మీ రిస్క్ ప్రొఫైల్

మీ రిస్క్ ఆసక్తి మరియు పెట్టుబడి లక్ష్యాలకు అనువుగా ఉండే మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టండి

దయచేసి మీ మొదటి మరియు చివరి పేరు నమోదు చేయండి
దయచేసి మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి

1. నేను క్రింది ఏజ్ బ్యాండులో ఉంటాను:

2 . నెలవారీ ఆదాయంలో ఇంటి ఖర్చులు మరియు లోన్ ఇన్స్టాల్మెంట్ చెల్లింపుకు వెళ్ళే భాగం:

3. నేను గనుక ప్లాన్ చేసుకుని వివాహం, ఇంటి కొనుగోలు, పిల్లవాని ఉన్నత విద్య, మొదలైనటువంటి నా ఫైనాన్షియల్ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ఫండ్స్ పక్కన పెట్టి ఉంటే.

4. సాధారణంగా నేను ట్రై చేసిన మరియు పరీక్షించిన-నిదానమైన, సురక్షితమైన, కానీ ఖచ్చితమైన పెట్టుబడులను ఎంచుకుంటాను:

5. 5 ఇప్పటి నుండి 5 నుండి 10 సంవత్సరాలలో, నేను నా పెట్టుబడులు:

6. ప్రతిపాదించబడిన మీ పెట్టుబడులు నుండి ఈ నగదు మీకు ఎప్పటికి అవసరమవుతుంది ?

7. నా స్వంత ప్రాధాన్యతకు బాగా దగ్గరిగా మ్యాచ్ అయ్యే అసెట్ మిక్స్ అనగా:

8. నా ఈక్విటీ పోర్ట్ ఫోలియో నగదు కోల్పోతున్నట్లయితే, నా నష్టం మించిపోతున్నట్లయితే నేను అమ్మేసి పెట్టుబడి నుండి నిష్క్రమిస్తాను:

9. 5 సంవత్సరాలలో క్రింది రకం పోర్ట్ ఫోలియోతో నాకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది:

10. కొన్ని చెడు పెట్టుబడి నిర్ణయాల గురించి నేను బాధపడను:

సెక్యూర్: సెక్యూర్ పెట్టుబడిదారుడు అనేవారు క్యాపిటల్ పరిరక్షణ ప్రాథమిక లక్ష్యంగా కలిగి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని పెట్టుబడిదారుడు. ఈ ప్రొఫైలులో పెట్టుబడిదారుడు కోసం పోర్ట్ ఫోలియోలో ఎక్కువ భాగం ఫిక్సెడ్ ఆదాయం పెట్టుబడి ఉత్పత్తులు ఉంటాయి. క్యాపిటల్ కోత ప్రమాదాన్ని తగ్గించేందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కు అసెట్ కేటాయింపు చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ ప్రొఫైల్ క్రింద పెట్టుబడిదారుడికి అసెట్ కేటాయింపు మొత్తంగా రిటర్న్స్ మెరుగుపరిచే అవకాశం అందిస్తుంది. ఈ ప్రొఫైలుకు సిఫారసు చేయబడిన హోల్డింగ్ కాలం 3-5 సంవత్సరాలు.

కన్జర్వేటివ్: ఒక మితమైన పెట్టుబడిదారుడుగా, మీ లక్ష్యం స్థిరమైన ఆదాయం ప్రవాహ నిర్వహణ మరియు ద్రవ్యోల్బణంపై పోరాడడం. పెట్టుబడుల గురించి మీ పరిజ్ఞానం పరిమితంగా ఉండగా, ప్రయత్నించి కొద్దిగా ఎక్కువ సంపాదించడం కోసం మీరు క్యాల్కులేటెడ్ మొత్తంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. మార్కెట్ అస్థిరత మీకు అసౌకర్యంగా కలిగించినప్పటికీ, మధ్యస్థ కాలానికి పెట్టుబడి పెట్టి ఉండడం ద్వారా మీరు దానిని పూర్తి చేయగలుగుతారు. ఈ ప్రొఫైల్ క్రింద పెట్టుబడిదారుడికి అసెట్ కేటాయింపు మార్కెట్ అవకాశాల యొక్క ప్రయోజనం పొందేందుకు క్యాపిటల్ విషయంలో చాలా తక్కువ రిస్క్ తీసుకుంటూ ఆదాయం యొక్క స్థిరమైన ప్రవాహం సృష్టించే విధంగా చూడడం జరుగుతుంది. ఈ ప్రొఫైల్ కోసం సిఫారసు చేయబడిన హోల్డింగ్ సమయం 5-10 సంవత్సరాలు.

బ్యాలెన్స్డ్: ఒక బ్యాలెన్స్డ్ పెట్టుబడిదారుడుగా, సాధారణ ఆదాయం మరియు ఎదుగుదలను సమతుల్యం చేయడం మీ లక్ష్యం కావచ్చు. అధిక రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవడానికి మీరు ఇష్టపడతారు, కానీ మీ పెట్టుబడుల విలువలో ఎక్కువ ఎగుడుదిగుడులు చూడాలని భరించాలని మీరు కోరుకోరు. మీ పెట్టుబడులను ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయం గురించి మీకు మంచి అవగాహనే ఉండి ఉండవచ్చు కావున, మీరు మొదట్లో పెట్టుబడి పెట్టిన దానికంటే తిరిగి తక్కువ పొందే అవకాశాన్ని మీరు అంగీకరిస్తారు. ఈ ప్రొఫైల్ క్రింద పెట్టుబడిదారుల ఫైనాన్షియల్ అసెట్ కేటాయింపు ఫిక్సెడ్ ఆదాయం అసెట్స్ మరియు దీర్ఘకాలిక వృద్ధి అనగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మధ్యన సమతుల్యత సాధించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది. ఈ ప్రొఫైలులోని పెట్టుబడిదారులు అడపాదడపా ధరల అస్థిరత మరియు క్యాపిటలుకు ఒక మోస్తరు రిస్క్ కి లోనవుతారు మరియు ఈ ప్రొఫైల్ కోసం సిఫారసు చేయబడిన హోల్డింగ్ సమయం 10-15 సంవత్సరాలు.

ఎంటర్ప్రైజింగ్ : ఒక ఎంటర్ప్రైజింగ్ పెట్టుబడిదారుడుగా, మీ ప్రాధమిక లక్ష్యం మధ్యస్థం నుండి దీర్ఘకాలంలో మీ క్యాపిటల్ వృద్ధి చెందడం. మీరు ఈక్విటీ మార్కెట్ల క్లిష్టతను మరియు దీర్ఘకాలంలో అధిగమించగలిగే వాటి సామర్థ్యాన్ని అర్థం చేసుకోగలగవచ్చు, మరియు అదనపు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే మీరు తక్కువగా తిరిగి పొందవచ్చు అనే విషయం మీకు తెలిసి ఉంటుంది. ఈ ప్రొఫైలులోని పెట్టుబడిదారుల యొక్క ఫైనాన్షియల్ అసెట్ కేటాయింపు మ్యూచువల్ ఫండ్స్ వంటి దీర్ఘకాలిక అసెట్స్ లో మరియు ఉత్తమమైన భాగాన్ని ఫిక్సెడ్ ఆదాయం పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధిని సాధించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది. ఈ ప్రొఫైలులోని పెట్టుబడిదారులు అడపాదడపా ధర అస్థిరత మరియు క్యాపిటలుకు ఒక మోస్తరు రిస్కుకు లోనుకావచ్చు మరియు ఈ ప్రొఫైల్ కోసం సిఫారసు చేయబడిన హోల్డింగ్ సమయం 15-20 సంవత్సరాలు.

అగ్రెసివ్ : వృద్ధి పెట్టుబడిదారుడుగా, మీ ప్రాథమిక లక్ష్యం దీర్ఘకాలంలో, మీ క్యాపిటల్ ను చాలా దూకుడుగా వృద్ధి చేసుకోవడం. మీకు అదనపు రిస్కులు తీసుకునే అనుభవం మరియు నగదు ఉండి ఉండవచ్చు, స్వల్పకాలిక అస్థిరతచే ప్రభావితం కాకపోవచ్చు, మరియు మార్కెట్ యొక్క వాతావరణం ఆధారంగా మీరు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే మీరు చాలా తక్కువ మొత్తం తిరిగి పొందుతారనే విషయం మీకు తెలిసి ఉంటుంది. ఈ ప్రొఫైల్ తరచుగా అస్థిరతకు లోనవుతుంది మరియు క్యాపిటలుకు అధిక రిస్క్ ఉంటుంది మరియు సిఫారసు చేయబడిన హోల్డింగ్ సమయం 20 లేదా ఎక్కువ సంవత్సరాలు.


స్కోర్

స్కోరింగ్ సిస్టమ్ :

0-10 : సెక్యూర్

11-20 : కన్జర్వేటివ్

21-30 : బ్యాలెన్స్డ్

31-40 : ఎంటర్ప్రైజింగ్

41-50 : అగ్రెసివ్