ఒక హోమ్ లోన్ తీసుకోవడం వలన మీ కలల ఇంటిని సులభంగా కొనుగోలు చేయవచ్చు, కానీ మీరు మెరుగైన హోమ్ లోన్, తక్కువ వడ్డీ రేటుతో మరియు విలువ జోడించిన సర్వీసులతో పాటుగా పొందవచ్చు. అలాంటి సందర్భంలో, మీరు మీ హోమ్ లోన్ ను మెరుగైన సర్వీసులు అందించే కొత్త రుణదాతకు మార్చుకోవాలి అనుకోవచ్చు. మీ హోమ్ లోన్ ను ఒక రుణదాత నుండి మరొకరికి మార్చుకోవడం లేదా బదిలీ చేయడం అనే ఈ ప్రక్రియను హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ అంటారు.
సాధారణంగా, మీ ప్రస్తుత రుణదాత యొక్క నిబంధనలు అంత అనుకూలంగా లేనప్పుడు మరియు సంస్థ ఆ విషయంలో చర్చించడానికి సమ్మతించని సందర్భంలో మీ హోక్ లోన్ బ్యాలెన్స్ ను మీరు ఒక కొత్త ఋణదాతకు మార్చుకుంటారు. బదిలీ చేసుకోవడానికి మీకు అనేక కారణాలు ఉండవచ్చు, కానీ బ్యాలెన్స్ బదిలీకి అత్యంత సాధారణ కారణం ఏమిటంటే మీరు అధిక వడ్డీ రేటు చెల్లించడం. ఇది కఠినమైన నిబంధనలు, మరీ ఎక్కువ అదనపు ఛార్జీలు మరియు సరిలేని వినియోగదారు సర్వీసు లాంటి కారణాల మిశ్రమం కూడా కావచ్చు.
ఒక హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీని మీ అవధి ప్రారంభ సమయంలో చేయడం ఉత్తమమైనది. ఇది ఎందుకంటే ప్రారంభంలో, ఒక్కొక్క EMI యొక్క వడ్డీ అంశం, ప్రిన్సిపల్ అంశం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు వడ్డీరేటు తక్కువగా ఉండటం వల్ల ప్రయోజనాన్ని ఈ సమయంలోనే కలిగి ఉంటారు. ఇంకా, బ్యాలెన్స్ బదిలీ కోసం మీరు ఛార్జీ చెల్లించవలసి రావచ్చని మరియు కొత్త రుణదాతకు ప్రాసెసింగ్ ఫీజు రీపే చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. కాబట్టి, వీటిని లెక్కలోనికి తీసుకుని, మీ నికర లాభాన్ని అర్థం చేసుకున్న తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీ బ్యాలెన్స్ బదిలీ నిజంగా మీరు ఆదా చేసుకోవడానికి ఉపకరిస్తుందని మీకు హామీ ఇవ్వడానికి ఇది సహాయపడగలదు.
మీరు ఆనందించగల కొన్ని హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్రయోజనాలుక్రింద జాబితాగా ఇవ్వబడ్డాయి.
ఇప్పుడు ఒక హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ ఎంత ప్రయోజనకరమైనదో మీరు తెలుసుకున్నారు కాబట్టి, దానిని బజాజ్ ఫిన్ సర్వ్ వంటి ప్రముఖ NBFC ద్వారా పొందుట గురించిన ప్రక్రియను చూద్దాం.
మీ ప్రస్తుత రుణదాతకు ఒక అప్లికేషన్ సమర్పించండి:
మీరు బ్యాలెన్స్ బదిలీ కోరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మీ రుణదాతకు ఒక అప్లికేషన్ ద్వారా తెలపడం ముఖ్యం. ఈ అప్లికేషన్ లో, ఒక లేఖ లేదా ఒక పఫారం ఉంటుంది. రెండు సందర్భాలలోను, అప్లికేషన్ ని జాగ్రత్తగా నింపి, బదిలీ కోసం మీ కారణాలను వ్రాయండి. అది ఒక ఫారం అయితే, దానిని ఖచ్చితంగా నింపే విధంగా చూసుకోండి.
NOC లేదా సమ్మతి లేఖను సేకరించండి:
మీ మొదటి దశను పూర్తి చేసిన తరువాత, మీ ఋణదాత మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లేదా సమ్మతి లేఖను ఇస్తారు. ఈ పత్రం కీలకమైనది, ఎందుకంటే మీరు మీ దరఖాస్తు పంపు సమయంలో, మీ కొత్త ఋణదాతకు ఇది అవసరం.
మీ డాక్యుమెంట్లను ఇవ్వండి:
మీరు ఒకసారి NOC అందుకుంటే, అప్పుడు కొత్త రుణదాతను సంప్రదించి మీ డాక్యుమెంట్లను అందజేయవచ్చు. NOC మరియు KYC డాక్యుమెంట్ల వంటి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం కాకుండా, మీరు మీ ఆస్తి పత్రాల, లోన్ బ్యాలెన్స్ స్టేట్మెంట్స్ మరియు వడ్డీ స్టేట్మెంట్స్ మరియు నింపిన అప్లికేషన్ ఫారం కాపీని కూడా సమర్పించవలసి రావచ్చు.
పాత ఋణదాత నుండి ధృవీకరణ పొందండి:
అన్ని డాక్యుమెంట్లు కొత్త ఋణదాతకు సమర్పించిన తరువాత, మీ లోన్ ఖాతా క్లోజ్ చేయడానికి సంబంధించి మీ పాత ఋణదాత నుండి తుది ధృవీకరణ వచ్చేవరకు ఆగండి. నిబంధనల ప్రకారం లోన్ కాంట్రాక్ట్ ముగిసింది అని ఇది సర్టిఫై చేస్తుంది.
అన్ని ఫీజులు చెల్లించి, తాజాగా ప్రారంభించండి:
ఇప్పుడు, మీరు చేయడానికి ఏముంటాయంటే, కొత్త ఋణదాత తో ఒక కాంట్రాక్ట్ సంతకం చేయడం మరియు బకాయి ఉన్న ఫీజులు చెల్లించడం. ఒకసారి ఇది పూర్తయితే, మీరు మీ కొత్త ఋణదాతకు తదుపరి EMI చెల్లించవచ్చు. ఈ స్టెప్-బై-స్టెప్ గైడ్ అనుసరించుట వలన, మీరు కోరుకున్న ఋణదాతకు మీ హోమ్ లోన్ బ్యాలెన్స్ బదిలీ చేసుకోవచ్చు. ఒకసారి ఇది పూర్తయితే, మీరు మీ కొత్త ఋణదాత ఆఫర్ చేయాలనుకున్న సౌలభ్యత మరియు అనుకూలత వంటి ప్రయోజనాలను పొందవచ్చు.