మై అకౌంట్‌లో మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డు వివరాలను తనిఖీ చేయండి

మై అకౌంట్‌లో మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును నిర్వహించండి

మా కస్టమర్ పోర్టల్‌లో మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును నిర్వహించండి

ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ అని పిలువబడే బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డు దుస్తులు, ఫర్నిచర్, ఫర్నిషింగ్స్, ఇంటి మరియు వంటగది ఉపకరణాలు, ఫిట్‌నెస్ పరికరాలు మరియు మరెన్నో విభాగాల్లో షాపింగ్ చేయడానికి మీకు వీలుకల్పించే ఒక ప్రత్యేక ఆర్థిక సదుపాయం.

మీరు మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డు గురించి మరింత సమాచారం కోసం చూస్తున్నట్లయితే – ప్రస్తుత లోన్లు, మీ చెల్లింపుల గురించి సమాచారం, లేదా మీరు ప్రస్తుతం రుణాన్ని తిరిగి చెల్లించాలని చూస్తున్నట్లయితే, మీరు మా బజాజ్ ఫిన్‌సర్వ్- మై అకౌంట్కు వెళ్లవచ్చు.

కేవలం మీ మొబైల్ నంబర్ మరియు వన్ టైమ్ పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ అవ్వండి మరియు ఇవి చేయండి:

  • మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ వివరాలు మరియు వినియోగాన్ని ట్రాక్ చేయండి
  • మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
  • మీ కార్డును బ్లాక్ చేయండి లేదా అన్‌బ్లాక్ చేయండి
  • మీ ఇ-మ్యాండేట్‌ను రిజిస్టర్ చేసుకోండి

మై అకౌంట్‌లో మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ వివరాలను చూడండి

మై అకౌంట్‌కు సైన్ ఇన్ అవ్వడం ద్వారా మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ స్థితిని చూడండి, మీ కార్డ్ వివరాలను ధృవీకరించండి, కార్డ్ చెల్లుబాటు, ఆమోదించబడిన మొత్తం రుణం పరిమితి మరియు మీ అందుబాటులో ఉన్న మొత్తం పరిమితిని చూడండి.

  • Check your card details

    మీ కార్డు వివరాలను చెక్ చేయండి

    ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీ కార్డ్ వివరాలను మీరు తనిఖీ చేయవచ్చు:

    • మీ పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఓటిపి తో సైన్-ఇన్ అవ్వండి.
    • 'నా సంబంధాలు' విభాగం నుండి మీ కార్డును ఎంచుకోండి.
    • మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ యొక్క స్థితి, చెల్లుబాటు, మొత్తం మరియు అందుబాటులో ఉన్న పరిమితి వంటి మీ కార్డ్ వివరాలను కనుగొనండి.


    మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ గురించి సమాచారాన్ని పొందడానికి మీరు 'మీ కార్డ్ వివరాలను చూడండి' పై కూడా క్లిక్ చేయవచ్చు. మీరు 'మై అకౌంట్' కు సైన్-ఇన్ అవమని అడగబడతారు, ఆపై నా సంబంధాలు విభాగానికి మళ్ళించబడతారు, ఇక్కడ మీరు కార్డును ఎంచుకోవడం ద్వారా మీరు దాని వివరాలను చూడవచ్చు.

    మీ కార్డ్ వివరాలను చూడండి

  • మీ కార్డు వివరాలను చెక్ చేయండి

    మీ కార్డు వివరాలను తెలుసుకోవడానికి మీ పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్ ఉపయోగించి మై అకౌంట్‌కు సైన్-ఇన్ అవ్వండి.

మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును యాక్టివేట్ చేయండి

మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును యాక్టివేట్ చేయడం సులభం. మీరు కేవలం మీ కెవైసి పూర్తి చేసి, ఇ-మ్యాండేట్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. మీ కార్డు యాక్టివేట్ అయిన తర్వాత, మీకు నచ్చిన ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో లేదా మీ సమీప దుకాణంలో షాపింగ్ మొదలుపెట్టవచ్చు.

ప్రతి కొత్త కొనుగోలు, అది ఆన్‌లైన్‌లో చేసినా లేదా మా భాగస్వామి దుకాణంలో చేసినా ఒక కొత్త లోన్ అకౌంట్ క్రియేట్ చేయబడుతుంది. మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా మీ అన్ని లోన్ అకౌంట్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

దయచేసి గమనించండి, మీ కార్డ్ యాక్టివేట్ చేయబడిన తర్వాత మీ సంప్రదింపు వివరాలలో మార్పు ఉంటే, మీరు మా 1.2 లక్షలకు పైగా ఉన్న భాగస్వామి దుకాణాలలో ఒకదానిలో మీ మొదటి ట్రాన్సాక్షన్ చేయాలి.

  • Activate your card

    మీ కార్డ్‌ని యాక్టివేట్ చేసుకోండి

    మీరు మై అకౌంట్ సందర్శించడం ద్వారా మీ కార్డును యాక్టివేట్ చేయవచ్చు

    • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీతో మా కస్టమర్ పోర్టల్‌కు సైన్-ఇన్ అవ్వండి మరియు ఓటిపి సబ్మిట్ చేయండి.
    • సైన్-ఇన్ అయిన తర్వాత, 'నా సంబంధాలు' కింద మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఎంచుకోండి.
    • 'ఇప్పుడే రిజిస్టర్ చేయండి' పై క్లిక్ చేయండి మరియు మీ ఇ-మ్యాండేట్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి కొనసాగండి.


    ప్రారంభించడానికి మీరు క్రింద ఇవ్వబడిన 'మీ కార్డును యాక్టివేట్ చేయండి' ఎంపికపై క్లిక్ చేయవచ్చు. మీరు 'మై అకౌంట్'కు సైన్-ఇన్ అవ్వమని అడగబడతారు మరియు 'నా సంబంధాలు' విభాగానికి మళ్ళించబడతారు, ఇక్కడ మీరు మీ కార్డును ఎంచుకోవచ్చు మరియు దానిని యాక్టివేట్ చేయడానికి మ్యాండేట్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు.

    మీ కార్డ్‌ని యాక్టివేట్ చేసుకోండి

మై అకౌంట్‌లో మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

మీ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది మీ ట్రాన్సాక్షన్లు, వాయిదాలు, ఇన్సూరెన్స్ మరియు అదనపు సర్వీసులు ఏవైనా ఉంటే వాటి యొక్క వివరణాత్మక సారాంశాన్ని చూపుతుంది. ఇది మీ ప్రస్తుత రుణం మరియు రీపేమెంట్ అవధిలో మీరు భరించే ఫీజులు మరియు ఛార్జీలను ట్రాక్ చేయడానికి మీకు సహాయపడుతుంది.

  • Check your account statement

    మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను చూడండి

    మీరు మా కస్టమర్ పోర్టల్ - మై అకౌంట్ సందర్శించడం ద్వారా మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డుకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్‌ను (మరియు ఇతర డాక్యుమెంట్లు) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    • మీ పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఓటిపి తో సైన్-ఇన్ అవ్వండి.
    • మీరు స్టేట్‌మెంట్‌ చూడాలనుకుంటున్న సంబంధిత రుణాన్ని ఎంచుకోండి.
    • మీ లోన్ అకౌంట్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కనుగొనండి.
    • కేవలం ఒక క్లిక్‌తో మీ 'అకౌంట్ స్టేట్‌మెంట్' డౌన్‌లోడ్ చేసుకోండి.


    మీరు క్రింద ఉన్న 'మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి' ఎంపికపై కూడా క్లిక్ చేయవచ్చు.

    మీరు సైన్-ఇన్ చేయవలసి ఉంటుంది, ఆ తరువాత 'డాక్యుమెంట్ సెంటర్' కు మళ్ళించబడతారు, ఇక్కడ మీరు దాని డాక్యుమెంట్లను వీక్షించడానికి మీ లోన్ అకౌంట్‌ను ఎంచుకోవచ్చు మరియు దానిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి 'అకౌంట్ స్టేట్‌మెంట్' పై క్లిక్ చేయవచ్చు.

    మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

మమ్మల్ని సంప్రదించండి

మా ఉత్పత్తులు లేదా సేవల గురించి మీకు ఏదైనా సహాయం అవసరమైతే మమ్మల్ని సంప్రదించండి.

  • ఆన్‌లైన్‌లో సహాయం పొందడానికి, సందర్శించండి సహాయం మరియు మద్దతు.
  • ఏదైనా మోసం సందర్భంలో సహాయం కోసం మా హెల్ప్‌లైన్‌ +91 8698010101 కి కాల్ చేయండి.
  • మాతో కనెక్ట్ అవ్వడానికి మీరు Play Store/ App Store నుండి మా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • మీ లొకేషన్‌కు దగ్గరలో ఉన్న మా బ్రాంచ్‌ను కనుగొనండి మరియు మీ సందేహాలను తీర్చుకోండి.
  • మా మమ్మల్ని సంప్రదించండి పేజీని సందర్శించడం ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.

మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ పిన్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి

మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ పిన్‌ను రీసెట్ చేయండి

మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ నాలుగు అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (పిన్)తో లభిస్తుంది. మీ కార్డును యాక్టివేట్ చేసినప్పుడు ఒక కొత్తదాన్ని సెట్ చేయమని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ కోసం మీకు ఈ పిన్ అవసరం. ఒక వేళ మీ పిన్‌ను మీరు మర్చిపోతే లేదా దానిని అప్‌డేట్ చేయాలనుకుంటే, మీరు మై అకౌంట్ సందర్శించడం ద్వారా దానిని రీసెట్ చేయవచ్చు.

  • Update your card PIN

    మీ కార్డ్ పిన్‌ను అప్‌డేట్ చేయండి

    • మీ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీతో సైన్-ఇన్ అవ్వండి.
    • 'నా సంబంధాలు' విభాగం నుండి మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఎంచుకోండి.
    • త్వరిత చర్యలు'కు వెళ్లి 'పిన్‌ను రీసెట్ చేయండి' పై క్లిక్ చేయండి.
    • కొత్త పిన్ ఎంటర్ చేయండి మరియు కొనసాగండి.
    • మీ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఒటిపిని ధృవీకరించండి.


    సైన్-ఇన్ చేయడానికి మీరు క్రింద ఇవ్వబడిన 'మీ పిన్ మార్చండి' ఎంపిక పై క్లిక్ చేయవచ్చు. అప్పుడు, మీరు 'నా సంబంధాలు' నుండి మీ కార్డును ఎంచుకోవచ్చు మరియు కొనసాగవచ్చు.

    మీరు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీ స్క్రీన్ పై మీరు ఒక నోటిఫికేషన్ అందుకుంటారు.

    మీ పిన్‌ను మార్చండి

మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును బ్లాక్ చేయండి లేదా అన్‌బ్లాక్ చేయండి

మీ కొనుగోళ్లను నిర్వహించడానికి మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ఒక గొప్ప మార్గం, కానీ మీరు మీ కార్డును బ్లాక్ చేయవలసిన పరిస్థితిని ఎదుర్కోవచ్చు.

బహుశా మీరు కొంతకాలం మీ కార్డును ఉపయోగించాలని అనుకోవడం లేదు లేదా మీరు మా దీర్ఘకాలిక కస్టమర్లలో ఒకరైతే, మీ భౌతిక ఇఎంఐ నెట్‌వర్క్ కార్డును పోగొట్టుకొని ఉండవచ్చు. అలాంటి సందర్భంలో, ఇన్‌స్టా ఇఎంఐ కార్డును బ్లాక్ చేయడం వలన మీరు దుర్వినియోగం లేదా మోసాన్ని నివారించవచ్చు. అలాగే, మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా దీనిని చేయవచ్చు. అయితే, కార్డ్ బ్లాక్ చేయబడిన తర్వాత మీరు దానిని షాపింగ్ చేయడానికి ఉపయోగించలేరు.

వాయిదాలు లేదా బకాయిలు చెల్లించని సందర్భంలో లేదా తక్కువ సిబిల్ స్కోర్ కారణంగా మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ బ్లాక్ చేయబడితే, మీరు మీ గడువు మీరిన ఇఎంఐలను క్లియర్ చేసిన తర్వాత లేదా మా అంతర్గత పాలసీలను నెరవేర్చే మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరిచిన తర్వాత అది అన్‌బ్లాక్ చేయబడుతుంది. మీ కార్డ్ స్థితిలో ఏదైనా మార్పు గురించి మీకు తెలియజేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ పంపబడుతుంది.

  • Block your card

    మీ కార్డును బ్లాక్ చేయండి

    మీరు మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా మీ కార్డును బ్లాక్ చేయవచ్చు

    • మీ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీతో సైన్-ఇన్ అవ్వండి.
    • 'నా సంబంధాలు' విభాగం నుండి మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఎంచుకోండి.
    • 'త్వరిత చర్యలు' విభాగం నుండి 'కార్డును బ్లాక్ చేయండి' ఎంపికపై క్లిక్ చేయండి.
    • బ్లాకింగ్ కోసం కారణాలను ఎంటర్ చేయండి మరియు కొనసాగండి.


    సైన్-ఇన్ చేయడానికి మీరు క్రింద ఉన్న 'మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ బ్లాక్ చేయండి' ఎంపికపై క్లిక్ చేయవచ్చు. అప్పుడు మీరు 'నా సంబంధాలు' నుండి మీ కార్డును ఎంచుకోవచ్చు మరియు బ్లాక్ చేయడానికి కొనసాగవచ్చు. మీ కార్డ్ తక్షణమే బ్లాక్ చేయబడుతుంది.

    మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును బ్లాక్ చేయండి

  • Unblock your card

    మీ కార్డును అన్‌బ్లాక్ చేయండి

    మీరు గతంలో బ్లాక్ చేసిన మీ కార్డును మళ్లి ఉపయోగించాలనుకుంటే, మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా దానిని అన్‌బ్లాక్ చేయవచ్చు

    • మా రెండు-దశల ప్రామాణీకరణను ఉపయోగించి మై అకౌంట్‌కు సైన్-ఇన్ అవ్వండి.
    • మీరు అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్న కార్డును 'నా సంబంధాలు' నుండి ఎంచుకోండి.
    • త్వరిత చర్యలు' విభాగం నుండి 'కార్డును అన్‌బ్లాక్ చేయండి' ఎంపికపై క్లిక్ చేయండి.
    • మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు పంపబడిన ఓటిపితో ధృవీకరించండి మరియు కొనసాగండి.


    సైన్-ఇన్ చేయడానికి మీరు క్రింద ఉన్న 'మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును అన్‌బ్లాక్ చేయండి' ఎంపికపై క్లిక్ చేయవచ్చు. అప్పుడు 'నా సంబంధాలు' నుండి మీ కార్డును ఎంచుకోండి మరియు అన్‌బ్లాక్ చేయడానికి కొనసాగండి.

    మీ కార్డ్ అన్‌బ్లాక్ చేయబడుతుంది మరియు మీరు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీ స్క్రీన్ పై మీరు ఒక నోటిఫికేషన్ అందుకుంటారు.

    మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును అన్‌బ్లాక్ చేయండి

మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును డిజిటల్‌గా యాక్సెస్ చేయండి

మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డు పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుంది - మీకు నచ్చిన ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో లేదా స్టోర్‌లో చెల్లించడానికి వీలుగా మీకు ఒక భౌతిక కార్డు అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఒక భాగస్వామి దుకాణంలో మా ప్రతినిధితో మీ కార్డ్ నంబర్‌ను పంచుకోవడం లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు మీ 16-అంకెల కార్డు వివరాలను అందించడం. మీరు మై అకౌంట్‌కు సైన్-ఇన్ చేయడం ద్వారా మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు.

  • Check your Insta EMI Card number

    మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ నంబర్‌ను తనిఖీ చేయండి

    మీరు మా కస్టమర్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా మీ కార్డ్ నంబర్‌ను తనిఖీ చేయవచ్చు

    • మీ పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఓటిపి తో సైన్-ఇన్ అవ్వండి.
    • 'నా సంబంధాలు' విభాగం నుండి మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఎంచుకోండి.
    • మీ కార్డుపై మాస్క్ చేయబడిన అంకెలను చెక్ చేయడానికి 'నంబర్ చూడండి' పై క్లిక్ చేయండి.
    • మీ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపి తో మీ వివరాలను ధృవీకరించండి.
    • మీ స్క్రీన్ పై కనిపించే కార్డ్ నంబర్ మరియు ఇతర వివరాలను చెక్ చేయండి.


    మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును కూడా మీరు యాక్సెస్ చేయవచ్చు లేదా 'మీ కార్డ్ నంబర్ చూడండి' పై క్లిక్ చేయడం ద్వారా దాని నంబర్‌ను తనిఖీ చేయవచ్చు. మీరు 'మై అకౌంట్'కు సైన్-ఇన్ అవ్వమని అడగబడతారు మరియు 'నా సంబంధాలు' విభాగానికి మళ్ళించబడతారు, ఇక్కడ మీరు మీ కార్డును ఎంచుకోవచ్చు, కొనసాగడానికి 'నంబర్ చూడండి' పై క్లిక్ చేయవచ్చు.

    మీ కార్డ్ నంబర్‌ను చూడండి

మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డుతో ఎక్కడ షాపింగ్ చేయాలి

కిరాణా సామానుల నుండి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు మరియు ఇటువంటి 1 మిలియన్‌కు పైగా ఉన్న ప్రొడక్ట్స్ షాపింగ్ చేయడానికి మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఉపయోగించవచ్చు. 3 నుండి 24 నెలల ఫ్లెక్సిబుల్ అవధులలో మీ బిల్లులను విభజించడానికి మరియు మీ కొనుగోళ్లను సులభమైన ఇఎంఐలుగా మార్చుకోవడానికి ఈ కార్డు మీకు అవకాశం ఇస్తుంది.

ఈ కింది వాటిలో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ షాపింగ్ చేయడానికి మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఉపయోగించండి:

  • Bajaj Mall

    బజాజ్ మాల్

    మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డుతో బజాజ్ మాల్‌లో మీకు ఇష్టమైన గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్ లేదా లైఫ్‌స్టైల్ ప్రోడక్టుల నుండి ఎంచుకోండి.
    బజాజ్ మాల్‌లోకి సైన్-ఇన్ అవ్వడానికి మీ మొబైల్ నంబర్ మరియు ఓటిపి ఉపయోగించండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ ఎంచుకోండి, ఇఎంఐ ప్లాన్ ఎంచుకోండి మరియు మీ డెలివరీ చిరునామాను నిర్ధారించండి. మీ కొనుగోలును మీరు పూర్తి చేసిన తర్వాత, నిర్దేశించిన కాలపరిమితిలోపు మీ ప్రోడక్ట్‌ను మీరు అందుకుంటారు.

    బజాజ్ మాల్‌లో షాపింగ్ చేయండి

  • E-commerce websites

    ఇ-కామర్స్ వెబ్‌సైట్లు

    Amazon, MakeMyTrip, Vijay Sales, Tata Croma, Reliance Digital వంటి మీకు ఇష్టమైన ఆన్‌లైన్ షాపింగ్ గమ్యస్థానాలను సందర్శించండి మరియు నో కాస్ట్ ఇఎంఐలలో షాపింగ్ చేయండి. ప్రోడక్ట్‌ను ఎంచుకోండి, ఇఎంఐలలో చెల్లించడానికి ఎంచుకోండి, మీ అవధిని ఎంచుకోండి మరియు మీ కొనుగోలును చిన్న వాయిదాలలోకి మార్చండి.

  • Offline partner stores

    ఆఫ్‌లైన్ భాగస్వామి దుకాణాలు

    మా ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ 3,000 కంటే ఎక్కువ నగరాలలో 1.2 లక్షల కంటే ఎక్కువ భాగస్వామి దుకాణాలలో అంగీకరించబడుతుంది. మా భాగస్వామి దుకాణాలలో దేనికైనా వెళ్లండి, మీకు నచ్చిన ప్రోడక్ట్ ఎంచుకోండి, ఉత్తమ ఇఎంఐ పథకాలను పొందండి.

  • Partner superstores

    భాగస్వామి సూపర్‌స్టోర్లు

    కేవలం మీ గాడ్జెట్లు లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మాత్రమే కాకుండా, మీ కిరాణా సామానులు కూడా నో కాస్ట్ ఇఎంఐ లలో అందుబాటులో ఉన్నాయి. మీకు సమీపంలోని మా భాగస్వామి సూపర్‌స్టోర్‌లలో దేనిలోకైనా వెళ్ళండి, మీ కిరాణా అవసరాల కోసం షాపింగ్ చేయండి మరియు మీ కొనుగోళ్లను సులభమైన ఇఎంఐ లలోకి మార్చడానికి మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఉపయోగించండి.

    మీకు సమీపంలోని భాగస్వామి దుకాణాన్ని కనుగొనండి

నామమాత్రపు వార్షిక ఫీజు

మీకు ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ఉంటే కానీ గత 12 నెలల్లో కొనుగోలు చేయకపోతే, మీకు నామమాత్రపు వార్షిక ఫీజు రూ. 117 వసూలు చేయబడుతుంది. ఫీజులు మరియు ఛార్జీల పూర్తి జాబితాను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

నా బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ఎందుకు బ్లాక్ చేయబడింది? నేను దాన్ని ఎలా అన్‌బ్లాక్ చేయాలి?

అనేక అంశాల కారణంగా మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ బ్లాక్ చేయబడవచ్చు. వీటిలో తక్కువ సిబిల్ స్కోర్, మిస్ అయిన లేదా బౌన్స్ అయిన ఇఎంఐలు, సరిగ్గా లేని చెల్లింపు రికార్డ్ మరియు ఇతరత్రా ఉంటాయి. సాధారణంగా, మీ గడువు మీరిన ఇఎంఐలను మీరు క్లియర్ చేసిన తర్వాత లేదా మా అంతర్గత పాలసీల ప్రకారం మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడిన తర్వాత మీ కార్డ్ అన్‌బ్లాక్ చేయబడుతుంది.

మీరు 'మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ స్థితిని తనిఖీ చేయండి' పై క్లిక్ చేయడం ద్వారా మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ స్థితిని చూడవచ్చు మరియు బ్లాకింగ్ కోసం కారణాన్ని కనుగొనవచ్చు మరియు దానిని అన్‌బ్లాక్ చేయడానికి దశలను కనుగొనవచ్చు.

మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ స్థితిని తనిఖీ చేయండి

బజాజ్ ఫైనాన్స్ నా బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ యొక్క కార్డ్ పరిమితిని ఎందుకు తగ్గించింది?

మీకు కేటాయించబడిన ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ పరిమితి మా అంతర్గత క్రెడిట్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ పాలసీ మీ సిబిల్ స్కోర్, మీ రీపేమెంట్ చరిత్ర, తీసుకున్న కొత్త లోన్ల ఫ్రీక్వెన్సీ మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ (కార్డ్ పరిమితి) పై ప్రీ-అప్రూవ్డ్ లోన్ మొత్తం మా అంతర్గత పాలసీల ప్రకారం మార్పునకు లోబడి ఉంటుందని గమనించండి. మీ కార్డ్ పరిమితిలో ఏదైనా మార్పు ఉంటే మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పై ఒక ఎస్ఎంఎస్ అందుకుంటారు.

నా కార్డ్ యాక్టివ్‌గా ఉందో లేదో నేను ఎలా తెలుసుకోగలను?

క్రింద ఉన్న 'మీ కార్డ్ వివరాలను చూడండి' పై క్లిక్ చేయడం ద్వారా లేదా మై అకౌంట్‌కు సైన్-ఇన్ చేయడం ద్వారా మీ కార్డ్ స్థితిని మీరు తనిఖీ చేయవచ్చు. మీరు సైన్-ఇన్ చేసిన తర్వాత, 'నా సంబంధాలు' విభాగం నుండి మీ కార్డును ఎంచుకోండి మరియు మీ కార్డు స్థితిని చూడండి.

మీ కార్డ్ వివరాలను చూడండి

నా ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ యాక్టివ్‌గా ఉందని నేను ఎలా నిర్ధారించుకోగలను?

మీ అన్ని ఇఎంఐలు సకాలంలో చెల్లించడం ద్వారా మరియు మా అంతర్గత పాలసీల ప్రకారం అవసరమైన కనీస సిబిల్ స్కోర్‌ను నిర్వహించడం ద్వారా మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ప్రయోజనాలను మీరు ఆటంకాలు లేకుండా కొనసాగించవచ్చు.

నా స్నేహితుడు లేదా సోదరుడు నా ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఉపయోగించవచ్చా?

భద్రతా కారణాల వలన, కార్డుహోల్డర్ మాత్రమే అతని/ఆమె బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఇఎంఐ కార్డును ఉపయోగించాలని సిఫార్సు చేయబడుతుంది. మీ కార్డుపై తీసుకున్న రుణాల పై మీదే బాధ్యత మరియు ఆలస్యం చేయబడిన చెల్లింపులు లేదా డిఫాల్ట్ అయిన సందర్భంలో మీరు బాధ్యత వహిస్తారు.

నేను భౌతిక ఇఎంఐ నెట్‌వర్క్ కార్డును ఎప్పుడు అందుకుంటాను?

కొన్ని సంవత్సరాల క్రితం వరకు మేము భౌతిక ఇఎంఐ నెట్‌వర్క్ కార్డులను జారీ చేసినప్పటికీ, కొత్త ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ వర్చువల్ రూపంలో మాత్రమే జారీ చేయబడుతుంది. వెంట తీసుకువెళ్లవలసిన అవసరం లేకుండానే ఒక భౌతిక కార్డులో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఒక కొనుగోలును పూర్తి చేయడానికి మీకు మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ నంబర్ మరియు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడిన ఓటిపి మాత్రమే అవసరం.

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌లో లేదా మై అకౌంట్‌లోకి సైన్-ఇన్ అవ్వడం ద్వారా మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ నంబర్‌ను కనుగొనవచ్చు.

మీ కార్డ్ వివరాలను చూడండి

ఇప్పుడు బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ డిజిటిల్ రూపంలోకి మార్చబడినందున, నా భౌతిక కార్డును ఏమి చేయాలి?

ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ ఇప్పుడు కేవలం వర్చువల్ కార్డ్ మాత్రమే అయినప్పటికీ, మీరు ఇప్పటికీ మా బజాజ్ మాల్, ఇతర ఇ-కామర్స్ గమ్యస్థానాలు మరియు మీకు ఇష్టమైన భాగస్వామి దుకాణాలలో ట్రాన్సాక్షన్లు చేయడానికి మీ భౌతిక కార్డును ఉపయోగించవచ్చు. మీరు మా కస్టమర్ పోర్టల్ - మై అకౌంట్‌ను సందర్శించడం ద్వారా కూడా మీ డిజిటల్ కార్డును యాక్సెస్ చేయవచ్చు.

ఇన్‌స్టా ఇఎంఐ కార్డుపై మీరు ఏవైనా వార్షిక ఛార్జీలను వసూలు చేస్తారా?

అవును, మీకు ఇన్‌స్టా ఇఎంఐ కార్డ్ ఉంటే కానీ గత ఒక సంవత్సరంలో ఏ కొనుగోలును పూర్తి చేయకపోతే, మీ నుండి రూ. 117 వార్షిక ఫీజు వసూలు చేయబడుతుంది. అయితే, మీరు మునుపటి సంవత్సరంలో మీ ఇన్‌స్టా ఇఎంఐ కార్డుతో కనీసం ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసినట్లయితే, ఈ ఛార్జీ మాఫీ చేయబడిందని మీరు కనుగొంటారు.

ఉదాహరణకు, బజాజ్ ఫిన్‌సర్వ్ ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ ఫిబ్రవరి 2019 లో జారీ చేయబడితే (ఇఎంఐ నెట్‌వర్క్ కార్డ్ పై "ఇప్పటి నుండి సభ్యుడు" అని పేర్కొనబడి ఉంటుంది) వార్షిక ఫీజు చెల్లింపు తేదీ మార్చి 2020గా ఉంటుంది (ఫిబ్రవరి 2019 నుండి మార్చి 2020 మధ్య ఎటువంటి రుణం బుక్ చేయబడకపోతే).

వర్తించే పూర్తి ఫీజులు మరియు ఛార్జీలను చూడండి

మరింత చూపండి తక్కువ చూపించండి