హోమ్ లోన్ ప్రీపేమెంట్ ప్రాసెస్ లో ఇవి ఉంటాయి:
1. రుణదాతకు సమాచారం: ప్రణాళిక చేసినదాని కంటే ముందుగా మీరు లోన్ చెల్లిస్తున్నారు కాబట్టి రుణదాతకు ముందుగా రాతపూర్వకంగా తెలపండి.
2. జరిమానా చెల్లించండి(ఏదైనా): RBI ఆదేశాల ప్రకారం, ఫ్లోటింగ్ వడ్డీరేటుపై రుణదాత ప్రీపేమెంట్ పెనాల్టీ ఫీజు విధించకూడదు. కానీ కొందరు రుణదాతలు మీ హోమ్ లోన్ ఫోర్ క్లోజింగ్ కోసం ఫీజు వసూలు చేస్తారు
3. ఫోర్క్లోజర్: మీ తొలి EMI చెల్లించిన తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్ కు ఎంత మొత్తం అయినా(కనీసం మూడు EMI లకు సమానం) మీరు ముందుగా చెల్లించవచ్చు. హోమ్ లోన్ పాక్షిక ప్రీపేమెంట్ కోసం గరిష్ఠ చెల్లింపు పై ఎలాంటి పరిమితి లేదు
హోమ్ లోన్ ప్రీపేమెంట్ ఉపాయాలు
• లోన్ అవధి కంటే ముందు ప్రీపేమెంట్ కోసం ప్రణాళిక.
• ఫోర్క్లోజర్ కోసం కాకుండా ప్రయోజనాలు పొందడానికి నిధుల వినియోగం.
• రుణదాత నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్ పొందడం.
• ఫోర్క్లోజర్ టైమ్ లో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పొందడం.
• నిర్ణయానికి ముందు పన్ను ప్రయోజనాలను చెక్ చేయండి.
హోమ్ లోన్ ప్రీపేమెంట్ నియమాలు
• మీరు ప్రీ పే చెయ్యాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రభుత్వ గుర్తింపు రుజువును వెంట తీసుకువెళ్ళండి.
• ప్రీపేమెంట్ కోసం సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించండి.
• దుర్వినియోగం కాకుండా ఋణదాత వద్ద నుంచి ఉపయోగించని చెక్కులను పొందండి.
బజాజ్ ఫిన్సర్వ్ హోమ్ లోన్ఫోర్క్లోజర్ కు ఎలాంటి అదనపు రుసుమును వసూలు చేయదు. ఆన్లైన్ కస్టమర్ పోర్టల్ - ఎక్స్పీరియా ద్వారా మీకు అనుకూలంగా ముందస్తు చెల్లింపులు చేయవచ్చు.
అదనంగా చదవండి: మీ హోమ్ లోన్ ని ప్రీపే చేసేటప్పుడు మనస్సులో ఉంచుకోవలసిన అంశాలు