పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్
పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు లేదా బిజినెస్ క్రెడిట్ కోసం ఇఎంఐ లను లెక్కించేటప్పుడు ఇఎంఐ క్యాలిక్యులేటర్లు ప్రయోజనకరంగా ఉంటాయి మరియు దానిని ఉపయోగించడం కూడా సులభం. బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ కోసం మీ నెలవారీ వాయిదాలను నిర్ణయించడానికి కేవలం మూడు అవసరమైన ఫీల్డ్‌లను మాత్రమే నింపవలసి ఉంటుంది - మీరు అప్పుగా తీసుకోవాలనుకుంటున్న రుణ మొత్తం, తరువాత అవధి మరియు వడ్డీ రేటు.
మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని నెరవేర్చడానికి మీరు ఇఎంఐ ను కూడా మార్చవచ్చు. అవధిని పెంచడం వలన మీ ఇఎంఐలు తగ్గుతాయి మరియు అవధిని తగ్గించడం వలన ఇఎంఐలు పెరుగుతాయి. ఇఎంఐ క్యాలిక్యులేటర్ యొక్క సంబంధిత ఫీల్డ్స్‌లో మార్పులు చేయడం ద్వారా మీరు దీనిని చేయవచ్చు.
బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఇఎంఐ లెక్కించేటప్పుడు అసలు మరియు వడ్డీ మొత్తాల వివరాలను కూడా చూపుతుంది. 'రీపేమెంట్ షెడ్యూల్ చూడండి' పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ నెలవారీ లేదా వార్షిక ఇఎంఐ కూడా చెక్ చేసుకోవచ్చు.
ప్రదర్శించబడే విలువలు సూచనాత్మకమైనవి మరియు తెలివైన నిర్ణయం తీసుకోవడంలో, వివిధ వడ్డీ రేట్ల వద్ద ఇఎంఐని సరిపోల్చడంలో ఉపయోగపడతాయి.
డిస్‌క్లెయిమర్
క్యాలిక్యులేటర్(లు) ద్వారా సృష్టించబడిన ఫలితాలు సూచనాత్మకమైనవి. రుణం పై వర్తించే వడ్డీ రేటు రుణం బుకింగ్ సమయంలో ప్రస్తుత రేట్లపై ఆధారపడి ఉంటుంది.
కాలిక్యులేటర్ (లు) ఎట్టి పరిస్థితులలోనూ తన యూజర్లు/ కస్టమర్‌లకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ("బిఎఫ్ఎల్") ద్వారా సర్టిఫై చేయబడిన లేదా బిఎఫ్ఎల్ యొక్క బాధ్యత, హామీ, వారంటీ లేదా నిబద్ధత, ఆర్థిక మరియు వృత్తిపరమైన సలహాతో కూడిన ఫలితాలను అందించడానికి ఉద్దేశించబడలేదు. యూజర్ / కస్టమర్ ద్వారా డేటా ఇన్‌పుట్ నుండి జనరేట్ అయిన వివిధ వివరణాత్మక ఫలితాలను అందించే ఒక సాధనం మాత్రమే. కాలిక్యులేటర్ యొక్క ఉపయోగం పూర్తిగా యూజర్/కస్టమర్ యొక్క రిస్క్ పై ఆధారపడి ఉంటుంది, కాలిక్యులేటర్ నుండి వచ్చిన ఫలితాలలో ఏదైనా తప్పులు ఉంటే బిఎఫ్ఎల్ ఎటువంటి బాధ్యత వహించదు.
తరచుగా అడిగే ప్రశ్నలు
పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడానికి ముందు మీ ఇఎంఐ లను లెక్కించడం మంచిది. మీరు మాన్యువల్‌గా చేయగలిగినప్పుడు, ఒక పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించడం మీకు మరింత ఖచ్చితమైన విలువను నిర్ణయించడంలో సహాయపడుతుంది. ఇంటరాక్టివ్ చార్ట్‌తో ఖచ్చితంగా చెల్లించవలసిన ఇఎంఐ ను పొందడానికి మీరు లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటును మాత్రమే ఎంచుకోవాలి.
ఇఎంఐ క్యాలిక్యులేటర్ మీ నెలవారీ వాయిదాలను లెక్కించడానికి సాధారణ గణిత సూత్రాన్ని ఉపయోగిస్తుంది. ఆ సూత్రం ఏంటంటే:
E = P*r*(1+r)^n/((1+r)^n-1) ఇక్కడ
- E అంటే ఇఎంఐ
- P అంటే అసలు లోన్ మొత్తం,
- r అనేది నెలవారీ లెక్కించబడిన వడ్డీ రేటు, మరియు
- n అనేది నెలలలో అవధి/వ్యవధి
ఉదాహరణకు, మీరు సంవత్సరానికి 14% వడ్డీ రేటుకు మరియు 2 సంవత్సరాల అవధి కోసం రూ. 1 లక్ష పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తే, మీ ఇఎంఐ ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది:
ఇఎంఐ = 100000* 0.01167 * (1+ 0.01167)^60 / [(1+ 0.01167)^60 ] -1 ఇది రూ. 2,327.
మీ రుణంపై వడ్డీ రేటు (R) ప్రతి నెలా లెక్కించబడుతుంది అని దయచేసి గమనించండి (R = వార్షిక వడ్డీ రేటు/12/100) ఈ సందర్భంలో 14/12/100 = 0.01167.
పర్సనల్ లోన్ కోసం మా ఆన్‌లైన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీరు సులభంగా మీ ఇఎంఐ మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు.
ఈ క్రింది అంశాలు పర్సనల్ లోన్ ఇఎంఐలను ప్రభావితం చేస్తాయి -
- లోన్ అమౌంట్ – చెల్లించవలసిన మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఎంచుకున్న లోన్ మొత్తానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటాయి. అందుకున్న లోన్ ఎక్కువగా ఉంటే, మీ ఇఎంఐలు అధికంగా ఉంటాయి.
- వడ్డీ రేటు - రుణదాతలు లోన్ మొత్తంపై వడ్డీ వసూలు చేసే శాతం వడ్డీ రేటు. అధిక వడ్డీ రేటు వలన ఇఎంఐ లు పెరుగుతాయి మరియు తక్కువ వడ్డీ రేటు వలన తగ్గుతాయి.
- కాలపరిమితి - ఇది లోన్ రీపేమెంట్ అవధిని సూచిస్తుంది మరియు ఇఎంఐలకు విలోమానుపాతంలో ఉంటుంది. సుదీర్ఘమైన అవధి మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లను తగ్గిస్తుంది, అయితే తక్కువ అవధి వాటిని పెంచుతుంది.
బజాజ్ ఫిన్‌సర్వ్ అందించే 13% వడ్డీ రేటుతో వివిధ అవధుల కోసం రూ. 1 లక్ష పర్సనల్ లోన్ పై ఇఎంఐలను తనిఖీ చేయండి:
|
అవధి |
|||
2 సంవత్సరాలు |
3 సంవత్సరాలు |
4 సంవత్సరాలు |
5 సంవత్సరాలు |
|
ఇఎంఐ లు |
రూ. 4,754 |
రూ. 3,369 |
రూ. 2,683 |
రూ. 2,275 |
మొత్తం చెల్లించాల్సిన అమౌంట్ |
రూ. 1,14,101 |
రూ. 1,21,303 |
రూ. 1,28,769 |
రూ. 1,36,528 |
చెల్లించవలసిన మొత్తం వడ్డీ |
రూ. 14,101 |
రూ. 21,303 |
రూ. 28,769 |
రూ. 36,528 |
పర్సనల్ లోన్ వడ్డీ రేటు మీ రుణ మొత్తం, అవధి మరియు క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా మీ రుణదాత ద్వారా నిర్ణయించబడుతుంది. కావలసిన రుణ మొత్తం మరియు అవధి పై వడ్డీ రేటు మీకు తెలిసిన తర్వాత, మీరు నెలవారీ వాయిదాలను నిర్ణయించడానికి పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.
చెల్లించవలసిన ఖచ్చితమైన వడ్డీని తెలుసుకోవడానికి, క్యాలిక్యులేటర్‌లో అన్ని మూడు విలువలను అందించండి, అవి లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటు.
మీరు భారతదేశంలో రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు చెల్లించాల్సిన ఇఎంఐ తెలుసుకోవడానికి మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ని కూడా ఉపయోగించవచ్చు. సకాలంలో రీపేమెంట్లను చెల్లించేలా ముందస్తు ఏర్పాట్లు చేయడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.
పర్సనల్ లోన్ అమార్టైజేషన్ షెడ్యూల్ అనేది లోన్ కాలపరిమితి సమయంలో చేయవలసిన నిర్ణీత కాల చెల్లింపుల యొక్క వివరణాత్మక పట్టిక. రుణదాతలు ఈ షెడ్యూల్‌ను సృష్టించడానికి ఒక అమోర్టైజేషన్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగిస్తారు. అమార్టైజేషన్ అనేది ఎంచుకున్న అవధిలో ఇఎంఐల ద్వారా లోన్ రీపేమెంట్‌ను నిర్ధేశించే ఒక లెక్కింపు ప్రాసెస్.
ఇది లోన్ రీపేమెంట్ పూర్తి అయ్యే వరకు అవధి ద్వారా చెల్లించవలసిన ప్రతి ఇఎంఐ లో చేర్చబడిన అసలు మరియు వడ్డీ మొత్తం యొక్క వివరణాత్మక వివరాలను కలిగి ఉంటుంది. ఒక రుణగ్రహీతకు ప్రతి ఇఎంఐ లో చేర్చబడిన అసలు మొత్తం మరియు వడ్డీ భాగం పై ఖచ్చితమైన సమాచారాన్ని ఈ షెడ్యూల్ ఇస్తుంది.
ఇఎంఐ, లేదా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది రుణదాత నుండి తీసుకున్న రుణాన్ని క్లియర్ చేయడానికి రుణగ్రహీత ప్రతి నెలా చెల్లించే స్థిర మొత్తం. ఇది ప్రతి క్యాలెండర్ నెల యొక్క నిర్దిష్ట తేదీన షెడ్యూల్ చేయబడుతుంది, అసలు మరియు వడ్డీ భాగాలు రెండింటినీ కలిగి ఉంటాయి. మీ పర్సనల్ లోన్ ఇఎంఐ లోన్ అసలు మొత్తం, వడ్డీ రేటు మరియు లోన్ అవధిపై ఆధారపడి ఉంటుంది.
లోన్ ఇఎంఐ లను తగ్గించడానికి మరియు ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి మీకు సహాయపడే కొన్ని సులభమైన దశలు:
- సుదీర్ఘమైన రీపేమెంట్ అవధిని ఎంచుకోండి, ఇది మీకు లోన్ లోన్ అమౌంట్‌ను ఎక్కువ కాలానికి విస్తరించడంలో మరియు చిన్న వాయిదాలలో చెల్లించడంలో మీకు సహాయపడుతుంది
- తక్కువ వడ్డీ రేటు కోసం లోన్ ప్రొవైడర్ తో మాట్లాడండి
- తక్కువ వడ్డీ రేట్లు మరియు తగ్గిన ఇఎంఐ ల కోసం మంచి సిబిల్ స్కోర్ ను కలిగి ఉండండి
- మీ అవసరాలు, రీపేమెంట్ సామర్థ్యానికి అనుగుణంగా అత్యుత్తమ డీల్స్ కోసం షాపింగ్ చేయండి
బజాజ్ ఫిన్‌సర్వ్ ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్ ఈ క్రింది ప్రయోజనాలను అందిస్తుంది:
- వేగవంతమైన ఇఎంఐ లెక్కింపు
- తప్పులు జరిగే అవకాశాలను తగ్గిస్తుంది
- ఇఎంఐ లెక్కింపు ద్వారా తగిన రీపేమెంట్ షెడ్యూల్ మూల్యాంకనకు సహాయపడుతుంది
- రుణగ్రహీత యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయకుండా సకాలంలో తిరిగి చెల్లించదగిన ఒక తగిన మొత్తాన్ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది
మీరు ఏదైనా కారణం వలన మీ ఇఎంఐ చెల్లింపును స్కిప్ చేస్తే, మీకు ఇఎంఐ బౌన్స్ ఛార్జీగా రూ. 600 - రూ. 1,200 మధ్య జరిమానా రుసుము వసూలు చేయబడుతుంది. ఇది మీ లోన్ అవధిని కూడా ప్రభావితం చేయవచ్చు మరియు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. ఇఎంఐలు ఒకే విధంగా ఉంటాయని పరిగణించి, మీ లోన్ అవధి కూడా పెరుగుతుంది. ఇఎంఐ లను స్కిప్ చేయడం అనేది మీ క్రెడిట్ యోగ్యతను ప్రభావితం చేస్తుందని మరియు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేయగలదని దయచేసి గమనించండి.
ఏదైనా బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థ అందించే లోన్ల ఇఎంఐ లను లెక్కించడానికి మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ పర్సనల్ లోన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. కావలసిన లోన్ మొత్తం, అవధి మరియు వడ్డీ రేటును ఎంచుకోవడానికి లేదా ఇఎంఐ తెలుసుకోవడానికి టెక్స్ట్ ఫీల్డ్స్‌లో నేరుగా డేటాను ఎంటర్ చేయడానికి స్లైడర్లను ఉపయోగించండి.