తనఖా లోన్ క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

2 నిమిషాలలో చదవవచ్చు

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ ఆస్తి పై రుణం తీసుకున్నప్పుడు మా తనఖా రుణం క్యాలిక్యులేటర్ మీకు రీపేమెంట్ ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మొత్తం రీపేమెంట్, చెల్లించవలసిన మొత్తం వడ్డీ మరియు ప్రతి నెలా చెల్లించవలసిన ఇఎంఐలను లెక్కిస్తుంది.

ఈ సులభమైన ఆన్‌లైన్ సాధనంతో మీ నెలవారీ వాయిదాలను అంచనా వేయండి మరియు మీ ఫైనాన్సులను మెరుగ్గా ప్లాన్ చేసుకోండి.

తనఖా రుణం క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి 3 దశలు

  • రుణం మొత్తాన్ని ఎంచుకోండి
    క్యాలిక్యులేటర్ ఉపయోగించడానికి ముందు, మీరు పొందాలనుకుంటున్న తనఖా రుణం మొత్తం గురించి సహేతుకమైన ఆలోచనను కలిగి ఉండండి. 'రుణం మొత్తం' విభాగంలో ఈ మొత్తాన్ని పూరించండి
  • రీపేమెంట్ అవధిని ఎంచుకోండి
    18 సంవత్సరాల వరకు ఉండే రీపేమెంట్ అవధిని ఎంచుకోండి. మీ ప్రాధాన్యతగల అవధిని నెలలలోకి మార్చండి మరియు 'అవధి' విభాగంలో జోడించండి.
  • వడ్డీ రేటును ఇన్పుట్ చేయండి
    ఇప్పుడు 'వడ్డీ రేటు' విభాగంలో తనఖా రుణం వడ్డీ రేటును నమోదు చేయండి.

గమనిక: మీరు మాన్యువల్‌గా సమాచారాన్ని పూరించడానికి బదులుగా ప్రతి విభాగంలోనూ స్లైడర్‌ను కూడా తరలించవచ్చు.

మీరు ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత, తనఖా రుణం క్యాలిక్యులేటర్ ఫలితాలను ఖచ్చితంగా మరియు తక్షణమే లెక్కిస్తుంది. మీ కోసం అనువైన ఇఎంఐ ను లెక్కించడానికి మీరు రుణం మొత్తం మరియు అవధిని మార్చవచ్చు. చెల్లించవలసిన మొత్తం వడ్డీని తగ్గించడానికి, రుణం మొత్తాన్ని తగ్గించుకోండి. మీ ఇఎంఐలను బడ్జెట్-ఫ్రెండ్లీగా చేయడానికి, మీరు అవధిని పెంచుకోవచ్చు.

మీరు మీ ఇఎంఐలను అంచనా వేసిన తర్వాత, రుణం అప్లికేషన్‌తో ప్రారంభించండి. మా సులభంగా నెరవేర్చగలిగే తనఖా రుణం అర్హత అవసరాలను చెక్ చేసుకోండి మరియు వేగవంతమైన అప్రూవల్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి. మా సులభమైన మరియు ఆన్‌లైన్ తనఖా రుణం ప్రాసెస్ అప్లై చేయడం సులభం మరియు ఒత్తిడి-లేనిది.

మరింత చదవండి తక్కువ చదవండి