మా కస్టమర్ పోర్టల్ నుండి మరింత పొందండి
మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ ప్రోడక్ట్‌ను ఎంచుకున్నప్పుడు, మిమ్మల్ని మీ సంప్రదింపు వివరాలు, కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను అందజేయాలని అడగడం జరుగుతుంది. ఆ సమాచారం ఉన్నత స్థాయి ప్రమాణాలలో భద్రపరచబడుతుంది. తదుపరి, మా కస్టమర్ సర్వీస్ ప్లాట్‌ఫారం - మై అకౌంట్లో మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
మై అకౌంట్‌లో, మీరు బజాజ్ ఫిన్‌సర్వ్‌తో మీ ప్రస్తుత సంబంధాలు అన్నింటినీ చూడవచ్చు మరియు మీ స్టేట్‌మెంట్లను తనిఖీ చేయవచ్చు, మీ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు చెల్లింపులు చేయవచ్చు.
మీరు లోన్లు, కార్డులు, ఇన్సూరెన్స్ మరియు మరెన్నో వంటి మా ప్రోడక్టులకు సంబంధించి అద్భుతమైన ఆఫర్లకు యాక్సెస్ పొందుతారు.
అందువల్ల మీరు, మీ వివరాలు మా రికార్డులలో క్రమం తప్పకుండా అప్‌డేట్ అయ్యేలా చూసుకోవాలి. మీరు మీ ఫోన్ నంబర్‌ను మార్చినట్లయితే లేదా వేరొక చిరునామాకు మారినట్లయితే – ఆ వివరాలు మా కస్టమర్ పోర్టల్‌లో కూడా కనిపించాలి.
మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసి ఉంచడంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
- మా ప్రోడక్ట్‌లు మరియు సర్వీసులకు తక్షణ యాక్సెస్
- సమస్యల విషయంలో త్వరిత సహాయం
- మీ ఇమెయిల్ ఇన్‌బాక్స్‌కు నెలవారీ రుణం స్టేట్‌మెంట్లు డెలివరీ చేయబడతాయి
- డేటా రక్షణ కోసం రెండు-దశల ప్రమాణీకరణ
- లోన్లు, కార్డులు మరియు మరిన్ని వాటిపై ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లు
మీ సంప్రదింపు వివరాలను నిర్వహించండి
మీ సంప్రదింపు వివరాలు అనేవి మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి మరియు ప్రస్తుత నివాస చిరునామాను కలిగి ఉంటాయి. మా రికార్డులలో కనిపించినప్పుడు మీరు మీ వివరాలను ధృవీకరించవచ్చు మరియు వాటిని మై అకౌంట్‌లో సవరించవచ్చు.
దయచేసి మీ పాన్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడి యొక్క స్వీయ-ధృవీకరించబడిన కాపీని అందుబాటులో ఉంచుకోండి.
ఇలా చేయడం ద్వారా మీరు మా నుండి ఏదైనా ముఖ్యమైన సర్వీస్ సంబంధిత సమాచారాన్ని ఎప్పుడూ మిస్ అవకుండా ఉండచ్చు.
-
మీ మొబైల్ నంబర్ నవీకరించండి
ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మై అకౌంట్లో మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయవచ్చు:
- మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడానికి ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయండి.
- ప్రొఫైల్ విభాగానికి వెళ్లడానికి మీ పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఓటిపి ని ఎంటర్ చేయండి.
- మొబైల్ నంబర్ క్రింద 'సవరించండి' టెక్స్ట్‌పై క్లిక్ చేయండి.
- ధృవీకరణ కోసం మీ పుట్టిన తేదీ/బ్యాంక్ అకౌంట్ నంబర్/ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ నంబర్‌ను ఉపయోగించండి.
- మీ కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి మరియు కొనసాగండి.
- మాతో రిజిస్టర్ చేయబడిన మీ పాత మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపి ని ధృవీకరించండి.
క్రింద ఉన్న 'మీ మొబైల్ నంబర్‌ను సవరించండి' టెక్స్ట్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను కూడా మార్చవచ్చు. మీరు మై అకౌంట్ యొక్క ప్రొఫైల్ విభాగానికి మళ్ళించబడతారు, ఇక్కడ మీరు మీ ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయవచ్చు.
మాతో రిజిస్టర్ చేయబడిన మీ పాత మొబైల్ నంబర్ పై అప్‌డేట్ చేయబడిన వివరాల గురించి మీరు రెండు వ్యాపార రోజుల్లోపు ఒక నిర్ధారణ ఎస్ఎంఎస్ అందుకుంటారు.
-
మీ ఇమెయిల్ ఐడిని అప్‌డేట్ చేయండి
ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు మై అకౌంట్లో మీ ఇమెయిల్ ఐడిని అప్‌డేట్ చేయవచ్చు:
- మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడానికి ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయడం.
- మీ ప్రొఫైల్‌ను చూడడానికి మీ పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్‌తో సైన్-ఇన్ అవ్వండి.
- మీ 'ఇమెయిల్ ఐడి' కింద 'సవరించండి' ఎంపికపై క్లిక్ చేయండి.
- ధృవీకరణ కోసం మీ పుట్టిన తేదీ/బ్యాంక్ అకౌంట్ నంబర్/ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ నంబర్‌ను ఉపయోగించండి.
- మీ కొత్త ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మరియు ఈ ఐడికి పంపబడిన ఓటిపి తో ధృవీకరించండి.
క్రింద ఉన్న 'మీ ఇమెయిల్ ఐడి సవరించండి' టెక్స్ట్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు మై అకౌంట్‌లోని ప్రొఫైల్ విభాగాన్ని కూడా సందర్శించవచ్చు.
మీ కొత్త ఇమెయిల్ ఐడికి ఓటిపి పంపబడుతుందని దయచేసి గమనించండి.
ఒకసారి పూర్తయిన తర్వాత, మీరు రెండు వ్యాపార రోజుల్లోపు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై అప్‌డేట్ చేయబడిన వివరాల గురించి ఒక నిర్ధారణ సందేశాన్ని పొందుతారు.
-
మీ నివాస చిరునామాను అప్‌డేట్ చేయండి
ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు మై అకౌంట్లో మీ నివాస చిరునామాను సవరించవచ్చు:
- ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించండి.
- మీ ప్రొఫైల్‌ను సందర్శించడానికి మీ పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- ‘ప్రస్తుత చిరునామా' విభాగం క్రింద ఉన్న 'సవరించండి' ఎంపికపై క్లిక్ చేయండి.
- మీ పుట్టిన తేదీ/ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్/బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉపయోగించి మీ వివరాలను ధృవీకరించండి.
- మీ అప్‌డేట్ చేయబడిన చిరునామాను నమోదు చేయండి మరియు సపోర్టింగ్ చిరునామా రుజువు డాక్యుమెంట్ యొక్క స్వీయ-ధృవీకరించబడిన కాపీని అప్‌లోడ్ చేయండి.
-
మీ ప్రొఫైల్‌ను చూడండి
మై అకౌంట్‌కు సైన్-ఇన్ చేయడం ద్వారా మీ సమాచారాన్ని తనిఖీ చేయండి.
మీ వ్యక్తిగత వివరాలను నిర్వహించండి
మీ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) మరియు పుట్టిన తేదీ వంటి మీ వ్యక్తిగత వివరాలు మీ ప్రొఫైల్‌ను ధృవీకరించడానికి సులభమైన మార్గాలు. మా సర్వీసులకు మీకు త్వరిత యాక్సెస్‌ను ఇవ్వడానికి ఇవి మా రికార్డులలో నిర్వహించబడతాయి.
మై అకౌంట్‌తో, మీరు కేవలం కొన్ని క్లిక్‌లలో ఈ వివరాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు మరియు అప్‌డేట్ చేయవచ్చు.
దయచేసి ఈ అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లలో (ఒవిడిలు) ఏదైనా ఒకదాని యొక్క స్వీయ-ధృవీకరించబడిన కాపీని ఉంచండి – పాన్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, నరేగా జాబ్ కార్డ్ లేదా జాతీయ జనాభా రిజిస్టర్ చేత జారీ చేయబడిన లేఖ – అందుబాటులో ఉంచుకోండి.
-
మీ పుట్టిన తేదీని అప్‌డేట్ చేయండి
ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మై అకౌంట్లో మీ పుట్టిన తేదీని సవరించవచ్చు:
- మా రెండు-దశల ప్రామాణీకరణను ఉపయోగించి మై అకౌంట్‌కు సైన్-ఇన్ అవ్వండి.
- ప్రొఫైల్ విభాగాన్ని సందర్శించండి మరియు పుట్టిన తేదీ విభాగంలో 'సవరించండి' పై క్లిక్ చేయండి.
- మీ పాన్/ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్/బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉపయోగించి మీ పుట్టిన తేదీని ధృవీకరించండి.
- మీ పుట్టిన తేదీని అప్‌డేట్ చేయండి మరియు సపోర్టింగ్ డాక్యుమెంట్ యొక్క స్వీయ-ధృవీకరించబడిన కాపీని అప్‌లోడ్ చేయండి.
ప్రారంభించడానికి మీరు క్రింద ఇవ్వబడిన 'మీ పుట్టిన తేదీని సవరించండి' ఎంపికపై క్లిక్ చేయవచ్చు. మార్పు చేయడానికి మీరు 'మై అకౌంట్'కు సైన్-ఇన్ చేయమని మరియు ప్రొఫైల్ విభాగాన్ని సందర్శించమని అడగబడతారు. రెండు వ్యాపార రోజుల్లోపు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై అప్‌డేట్ చేయబడిన వివరాల గురించి మీరు ఒక నిర్ధారణ ఎస్ఎంఎస్ అందుకుంటారు.
కెవైసి అంటే ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యమైనది?
మీరు ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్‌ను ఎంచుకున్నప్పుడు, మీ సంప్రదింపు సమాచారం మరియు కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్లను షేర్ చేయాలని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇది మీ గుర్తింపును నిర్ధారించడానికి మరియు మీ ప్రొఫైల్‌ను ధృవీకరించడానికి ఉపయోగపడుతుంది.
కస్టమర్ గుర్తింపును ధృవీకరించే ప్రక్రియను 'మీ కస్టమర్‌ను తెలుసుకోండి' (కెవైసి) అని పిలుస్తారు. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా అవసరమైన తప్పనిసరి ప్రాసెస్.
మీ కెవైసి వివరాలను ధృవీకరించడం ద్వారా, మా ప్రోడక్ట్‌లు జెన్యూన్ కస్టమర్లకు మాత్రమే అందించబడతాయి. ఇది మనీ లాండరింగ్ మరియు మోసాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
ఒక కస్టమర్ చేయవలసిన రెండు రకాల కెవైసిలు ఉన్నాయి:
-
లోన్లు మరియు డిపాజిట్ల కోసం కెవైసి
మీరు ఏదైనా రుణం లేదా డిపాజిట్ ప్రోడక్ట్‌ను ఎంచుకున్నప్పుడు, మీరు మీ ఐడి రుజువు మరియు చిరునామా రుజువును సమర్పించడం ద్వారా మీ కెవైసి ధృవీకరణను పూర్తి చేయాలి.
-
వాలెట్ల కోసం కెవైసి
మొబైల్ నంబర్, పేరు యొక్క స్వీయ-ప్రకటన మరియు ఐడి రుజువు వంటి కనీస వివరాలతో చిన్న వాలెట్ లేదా ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు (పిపిఐ) జారీ చేయబడవచ్చు. అయితే, ఏదైనా బ్యాంక్ అకౌంట్‌కు డబ్బు పంపడానికి లేదా ట్రాన్స్‌ఫర్ చేయడానికి మీ వాలెట్‌ను ఉపయోగించడానికి మీరు మీ ఫుల్ కెవైసిని పూర్తి చేయాలి.
-
మీరు లోన్లు, డిపాజిట్లు మరియు పిపిఐల కోసం తీసుకురావలసిన డాక్యుమెంట్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:
తప్పనిసరి డాక్యుమెంట్లు - ఫోటోగ్రాఫ్, పాన్ లేదా ఫారం 60 (పాన్ లేకపోతే).
గుర్తింపు రుజువు (పిఒఐ) – పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ లేదా నరేగా జాబ్ కార్డ్.చిరునామా రుజువు (పిఒఎ) – పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ లేదా జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖ. పైన పేర్కొన్న డాక్యుమెంట్లపై మీ ప్రస్తుత చిరునామా అప్‌డేట్ చేయబడకపోతే, మీరు ఈ డాక్యుమెంట్లలో ఏదైనా ఒకదాన్ని సబ్మిట్ చేయవచ్చు, యుటిలిటీ బిల్లులు, ఆస్తి పన్ను రసీదు, పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు (పిపిఒలు), యజమాని నుండి వసతి కేటాయింపు లేఖ.
తరచుగా అడిగే ప్రశ్నలు
మీరు మా ప్రోడక్ట్‌లో దేనినైనా ఎంచుకున్నప్పుడు, మీరు మీ పాన్ మరియు పుట్టిన తేదీ వంటి మీ వ్యక్తిగత వివరాలను మాతో షేర్ చేయాలి. మీరు ఈ వివరాలలో దేనినైనా మీ మై అకౌంట్ ప్రొఫైల్‌లో అసంపూర్ణంగా కనుగొన్నట్లయితే, ఈ ప్రయోజనాలను పొందడానికి మీరు వెంటనే దానిని అప్‌డేట్ చేయాలి:
- మా నుండి ముఖ్యమైన సర్వీస్ సంబంధిత కమ్యూనికేషన్‌ను అందుకోండి.
- మీ అకౌంట్‌లో మోసపూరిత కార్యకలాపాలను నివారించండి.
- మీకు ఏవైనా అకౌంట్ సంబంధిత సమస్యలు ఉంటే తక్షణ సహాయం పొందండి.
నా వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేయండి
మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు యాక్సెస్ లేకపోతే, మీ ప్రొఫైల్ సమాచారానికి సంబంధించిన ఏవైనా మార్పులను ప్రారంభించడానికి దయచేసి మా సమీప శాఖను సందర్శించండి.
మీ మొబైల్ నంబర్ అనేది మీరు మాతో షేర్ చేసే మీ సంప్రదింపు వివరాలలో ఒక ముఖ్యమైన భాగం. మార్పు విషయంలో, మీరు కొన్ని సులభమైన దశలలో మీ వివరాలను సవరించవచ్చు:
- మీ పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్ ఉపయోగించి మై అకౌంట్‌కు సైన్-ఇన్ అవ్వండి.
- మొబైల్ నంబర్ విభాగంలో 'సవరించండి' ఎంపికను ఎంచుకోండి మరియు మీ పాన్/ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ నంబర్/ బ్యాంక్ అకౌంట్ నంబర్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించండి.
- మాతో రిజిస్టర్ చేయబడిన మీ పాత మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపి ని ఎంటర్ చేయండి మరియు సబ్మిట్ చేయండి.
- రెండు వ్యాపార రోజుల్లోపు మీ పాత మొబైల్ నంబర్ పై నిర్ధారణ పొందండి.
నా మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి
మీరు మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా కేవలం కొన్ని క్లిక్‌లలో మీ ఇమెయిల్ ఐడిని అప్‌డేట్ చేయవచ్చు. మాతో మీ ఇమెయిల్ ఐడిని అప్‌డేట్ చేయడానికి ఈ సులభమైన దశలను అనుసరించండి:
- మీ ప్రొఫైల్‌ను వీక్షించడానికి మీ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీతో మై అకౌంట్‌కు సైన్-ఇన్ అవ్వండి.
- ఇమెయిల్ ఐడి విభాగంలో 'సవరించండి' ఎంపికను ఎంచుకోండి మరియు కొనసాగండి.
- మీ పాన్/ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్/ బ్యాంక్ అకౌంట్ నంబర్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించండి.
- మీ కొత్త ఇమెయిల్ ఐడికి పంపబడిన ఓటిపి ని ఎంటర్ చేయండి మరియు మీ అభ్యర్థనను సమర్పించండి.
మీరు అభ్యర్థనను సమర్పించిన తర్వాత, మీరు మీ అభ్యర్థనను ట్రాక్ చేయగల ఒక సర్వీస్ అభ్యర్థన నంబర్‌ను అందుకుంటారు. మా రికార్డులలో మీ ఇమెయిల్ ఐడిని అప్‌డేట్ చేయడానికి సాధారణంగా మాకు రెండు వ్యాపార రోజులు పడుతుంది.
నా ఇమెయిల్ ఐడిని అప్‌డేట్ చేయండి
మీరు విజయవంతంగా మీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత, మీ అకౌంట్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడానికి మాకు రెండు వ్యాపార రోజులు పడుతుంది. మీ వివరాలు మా రికార్డులలో అప్‌డేట్ చేయబడిన తర్వాత మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై ఒక నిర్ధారణ సందేశాన్ని అందుకుంటారు.
మీరు మీ మై అకౌంట్ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసినప్పుడు, మార్పులు మీ ద్వారా ప్రారంభించబడ్డాయో లేదో ధృవీకరించడం మాకు ముఖ్యం. అందువల్ల, మీరు మీ పాన్/ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్/ బ్యాంక్ అకౌంట్ నంబర్ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించాలి. ధృవీకరణ యొక్క ఈ పద్ధతి ఏవైనా మోసపూరిత కార్యకలాపాలను నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది మీ అనుమతి లేకుండా మీ అకౌంట్‌ను ఎవరైనా ఉపయోగించడాన్ని నివారిస్తుంది.
మీ సంతకం దాని ఫోటోకాపీపై ఉంచడం ద్వారా మీరు మీ డాక్యుమెంట్‌ను స్వీయ-ధృవీకరించవచ్చు.
మీరు మీ మై అకౌంట్ ప్రొఫైల్‌లో ఏవైనా మార్పులు చేసినప్పుడు, మీరు ధృవీకరణ కోసం ఒక స్వీయ-ధృవీకరించబడిన కెవైసి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
మీరు మాతో మీ వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేస్తున్నప్పుడు, మీరు ధృవీకరణ కోసం కెవైసి డాక్యుమెంట్ల స్వీయ-ధృవీకరించబడిన కాపీని సమర్పించాలి.
మీరు ఈ డాక్యుమెంట్లలో ఒకదాన్ని సమర్పించవచ్చు - గుర్తింపు రుజువుగా పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, నరేగా జాబ్ కార్డ్ లేదా మాస్క్ చేయబడిన ఆధార్ కార్డ్ (మొదటి ఎనిమిది అంకెలు). చిరునామా రుజువుగా, మీరు మీ పాన్ మినహా, పైన పేర్కొన్న డాక్యుమెంట్లలో దేనినైనా సబ్మిట్ చేయవచ్చు.
మీరు రెండు ఓటిపిలను అందుకున్నప్పుడు మరియు వాటిలో ఏదైనా ఒకదాన్ని నమోదు చేసినప్పుడు ఈ సమస్య సాధారణంగా సంభవిస్తుంది. దీనిని పరిష్కరించడానికి, కొంత సమయం వేచి ఉండండి మరియు 'ఓటిపి మళ్ళీ పంపండి' బటన్ పై ఒకసారి మాత్రమే క్లిక్ చేయండి. మీరు మీ మొబైల్ నంబర్‌కు పంపబడిన కొత్త ఓటిపి ని తిరిగి ఎంటర్ చేయడానికి ప్రయత్నించవచ్చు.
మా రికార్డులలో మీ పేరు తప్పుగా ఉంటే, మీరు మా 'అభ్యర్థనను లేవదీయండి' సదుపాయాన్ని ఉపయోగించి దానిని అప్‌డేట్ చేయవచ్చు. మీరు మీ అభ్యర్థనను లేవదీసేటప్పుడు దయచేసి ఈ డాక్యుమెంట్లలో ఒకదాన్ని అందుబాటులో ఉంచుకోండి - పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్.
మీరు అభ్యర్థనను సమర్పించిన తర్వాత, మీరు ఒక సర్వీస్ అభ్యర్థన నంబర్‌ను అందుకుంటారు. మీ అభ్యర్థన స్థితిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడానికి మీరు ఈ అభ్యర్థన నంబర్‌ను ఉపయోగించవచ్చు.
మీ అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లలో మీ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, నరేగా జాబ్ కార్డ్ లేదా జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖ ఉంటాయి.
మీ అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు ఏవీ మీ ప్రస్తుత చిరునామాతో అప్‌డేట్ చేయబడకపోతే, మీరు అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు (డిఒవిడి)ను సబ్మిట్ చేయవచ్చు.
మీ డిఒవిడి అనేది దరఖాస్తుదారు పేరులోని మీ ఇటీవలి యుటిలిటీ బిల్లులలో ఏదైనా కావచ్చు (విద్యుత్, టెలిఫోన్, పోస్ట్-పెయిడ్ మొబైల్ ఫోన్, పైప్డ్ గ్యాస్ లేదా నీటి బిల్లు). ఇది ఒక ఆస్తి లేదా మునిసిపల్ పన్ను రసీదు, పెన్షన్ లేదా కుటుంబ పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు (పిపిఒలు), రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, చట్టబద్ధమైన లేదా నియంత్రణ సంస్థలు, పిఎస్‌యు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు జాబితా చేయబడిన కంపెనీల ద్వారా ఇవ్వబడిన యజమాని నుండి వసతి కేటాయింపు లేఖ అయి ఉండవచ్చు.
అయితే, మీరు మీ డిఒవిడి సమర్పించిన మూడు నెలల్లోపు మీ ప్రస్తుత చిరునామాతో అప్‌డేట్ చేయబడిన అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లలో ఏదైనా ఒకదాన్ని సమర్పించాలి.