మై అకౌంట్‌ విభాగం నుండి మీ లోన్లను నిర్వహించండి

మై అకౌంట్‌ విభాగం నుండి మీ లోన్లను నిర్వహించండి

మా కస్టమర్ పోర్టల్‌లో మీ లోన్ అకౌంట్‌ను ట్రాక్ చేయండి

మీరు ఒక రుణం తీసుకున్నప్పుడు, దానిని కొంత కాలవ్యవధిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో మీరు ప్రతి నెలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (ఇఎంఐ) అనే ఒక నిర్ధిష్ట మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.

అయితే, మీరు ఇఎంఐలను సకాలంలో చెల్లించడమే కాకుండా, లోన్‌‌కు సంబంధించి మరెన్నో వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. మీరు రుణానికి సంబంధించి అన్ని వివరాలను తెలుసుకోవాలి - తిరిగి చెల్లించిన మొత్తం, మీరు ఇప్పటికీ చెల్లించవలసిన మొత్తం, మీ లోన్ స్టేట్‌మెంట్, మీ రీపేమెంట్ షెడ్యూల్ మరియు మరెన్నో.

బజాజ్ ఫిన్‌సర్వ్ మీ వ్యక్తిగత మరియు వ్యాపార ఖర్చులను నిర్వహించుకోవడంలో మీకు సహాయపడే అనేక ప్రత్యేకమైన అన్‍సెక్యూర్డ్ మరియు సెక్యూర్డ్ రుణ పరిష్కారాలను అందజేస్తుంది. అలాగే, మా కస్టమర్ పోర్టల్ – మై అకౌంట్ ద్వారా మీరు మీ లోన్‌ను సులభంగా నిర్వహించుకోవడానికి ఉపయోగపడే అనేక సెల్ఫ్-సర్వీస్ ఆప్షన్లను కనుగొనవచ్చు.

వీటిలో బహుళ రీపేమెంట్ ఆప్షన్లు ఉన్నాయి, మీ డాక్యుమెంట్లకు త్వరిత ప్రాప్యత మరియు మీ అకౌంట్ సమాచారం పై ఎక్కువ నియంత్రణ ఉంటాయి.

మీరు ఒక బ్రాంచ్‌ను సందర్శించకుండానే ఇవన్నీ చేయవచ్చు.

మీ ప్రాథమిక వివరాలతో లాగిన్ అవ్వండి మరియు మా రుణ సంబంధిత అన్ని సేవలకు ప్రాప్యత పొందండి:

  • Loan details

    లోన్ వివరాలు

    మీ ఇఎంఐలు, చెల్లింపు స్థితి, తేదీలు మరియు మరెన్నో వంటి మీ లోన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ట్రాక్ చేయండి.

  • Account statements and documents

    అకౌంట్ స్టేట్‌మెంట్లు మరియు డాక్యుమెంట్లు

    మీ లోన్ అకౌంట్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ పై నిఘా ఉంచండి, మీరు చెల్లించే ఇఎంఐ మొదలుకొని ఇతర ఫీజులు, ఛార్జీలు మరియు మరెన్నో వాటి పై దృష్టి పెట్టండి.

  • EMI repayment

    ఇఎంఐ రీపేమెంట్

    మీరు అప్పుగా తీసుకున్న మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించండి లేదా మీ లోన్‌ను సులభంగా ఫోర్‌క్లోజ్ చేయండి.

  • Withdraw funds

    నిధులు విత్‍డ్రా చేయండి

    కేవలం కొన్ని క్లిక్‌లలో మీ ఫ్లెక్సీ లోన్ అకౌంట్ నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోండి మరియు మీ బ్యాంక్ అకౌంట్లో నగదును జమచేయండి.

  • Bank account update

    బ్యాంక్ అకౌంట్ అప్‌డేట్

    మీ డ్రాడౌన్ మరియు రీపేమెంట్ లాంటి బ్యాంక్ అకౌంటు వివరాలను సులభంగా నిర్వహించుకోండి.

మీ రుణ వివరాలను నిర్వహించండి

బజాజ్ ఫిన్‌సర్వ్ నుండి మీరు తీసుకునే ప్రతి లోన్‌కు ఒక ప్రత్యేక లోన్ అకౌంట్ నంబర్ (ఎల్ఎఎన్) కేటాయించబడుతుంది. ఎల్ఎఎన్ ఒక గుర్తింపుగా పనిచేస్తుంది, ఇది మీ లోన్ స్థితి (యాక్టివ్‌గా ఉన్నది లేదా మూసివేయబడింది)ని, తిరిగి చెల్లించిన ఇఎంఐల సంఖ్య, బాకీ ఉన్న మొత్తంతో పాటు మీ పూర్తి లోన్‌ వివరాలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది.

మీరు ఈ రుణ వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించడం ముఖ్యం, తద్వారా మీరు మీ బాధ్యతల గురించి తెలుసుకుని మీ ఫైనాన్సులను మెరుగ్గా నిర్వహించగలుగుతారు.

  • View your loan details

    మీ లోన్ వివరాలను చూడండి

    మీరు ఈ సాధారణ దశలను అనుసరించడం ద్వారా మై అకౌంట్‌లో మీ లోన్ వివరాలను చెక్ చేయవచ్చు:

    • ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్‌ను క్లిక్ చేసి మా కస్టమర్ పోర్టల్‌కు కొనసాగండి.
    • మీ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయండి, సైన్-ఇన్ చేయడానికి ఒటిపి సబ్మిట్ చేయండి.
    • 'నా సంబంధాలు' విభాగం నుండి మీరు వివరాలను చూడాలనుకుంటున్న లోన్‌ను ఎంచుకోండి.
    • రీపేమెంట్ స్టేటస్, ఇఎంఐ మొత్తం, తదుపరి గడువు తేదీ మొదలైనటువంటి రుణ వివరాలను చూడండి.


    దిగువన ఉన్న 'మీ లోన్ వివరాలను చెక్ చేయండి' టెక్స్ట్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ అన్ని రుణ వివరాలను తెలుసుకోవచ్చు. 'మై అకౌంట్'కు సైన్-ఇన్ అవమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సైన్-ఇన్ తర్వాత మీరు 'నా సంబంధాలు' విభాగంలోకి వెళతారు, అక్కడ మీరు వివరాలను తెలుసుకోవాలనుకుంటున్న లోన్ అకౌంట్‌ను ఎంచుకోవచ్చు.

    మీ లోన్ వివరాలను చెక్ చేయండి

  • మీ లోన్ అకౌంటును చెక్ చేయండి

    మీ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలతో మా కస్టమర్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.

మీ లోన్ స్టేట్‌మెంట్‌ను చూడండి

లోన్ స్టేట్‌మెంట్ అనేది మీ ప్రస్తుత లోన్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది రుణం పంపిణీ చేయబడిన తేదీ నుండి దానిని క్లోజ్ చేసే చివరి క్షణం వరకు మీ లోన్ అకౌంటులో జరిగిన ప్రతి లావాదేవికి సంబంధించిన రికార్డును కలిగి ఉంటుంది.

దీనికి అదనంగా, మీ లోన్ స్టేట్‌మెంట్లో ముఖ్యమైన అకౌంట్ సమాచారం, మీ తదుపరి ఇఎంఐ గడువు తేదీ, ఇప్పటివరకు తిరిగి చెల్లించిన మొత్తం, బాకీ ఉన్న అసలు మొత్తం మరియు మరెన్నో వివరాలు ఉంటాయి.

మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయండి, వాయిదాలు అలాగే మీ అకౌంట్ పై ఇతర మినహాయింపుల గురించి పూర్తిగా తెలుసుకోండి.

  • Download your account statement

    మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

    మీరు మై అకౌంట్ విభాగానికి వెళ్లి మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

    • మా కస్టమర్ పోర్టల్‌కు వెళ్ళడానికి ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయండి.
    • మా రెండు-దశల ప్రమాణీకరణను ఉపయోగించండి, ఓటిపిని ఎంటర్ చేసి సైన్-ఇన్ చేయండి.
    • మీరు అకౌంట్ స్టేట్‌మెంట్‌ను చూడాలనుకుంటున్న రుణాన్ని ఎంచుకోవడానికి 'డాక్యుమెంట్ సెంటర్' విభాగానికి వెళ్లండి.
    • డౌన్‌లోడ్ చేసుకోవడానికి 'అకౌంట్ స్టేట్‌మెంట్' పై క్లిక్ చేయండి.


    దిగువన ఉన్న 'మీ లోన్ స్టేట్‌మెంట్ చూడండి' ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ లోన్ స్టేట్‌మెంట్లను, ఇతర డాక్యుమెంట్లను చూడవచ్చు. మిమ్మల్ని 'మై అకౌంట్'కు సైన్-ఇన్ చేయమని అడగడం జరుగుతుంది మరియు అక్కడ మీ లోన్ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ను వీక్షించడానికి మీరు 'డాక్యుమెంట్ సెంటర్' విభాగానికి మళ్ళించబడతారు.

    మీ లోన్ స్టేట్‌మెంట్‌ను చూడండి

మీ రుణ చెల్లింపులను మేనేజ్ చేసుకోండి

ఒకసారి మీ రుణం మీకు పంపిణీ చేయబడిన తర్వాత, మీ నెలవారీ వాయిదాలు ముందుగా-నిర్ణయించిన తేదీన మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమెటిక్‌గా మినహాయించబడతాయి. ఈ తేదీ సాధారణంగా తరువాతి నెలలో రెండవ రోజుగా ఉండవచ్చు.

మీ ఎన్ఎసిహెచ్ (నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్) మాండేట్ నేరుగా మీ బ్యాంక్ అకౌంటు నుండి ఆటో-చెల్లింపులను అనుమతిస్తుంది. ఒకసారి మీ లోన్ బుక్ అయిన తర్వాత మీరు ఏ ఇతర చెల్లింపులు అమలు చేయాల్సిన అవసరం లేదు.

అయితే, మీరు ఏవైనా అదనపు చెల్లింపులు చేయాలనుకుంటే మై అకౌంట్ నుండి సులభంగా చేయవచ్చు.

అడ్వాన్స్ ఇఎంఐలు, పార్ట్-ప్రీపేమెంట్లు మరియు గడువు మీరిన ఇఎంఐలు

మీరు మీ రాబోయే ఇఎంఐని గడువు తేదీకి ముందుగానే చెల్లించాలనుకుంటే, అడ్వాన్స్ ఇఎంఐ ఆప్షన్ ద్వారా చెల్లించవచ్చు. ఒక సింగిల్ అడ్వాన్స్ ఇఎంఐ తదుపరి నెలలో మీ వాయిదాకు ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయబడుతుంది. అంటే రాబోయే గడువు తేదీన మీ ఇఎంఐ బ్యాంక్ అకౌంట్ నుండి మినహాయించబడదు.

ఒకవేళ మీ వద్ద మిగులు నిధులు ఉంటే, మీరు పార్ట్-ప్రీపేమెంట్ సౌకర్యం ద్వారా మీ బాకీ ఉన్న రుణ మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించవచ్చు. ఇది మీ లోన్ అవధి లేదా ఇఎంఐని ప్రభావితం చేస్తుంది. అలాగే, మీరు రుణం పై చెల్లించే వడ్డీని ఆదా చేసుకోవచ్చు.

వాస్తవానికి, మీ గడువు మీరిన ఇఎంఐలను క్లియర్ చేసే అవకాశం కూడా మీకు ఉంది. మీ వద్ద తక్కువ అకౌంట్ బ్యాలెన్స్ ఉన్నందున లేదా ఏదైనా సాంకేతిక లోపం కారణంగా మీరు మీ ఇఎంఐ చెల్లింపును మిస్ చేస్తే, ఈ సౌకర్యం ద్వారా బౌన్స్ అయిన ఇఎంఐని తిరిగి చెల్లించవచ్చు.

  • Make your loan payments in My Account

    మై అకౌంట్‌లో మీ రుణ చెల్లింపులు చేయండి

    మీరు అడ్వాన్స్ ఇఎంఐ చెల్లించవచ్చు, మీ రుణాన్ని పార్ట్-ప్రీపే చేయవచ్చు లేదా మా కస్టమర్ పోర్టల్ - మై అకౌంట్ సందర్శించడం ద్వారా మీ బాకీ ఉన్న మొత్తాన్ని క్లియర్ చేయవచ్చు.

    • మీ పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
    • జాబితా నుండి చెల్లింపు రకాన్ని ఎంచుకోండి.
    • మీరు చెల్లింపు చేయాలనుకుంటున్న లోన్ అకౌంట్ నంబర్‌ను ఎంచుకోండి.
    • అమౌంటును ఎంటర్ చేయండి మరియు వర్తించే అదనపు ఛార్జీలు ఏవైనా ఉంటే వాటిని సమీక్షించండి.
    • మా సురక్షితమైన చెల్లింపు విధానం ద్వారా చెల్లింపును పూర్తి చేయడానికి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.


    దిగువన ఉన్న 'మీ లోన్ ఇఎంఐలను చెల్లించండి' టెక్స్ట్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు, మీ లోన్ ఇఎంఐలను నిర్వహించవచ్చు.
    మిమ్మల్ని 'మై అకౌంట్'కు లాగిన్ అవమని అడగడం జరుగుతుంది, అక్కడ మీరు చెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. తదుపరి మీరు మీ లోన్ అకౌంటును ఎంచుకుని, చెల్లింపును పూర్తి చేయవచ్చు.

    మీ లోన్ ఇఎంఐలను చెల్లించండి

మమ్మల్ని సంప్రదించండి

మా ప్రొడక్ట్స్ మరియు సేవలకు సంబంధించి మీ అన్ని సందేహాలకు సమాధానాలను కనుగొనండి:

  • ఆన్‌లైన్ సహాయం కోసం దయచేసి మా సహాయం మరియు మద్దతు విభాగాన్ని సందర్శించండి.
  • మీరు ఒక మోసపూరిత ట్రాన్సాక్షన్‌ను గురించి రిపోర్ట్ చేయాలనుకుంటే, దయచేసి మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి: +91-8698010101
  • మాతో కనెక్ట్ అవ్వడానికి మీరు Play Store/ App Store నుండి మా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • మీ లొకేషన్‌కు దగ్గరలో ఉన్న మా బ్రాంచ్‌ను కనుగొనండి మరియు మీ సందేహాలను తీర్చుకోండి.
  • మీరు మా 'మమ్మల్ని సంప్రదించండి' పేజీని సందర్శించడం ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

నిధుల ఉపసంహరణను నిర్వహించండి

మేము మా అన్‍సెక్యూర్డ్ లోన్ ప్రోడక్ట్స్‌లో భాగంగా టర్మ్ మరియు ఫ్లెక్సీ వేరియంట్లను అందిస్తాము. ఫ్లెక్సీ లోన్ వేరియంట్ అనేది మీ ఆర్థిక పరిస్థితి ఆధారంగా రీపేమెంట్‌ను ప్లాన్ చేసుకునే స్వేచ్ఛను మీకు అందిస్తుంది.

ఒకవేళ మీరు మా ఫ్లెక్సీ లోన్ వేరియంట్‌ను ఎంచుకున్నట్లయితే, కావలసినన్ని సార్లు మీకు అందుబాటులో ఉన్న రుణ మొత్తం నుండి నిధులను విత్‍డ్రా చేసుకోవచ్చు మరియు మీకు వీలైనప్పుడల్లా, మీకు నచ్చినన్ని సార్లు ముందస్తు చెల్లింపు కూడా చేయవచ్చు.

  • Withdraw funds from your Flexi account

    మీ ఫ్లెక్సీ అకౌంట్ నుండి నిధులను విత్‍డ్రా చేసుకోండి

    మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా మీరు, మీ ఫ్లెక్సీ లోన్ అకౌంట్ నుండి నిధులను విత్‍డ్రా చేసుకోవచ్చు

    • మై అకౌంట్‌ను సందర్శించడానికి ఈ పేజీలోని 'సైన్-ఇన్' బటన్ పై క్లిక్ చేయండి.
    • సైన్ ఇన్ చేయడానికి మీ పుట్టిన తేదీ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
    • 'నా సంబంధాలు' విభాగం నుండి, మీరు నిధులను విత్‍డ్రా చేయాలనుకుంటున్న లోన్ అకౌంటును ఎంచుకోండి.
    • 'త్వరిత చర్యలు' కింద, 'విత్‍డ్రా' పై క్లిక్ చేయండి.
    • మీకు అందుబాటులో ఉన్న పరిమితి నుండి మీరు విత్‍డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి. మరియు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను సమీక్షించండి.
    • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపితో మీ వివరాలను ధృవీకరించండి.


    దిగువన ఉన్న 'మీ ఫ్లెక్సీ లోన్ నుండి నిధులను విత్‍డ్రా చేసుకోండి' టెక్స్ట్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు, మీకు అందుబాటులో ఉన్న పరిమితి నుండి నిధులను విత్‍డ్రా చేసుకోవచ్చు. మిమ్మల్ని 'మై అకౌంట్'కు సైన్ ఇన్ అవమని అడగడం జరుగుతుంది, అప్పుడు మీరు 'నా సంబంధాలు' విభాగానికి మళ్లించబడతారు.

    అప్పుడు మీరు మీ లోన్ అకౌంట్‌ను ఎంచుకోవచ్చు, 'త్వరిత చర్యలు' విభాగం నుండి 'విత్‍డ్రా' పై క్లిక్ చేసి, విత్‍డ్రాల్‌ను పూర్తి చేయండి.

    మీ విత్‍డ్రాల్ అభ్యర్థన ప్రాసెస్ పూర్తయిన తర్వాత, మీరు కేవలం కొన్ని గంటల్లో మీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును స్వీకరిస్తారు.

    మీ ఫ్లెక్సీ లోన్ నుండి నిధులను విత్‍డ్రా చేసుకోండి

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను నిర్వహించండి

మీరు మా నుండి రుణం తీసుకున్నప్పుడు, రుణం పంపిణీ చేయబడే ఒక యాక్టివ్ బ్యాంక్ అకౌంట్‌ను మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇది మీ ఇఎంఐలు మినహాయించబడే అకౌంట్.

మీ బ్యాంక్ అకౌంట్ మార్పుకు గురైతే, మీరు తప్పకుండా దానిని గురించి మా రికార్డుల్లో అప్‌డేట్ చేయాలి. ఇఎంఐ బౌన్స్, అనవసరమైన ఛార్జీలు మరియు మీ సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి మీరు దీనిని చేయాలి.

మా కస్టమర్ పోర్టల్ మై అకౌంట్‌కు సైన్-ఇన్ అవ్వడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను మీరు నిర్వహించవచ్చు.

మీరు మా ఫ్లెక్సీ లోన్ రకాన్ని ఎంచుకున్నట్లయితే, ఇక్కడ మీరు రెండు రకాల బ్యాంక్ అకౌంట్లను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది - మీ ఇఎంఐ రీపేమెంట్ అకౌంట్ మరియు మీ డ్రాడౌన్ బ్యాంక్ అకౌంట్.

రీపేమెంట్ అకౌంట్ అనేది ప్రతి నెలా మీ ఇఎంఐలు మినహాయించబడే అకౌంట్. డ్రాడౌన్ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు మీ ఫ్లెక్సీ లోన్ నుండి డబ్బును విత్‍డ్రా చేసినప్పుడు మీరు నిధులను స్వీకరించే అకౌంట్.

  • Change repayment bank account details

    రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్ వివరాలను మార్చండి

    ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మై అకౌంట్‌లో మీ రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు:

    • మీ పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్‌తో మా కస్టమర్ పోర్టల్‌లోకి సైన్-ఇన్ అవ్వండి.
    • మీరు బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటున్న లోన్ అకౌంట్‌ను ఎంచుకోండి మరియు కొనసాగండి.
    • అకౌంట్ హోల్డర్ పేరు, కొత్త బ్యాంక్ అకౌంట్ నంబర్ మరియు ఐఎఫ్‌ఎస్‌సి వంటి సంబంధిత వివరాలను నమోదు చేయండి.
    • మీ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఎంచుకోండి మరియు కొనసాగండి.


    దిగువన ఉన్న 'మీ రీపేమెంట్ అకౌంట్‌ను నిర్వహించండి' టెక్స్ట్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్ వివరాలను మార్చవచ్చు. మిమ్మల్ని 'మై అకౌంట్'కు సైన్-ఇన్ అవమని అడగడం జరుగుతుంది’. సైన్-ఇన్ తర్వాత, మీరు మా మ్యాండేట్ మేనేజ్‌మెంట్ విభాగానికి మళ్లించబడతారు.

    అప్పుడు మీరు మీ లోన్ అకౌంట్‌ను ఎంచుకోవచ్చు, అవసరమైన ఇతర వివరాలను నమోదు చేసి ముందుకు కొనసాగవచ్చు.

    మీ రీపేమెంట్ అకౌంట్‌ను నిర్వహించండి

    మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు విజయవంతంగా రిజిస్టర్ చేయబడిన తర్వాత మీరు మీ స్క్రీన్ పై ఒక నిర్ధారణ మెసేజ్ అందుకుంటారు.

    మీరు ఇటీవల మీ ప్రొఫైల్ వివరాలను అప్‌డేట్ చేసినట్లయితే, మీ రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్ వివరాలను మళ్ళీ అప్‌డేట్ చేయడానికి 90 రోజుల వరకు మీరు వేచి ఉండాలి అని దయచేసి గమనించండి.

    అలాగే, మీ రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్‌లో ఏదైనా మార్పు మీ డ్రాడౌన్ బ్యాంక్ అకౌంట్ వివరాలను మార్చదు.

  • Change drawdown bank account details

    డ్రాడౌన్ బ్యాంక్ అకౌంట్ వివరాలను మార్చండి

    మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా మీ డ్రాడౌన్ బ్యాంక్ అకౌంట్‌ను మార్చవచ్చు

    • మా రెండు దశల ప్రామాణీకరణను ఉపయోగించి మై అకౌంట్‌కు సైన్-ఇన్ అవ్వండి మరియు ఒక ఓటిపి తో మీ వివరాలను ధృవీకరించండి.
    • 'నా సంబంధాలు' విభాగం నుండి మీరు డ్రాడౌన్ బ్యాంక్ అకౌంట్‌ను మార్చాలనుకుంటున్న ఫ్లెక్సీ లోన్ అకౌంట్‌ను ఎంచుకోండి.
    • 'త్వరిత చర్యలు' విభాగం నుండి 'విత్‍డ్రా చేయండి' ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు మీ అకౌంట్ వివరాల కింద ఉన్న 'బ్యాంక్ అకౌంటును అప్‌డేట్ చేయండి' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
    • మీ కొత్త బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు ఐఎఫ్‌ఎస్‌సి ని ఎంటర్ చేయండి.
    • మీ కొత్త బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేయడానికి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.


    బదులుగా, మీరు దిగువన ఉన్న 'మీ డ్రాడౌన్ అకౌంట్‌ను నిర్వహించండి' టెక్స్ట్ పై క్లిక్ చేయడం ద్వారా మీ డ్రాడౌన్ బ్యాంక్ అకౌంట్‌ను అప్‌డేట్ చేయవచ్చు. మీరు 'మై అకౌంట్'కు సైన్-ఇన్ చేయమని అడగబడతారు మరియు 'నా సంబంధాలు' విభాగానికి మళ్ళించబడతారు.

    మీ ఫ్లెక్సీ లోన్ అకౌంట్‌ను ఎంచుకోండి, 'త్వరిత చర్యలు' నుండి 'విత్‌డ్రా చేయండి' పై క్లిక్ చేయండి మరియు మీ డ్రాడౌన్ బ్యాంక్ అకౌంట్ వివరాల క్రింద ఉన్న 'బ్యాంక్ అకౌంట్‌ను అప్‌డేట్ చేయండి' పై క్లిక్ చేయండి మరియు కొనసాగండి.

    మీ రీపేమెంట్ బ్యాంక్ అకౌంట్‌లో ఏదైనా మార్పు మీ డ్రాడౌన్ బ్యాంక్ అకౌంట్ వివరాలను మార్చదు అని దయచేసి గమనించండి.

    మీ డ్రాడౌన్ అకౌంట్‌ను నిర్వహించండి

మీ రుణానికి వర్తించే ఫీజులు మరియు ఛార్జీలను చెక్ చేయండి

మీరు ఎంచుకున్న రుణానికి అనేక ఫీజులు మరియు ఛార్జీలు వర్తిస్తాయి. ఇవి మా వెబ్‌సైట్, యాప్ మరియు మీరు అందించిన లోన్ అగ్రిమెంట్‌లో చాలా స్పష్టంగా పేర్కొనబడ్డాయి.

మీరు ఎల్లప్పుడూ వర్తించే ఛార్జీల గురించి తప్పక తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది మీరు తిరిగి చెల్లించే మొత్తంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

మా ప్రోడక్ట్స్ కోసం వర్తించే ఫీజులు మరియు ఛార్జీలను చెక్ చేయండి

  • Part- prepayment charges

    పాక్షిక- ప్రీపేమెంట్ ఛార్జీలు

    మీరు మీ టర్మ్ లోన్ పై పార్ట్-పేమెంట్ చేసినప్పుడు, నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి రావచ్చు. వీటినే పార్ట్-ప్రీపేమెంట్ చార్జీలు అంటారు.
    ఒకవేళ మీరు మా ఫ్లెక్సీ వేరియంట్‌ను ఎంచుకున్నట్లయితే, పార్ట్-ప్రీపే చేయడానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు వీలైనన్ని సార్లు, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా పార్ట్-ప్రీపే చేయవచ్చు.

  • Bounce charges

    బౌన్స్ ఛార్జీలు

    గడువు తేదీలోపు ఇఎంఐ చెల్లించడానికి మీ బ్యాంక్ అకౌంట్లో తగినంత డబ్బు లేకపోతే, మీ ఇన్‌స్టాల్‌మెంట్ బౌన్స్ అవుతుంది. అలాంటి దృష్టాంతంలో మీరు, మీ అకౌంట్లో బ్యాంక్ విధించే ఛార్జీలతో పాటు బౌన్స్ ఫీజును కూడా భరించాల్సి ఉంటుంది. బౌన్స్ ఇఎంఐ అనేది మీ రీపేమెంట్ చరిత్రకు అంతరాయం కలిగిస్తుంది మరియు మీ సిబిల్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

  • Foreclosure charges

    ఫోర్‍క్లోజర్ ఛార్జీలు

    మీ వద్ద మిగులు నిధులు ఉంటే, మీకు బాకీ ఉన్న రుణ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే అవకాశం ఉంటుంది. మీరు మీ మొదటి ఇఎంఐని క్లియర్ చేసిన తర్వాత, లోన్ అవధిలో ఎప్పుడైనా దీనిని పూర్తి చేయవచ్చు. దీని కోసం మీరు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది, వీటినే ఫోర్‍క్లోజర్ ఛార్జీలు అంటారు.

రుణాన్ని ఫోర్‌క్లోజ్ చేయడం ఎలా

మీ లోన్ అకౌంట్‌ను ఫోర్‌క్లోజ్ చేయండి

మీ వద్ద మిగులు నిధులు ఉంటే, లోన్ అవధిలో ఎప్పుడైనా మీరు బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లించి లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేయవచ్చు. మీరు మీ మొదటి ఇఎంఐ తర్వాత ఎప్పుడైనా మీ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేయవచ్చు, అయితే, మీరు ఫోర్‌క్లోజర్ ఛార్జీలను చెల్లించాల్సి రావచ్చు.

  • Repay your complete loan amount in advance

    మీ పూర్తి రుణ మొత్తాన్ని ముందుగానే తిరిగి చెల్లించండి

    మీ లోన్ అకౌంట్‌ను ఫోర్‌క్లోజ్ చేయడానికి:

    • మీ పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
    • మీరు క్లోజ్‌ చేయాలనుకుంటున్న లోన్ అకౌంట్‌ను ఎంచుకోండి మరియు అవసరమైన వివరాలను నమోదు చేయండి.
    • చెల్లింపు ఆప్షన్ల నుండి 'ఫోర్‍క్లోజర్' ఎంచుకోండి.
    • వర్తించే ఫోర్‌క్లోజర్ ఛార్జీలను సమీక్షించండి మరియు చెల్లింపుతో కొనసాగండి.

    సైన్ ఇన్ చేయడానికి మీరు 'మీ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేయండి' పై క్లిక్ చేయవచ్చు. అప్పుడు మీరు ఆప్షన్ల జాబితా నుండి 'ఫోర్‍క్లోజర్' ఆప్షన్‌ను ఎంచుకోండి, ఆపై మీ లోన్ అకౌంట్‌ను ఎంచుకొని, చెల్లింపుతో కొనసాగండి. మీరు ఫోర్‍క్లోజ్ చేసిన 24 గంటల్లోపు మీ 'నో డ్యూస్ సర్టిఫికెట్' డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    మీ లోన్‌ను ఫోర్‌క్లోజ్ చేయండి

మీ ఇఎంఐలను సకాలంలో చెల్లించండి

షెడ్యూల్ చేయబడిన ఇఎంఐ తేదీకి కనీసం రెండు రోజుల ముందు మీరు మీ బ్యాంక్ అకౌంటులో తగినంత బ్యాలెన్స్‌ను కలిగి ఉండాలి. ఇది ఇఎంఐ బౌన్స్ అయ్యే అవకాశం లేదని నిరూపిస్తుంది, మీరు మీ సిబిల్ స్కోర్‌ను చక్కగా నిర్వహించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను నా లోన్ కోసం ఫోర్‍క్లోజర్ మొత్తాన్ని చెల్లించాను, కానీ నా ఇఎంఐ మినహాయించబడింది. నాకు రిఫండ్‌ ఎప్పుడు లభిస్తుంది?

ఒకవేళ నెలలో 22వ తేదీ తర్వాత ఫోర్‍క్లోజర్ మొత్తాన్ని చెల్లించినట్లయితే, ఇది జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీరు ఏడు నుండి పది పని దినాల్లోపు మినహాయించిన ఇఎంఐ కోసం రిఫండ్‌ను అందుకుంటారు.

నా బ్యాంక్ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ నా ఇఎంఐ ఎందుకు బౌన్స్ అవుతుంది?

మీ ఇఎంఐ బౌన్స్ కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఇది మీ బ్యాంక్‌లో ఒక సాంకేతిక సమస్య కారణంగా జరిగి ఉండవచ్చు లేదా మీ లోన్ అకౌంట్‌లో ఒక మ్యాండేట్‌కు సంబంధించిన సమస్య వల్ల కావచ్చు.

దయచేసి మీ బ్యాంకును సంప్రదించండి మరియు ఈ సమస్యను వెంటనే తెలియజేయండి. మ్యాండేట్ సంబంధిత సమస్యల కోసం మీరు ఈ కింది దశలను అనుసరించి మాకు ఒక అభ్యర్థనను పంపండి:

  • మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడానికి దిగువన ఉన్న 'మా సహాయం మరియు మద్దతు విభాగాన్ని సందర్శించండి' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా మై అకౌంటుకు లాగిన్ అవ్వండి.
  • అభ్యర్థనను పంపండి' పై క్లిక్ చేయండి, మీ ప్రోడక్ట్‌ను ఎంచుకోండి మరియు మీ లోన్ అకౌంట్ నంబర్‌ను ఎంచుకోండి.
  • ఇప్పుడు మీ సమస్యకు సంబంధించిన 'ప్రశ్న రకం' మరియు 'ఉప-ప్రశ్న రకం' ఎంచుకోండి.
  • చివరగా, మీ ఫిర్యాదును వివరంగా తెలపండి, అవసరమైన మద్దతు డాక్యుమెంట్లను జతచేయండి మరియు 'సబ్మిట్' పై క్లిక్ చేయండి’.

దీని తర్వాత, మీరు మీ అభ్యర్థన యొక్క పరిష్కార స్థితిని ట్రాక్ చేయడానికి వీలుగా, ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్‌ను అందుకుంటారు.

మా సహాయం మరియు మద్దతు విభాగాన్ని సందర్శించండి

నేను నా ఫోర్‍క్లోజర్ లెటర్‌ను ఎలా జనరేట్ చేయగలను?

మీరు మై అకౌంట్లో మీ రుణాన్ని ఫోర్‌క్లోజ్ చేసే ప్రాసెస్‌ను పూర్తి చేసిన తర్వాత, మీ ఫోర్‌క్లోజర్ లెటర్ రూపొందించబడుతుంది. ఆ ఫోర్‍క్లోజర్ లెటర్ జనరేట్ అయిన తర్వాత ఏడు రోజుల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో మీకు ఎదో ఒక సమయంలో ఇది మళ్లీ మీకు అవసరమైతే, మీరు తాజా ఫోర్‍క్లోజర్ లెటర్‌ను జనరేట్ చేయాలి.

లోన్ ఫోర్‍క్లోజర్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు ఈ దశలను అనుసరించవచ్చు:

  • మై అకౌంటుకు వెళ్లడానికి దిగువన ఉన్న 'ఫోర్‌క్లోజర్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్ నమోదు చేయడం ద్వారా మా కస్టమర్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
  • మీరు ఫోర్‍క్లోజర్ లెటర్ జనరేట్ చేయాలనుకుంటున్న లోన్ అకౌంట్‌ను ఎంచుకోండి.
  • అన్ని సంబంధిత డాక్యుమెంట్లను చూడండి మరియు డౌన్‌లోడ్ చేసుకోవడానికి 'ఫోర్‌క్లోజర్ లెటర్' పై క్లిక్ చేయండి.

ఫోర్‍క్లోజర్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

నేను నా రుణాన్ని పార్ట్-ప్రీపే చేశాను కానీ, నా ఇఎంఐ అమౌంటు ఎందుకు తగ్గించబడలేదు?

మీ రుణం పై మీరు చేసే పార్ట్ ప్రీ-పేమెంట్ అనేది నెలవారీ వాయిదాను ప్రభావితం చేయదు. మీ ఇఎంఐ అమౌంట్ యథాతతంగా ఉంటుంది. అయితే, పార్ట్ ప్రీ-పేమెంట్ మొత్తం అనేది మీ రుణ అవధిపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. పార్ట్ ప్రీ-పేమెంట్ మొత్తం ఎక్కువగా ఉంటే, మీరు చెల్లించవలసిన ఇఎంఐలు తక్కువగా ఉంటాయి.

నా లోన్ అకౌంట్లో పార్ట్-ప్రీపేమెంట్ సర్దుబాటు కావడానికి ఎంత సమయం పడుతుంది?

మీరు పార్ట్ ప్రీ-పే చేసిన తర్వాత, మీ లోన్ అకౌంట్లో ఆ మొత్తం కనిపించడానికి 24 గంటల వరకు సమయం పడుతుంది. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు, మీ తాజా రుణ వివరాల కోసం రీపేమెంట్ షెడ్యూల్‌ను చెక్ చేయవచ్చు:

  • మా కస్టమర్ పోర్టల్‌కు వెళ్లడానికి దిగువ ఉన్న 'స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేయండి' పై క్లిక్ చేయండి.
  • మా రెండు-దశల ప్రమాణీకరణను ఉపయోగించి మై అకౌంట్‌కు లాగిన్ అవమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది.
  • మీరు ‘రీపేమెంట్ షెడ్యూల్’‌ను డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న లోన్ అకౌంటును ఎంచుకోండి.
  • అన్ని సంబంధిత డాక్యుమెంట్లను వీక్షించండి మరియు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి 'రీపేమెంట్ షెడ్యూల్' పై క్లిక్ చేయండి.

స్టేట్‌మెంట్‌ని డౌన్‌లోడ్ చేయండి

నేను నా రుణాన్ని పార్ట్-ప్రీపే చేయలేకపోతున్నాను?

మీరు మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా మీ లోన్‌లో కొంత భాగాన్ని చెల్లించవచ్చు. మీరు మీ రుణాన్ని పార్ట్-ప్రీపే చేయలేకపోతే, అది కింది కారణాలలో ఏదైనా ఒకదాని వలన అయి ఉండవచ్చు:

  • ఒకవేళ మీ రుణం పై గడువు మీరిన చెల్లింపులు ఏవైనా బాకీ ఉంటే, వాటిని క్లియర్ చేయాలి.
  • ఒకవేళ కేవలం మీ చివరి ఇఎంఐ చెల్లించాల్సి ఉంటే; ఆ సందర్భంలో మీరు నేరుగా ఫోర్‍క్లోజర్‌కు వెళ్లవచ్చు.
  • ఒకవేళ మీ పార్ట్-ప్రీపేమెంట్ అమౌంట్ అనేది, మీ బ్యాంకు ద్వారా ముందుగా నిర్వచించబడిన ఎన్ఇఎఫ్‌టి పరిమితిని మించితే.
  • సాంకేతిక ఆలస్యాలకు కారణమయ్యే ఏవైనా నెట్‌వర్క్ సమస్యలు తలెత్తితే; ఆ సందర్భంలో, దయచేసి కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించండి.

పార్ట్-పేమెంట్ చేయండి

మరింత చూపండి తక్కువ చూపించండి