మీ హోమ్ లోన్ ఇఎంఐ తగ్గించుకోవడానికి చిట్కాలు
2 నిమిషాలలో చదవవచ్చు
మీ హోమ్ లోన్ ఇఎంఐ ను తగ్గించడం అనేది రీపేమెంట్ ను మరింత బడ్జెట్-ఫ్రెండ్లీ మరియు / లేదా చవకగా చేస్తుంది. మీరు మీ హోమ్ లోన్ ఇఎంఐని ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:
- అధిక డౌన్ పేమెంట్ చేయండి: తక్కువ అసలు మొత్తంతో, మరియు దాని వలన తక్కువ వడ్డీ చెల్లింపుతో, మీ ఇఎంఐ తక్కువగా ఉంటుంది.
- దీర్ఘకాలిక హోమ్ లోన్ అవధిని ఎంచుకోండి: నెలవారీ వాయిదాల సంఖ్య పెరిగే కొద్దీ, ప్రతి వాయిదా మొత్తం తక్కువగా ఉంటుంది. అయితే, మీరు హోమ్ లోన్ పై ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఇఎంఐ ను ముందుగానే అంచనా వేయడానికి మీరు హోమ్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.
- ప్రీపేమెంట్లను పరిగణనలోకి తీసుకోండి: అసలు మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లిస్తే, మీరు చెల్లించవలసిన పూర్తి మొత్తం తగ్గుతుంది మరియు మీ ఇఎంఐ లేదా హోమ్ లోన్ అవధిని తగ్గించే ఎంపికను అందిస్తుంది.
- మీ రుణదాతతో చర్చించండి: మీకు రిపేమెంట్ యొక్క మంచి ట్రాక్ రికార్డ్ ఉంటే మరియు దీర్ఘకాలిక కస్టమర్ అయితే, మీ రుణదాతతో మాట్లాడండి మరియు తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేటు పొందడానికి ప్రయత్నించండి.
- ఒక హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ నిర్వహించండి: ఒకవేళ మరొక రుణదాత తక్కువ వడ్డీ రేటు మరియు మెరుగైన నిబంధనలు మరియు షరతులను అందిస్తే, మీరు తదనుగుణంగా మీ హోమ్ లోన్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. తక్కువ వడ్డీ రేటు ఆటోమేటిక్‌గా తక్కువ ఇఎంఐ ని అందిస్తుంది.
ఇవి కూడా చదవండి: హోమ్ లోన్ వడ్డీని తగ్గించడం ఎలా
మరింత చదవండి
తక్కువ చదవండి