వ్యక్తిగత రుణం అర్హత కోసం కనీస క్రెడిట్ స్కోర్ ఎంత?

2 నిమిషాలలో చదవవచ్చు

మీ CIBIL స్కోర్ మీ క్రెడిట్ విలువ మరియు రీపేమెంట్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది ముఖ్యంగా మీరు అన్‍సెక్యూర్డ్ రుణాలను అప్పుగా తీసుకోవాలనుకుంటున్నప్పుడు, చాలా ముఖ్యమైన అర్హతా ప్రమాణాలు. ఎందుకంటే కొలేటరల్ లేనప్పుడు, మీ క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ రుణదాతకు సకాలంలో తిరిగి చెల్లించే హామీని అందిస్తుంది.

అంతేకాకుండా, అధిక సిబిల్ స్కోర్‍‌ను కలిగి ఉండటం అనేది, మీరు పర్సనల్ లోన్ పొందినప్పుడు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఆఫర్లను పొందడంలో మీకు సహాయపడుతుంది.

వ్యక్తిగత రుణం కోసం కనీస సిబిల్ స్కోర్

సాధారణంగా, మీ సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అయితే, త్వరిత అన్‍సెక్యూర్డ్ వ్యక్తిగత రుణం అప్రూవల్ కోసం కనీస సిబిల్ స్కోర్ 750. క్రెడిట్‌ని బాధ్యతాయుతంగా నిర్వహించడంలో మీకు అనుభవం ఉందని మరియు సకాలంలో చెల్లింపులు చేస్తారని ఇది సూచిస్తుంది.

మరింత చదవండి: 550-600 సిబిల్ స్కోర్ కోసం పర్సనల్ రుణం

685 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌తో, మీరు ప్రాథమిక అర్హతా ప్రమాణాలు మరియు డాక్యుమెంట్ల పై సులభంగా మా నుండి పర్సనల్ లోన్ పొందవచ్చు. వయస్సు, జాతీయత మరియు కనీస ఆదాయం కోసం అర్హతా ప్రమాణాలను నెరవేర్చాలి మరియు మీరు కెవైసి డాక్యుమెంట్లు, ఉద్యోగి ఐడి బ్యాంక్ స్టేట్‌మెంట్లు మరియు జీతం స్లిప్స్ వంటి కొన్ని డాక్యుమెంట్లను మాత్రమే సబ్మిట్ చేయాలి.

మీరు తగిన సిబిల్ స్కోర్‌ని కలిగి ఉంటే, బజాజ్ ఫిన్‌సర్వ్ యొక్క సులభమైన ఆన్‌లైన్ అప్లికేషన్, పోటీ వడ్డీ రేటు, నామమాత్రపు లోన్ ఛార్జీలు మరియు ప్రత్యేకమైన ఫ్లెక్సీ సౌకర్యాన్ని పొందగలరు.. ఒక ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ ఉపయోగించడం ద్వారా మీరు ఫండ్స్‌కు మరింత వేగవంతమైన యాక్సెస్ పొందవచ్చు.

మరింత చదవండి తక్కువ చదవండి