మీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఎలా తగ్గించుకోవాలి?
ఒక హోమ్ లోన్ అనేది దాని పరిమాణం మరియు సుదీర్ఘమైన అవధి కారణంగా ఖరీదైన బాధ్యతలలో ఒకటి. సహజంగా, ఒక లోన్ అవధి ఒక దశాబ్దం లేదా రెండు దశాబ్దాలు ఉన్నట్లయితే, చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, తక్కువ వడ్డీ రేటుని పొందడం ద్వారా, మీరు మీ హోమ్ లోన్ పై చెల్లించే వడ్డీని భారీగా తగ్గించుకోవచ్చు మరియు చాలా డబ్బును ఆదా చేయవచ్చు.
మీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ పరిగణించండి
ఒక హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది ఒక ఆచరణీయమైన పరిష్కారం, ఎందుకంటే ఇది మరింత అనుకూలమైన నిబంధనలతో మరొక రుణదాతకు మారడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ మార్పు మీకు నిజంగా లాభదాయకంగా ఉందా అని నిర్ధారించడానికి, మీరు అప్లై చేయడానికి ముందు హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ క్యాలిక్యులేటర్ ఉపయోగించండి. చాలా తక్కువ రేటు ఉన్నప్పటికీ, అవధిలో చాలా ఆలస్యంగా బదిలీ చేయడం అనేది ఉత్తమ నిర్ణయం కాకపోవచ్చు. తెలివైన నిర్ణయం తీసుకోవడానికి క్యాలిక్యులేటర్ మీకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.
ఒక ఫ్లోటింగ్ వడ్డీ హోమ్ లోన్ ఎంపిక చేసుకోండి
ఇది మీరు రుణం పొందడానికి ముందు పనిచేసే ఒక విధానం. హోమ్ లోన్ వడ్డీ రేట్లు రకం ఆధారంగా మారుతూ ఉంటాయి కాబట్టి, సరైన రకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీకు ఒక ఫ్లోటింగ్ లేదా ఫిక్స్‌డ్ వడ్డీ రేటు ఎంచుకునే అవకాశం ఉంది మరియు కాలం గడిచే కొద్దీ మొదటి ఎంపిక సరసమైనదిగా ఉండే అవకాశం ఉంది. ఇది పెద్ద రిస్క్ తీసుకునే సామర్థ్యం కలిగిన వారికి ఉత్తమంగా సరిపోయే ఒక ఎంపిక మరియు మీరు చాలా పొదుపు చేసుకోవడానికి సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మీరు ఒక హోమ్ లోన్ పై వడ్డీ రేటును తగ్గించలేకపోతే, మీ వడ్డీ చెల్లింపును తగ్గించుకోండి. ఆచరించగల ఒక తెలివైన మార్గం ఏంటంటే రెగ్యులర్ పాక్షిక-ప్రీపేమెంట్లు చేయడం. మీ అసలు మొత్తాన్ని ముందస్తుగా చెల్లించడం వలన రుణం పై వసూలు చేయబడే వడ్డీ తగ్గుతుంది. మీరు ప్రతి చెల్లింపుతో ఖచ్చితంగా ఎంత ఆదా చేసుకోవచ్చో లెక్కించడానికి హోమ్ లోన్ పార్ట్ ప్రీపేమెంట్ క్యాలిక్యులేటర్ ఉపయోగించవచ్చు.