హోమ్ లోన్ తెలుపబడిన తేదీన, ఫోర్‍క్లోజ్ చేయబడిందని తెలుపుతూ ఒక ఫోర్‍క్లోజర్ లేఖ మరియు ఎలాంటి బ్యాలెన్స్ బకాయి లేదని తెలుపుతూ ఒక లేఖ. మీ కొత్త ఋణదాత మీ ప్రస్తుత ఋణదాతకు మీ బకాయి లోన్ మొత్తం చెల్లించిన తరువాత ఈ లేఖ ఇవ్వబడుతుంది.
మీ EMI రీ పేమెంట్ ట్రాక్ రికార్డ్ ను ప్రదర్శిస్తున్న హోమ్ లోన్ స్టేట్మెంట్ సేకరించండి. ఈ స్టేట్మెంట్ లో బకాయి పడ్డ లోన్ మొత్తం కూడా ఉంటుంది.
మీరు మీ ఆస్తి-సంబంధిత డాక్యుమెంట్లను మీ ప్రస్తుత ఋణదాత నుండి సేకరించాలి.
మీరు హోమ్ లోన్ తీసుకునే సమయంలో పోస్ట్-డేటెడ్ చెక్కులను సమర్పించి ఉంటారు. పెండింగ్ చెక్కులను తీసుకోవటం మరవకండి.
మీరు మీ కొత్త ఋణదాతకు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు:
ఇది మీ గుర్తింపు వెరిఫికేషన్ కోసం చేయబడుతుంది. మీరు క్రింది జాబితా నుండి కనీసం ఒక డాక్యుమెంట్ సమర్పించాలి:
- ఓటరు ID
- డ్రైవింగ్ లైసెన్సు
- NREGA ద్వారా జారీ చేయబడిన జాబ్ కార్డ్
- ఆధార్ కార్డు
- PAN కార్డు (PAN కార్డు కేవలం గుర్తింపు రుజువుగా మాత్రమే)
ఇది మీ చిరునామా వివరాలను వెరిఫై చేయడానికి. మీరు క్రింద తెలిపిన జాబితా నుండి కనీసం ఒక డాక్యుమెంట్ సమర్పించాలి:
- పాస్‍పోర్ట్
- ఓటర్ ID కార్డు
- డ్రైవింగ్ లైసెన్సు
- ఆధార్ కార్డు
ఇది మీ రీపేమెంట్ సామర్థ్యం మరియు ఆదాయ వనరులను వెరిఫై చేయడానికి. మీరు క్రింది డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది:
- ఫారం 16
- ఇటీవలి జీతం స్లిప్పులు
- జీతం అకౌంట్ యొక్క గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
ఇది మీ ఆస్తి కొనుగోలుని వెరిఫై చేయడానికి చేయబడుతుంది. మీరు ఈ క్రింది డాక్యుమెంట్లను సమర్పించాలి:
- ఆస్తి కొనుగోలు డాక్యుమెంట్లు లేదా ఆస్తి యాజమాన్యం నిరూపించడానికి తగిన డాక్యుమెంట్లు
- మీ డెవలపర్/హౌసింగ్ సొసైటీ నుండి NOC
- రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ చెల్లింపులు
ఇది మీ ప్రస్తుత లోన్ వివరాలను వెరిఫై చేయడానికి మరియు మీ హోమ్ లోన్ బదిలీ చేయడానికి మీ ఋణదాతకు ఎలాంటి ఆక్షేపణ లేదని వెరిఫై చేయడానికి చేయబడుతుంది. మీరు ఈ డాక్యుమెంట్లను మీ ప్రస్తుత ఋణదాత నుండి సేకరించి, మీ కొత్త ఋణదాతకు సమర్పించాలి:
- మీ ప్రస్తుత ఋణదాత నుండి లోన్ మంజూరు లేఖ లేదా లోన్ ఒప్పందం
- మీ ప్రస్తుత ఋణదాత నుండి ఆమోదాలు (సమ్మతి లేఖ, NOC, ఫోర్‍క్లోజర్ లేఖ)
- ఈ తేది వరకు హోమ్ లోన్ స్టేట్మెంట్
పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉండి, వెరిఫై చేయబడితే, మీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ మృదువుగా సాగుతుంది.
ఈ డాక్యుమెంట్ల చెక్ లిస్ట్ ను గమనించండి మరియు మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయం ప్రయోజనం పొందాలంటే వాటిని సేకరించడం ప్రారంభించండి.
హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ | బజాజ్ ఫిన్ సర్వ్
మీకు ఇష్టం లేనిది ఏది?
మీకు ఇష్టం లేనిది ఏది?
మీకు ఇష్టమైనది ఏది?
మీకు ఇష్టమైనది ఏది?
మీకు ఇష్టమైనది ఏది?