హోమ్ లోన్ కొరకు చేసే వడ్డీ చెల్లింపులపై ఆదాయపు పన్ను ప్రయోజనాలను రూ. 1.5 లక్షలకు పెంచాలని 2020 కేంద్ర సార్వత్రిక బడ్జెట్లో ప్రతిపాదించబడినది. ఈ ప్రకారంగా, రుణగ్రహీతలు రూ.3.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు.
హోమ్ లోన్ పై చెల్లించే వడ్డీల పై రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను అందించే సెక్షన్ 80EEA క్రింద ఈ మినహాయింపు లభ్యమవుతుంది. సెక్షన్ 24(b) క్రింద ఉన్న ప్రస్తుత మినహాయింపు అయిన రూ. 2 లక్షలకు మించి ఈ హోమ్ లోన్ పన్ను ప్రయోజనాలు లభ్యమవుతాయి.
రూ. 45 లక్షల వరకు స్టాంప్ విలువ ఉన్న గృహాలను కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే ఈ హోమ్ లోన్ పన్ను మినహాయింపులను పొందవచ్చు. 31 మార్చి 2021 వరకు పొందిన రుణాలపై ఇంటి యజమానులు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా, రుణగ్రహీతలు గరిష్ఠంగా రూ. 7 లక్షల ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
PMAY CLSS స్కీం క్రింద హోమ్ లోన్లు పొందిన వారికి సెక్షన్ 80EEA క్రింద ఆదాయపు పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
ఆదాయపు పన్ను చట్టంలో హోమ్ లోన్ పై పన్ను రాయితీ అందించే సెక్షన్లు:
|
|
|
---|---|---|
సెక్షన్ 80C | అసలు మొత్తం రిపేమెంట్ పైన పన్ను మినహాయింపులు | రూ. 1.5 లక్ష |
సెక్షన్ 24 | చెల్లించవలసిన వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపులు | రూ. 2 లక్ష |
సెక్షన్ 80EE | మొదటిసారి ఇంటి కొనుగోలుదారులకు అదనపు హోమ్ లోన్ వడ్డీ పన్ను ప్రయోజనం | రూ. 50,000 |
రుణగ్రహీతలపై భారం తగ్గించి మరియు లోన్లను మరింత చవకగా చేయడానికి భారతదేశ ప్రభుత్వం ఈ ప్రయోజనాలను ఒక ఉపశమనం లాగా అందిస్తుంది.
ఒక హోమ్ లోన్ పొందిన తరువాత, మీరు నెలవారీ EMIల చెల్లింపులు చేయాలి, ఇందులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి – ప్రిన్సిపల్ మొత్తం మరియు చెల్లించవలసిన వడ్డీ. ఐటి యాక్ట్ ప్రకారం రుణగ్రహీతలు ఈ రెండు భాగాలపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
1. సెక్షన్ 80C
2. సెక్షన్ 24
3. సెక్షన్ 80EE
గమనించవలసిన కొన్ని ఇతర షరతులు:
మీరు హోమ్ లోన్‌ను జాయింట్‌గా తీసుకున్నట్లయితే, ప్రతి రుణగ్రహీత తాను చెల్లించవలసిన ఆదాయపు పన్ను లో వ్యక్తిగతంగా జాయింట్ హోమ్ లోన్ ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. చెల్లించవలసిన వడ్డీ పై గరిష్ఠంగా రూ 2 లక్షల వరకు మరియు ప్రిన్సిపల్ మొత్తం పై గరిష్టంగా 1.5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఇచ్చే జాయింట్ హోమ్ లోన్ లో కుటుంబ సభ్యులు ఎవరైనా, మిత్రులు, లేదా జీవిత భాగస్వామి కో-బారోవర్ గా ఉండవచ్చు.
దీనిలో ఉన్న ఏకైక షరతు ఏమిటంటే హోసింగ్ లోన్ కోసం అప్లై చేసే ప్రతి అప్లికెంట్ ఆ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కి సహ యజమాని అయి ఉండాలి.
మీరు ఇంకొక ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి రెండవ హోమ్ లోన్ తీసుకున్నట్లయితే, చెల్లించవలసిన వడ్డీలపై పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. ఇక్కడ, ఎటువంటి క్యాప్ పరిమితి లేనందువలన మీరు చెల్లించిన పూర్తి వడ్డీ మొత్తమును క్లెయిమ్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం, వ్యక్తులు కేవలం ఒక ఆస్తిలోనే నివసిస్తున్నట్టు క్లెయిమ్ చేసుకోవచ్చు మరియు మరొక దాని పై నోషనల్ రెంట్ ఆధారంగా పన్ను చెల్లింపులు చేయవచ్చు. తాజా కేంద్ర బడ్జెట్ ప్రకారం, ఒక వ్యక్తి రెండవ గృహాన్ని కూడా నివసిస్తున్న ఆస్తిగా క్లెయిమ్ చేసుకోవచ్చని ఒక ప్రతిపాదన చేయబడింది. దీని లక్ష్యం, రుణగ్రహీతలు పన్ను రూపంలో అధికంగా ఆదా చేసుకునే విధంగా సహాయపడటం.
హోమ్ లోన్ పై పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ సులభమైనది మరియు సరళమైనది.
స్వయం-ఉపాధి పొందే రుణగ్రహీతలు ఈ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. కానీ భవిష్యత్తులో అవసరాల నిమిత్తం వారు ఇవి దగ్గర ఉంచుకోవాలి.
ఇన్కమ్ టాక్స్ చట్టం 1961 క్రింద పన్ను మినహాయింపుల కోసం హోమ్ లోన్ రీపేమెంట్ అర్హత కలిగి ఉంది. సంవత్సరానికి ₹.2 లక్షల వరకు చెల్లించిన హోమ్ లోన్ వడ్డీ u/s 24 పన్ను మినహాయింపు పొందదగినది. సెక్షన్ 80C మినహాయింపును అనుమతిస్తుంది ₹ .1.5 లక్ష వరకు ప్రతి సంవత్సరం ప్రిన్సిపల్ రీపేమెంట్ పై. అదనపు మినహాయింపులు u/s 80EE మరియు 80EEA అందుబాటులో ఉన్నాయి.
ఇన్కమ్ టాక్స్ చట్టం 1961 యొక్క నిర్దిష్ట సెక్షన్ల క్రింద ఒక హోమ్ లోన్ కోసం గరిష్ట పన్ను మినహాయింపు పొందదగినది దిగువన జాబితా చేయబడింది.
స్వయంగా-నివసించడం కోసం లేదా అద్దెకు ఇవ్వడానికి ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసిన ఒక వ్యక్తి ఇన్కమ్ టాక్స్ చట్టం 1961 యొక్క u/s 24, 80C మరియు 80EEA అనుసరించి హోమ్ లోన్స్ పై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు. మీరు ఆ ఇంటి యొక్క ఒక సహ-యజమాని లేదా సహ-రుణగ్రహీత అయినా కూడా మీరు పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.
అవును, మీరు u/s 80C, నిర్మాణంలో ఉన్న ఒక ఆస్తికి హోమ్ లోన్ పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. అటువంటి మినహాయింపుకు ఈ క్రింది నియమాలు వర్తిస్తాయి.
ఒక హోమ్ లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం చెల్లించిన ప్రీమియంలు అనేవి రుణగ్రహీత రీపేమెంట్ చేస్తే మాత్రమే ఇన్కమ్ టాక్స్ చట్టం 1961 యొక్క సెక్షన్ 80C క్రింద పన్ను మినహాయింపు పొందుతాయి. అటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రుణదాత ఫైనాన్స్ చేసే మరియు రుణగ్రహీత లోన్ EMI ల ద్వారా రీపే చేసే నిర్దిష్ట పరిస్థితులలో, మినహాయింపులు అనుమతించబడవు.
u/s 24(b) మరియు 80C, ఒక హోమ్ లోన్ టాప్ అప్ పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉంటుంది అది ఇందుకోసం ఉపయోగించబడితే మాత్రమే –
అటువంటి క్లెయిమ్ చెల్లుబాటు అయ్యే రసీదులు మరియు డాక్యుమెంట్లతో బ్యాకప్ చేయబడి కూడా ఉండాలి.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా పన్ను ప్రయోజనాలను లెక్కించడానికి బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క ఆదాయపు పన్ను క్యాలిక్యులేటర్ ను ఉపయోగించండి. ఇది, నిర్ణీత హోమ్ లోన్ వివరాల ఆధారంగా డబ్బు మొత్తాన్ని వెంటనే లెక్కించే ఒక ఆన్‌లైన్ టూల్. ఆ వివరాలలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి, హోమ్ లోన్ మొత్తం, వడ్డీ రేటు, ఇప్పటికే ఉన్న పన్ను మినహాయింపులు, స్థూల వార్షిక వేతనం, మొదలైనవి.
అవసరమైన వివరాలను నమోదు చేయండి మరియు మీరు పొందగలిగే పన్ను ప్రయోజన వివరాలను సులభంగా తెలుసుకోండి.
ఇండియాలో, ఆస్తిని కొనుగోలు చేయడమనేది ఒక ముఖ్యమైన పెట్టుబడి నిర్ణయం. అందుకనే, మీ కలల సౌధాన్ని సొంతం చేసుకునేందుకు బజాజ్ ఫిన్‌సర్వ్ ని సంప్రదించండి మరియు ఆకర్షణీయమైన హోమ్ లోన్ వడ్డీ రేటుతో పాటు ఇతర ప్రయోజనాలను పొందండి.