గృహ కొనుగోలు ప్రక్రియలో గృహానికి చెల్లింపు చేయుట కాకుండా వివిధ రకాల అదనపు ఖర్చులు ఉంటాయి. పార్కింగ్ ప్లేస్ కోసం లేదా నిర్వహణ ఫీజు కోసం చెల్లింపు వంటివి ఒక రకమైన ఛార్జీలు, మరొకటి ఏమిటంటే, మీ గృహ కొనుగోలు నియమాలను పూర్తి చేయుటకు మీరు చెల్లించాల్సిన తప్పనిసరి స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు. మరియు ఆస్తుల ధరలు పెరుగుతూ ఉండటంతో,మీరు గరిష్ట గృహ కొనుగోలు ఖర్చులను కవర్ చేసే ఒక మంచి హోమ్ లోన్ కోసం వెతక వలసి ఉంటుంది. అయినా, స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సామాన్యంగా మీ హోమ్ లోన్ మంజూరి నుండి మినహాయించబడతాయి. కాబట్టి, ఈ ఛార్జీలకు సాధారణంగా అయ్యే ఖర్చులకు అవతల అయ్యే ఖర్చుగా భావించి దానికి అనుగుణంగా పొదుపు చేయాలి
ఇటీవలే, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజును ఆస్తి ఖర్చు యొక్క 5–6% కు ఎలా తగ్గించాలి అనే దాని గురించి తెలిపింది, ఇది కొన్ని రాష్ట్రాలలో 12% వరకు గల కొనసాగుతున్న రేటుకు పోల్చబడుతుంది. ప్రస్తుతం, ఈ శాతం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారుతూ ఉంటుంది, మరియు ప్రభుత్వ విచక్షణాధికారం ప్రకారం నిర్ణయించబడుతుంది. కాబట్టి, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు NHB అభ్యర్థనకు అంగీకరిస్తే, రాబోవు కాలంలో ఈ ఛార్జీలు తగ్గించవచ్చు, దీనితో గృహ కొనుగోలును మీకు చవకగా అందించవచ్చు.
ఈ మధ్యలో, ఈ ఛార్జీల గురించి మరింత వివరంగా చూద్దాం.
స్టాంపు డ్యూటీ అంటే మీ గృహ కొనుగోలు పూర్తి చేయు సమయంలో జరిగే ఏవైనా ధనసంబంధమైన లావాదేవీపై వేయు పన్ను అని అర్థం, మరియు ఇది 1899. లో భారతీయ స్టాంపు చట్టం తరువాత అమలు చేయబడింది. ఇందులో రవాణా ఒప్పందాలు, విక్రయ ఒప్పందం మరియు పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ల వంటి లావాదేవీలపై పన్ను ఉంటుంది. మీరు స్టాంపు డ్యూటీ చెల్లించిన తరువాత మీరు ఈ డాక్యుమెంట్లను క్లెయిమ్ చేయవచ్చు. ఒక్కొక్క డాక్యుమెంట్ పై ఖచ్చితమైన డ్యూటీని, మీ ఆస్తి విలువ మరియు స్వభావాన్ని మూల్యాంకన చేయడం ద్వారా లెక్కిస్తారు. తరువాత ఇది సర్కిల్ రేట్ తో పోల్చబడుతుంది. అప్పుడు ఈ సొమ్ము, ఏది ఎక్కువ ఉందో ఆ విలువపై లెక్కించబడుతుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు అంటే, ఆస్తి మీ పేరుపై రిజిస్టర్ చేసుకోవడానికి, స్టాంపు డ్యూటీ పై చెల్లించవలసిన ఒక ఖర్చు. ఈ ఫీజు సాధారణంగా ఆస్తి యొక్క మొత్తం ఖర్చు లేదా దాని మార్కెట్ విలువ యొక్క 1% వద్ద, మీరు ఆస్తిని కొనుగోలు చేసిన ప్రదేశాన్ని బట్టి, లెక్కించబడుతుంది. ముంబైలో, ఉదాహరణకు, ఇది ఆస్తి యొక్క మొత్తం మార్కెట్ లేదా ఒప్పందం విలువ యొక్క 1% గా లేదా రూ. 30,000 గా, ఏది తక్కువగా ఉంటే అలా ఉంటుంది. కోల్‌కతాలో అయితే ఇది ఆస్తి యొక్క మొత్తం ఖర్చు యొక్క 1% గా ఉంటుంది. కాబట్టి, మీరు ఒక ఇంటిని రూ. 70 లక్షలకు కొనుగోలు చేస్తే, ఉదాహరణకు, ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ మొత్తం లో 1% గా ఉంటుంది, అంటే రూ. 70,000.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ, 1908. యొక్క భారతీయ రిజిస్ట్రేషన్ చట్టము ద్వారా అమలులోకి వచ్చింది. మీరు మీ ఇంటిని మీ ఆస్తి ఉన్న ప్రదేశంలోని సబ్-రిజిస్ట్రార్ వద్ద రిజిస్టర్ చేసుకోవడానికి ఈ సులభమైన దశలను అనుసరించండి.
• మీ ఆస్తి విలువను అంచనా వేయండి మరియు స్టాంపు డ్యూటీని లెక్కించండి.
• కావలసిన మొత్తం యొక్క నాన్-జ్యూడిషియల్ స్టాంపు పేపర్స్ ను కొనుగోలు చేయండి. మీరు ఆన్ లైన్ లో ఇ-స్టాంపు పేపర్స్ కూడా కొనవచ్చును.
• మీ తరపున మరియు కొనుగోలుదారు తరపున వ్యవహరించు ఒక అధీకృత అటార్నీని నియమించడము ద్వారా విక్రయ ఒప్పందం సిద్ధం చేసుకోండి.
• స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించండి.
• ఈ ఒప్పందాన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు సాక్షుల సమక్షంలో రిజిస్టర్ చేయించండి.
• అంటే గుర్తింపు ఋజువు, చిరునామా ఋజువు మరియు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లాంటి, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి.
• ఒకసారి డాక్యుమెంట్ వెరిఫై చేయబడితే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లుగా భావించబడుతుంది. మీకు డాక్యుమెంట్ల ఒరిజినల్ సెట్ ఇవ్వబడుతుంది మరియు రిజిస్ట్రార్ కార్యాలయంలో వారి రికార్డుల కోసం వీటి కాపీ భద్రపరచబడుతుంది.
ఇప్పుడు మీరు స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల గురించి మరియు మీ ఆస్తిని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కాబట్టి, మీరు ఒక ఇల్లు కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ సొమ్మును మీ బడ్జెట్ లో కలపడం మరవకండి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో గల స్టాంపు డ్యూటీ మరియు ఆస్తి రిజిస్ట్రేషన్ ఛార్జీల గురించి తెలుసుకోవడానికి మా స్టాంపు డ్యూటీ కాలిక్యులేటర్ ను ఉపయోగించండి.